Sunday, May 17, 2026

మీరు ఎవరి కోసమో బ్రతుకుతున్నారా? ఈ కథ వింటే మీ ఆలోచన మారుతుంది! | Moral Stories Telugu

మీరు ఎవరి కోసమో బ్రతుకుతున్నారా? ఈ కథ వింటే మీ ఆలోచన మారుతుంది! | Moral Stories Telugu

Author Name:fact stories in telugu 01

Youtube Channel Url:https://www.youtube.com/@factstoriesintelugu01

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lnLYLuOwEIA



Transcript:
(00:03) అందరికీ నమస్కారం ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కట్టు బొట్టు గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తుంటారు. హంగు ఆర్బటాలు ప్రదర్శించే వారికే మర్యాదలు చేస్తుంటారు. కానీ అంత శుద్ధిని మించిన ఆభరణం లేదు. దాన్ని దర్శించలేని వ్యక్తులు అజ్ఞాలుగా మిగిలిపోతారు. పూర్వం జనక మహారాజు పండిత పరిషత్తు ఏర్పాటు చేశాడు.
(00:26) దానికి ఇంద్రాది దేవతలు కూడా హాజరయ్యారు. ఋషులు మునులు వేద పండితులు ఎందరో ఆ పరిషత్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక తాత్విక విషయాలపై చర్చ మొదలైంది. కాసేపటికి అష్టవక్రుడు ఆ సభకు వచ్చాడు. జనక మహారాజు సింహాసనం నుంచి లేచి వచ్చి అష్టవక్రుడికి సాధారంగా ఆహ్వానం పలుకుతూ ఉచితాసనంపై కూర్చోబెడతాడు. అష్టవక్రుడిని చూడగానే సభలోని పండితులంతా గొళ్ళు మని నవ్వుతారు.
(00:52) ఆయన శరీరంలోని వంకరులను అందరూ హేలనగా చూడసాగారు. సభికులందరినీ చూసి అష్టవక్రుడు కూడా పగలబడి నవ్వుతాడు. కాసేపటికి అంతా సర్దుకుంటుంది. సభ పూర్తయిన తర్వాత అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సభా మండపంలో అష్టవక్రుడు జనకుడు మాత్రమే ఉంటారు. అప్పుడు జనకుడు మునిని సమీపించి స్వామి సభలోని వారంతా మిమ్మల్ని చూసి నవ్వినందుకు వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అంటాడు.
(01:19) దానికి అష్టవక్రుడు పడవలేదన్నట్టుగా తలలుపుతాడు. కానీ అష్టవక్రుడు ఎందుకు పగలబడి నవ్వాడో ఇంకా జనక మహారాజుకు అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆయనను అడుగుతాడు. అప్పుడు అష్టవక్రుడు మహారాజా మీ సభలో వేద వేదాంగాలు అవపోసన పట్టిన పండితులు ఉన్నారు కానీ వారు జ్ఞానహీనులు అందుకే వారిని చూసి నవ్వు ఆపోలేకపోయాను అంటాడు. అంతటి పండితులను చూసి జ్ఞానహీనులు అనడంలో ఆశ్చర్యపోతాడు జ్ఞానకుడు.
(01:46) అప్పుడు అష్టవక్రుడు జనక మహారాజ నువ్వు పండితులు ఋషులు అని పరిచయం చేసిన వారంతా భౌతిక దృష్టి కలవారు. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ అనుభవంలో లేకపోతే అది మనిషిని కడతెరర్చలేదు. ఈ విద్వాంసులు నా భౌతిక దేహాన్ని చూశారే కానీ దేహంలో వెలుగుతున్న ఆత్మను చూడలేకపోయారు. వారిది భౌతిక దృష్టే కానీ ఆధ్యాత్మిక దృష్టి కాదు. శవంతో సమానమైన దేహాన్ని చూశారు కానీ శివ స్వరూపమైన ఆత్మను గుర్తించలేకపోయారు.
(02:13) వారిది బ్రాహ్య దృష్టి మాత్రమే అంతర్దృష్టి కాదు. ఏనాడైతే వాళ్ళు సూక్ష్మ దృష్టిని ఆత్మ దృష్టిని పెంపొందించుకుంటారో ఆనాడే వాళ్ళు నిజమైన పండితులు అనిపించుకుంటారు. కాబట్టి రాజా పండితులు కేవలం శాస్త్ర విజ్ఞానాన్ని పంపించుకుంటే సరిపోదు. ఆత్మనుభూతిని దైవ దృష్టిని అరవరుచుకోవాలి. అప్పుడే మానవ జన్మ సార్ధకం అవుతుంది అని వివరిస్తాడు.
(02:35) అష్టవక్కుల సందేశం ఏ కాలానికైనా అన్వయం అవుతుంది. అధికారం హోదను బట్టి మనుషులు స్థాయిని గుర్తిస్తున్నారు. మంచితనానికి ఆస్తిపాసులు కొలమానాలు కావని సత్యాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. ఎవరికి వారు 10 మందిలో గొప్పగా కనిపించడానికి లేనిపోని ఆర్బటాలకు పోతున్నారు. నలుగురిలో గొప్పగా ఉండాలని తాహతకు మించి ఖర్చు చేస్తున్నారు.
(02:55) కారణం ఎదుటివారు తనను తక్కువగా అనుకుంటారనే భ్రమ. కానీ నువ్వు నువ్వుగా ఉండగలగడం కన్నా గొప్ప వేషం మరొకటి లేదు అనే సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఎవరి మొప్పు కోసమో ఆ గుణాన్ని వదులుకోవడం అజ్ఞానమే అవుతుంది. అలాగే ఒక మనిషిని వారి రూపం స్థాయిని బట్టి కాకుండా అతని వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించడం నేర్చుకోవాలి.
(03:15) ఎలాగైతే నిన్ను అవతలి వాళ్ళు గుర్తించాలని భావిస్తున్నావో అలాగే నువ్వు కూడా వారిని గుర్తించగలగాలి. అదే ధర్మం.

No comments:

Post a Comment