మరుగు మందు అంటే ఇంత ఘోరమా
Author Name:Ctv colors of life | chandraja vadapalli
Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0gT_w5XlBeg
Transcript:
(00:02) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మన హార్రర్ జర్నీలోకి గ్రాండ్ వెల్కమ్ ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూస్తూనే ఒక లైక్ చేసేయండి అట్లాగే వీడియో నచ్చితే హెల్ప్ చేయండి. మన ఘోస్ట్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి షేర్ చేయండి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి.
(00:25) మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ కరెక్ట్ గా ప్రెస్ చేసామా లేదా ఆల్ అన ఆప్షన్ ఉందా లేదా అన్నది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్నింట్లోన దేనికి తగ్గకుండా ఉన్న మన ఛానల్ వ్యూయర్షిప్ లోనూ లైక్స్ లోనూ హైప్స్ లోనూ చాలా వీక్ ఉన్నారండి.
(00:46) మీ ఫ్యామిలీని ముందుకు నడిపించడానికి మీరే ముందుకు రావాలి. పక్కవాళ్ళు ఎందుకు వస్తారు సో ఇంకా ఆలస్యం చేయకుండా వీలు కుదిరిన వాళ్ళందరూ కూడా హైప్ చేయండి నచ్చిన వాళ్ళు అదర్వైస్ అందరూ లైక్స్ తో మన ఛానల్ ని ముంచేత్తండి అప్పుడే నేను మరిన్ని మరిన్ని వీడియోస్ మీకోసం కొత్తగా మరి కొత్తగా మరింతగా గుర్తు చేసుకొని మరి మీకు చెప్పగలను అలాగే ఫ్యూచర్ లో నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాను కల్పిత కథలు కూడా కొన్ని చేరుద్దాం అనుకుంటున్నాను సో ఇంకెందుకండీ ఆలస్యం ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అద్భుతమైన భయానక విషయం సీతంపేట మండలం అడ్డాకులగూడా లో జరిగినటువంటి ఒక భయానక విషయాన్ని మీకు
(01:26) నేను చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మరొక్కసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి మీకు చాలా నచ్చేటటువంటి చక్షుపిశాచి కేరళా సిరీస్ నెక్స్ట్ నర్సీపట్నం నితంబి చెట్టు రాజమ్మ లాట్ లాట్ వీడియోస్ ఉన్నాయండి మా మోర్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఇంకా మోర్ వీడియోస్ కోసం రెగ్యులర్ గా ఎలాగో ఇప్పుడు మనం రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంక మీదే ఆధారపడి ఉంది మొత్తం ఛానల్ జర్నీ అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంది ఓకేనా అండి అయితే అడ్డాకుల గూడ ఇది సీతాపేటలో ప్రకృతి ఒడిలో ముచ్చటగా ముద్దుగా ఉన్నటువంటి ఒక చిన్న పసిపాప లాంటి ఆకు పచ్చటి పచ్చ
(02:04) పచ్చటి గ్రామం 800 ఇళ్లు కూడా ఉండని ఆ గ్రామంలో జరిగిన దారుణమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి మూలం అడ్డాకుల కూడా ఆ కథకు మూలం అంటే ఆ ఇన్సిడెంట్ కి మూలం అడ్డాకుల గూడలో ఉందండి అయితే ఇది జరిగి 2008వ సంవత్సరంలో జరిగింది ఈ సంఘటన అయితే ఈ ఈ విషయం ఎలాగ బయటిక వచ్చింది అంటే శ్రీకాకుళంలో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందని చెప్పేసి ఇల్లు ఎలా ఉందో చూడమని ఇంట్లో నెగటివిటీ ఎలా ఉందో చూడమని ఒక కుటుంబ నన్ను కోరడం జరిగింది.
(02:43) శ్రీకాకుళంలో శ్రీకూర్మం అని ఒక విలేజ్ ఉంది మీ అందరికీ తెలుసు అక్కడ శ్రీకూర్మనాథ స్వామి కొలువై ఉన్నాడు చాలా పురాతన దేవాలయం అయితే అక్కడ ఆ అక్కడ ఆ గ్రామంలో శ్రీకూర్మ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మన దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అయ్యారండి. కాంటాక్ట్ అయ్యి ఒకసారి వాళ్ళ ఇంట్లో ఏమన్నా చెడు ఉందేమో చూడమన్నారు. చూడమంటే నేను యాక్చువల్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాస్తు విజిట్ కోసం వెళ్ళానండి.
(03:08) వాస్తు విజిట్ కోసం వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎదురైనటువంటి సంఘటనలు నేను ఎదుర్కొని చూసినవన్నీ కూడా నేను నోట్ చేసుకొని పెట్టుకొని వాళ్ళకి రిపోర్ట్ చెప్పాలి కదా నెక్స్ట్ డే చెప్పాలి కదా వాళ్ళని మన ఇంటికి రమ్మన్నాను. మన ఇంటికి రమ్మంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను నేను గమనించినవన్నీ చెప్పాను.
(03:30) చెప్పి వాస్తు దోషాలు అయితే చిన్న చిన్న ఉన్నాయి కానీ ఈ మాత్రం వాస్తు దోషాలకి మీరు అనుభవిస్తున్నంత కష్టాలు అయితే రావండి దీన్ని మీరు ఇలాగ ఇలాగా రెక్టిఫై చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అని అన్ని చెప్పాను అన్ని చెప్తే వాళ్ళు సరేనండి చూస్తాము ఒకసారి మా వాళ్ళతో కూడా మాట్లాడి మళ్ళా మీ దగ్గరికి కలుస్తామ అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు నెక్స్ట్ డేనే నాకు ఫోన్ చేశారు.
(03:51) నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి ఆ అమ్మ మీరు ఉన్నారంటే ఇవాళ వస్తాము అన్నారు రండి ఉన్నాను అన్నాను అంటే వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం విని నాకైతే చాలా షాక్ తగిలిందండి. ఎందుకు అనింటే నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మన ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళిన ఈ టూ డేస్ కాలంలో వాళ్ళ ఇంట్లో జరిగిన అంశాలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది నాకు చెప్పారు వాళ్ళు అది వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారండి.
(04:19) వాళ్ళ ఇంట్లో యాక్చువల్లీ నా దగ్గరికి వచ్చింది ఏంటంటే వాళ్ళ కొడుకు కోడలు సరిగ్గా ఉండట్లేదు. ఆ కుటుంబం సరిగ్గా అన్యోన్యంగా ఉండకపోయినా కూడా దానికి ఏదో కారణం ఉంటుంది వాస్తులో ఏదో దోషం ఉంటుంది అని వాళ్ళు నమ్మి అందులో ఏమనా దోషం ఉందేమో చూపించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. నాకు చూసినంత వరకు అందులో అంత భార్యా భర్తల మొహం మొహం చూసుకోనంత దరిద్రం ఏమీ లేదు అందులో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి చెప్పేసాను అయిపోయింది ఇంకా ఏమిట్రా విషయం అంటే నెక్స్ట్ డే మూడో రోజు వాళ్ళు వచ్చి చెప్పిన విషయం వాళ్ళ కోడలు వాళ్ళ ఇంట్లో వంట చేసుకోవడం మానేసింది
(04:55) తినడం మానేసింది మంచి నీళ్లుు తాగడం మానేసింది. వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి మా ఇంట్లో కుదరట్లేదండి మా ఇంట్లో నేను మా వాళ్ళని నమ్మలేకపోతున్నాను వాళ్ళు నాకు చాలా చెడు చేసేస్తున్నారు అందువల్ల వాళ్ళు ఇచ్చేవేవి నేను తినలేకపోతున్నాను తాగలేకపోతున్నాను వాళ్ళ వాళ్ళు ఇస్తున్న మంచి నీళ్లు నాకు రక్తం లా కనిపిస్తున్నాయి ఆ మా నాన్న రక్తంతో నన్ను పెంచి పెద్ద చేశారు ఏవేవో మాట్లాడుతుందట అండి అసలు ఒక మాటకు ఒక మాట పొంతను లేదు ఓ మాటక ఒక మాటకు అర్ధం లేదు ఓ మాటక ఒక మాటకు పోలిక లేదు ఇంటి పరువు బజారు ఎక్కింది కదండీ ఏం చేయాలా ఆ తర్వాత ఇంటికి వస్తుందంట ఎవ్వరితోటి
(05:32) మాట్లాడదంట ఏమి చెప్పదంట తన మటుకు తను వేరేగా ఒక గదిలోకి వెళ్ళిపోయి అందులో సామాన అంతా బయట పెట్టేసి అందులో ఒక చిన్న ఆ దుప్పటి కింద పరుచుకొని పడుకుంటున్నది వన్ డే నుంచి అంతలాగా చెడైపోవాల్సిన అవసరం ఏంటి అసలు ఏమైంది ఆమెకి అని అంటే తెలియదు ఎవరికీని వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడదు వీళ్ళతో మాట్లాడదు ఎవ్వరితోటి మాట్లాడదు మొహం ముడుచుకొని కూర్చుంటుంది.
(05:56) పోనీ మీ ఇంటికి వెళ్ళిపోతావా అని అడిగారట వీళ్ళు అడిగితే నేను వెళ్ళను నేను ఎందుకు వెళ్ళిపోవాలి మీరే అందరూ వెళ్ళిపోవాలి పోనీలే నిజమే కదా ఇంటి కోళ్ళు ఎందుకు వెళ్ళిపోద్ది అనుకని వీళ్ళు ఇలాగ ఒక మూడు రోజులు భరించి నాలుగో రోజు మన దగ్గరికి రావడం ఐదఆరు రోజులు అవ్వడం ఈ వారం నుంచి ఈ స్ట్రగుల్ జరుగుతోందట నాకు చెప్పలేదు వాళ్ళు అయితే దీనికి వాస్తు దోషం ఉందఅనుకున్నారు అది లేదు అయితే నా దగ్గరికి వచ్చి చెప్పారు ఇలా ఉందమ్మా విషయం అనిఅంటే నాకు కొంచెం వియర్డ్ గా అనిపించింది విచిత్రంగా కూడా అనిపించింది ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఏమన్నా గాలి దూడి
(06:26) సోకిందేమో చూసుకున్నారా అన్నాను అంటే మా ఊర్లో ఉన్న పూజారి గారు దాసుడు గారు కూడా ఉన్నారండి దాసుడు గారు కూడా చూశారు మా పక్కఊూరు దాసుడు గారు కూడా చూశారు చూసి ఏం లేదు అన్నారండి ఏదో కారణం ఉందండి వేరే ఊరు అన్నారు చెప్పాలంటే చెప్పట్లేదండి అన్నారు ఏంటి గందరగోళం అంతా నాకు అసలు అర్థం కాలే అర్థం కాకపోతే ఆ అమ్మాయిని చూద్దాం అని చెప్పేసి ఆ రోజు నేను శ్రీకర్మం బయలుదేరి వెళ్ళానండి శ్రీకూర్ బయలుదేరి వెళ్లి నాకు ఆ రోజు ఎవరు తోడలేను నేను ఒక్కదానిగా వెళ్ళాను ఇంక తప్పలేదు శ్రీకూర్మం వెళ్ళాను శ్రీకూర్మం వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను
(06:59) వీళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి ఉన్న ఇల్లు ఆ అమ్మాయి ఉన్న రూము కంపు దుర్గంధం వాసన వస్తుంది ఏదో చెడు వాసన అమ్మోనియా ఘాటైన అమ్మోనియా వాసన సినిమా హాళ్ల దగ్గర తర్వాత రోడ్డు పక్కన రోడ్ల మీద యూరిన్ పాస్ చేసే చోట ఉండే ఘాటైన అమ్మోనియా వాసన ఉంటుంది చూడండి అలాంటి వాసన వస్తుంది. ఏంటి అలాంటి వాసన వస్తుంది అసలు ఏంటి సంగతి ఏంటి ఈమె ఎవరింటికి వెళ్లి భోజనం చేస్తుంది అని అడిగాను నేను అన్ని విషయాలు చూసిన తర్వాత మీకు దూరమై ఎన్నాళ్ళ అయింది అంటే వన్ వీక్ అయింది.
(07:30) ఈ వన్ వీక్ నుంచి మీరు నా దగ్గరికి రాకముందు నుంచి మీరు సఫరింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ అబ్బాయితో కాపురం మానేసిన దగ్గర నుంచి ఆవిడ ఎవరింటికి ఎక్కువ వెళ్తోంది అని అడిగాను. అడిగితే బుట్టలు అల్లుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని బుట్టలు అల్లుకునే వాళ్ళ స్థాయి వీళ్ళది కాదు వీళ్ళ స్థాయి బుట్టలు అల్లుల్లుకున్నది కాదు మరి ఈ అమ్మాయి పనికట్టుకొని బుట్టలు అల్లుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అప్పుడు నాకు ఒక చిన్న మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.
(07:59) మరి ఆ అమ్మాయికి మీరు బంగారం డబ్బు ఏమనా ఇచ్చారా అని అడిగాను నేను ఎందుకు ఇవ్వలేదమ్మా ఇచ్చాం పెళ్లిప్పుడు ఇచ్చాం పెళ్లి అయి ఎన్నాళ్ళ అయింది అనుకుంటున్నారు అప్పటికి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి శుభ్రంగా ఉన్న అమ్మాయి ఈ 15 రోజుల పట్టి ఇలా ఉంది అందులో వారం నుంచి ఎక్కువ అయిపోయింది. కొంచెం దూరం పెట్టడం మొదలు పెట్టింది లాస్ట్ మంత్ నుంచి అని చెప్పారు వాళ్ళు సరే మనస్పర్ధలు అంటూ ఉంటాయి కదా ఇల్లన్న తర్వాత అత్తవారి ఇంట్లో మనస్పర్ధలు లేకుండా ఉండడానికి ఇదేమి సినిమా కాదు కదా ఏదో ఒకటి ఉంటాయి.
(08:24) సరే ఏది ఏమైనప్పటికీ మీరు భయపడకండి దీనికి ఏదైనా కారణం ఉండొచ్చండి భయపడకండి చూద్దాము అనేసాను నేను అనేసి మీరేమనా నగలుగటరా అమ్మాయి ఒంటి మీద ఉన్నాయా అన్నాను మాకుఇటు చూడనిస్తుందా మాకే ఇటు కనబడనిస్తుందా అంటుంది ఆవిడ వాళ్ళ అత్తగారు [గురకలు] సరే నేను వెళ్ళనా లోపలికి అన్నాను మరి ఆ బుట్టలు అల్లుకున్న వాళ్ళతో మీకు ఎలా పరిచయం అన్నాను నేను అదేనమ్మా మాకు అర్థం కాకుంటుంది ఎప్పుడు వెళ్ళినా బుట్ట బుట్టలోళ్ళ ఇంట్లోనే కూర్చుంటుంది వాళ్ళ వాళ్ళ దగ్గర గురించే మాట్లాడుతుంది వాళ్ళ ఇంటికాడి నుంచే చెంబుతూ మంచి నీళ్లుు తెచ్చుకొని తాగుతుంది మంచి నీళ్ళు కూడా
(08:58) తాగట్లేదా అన్నాను మంచి నీళ్లుు కూడా తాగట్లేదు. సరే ఇదేదో సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ వియర్డ్ అండ్ సం ఆ ఇష్యూ ఆర్ కాంప్లికేటెడ్ చూద్దాం ఇది ఏంటో అని అనుకున్నానండి. అనుకున్న తర్వాత అండి సరే ఆ బుట్టల వాళ్ళ ఇంటికి నాకు దారి చూపించండి నేను వెళ్తాను అన్నా వద్దమ్మ వాళ్ళు మంచిోళ్ళు కార అంటారు ఏమంటారు మంచోళ్ళు కారు అంటారు సరే చూద్దాం ముందు అసలు ఈ అమ్మాయిని నేను మాట్లాడతాను ఎలాగో ఇంటికి వచ్చాను కదా మాట్లాడతానండి అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు లలిత లలిత లలిత అని తలుపు కొట్టా లలిత లలితమ్మ అని తలుపు కొట్టాను తలుపు కొడితే మెల్లిగా తలుపు
(09:36) తీసింది తలుపు తీసింది షి సం సెన్సస్ మామూలుగానే ఉంది తలుపు తీసింది మీరెవరు అంది నన్ను చూడగానే నేనా నీకోసమే వచ్చాను అన్నాను అంటే నాకోసం మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి అంది అవును అవును చూడలేదు నేను మొన్న చూసాను బయట ఆ వరదమ్మ పంపించింది అన్నాను అవునా వరదమ్మ గారు పంపించారా రండి రండి రండి అని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టింది.
(10:05) సదర వరదమ్మ బుట్టలు అల్లుకున్న ఆవిడ ఏమిటి ఇంట్లో భర్త అత్తమామలకి తల్లిదండ్రులకు కూడా లేని ప్లేస్ వరదమ్మ అన్న స్త్రీకి వచ్చిందా అనుకున్నాను నేను వరదమ్మగారు పంపించారా అంది అవును అన్నాను లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత ఏమిటండి వరదమ్మగారు పంపించినవాడు మీరు వచ్చారు మీకు ఇద్ద ఇద్దాం అంటే నా దగ్గర నాదంటూ ఏమీ లేకపోయే ఇంట్లో అంది నీదంటే ఏం లేకపోవడం ఏంటమ్మా నీదే కదా ఇల్లంతా కొంచెం మంచి నీళ్ళ ఇస్తావా అన్నాను నేను చెంబులో తీసింది తీసి చూసి వద్దండి ఇవి నేను తాగినవి అంది నేను ఎంగిలు తాగనమ్మ కొంచెం ఇంట్లో నీళ్ళ ఇస్తావా అన్నాను అంటే
(10:41) ఇది నా ఇల్లు కాదండి బాబోయి నా ఇల్లు కాదు అంది నీళ్లు కాకపోవడం ఏంటి ఏమైందమ్మా అన్నా వరదమ్మ గారు మొత్తం కనుక్కురమ్మన్నారు అన్నాను నేను అని అంటే అలా అన్నారా ఆవిడ చాలా మంచివారండి అలా అన్నారా అని చెప్పేసి చాలా ఫర్గా మాట్లాడుతున్నాదండి ఆవిడతో ఆవిడ గురించి మాట్లాడుతుంటే మరి వరదమ్మ గారికి ఇద్దాం ఇస్తాను అన్న నేను చీకట్లో రాళ్ళు వేస్తున్నానండి అన్నిని అంటే మీకు అర్థం అవుతుంది కదా వర్డ్ అంటే చీకట్లో రాయి విసరడం అంటే జస్ట్ గెస్సింగ్ అన్నమాట గెస్సింగ్ చూస్తున్నాను అవి తగిలేస్తున్నాయి అవి అంటే కరెక్ట్ అవుతున్నాయి.
(11:16) నేను నాకు అనుమానం బలపడింది బలపడిన తర్వాత నేను అన్నాను వరదమ్మ గారికి ఇది ఇస్తాను అన్నావట కదమ్మా నువ్వు అది ఇస్తే నేను తీసుకెళ్తాను అనిఅంటే అవునండి ఇస్తాను అన్నాను ఉండండి తెస్తాను అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళింది ఏది వస్తువు ముట్టుకోకుండా లోపలికి వెళ్ళింది అంటరాని తనంలాగా లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్లి తన ఎక్కడో దాచుకున్న తాళాలు తీసి బీరువా తీసింది బీరువ తీసి బీరువాలో నుంచి ఒక ఐదు పేటల చంద్రహారం తీసింది రెండు ఏడు ఏడు రాళ్ల దిద్దులు ఈ రెండు తీసింది బరువుగా ఉన్నాయి రెండు తీసి కవర్లో వేసింది ఇప్పుడు చూడండి జ్యువెలరీ షాప్ కి వెళ్తే జిప్ కవర్లు
(11:55) ఇస్తారు కదా అలాంటి కవర్లో వేసి ఇచ్చిందండి వేసిచ్చి ఇది ఇచ్చేయండి ఆవిడకి అన్నది నాకు మతి పోయింది నాకు అలా అన్నా ఇంతవరకు ఇచ్చినవన్నీ బాగా నచ్చాయట వరదమ్మ గారికి అన్నాను అవునా అండి నచ్చాయా వెండి కంచం నచ్చిందా నేను దిష్టి చెప్పడం మొదలుపెట్టిందండి ఆరి భగవంతురా వెండి కంచం కూడా ఇచ్చేసావా అనుకున్నాను బెండ్ కంచం నచ్చిందా ముప్పల్ల అన్నది అది కూడా నచ్చిందట రింగులు అంది అది కూడా నచ్చిందంట మొహంలో ఒక రకమైన క్రేజీనెస్ కనపడుతున్నది అంటే పిచ్చి అన్నమాట వింతగాను కళ్ళు వింత కాంతితో మెరవటం ఈయ అని ఆ నవ్వు మొహం అంతాను అంటే ఒంటి మీద తెలివి లేని మనిషి అకస్మాత్తుగా
(12:37) ఎవరో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ ఆ ఇచ్చేసావా అవునా అరెరరే భలే లలితమ్మవే నువ్వు అది కూడా ఇచ్చేసావా ఓకే వాళ్ళయతే భలే హ్యాపీలే అమ్మ అన్నాను వాళ్ళు ఏది అడిగినా అది ఇచ్చేస్తాను నేను తెలుసా అండి భరతమ్మ గారు అంటే నాకు అంత ఇష్టం మరి వాళ్ళ అబ్బాయి అంటేనో అన్నాను నేను అనేటప్పటికీ వాళ్ళ అబ్బాయి అంటేనండి ఆయన ఎంతంటే అంతేనండి ఓయినారాయణ [నవ్వు] మొగుడు తల దేనికైనా బాధకుంటాడేమో అనుకున్నాను నేను అంటే నేను ఎందుకు చెప్ చెప్తున్నానుఅంటే అలా అయిపోతారండి మనుషులు అంతా అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి వరదమ్మ గారు నీకు తెలుసమ్మా అంత మహానుభావురాలు
(13:21) అంత గొప్ప ఆవిడ అంత మంచి ఆవిడ తల్లి లాంటిది మ్ అలాంటిది ఎప్పటినుంచి ఎప్పటినుంచి తెలుసమ్మా నీకు అన్నాను అంటే రెండు నెలల నుంచి అంది ఓహో ఎక్కడ పరిచయం మీ ఇది అన్నాను చెరువు కడ ఓహో ఇన్ని మాట్లాడానండి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైపోయింది మొత్తం అర్థమైపోయింది సీన్ మొత్తం అర్థమైపోయింది. మరి వాళ్ళ అబ్బాయి ఏం పేరు అది మర్చిపోయాను ఏంటమ్మా అన్నాను నేను ఆమె చేతే చెప్పిద్దాం నాకు తెలిీదు కదా చెప్పిద్దాం అని నేను చాలా విధాలుగా నాలో ఉన్న సైకోథెరపిస్ట్ అంచలంచలుగా బయటికి వచ్చాడండి అంచలంచలుగా బయటికి వచ్చేసాడు నాలో ఉన్న టాలెంట్ అంతా పువ్వులు పూసేస్తున్నాను
(14:03) ఆరోజు ఆ అంటే ఆ అమ్మాయి కూర్మనాథం కూర్మనాథం వాడి పేరు అన్నమాట అనుకున్నా మనసులో అనుకొని సరే ఇంకేంటమ్మా అంటే ఆ మరి కూర్మనాధంకి ఏమనా ఇచ్చారా అన్నాను ఎందుకు ఇవ్వలే వాచి సైకిలు చెప్తుంది వరసగా కొత్త బట్టలు అన్ని ఇచ్చానండి వారంలోనే అన్నాను వారం రోజులు అంటే ఏడు రోజులుండి ఆ అన్నది ఆహా అలాగా అన్నాను అనేసి సరేలే అమ్మ నువ్వు ఇచ్చావని చెప్పి ఇచ్చేసి వస్తాను సరేనా అన్నాను అంటే సరే అనేసి బయటికి వచ్చానండి బయటికి వచ్చిన తర్వాత నాకు బుర్ర హిట్ ఎక్కిపోయి వాళ్ళ అత్తగారికి చెప్పాను ఏవండీ కొంచెం టీ ఇస్తారా
(14:46) ఎందుకు ఇవ్వనమ్మా ఇస్తాను మీకు టీ ఇవ్వడానికి మాకేమ అమ్మ తప్పు ఏటమ్మా ఏటి చెప్తుంది అది ఏటి ఏటి ఇచ్చింది మా ఇంటి నుంచి అని అడుగుతుంది ఆవిడ వాళ్ళు కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్నారు. అప్పుడు ఆ తలుపులు వేసేసుకుంది వేడిసేసుకుని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది రెండు గదులు ఉన్నాయి అది లోపలికి వెళ్ళిపోయింది.
(15:04) లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను పదండి పెరట్లోకి వెళ్దాం అని పెరట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడానండి ఆవిడకి చెప్పాను ఆ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళవస్తాను వరదమ్మ దగ్గరికి వెళ్ళవస్తాను మీరు భయపడకండి ఇదంతా పెట్టుడు మందు అండి ఇది మరుగు మందు అంటాము పెట్టుడు మందు అంటారు వాళ్ళఎవరో మీ కోడల మీద కన్నేసి ఆవిడ ఒంటరిగా దొరకడం చూసి వాళ్ళు ఆలోచించుకుని సేకరించిన సమాచారం ప్రకారం పెట్టుడు మందు తయారు చేయించి ఆమెకి అప్ల అప్లై చేయడం జరిగిందండి ఆమెకి ఇచ్చారు అది అది కడుపులోకి ఇస్తే మాత్రం చాలా డేంజర్ అండి.
(15:39) తల మీద రాస్తే మాత్రం మనం తీసియవచ్చు కడుపులోకి ఇచ్చామంటే ఇచ్చారంటే మాత్రం కొంచెం మనం కష్టపడాల్సి వస్తుంది అసలు ముందు ఆ వరదమ్మ ఎవరో దాని కథ ఏంటో తెలుసుకొని వస్తాను ఉండండి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇది అనేసి నాకు టీ ఇవ్వండి టీ గాని కాఫీ గాని కొంచెం దండిగా ఇవ్వండి నాకు తలనొప్పిగా ఉంది. తాగేసి వెళ్తానంటే అయ్యో అంత మాట అమ్మ అని చెప్పేసి టీ ఇచ్చానండి.
(16:01) టీ ఇస్తే ఆ టీ తాగబోతూ ఆగాను నేను ఇది మీరే చేశరా అన్నాను నేనే చేశాను నేను చేసుకోవచ్చా అన్నాను ఏమని మేమ ఏమైనా నీకు పెట్టేస్తామనా అన్నా కాదండి దానికి కారణం ఉంది నేను చేసుకుంటాను ఉండండి అని చెప్పేసి నేనే వెళ్లి కాఫీ కలుపుకొని గిన్నె డికాషన్ తీసుకొని కాఫీ కలుపుకొని అయిపోయింది గిన్నె డికాషన్ దీని గురించి మీకు ఏమనా పరిచయాలు ఐడియాలు జ్ఞాపకాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
(16:26) అయితే అయిపోయిందండి తాగేసాను తాగేసి వరదమ్మ దగ్గరికి బయలుదేరి వెళ్ళానండి. వరదమ్మ దగ్గరికి బయలుదేరి వెళ్ళాను. వరదమ్మ దగ్గరికి బయలుదేరి వెళ్తే వాళ్ళది చిన్న ముష్టి గుడిస అండి గుడిసని ముష్టి అంటున్న ఎవరు దయచేసి హర్ట్ అవ్వకండి. కానీ ఇటువంటి కుటుంబాలని కూలదోసే దాన్ని అంతకంటే గౌరవించడం అనవసరం అనిపిస్తుంది నాకు అందుకని అలా చెప్తున్నాను ఇక్కడ కులము గుణము గోత్రము ఇవన్నీ కాదండి డబ్బు ఇవన్నీ కాదు ఆమెలో ఉండే గుణం ఆ వరదమ్మ దగ్గరికి వెళ్లి నేను ఒక 10 బుట్టలు ఆర్డర్ ఇచ్చాను ఇక్కడి నుంచి వచ్చానుని చెప్పలేదు నేను ఒక 10 బుట్టలు
(17:04) ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇచ్చి ఎక్కడమ్మ మీరు ఎవలు మీరు ఎప్పుడు చూడలేదు అన్నది ఇలా చూసినాను అని ఇలాగ అన్నారు నన్ను సిదిమి దీపంె పెట్టుకోవచ్చు అమ్మ ఆ ఎందరు పిల్లలు అంది నేను కావాలని ఐదుగురు అని చెప్పాను నమ్మలేనట్టు చూసింది నా వైపు నాకు ఐదుగురు కాదులేండి ఆ ఐదుగురు అన్నాను నమ్మలేనట్టు చూసి ఐదుగురు పిల్లలు తల్లివా అన్నది లలిత నేను ఒక దగ్గరే చదువుకున్నామండి అన్నాను ఏ లలిత అంది ఎంత హీనంగా అంటే అక్కడ ఇక్కడ గుడి దగ్గర ఉన్న వీధిలో ఆ చివరికి ఉన్న లలిత అండి ఆ లలిత నేను చదువుకున్నామఅండి
(17:49) వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడు నేను వస్తే ఇక్కడ బుట్టలు బాగా చేస్తారని చెప్పింది తను అందుకని నేను మీ దగ్గరికి వచ్చాను లేకపోతే మీ దగ్గరికి వెతుక్కుంటే నేను ఎందుకు వస్తాను నువ్వేంటి నాకు ఊరకనే ఇస్తావా అన్నాను నాకు కొంచెం ఫోర్సఫుల్ గా వచ్చేసింది మాట అంటే ఆమె ఏమంది లలిత్ చెప్పిందా ఎన్ని బుట్టలు కావాలి నీకు అనిది మారిపోయింది.
(18:13) ఎన్ని బొట్లు కావాలి నీకు ఏమైనా తాగుతావా టీ తాగుతావా అన్నా నాకు వద్దమ్మ నాకు అంత బంపర్ ఆఫర్లు ఇవ్వకు నువ్వు అని మనసులో అనుకున్నా అనుకని నాకేం టీ వద్దు గానీ బుట్టలు ఎప్పుడు రావాలో చెప్పు నేను అప్పుడు వస్తాను అన్నాను అంటే నువ్వు రాకులే అమ్మ మా కూర్మిగాడు ఉన్నాడు వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇచ్చేస్తాడు నీకు అంది పిలు అని అన్నాను ఎందుకు ఆడు అతనితో నాకేం పనిఅమ్మా నేను అడ్రెస్ చెప్తాను పిలువు ప్రతిదానికి అనుమానమే అంటే ఏంటి నువ్వు వ్యాపారం చేస్తున్నావా ఇంకేమన్నానా అన్నాను ఆ లేదమ్మ తప్పు అయిపోయా అన్నది అనేసి పిలిచిందండి పిలిస్తే వాడు వచ్చాడు వాడు
(18:48) ఎలా ఉన్నాడో తెలుసా అండి చింత ముద్దులాగా ఉన్నాడు. ఆరు అడుగులు ఎత్తున్నాడు చింత ముద్దులాగా ఉన్నాడు సన్నంగా ఉన్నాడు దెయ్యంలాగా ఇవన్నీ చూసాను చూసిన తర్వాత ఏ ఊరు మీది ఏ ఊరు మీది అని అడిగాను అంటే ఎందుకో అన్నాడు ఎందుకో కందుకో అనేసి సరేలే సరే నేను వెళ్ళాలి ఇంకా ఏ ఊరు నీ ఇది అన్నది నన్ను అన్నా నరసినపేట అన్నాను మా ఊరు చెప్పలేదు నరసన్నపేట అన్నాను నరసన్నపేట పోనీలే అమ్మ బాగా కలిగినంటి పిల్ల పిల్లలాగా ఉన్నావు పోన్లే ఈ పేదోళ్ళ ఇంటికి వచ్చినావు బుట్టల కోసం ఓ పని చేయమ్మ ఇదిగో ఇది ఇది ఇస్తున్నాను నీకు తీసుకో బాగుంటది ఇది వెదురు బియ్యము అనేసి బియ్యం
(19:36) ఇచ్చింది. నాకు బియ్యం తినే అలవాటు లేదు అంటే అన్నం తినే అలవాటు లేదు నేను తినను మంచిదే నేను రేపు వస్తాను బుట్టలు రెడీ చేసి ఉంచండి ఎల్లుండి పొద్దుట వస్తాను అని చెప్పాను చెప్పేసి నేను బయటికి వచ్చానండి. బయటికి వచ్చిన తర్వాత నాకు టోటల్ గా విషయం అర్థమైపోయింది విషయం అర్థం ఎందుకంటే దాని చెవులకి దుద్దులు మెరుస్తున్నాయి.
(19:56) ఆహా దేవుడా అనుకున్నాను అనుకొని వీళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చి ఇదండి విషయం వాళ్ళు మీ కోడలకి పెట్టుడు మంది పెట్టారు అన్నాను నేను అనేటప్పటికి అవునా ఎలాగండి అది విప్పదీయడం విప్పదీయడం ఎలాగ అన్నది తర్వాత ప్రశ్న ఆ అసలు ఇది ఎక్కడి నుంచి తెప్పించారు వాళ్ళు ఏమిటి పరిస్థితి వాళ్ళు ఎవరు అన్నది నేను కూపి లాగుతాను మీరు ఆగండి అని అంటే కిటికీ తీసి లోపల నుంచి లలిత అన్న ఆవిడ జుట్టు విరబోసుకుని వాళ్ళు ఇందాక నాతో మర్యాదగా మాట్లాడింది కదా ఆమె ఆమె జుట్టు వెరబోసుకొని తలుపు ఇలా తీసి కిటికీలోనుంచి ఇలా మొహం పెట్టి ఏంటే నువ్వు చూసేది నన్ను ఏంటి కూపీలు లాగుతావు
(20:34) నా గురించి నువ్వేంటి లాగుతావు నువ్వు నా గురించి ఏటి లాగలేవు పిక్క మీదే పీకలేవు ఇదే భాష అన్నమాట అబ్యూస్డ్ లాంగ్వేజ్ ఆ తీయలేవు ఆ నా ఇష్టము నేను ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నానో అన్నాళ్ళు ఉంటాను ఏదేది కావాలనుకుంటున్నానో అవన్నీ తీసుకెళ్ళిపోతాను ఆ తర్వాత ఈ తిత్తి నాకెందుకు ఈ తిత్తి అంటే అంటే ఆ అమ్మాయి అన్నమాట మాట్లాడుతున్నది అందులో ఉన్న దుష్ట శక్తి మరుగుమందు మాట్లాడుతుందని నాకు అంతకు తెలియదు అంటే మరుగుమందు రూపంలో లోపలికి వచ్చినటువంటి దుష్ట పిశాచి మాట్లాడుతుందని నాకు అప్పటిదాకా నాకు తెలియదు. నేను లోలోలోనే ఆశ్చర్యపోతూ
(21:07) వింటున్నాను నేను [గురకలు] నువ్వు నాకేంటి చేస్తావే ఏటి చేస్తావ్ నువ్వు నాకు నువ్వు నాకు ఏం చేయలేవు నేను నా వైపు నుంచి అన్ని నేను ఇచ్చేస్తాను నేను అక్కడికి ఏంటి ఈ పిల్లకి ఎలకు తగిలించాలో వాళ్ళకి తగిలిస్తాను. ఈ పిల్లక ఎలాగ నాశనం చేయాలో అలాగ నాశనం చేస్తాను ఈ పిల్ల కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అన్నది ఎందుకు ఇష్టం లేదు అని అన్నారు ఎందుకు ఇష్టం లేదు అంటే రా లోపలికి చెప్తాను అన్నది సరే వస్తాను అన్నాను వీళ్ళు వద్దంటే వద్దు అంటారు అంటే లేదు లేదు వెళ్ళకపోతే మీ సమస్య తేలదండి నేను వెళ్తాను లోపలికి నాకేం భయం లేదుఅని చెప్పేసి నేను వెళ్ళాను నా మెళలో సూత్రాల
(21:41) తాడు తప్ప ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇచ్చేసాను ఆవిడకి ఇవి ఇలా ఉంచండి నేను వచ్చాక తీసుకుంటాను చెవిలో కూడా తీసి ఇచ్చేసాను సూత్రాలు తాడు మాత్రం తీసివ్వలేదు గాజులు కూడా తీసి ఇచ్చేసాను. ఇచ్చేసి మొత్తం అవి ఎందుకు తీసి ఇచ్చేస్తున్నారు అన్నది కారణం ఉంది నేను లోపలికి వెళ్తాను అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు పక్కనే నెక్ ఉండి నా మీద అటాక్ చేసిందండి అటాక్ చేసి ఆ తర్వాత గబగబాను కిటికీ ఎక్కిపోయింది ఒక ఆడమనిషి అంత ఫాస్ట్ గా కిటికీలు ఎక్కడాలు గటలు నేను చూడలేదు ఎక్కడను అంటే ఇలాంటి కేసుల్లో తప్ప నార్మల్ గా ఎవరు ఎక్కరు కిటికీ
(22:15) ఎక్కిపోయింది కిటికీ ఎక్కిపోయింది మళ్ళీ కిందకి దూకేసింది మళ్ళీ కిటికీ ఎక్కింది అంటే నన్ను భయపెట్టాలని వేసుకో ప్రయత్నం చేసింది బట్ నేను కంగల అవ్వలా ల అవ్వకపోయేటప్పటికి నేను అడిగాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాను అంటే అడ్డాకులు కూడా ఏటి పీకుతావ్ అన్నాను ఇదే సేమ్ వర్డ్ అన్నమాట అడ్డాకులు కూడా ఏటి పీకుతావ్ అన్నాను నేనేమి పీకను ఇంకేంటి మాట్లాడతావ్ అన్నాను నేను ఇంకేంటి మాట్లాడతావ్ అనిఅంటే ఈ కుటుంబం నాశనం అయపోవాలని నీకేంటి ప్రాబ్లం నీకెందుకు అని అడిగాను [గురకలు] ఇవన్నీ మాట్లాడానండి మాట్లాడిన తర్వాత దాన్ని లోపల ఇలా అవతల
(22:53) పక్క నుంచి గడి పెట్టేయమన్నాను అంటే తాళం వేసేయమన్నాను పెల్లడ తలుపు నుంచి ఇది ఇది ఇంట్లో చేసుకుంటే తర్వాత క్లీన్ చేసుకోండి తాళం వేసేసుకోండి లేదంటే ఆ పిల్ల దక్కదని చెప్పాను. ముందు వీళ్ళు ఎక్కడైతే ఆవిడ లోపలికి వెళ్లి బయట తిరుగుతుందో ఈ పాస్ పాసింగ్ వే కూడా వేసేయమన్నాను. దారి కూడా ఎగ్జిట్ దారి కూడా వేసేయమన్నాను.
(23:14) వేసేసి రెండు తాళాలు ముందు వెనక బిగించి ఉండండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను అడ్డాకులు కూడా వెళ్తాను అడ్డాకులు కూడా వెళ్లి ఇదేంటో తేల్చుకొని వస్తాను అన్నాను అంటే [గురకలు] మీరు ఒక్కరే వెళ్తారా మా వాళ్ళు ఎవరో వస్తారా అనింటే రండి ఎవరైనా వస్తే అయితే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అంటే లెతారా తెలక భర్త వచ్చాడు పదనమ్మ నేను వస్తాను ఇంక మేమ ఇద్దరం కలిసి వెళ్ళామండి వెళ్తే బండి మీద వెళ్ళామ బండి మీద వెళ్తే అడ్డాకులు కూడా చాలా అసలు రోడ్డు సౌకర్యం లేదు బస్సు సౌకర్యం సరిగా లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందో
(23:48) తెలియదు అలా ఉంది. అక్కడికి వెళ్ళాము వెళ్ళేటప్పటికి సాయంకాలం 5దు గంటలు అయింది 5ు గంటలు అయితే అవతల వెళ్ళినప్పటికి ఆ వాడు అడిగాడు దిగ్గగానే ఆ కుర్రోడు అడిగాడు అమ్మగారు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఎలా వెళ్తారు అని అడిగాడు. పెట్టడమందే మనకు దారి చూపిస్తుంది పదనాయన అన్నాడు. పదనయనా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుమ్మిక పూడిన ముసిలోళ్ళు ఉన్నారు.
(24:11) ఆ ముసిలోళ్ళు ఉంటే ముసిలోళ్ళ దగ్గరికి వెళ్లి నేను శ్రీకూర్మం నుంచి వస్తున్నాను వరదమ్మ పంపించింది అన్నాను ముక్తసరిగా రెండే మాటలు అని అంటే అందులో ఎవ్వరు కదలలేదు ఒక్కడు మాత్రం ఇలా కళ్ళెత్తి చూసాడు అంటే వాడు దానికి కనెక్టెడ్ అన్నమాట కనెక్టెడ్ అయితే రండి మాట్లాడాలి అన్నాను నేను అని అంటే ఏడు మాట్లాడతావ్ అన్నాడు ఏం మాట్లాడడానికి ఏం లేదు లలితమ్మని రేపు పంపిస్తామ అని చెప్పారు వాళ్ళు నువ్వు ఎవరో అన్నాడు నువ్వు ఎవరో అన్నాడుంటే దాని అక్కని అన్నాను దాని అక్కని అంటే చెల్లి కంటే అక్కే బాగుంది అన్నాడు ఏడే ఏం లేదు అన్నాడు ఏం లేదంటే ఆ ఏంటి ఎందుకు వచ్చారు మీరు అసలు మీరు ఎవరు
(24:55) అన్నాడు నేను చెప్పాను కదయ్యా వాళ్ళ పెద్దమ్మ కూతుర్ని అంటే వాళ్ళకి మీకు పోలికలే లేవు ఆ సరలేండి మీరు ఏ పని మీద వచ్చారు ఎవరు పంపారు అన్నాడు వాడు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేసాడు వచ్చేస్తే ఎవరు పంపారో నేను చెప్తాను కానీ ఒకసారి మా ఇంటికి వెళ్దామా అంది ఇక్కడే మాట్లాడమంటావా పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వాడి ఇంటికి తీసుకెళ్ళాడు వాడిది ఒక సారాపాక ఆ సారా పాక దగ్గరికి తీసుకెళ్లి వీడు ఎవడు అన్నాడు ఆ పక్కన ఉన్న చూపించి అని అంటే మా తమ్ముడు అన్నాను తమ్ముడు అంటే దానికి అక్కవి వీడికి తమ్ముడా ఒకే కుటుంబం అట అందరూ అన్నాడు అవును అన్నాడు అయిన తర్వాత
(25:32) లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ నేను ఊహించలేదండి సడన్ గా నా జుట్టు పట్టుకున్నాడు ఇలాగ కొప్పు ఇలా పట్టుకున్నాడు అలా పట్టుకొని ఏటా నాటకాలు ఆడుతున్నావో నువ్వు ఏదో పట్టుకోవడానికి వచ్చావు నన్ను నువ్వు నన్ను ఏం పట్టుకోగలుగుతావ్ నువ్వు నన్నుఏమి చేయలేవు. తర్వాత నీకు ఇంకో ఇంత కష్టపడి వచ్చావు కాబట్టి చెప్తున్నాను నువ్వు ఏమి చేయలేవు ఈ మరుగుమందు అంటే ఏంటో చూపిస్తాను నేను తొట్టతొలి నాకు ఆ పిల్లక ఇవ్వాలనుకున్నారు తొట్ట తొలి మా సైడ్ మాట తొట్టతలి నాకు ఆ పిల్లక ఇవ్వాలనుకున్నారు ఆ లలిత్ కి నీకా అన్నాను నేనేమనుకుంటున్నావ్ నేను విద్య
(26:08) నేర్చుకుందాం అని ఇక్కడికి వచ్చాను నాది ఈ ఊరు కాదు నసికాకుండా ఉన్నాను అమ్మ రోజుకో న్యూస్లు తెలుస్తున్నాయి అయితే ఉన్నాను నువ్వు అక్కడ ఏటి కాదు నువ్వు వాళ్ళకి ఏమ అవ్వని నాకు తెలుసు నువ్వు వాళ్ళఏదో విడిపించుకోవడానికి ఇది చేస్తే నువ్వు ఏదో నాటకాలు వచ్చినట్టు ఉన్నావు అన్నాడు ఒరేయ్ నాటకాలు ఆడితే నేను ఎందుకురా ఇక్కడ దూరం వస్తాను నీ దగ్గరికి రాని పిల్లకి నువ్వు ఎందుకు రాలా ఆలోచిస్తావు ఆల్రెడీ ఆ పిల్లకి పెళ్లి అయిపోయి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు నువ్వు మరుగు మంది పెట్టి ఏం పీకుదాం అనుకుంటున్నావ్ నువ్వు నేను గట్టిగా తీవచ్చే వాటిని పెట్టాను
(26:37) నాకు తెలీదు అంటే నేను అడిగాను నువ్వు తల మీద పెట్టావా కడుపులోకి ఇచ్చావా అని అడిగానండి కడుపులోకి ఇచ్చావా అంటే నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను నీకు అనవసరం పో బయటికి అన్నాడు అంటే అంటే నేను పోతాను కానీ నువ్వు కూడా పోతావేమో జాగ్రత్త అన్నాను నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నాడు సరే మంచిదే అంత కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే అనుకని ఇంటికి వచ్చేసానండి.
(26:58) నాకు తెలుసు ఈ తీగ అంతా లాగేసాను డొంక అంతా కదిలిపోతుందని మరి ఏం చేస్తాను ఆమెను కాపాడడం నా ధర్మం అనిపించింది వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారో అది చేయడం నా ధర్మం కదండి మరసటి రోజు నేను వెళ్లి వీడు ఆ రాత్రి గడిచేటప్పటికి వీళ్ళకి చెప్పాను వీళ్ళ ఆ అబ్బాయికి ఆ భర్తకి చెప్పాను లలితమ్మ భర్తకి ఎట్టి పరిస్థితిలో మీరు ఈ రాత్రి ఆవిడ గింజుకున్న గీ పెట్టిన ఏడిచినా మొత్తుకున్న ఊరేసుకుంటాను అన్నా ఊరేసేసుకున్నా మీరు తలుపు తీయకండి ఆమెక ఏం కాదు ఆమెలో ఉన్న దుష్ట శక్తి ఆమని చంపనివ్వదు కనుక మీరేం టెన్షన్ అవ్వకండి ఆ రకరకాలైనటువంటి విధ విధానాలు చూపిస్తుంది
(27:32) మీరేం పట్టించుకోకండి. ఏదైనా అత్యంత అవసరమైతే నా దగ్గర రండి అని చెప్పాను నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి నాకు కావలసిన సామానం వాళ్ళకి చెప్పాను సరి చేసుకోమని చెప్పాను. నేను తర్వాత మరొకళ్ళు ఉన్నారులేండి నాకు ఆ ఆ వ్యక్తి మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అతను నేను కలిపి ఈ విషయం మాట్లాడుకుని ఏం చేయాలో మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత అతను ఏమన్నాడు ఇది మరుగుమందు కదా నువ్వు తీసుకెళ్ళవు కదా నువ్వు చేసేయమ్మా నువ్వు ఎందుకు నేను ఇంకా రాను ఇవాళ నాకు కొంచెం ఒట్లో నలతగా ఉంది అన్నాడు అంటే పోనీ రాకపోతే రాకపోయావు అన్నాను నువ్వు నాతో పాటు ఉండు
(28:04) నువ్వు ఏం చేయకు నేనే చేస్తాను ఉండు అన్నాడు ఉండు అంటే సరే అన్నాడు రాత్రి ఏడు గంటల అప్పుడు మళ్ళీ మేము బయలుదేరాం బయలుదేరి వెళ్ళేటప్పటికి ఆరు నూరయినా నూరు ఆరైనా మీరు నమ్మరండి మీరు నమ్మరు అసలు నమ్మనే నమ్మరు మా ఇంటి గుమ్మం తలుపు తీసి నేను మా అమ్మకి చెప్పేసి మా అమ్మ లేదండి అప్పటికి సారీ చనిపోయింది మా నాన్నగారికి చెప్పేసి నేను వెళ్తున్నాను నేను ఈ రాత్రి శ్రీకూర్మంలో ఉంటాను రేపు అడ్డాకులు కూడా వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు వెళ్ళకపోతే రేపు ఉదయం 11 కళల మన ఇంటికి వచ్చేస్తాను వెళ్తే రేపు సాయంత్రానికి వస్తాను అని చెప్పేసాను మా
(28:41) నాన్నగారికి చెప్పేసి మా వారికి ఫోన్ చేసి చెప్పాను నేను ఇలాగ వెళ్తున్నాను వర్క్ మీద అనిఅంటే ఎవరున్నారు నీకు సేఫ్టీకి అనిఅంటే ఉన్నారు నాకుఅని చెప్పాను. ఆ కార్లో వెళ్లి అన్నాడు సరే అన్నాను అన్నే ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను తలుపు తీశనండి సాయంకాలం ఆరు గంటలకి చీకటి పడ్డాక చేయాలి నేను శ్రీకూర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను.
(29:03) రెడీ అయి బయటికి వచ్చి చెప్పులు వేసుకొని గేట్ తీసి ఇలా బయటికి రాబోతున్నాను ఇంకా నేను బయటికి రాబోతుంటే గుమ్మం బయట ఆ గుమ్మం బయట వరదమ్మ నిలబడి ఉంది. నిలబడి ఉంటే ఏంటి ఇక్కడికి వచ్చావ్ అన్నాను నేను మా ఇల్లు తెలుసుకొని మా ఇంటికి వచ్చింది చూడండి ఏంటి ఇక్కడికి వచ్చావు అనిఅంటే అలా నా వైపు చూసిన అది మాట పలుకు లేదు మొహం మీద ఇలా అన్నాను నేను ఏంటి ఇక్కడికి వచ్చావ్ అని అడిగాను అలా చూస్తున్నాను నన్ను అంతే ఇంకేం స్టిల్ ఫొటోగ్రఫీ ఇలా చూస్తుంది.
(29:39) చూస్తుంటే పా అన్నాను ఇంకా వదిలేసి మా నాన్నని వదిలేసి వెళ్ళడానికి నాకు భయం వేసింది. నేను వెళ్ళిపోయాక ఆయన్ని ఏమన్నా చేస్తే అందుకని ఎందుకు వచ్చావు ఇక్కడికి పదా అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశాను నేను తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే రాలే మాట్లాడదు రాదు ఉలకదు పలకదు అక్కడి నుంచి కదలదు ఇది గొడవ ఒక గంట నడిచిందండి గంట నడిచిన తర్వాత ఆమె నాతో బేరానికి వచ్చింది నీకు నాకు తేడా లేదు అంటే నీకు నాకు గొడవలు లేవు నీకు నాకు స్నేహం లేదు నా నేను నీకు ఆస్తి బక్కర్ లేదు నువ్వు నాకు ఆస్తి బక్కర్ లేదు అటువంటప్పుడు ఎవతు గురించో నువ్వు వచ్చి నువ్వు నాకు చెడ్డయి
(30:19) నువ్వు ప్రమాదంలో పడకు అంది నేను ప్రమాదంలో పడతానో ప్రమాదంలో పెడతానో తర్వాత విషయం నువ్వు ఎందుకు అసలు ఆమెని అలా చేశవు నువ్వు నేను ఆమెను ఎప్పుడు బాగు చేయబోతున్నాను నీ దిక్కున్న చోట చెప్పుకో నువ్వు చేయగలిగింది చేసుకో అన్నాను ఈలోపు అదేమంది నువ్వు ఆమెని బాగు చేసే ప్రయత్నం ఏదైనా చేస్తే నీ ఇంట్లో పీనుగలు లేస్తాయి అంది.
(30:42) నా ఇంట్లో పీనుగలు లేవడానికి పడుకొని లేవు పిచ్చి పిచ్చి వేషాలు వేసాంటే పళ్ళు రాలకొడతాను ఏమనుకుంటున్నావో అని నేను చెప్పవలసింది గట్టిగా చెప్పి పద నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పేసి దాన్ని మా డ్రైవర్ తో పాటు నా కార్లో కుదేసి కూర్చోపెట్టి దాంతో పాటు నేను కూడా బయలుదేరాను ఎందుకంటే మా నాన్నని వదలడం నాకు ఇష్టం లేదు దానికి బయలుదేరాను బయలుదేరి శ్రీకోర్మ వెళ్ళిపోయాడు హాఫ్ న్ అవర్ ఎంతసేపు అండి కార్లో వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ నువ్వు మనసు మార్చుకొని అంటావు అన్నాను మార్చుకోవడం లేదు మరమరాలు లేవు పో బయటికి అనేసి ఈ అమ్మాయి దగ్గరికి
(31:16) వెళ్ళారండి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్లి నేను చేయాలనుకున్న పనికి అప్పటికి వాళ్ళు సిద్ధం చేశారు మొత్తం సిద్ధం చేసిన తర్వాత ఆ పిల్ల రూపాయి నాణ్యాలు నోట్లో పోసుకొని కూర్చుంది. ఎంత భయానక సంఘటనో చూడండి రూపాయి నాణాలు నోట్లో పోసుకుంది నోట్లో పోసుకొని కూర్చొని ఆ మింగేస్తానని బెదిరిస్తున్నారు అందరిని అయితే ఈ వరదమ్మ మాకు చెప్పాను నేను ఉమ్మేయమని చెప్పని నేను ఉయమన్నా అది పోతే నాకేమి అంది ఆహా నువ్వు ఉయ్యలేదుఅనుకో అంటే ఉయ్యమని చెప్పలేదుఅనుకో ఇక్కడ నిన్ను నేనేమి అన్నం కానీ పోలీసు వాళ్ళు మాత్రం లోపల వేసి కుమ్మేస్తారు నిన్ను అని అంటే
(32:01) పోలీసులు ఎందుకు నన్నుఏటి చేస్తారు నేనేటే రుజువా సాక్షమా ఆహా అయితే చాలా నాలెడ్జ్ ఉందే నీకు ఆమెని విడిచిపెడితే నువ్వు బతికిపోతావు లేకపోతే ఇబ్బందుల్లో పడతావు అన్నాను అంటే నువ్వు ఎవరో నాకు దాదాపురించినావు అన్నది అనేసి ఏదేదో మాట్లాడేసిందండి మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఈ లోపల ఉన్న అమ్మాయి నోట్లో రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాలేదు నాకు నోట్లో మింగేస్తాను మింగేస్తాను అంటుంది నన్ను చూడగానే రెచ్చిపోయిందండి రెచ్చిపోయి నా మీద కోపం కొద్ది ఒక్కసారి ఊసింది నా మీదకి ధవ అని
(32:35) ఊసేటప్పటికి నా పని ఈజీ అయిపోయింది ఇంక మేము లోపలికి వెళ్ళడం ఆవిడని కట్టడం కట్టిపెట్టి అన్ని చేయటం ఇవన్నీ అయిపోయింది. అయితే ఆ రాత్రి నేను చేసిన కార్యక్రమం తర్వాత వరసగా నేను మూడు రోజులు శ్రీకూర్ వెళ్లి వాళ్ళని సరిచేయడానికి వెళ్ళవలసి వచ్చింది. ఇంతకీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఆమె ఆ వరదమ్మ అన్న మనిషికి ఎలా తెలుసు అనిఅంటే ఈమె శ్రీకోర్మనాథ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని చూసిందంట చూసి ఆ వాడు ఎవడో ఉన్నాడు చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాడే అడ్డాకుల కూడా మనిషి వాడికి వీళ్ళు ఇస్తామన్నారట వాడి
(33:10) పేరు ప్రసాదు వాడికి ఇస్తామన్నారట వీళ్ళు వాడికి పిల్లని ఇస్తామ అన్నారట ఈ పిల్ల బాగుంటుంది ఈ పిల్ల ఆస్తి ఇస్తామ అన్నారట ఆ పిల్ల పిల్ల కన్నవారు ఇస్తామ అన్నారు కానీ వీడి చెడు తిరుగులు గాలి తిరుగుళ్ళకి ఇవ్వమన్నారు. దాంతో వాడు కక్ష కట్టి అడ్డాకుల గోడలో ఎవరో పెట్టుడు మందులు పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళని కలుసుకుని ఎవరో నాకు తెలియదు ఈరోజు వరకు కూడా తెలియదు నేను తెలిసిన చెప్పను ఆ పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని వాళ్ళ బంధువైనటువంటి ఈ వరదమ్మని పట్టుకొని ఈ వరదమ్మ ద్వారా ఆ పిల్లని మజ్జిక చేసుకొని ఆ పిల్లకి టీ ద్వారా కడుపులోకి ఇచ్చేసారండి అది
(33:49) కడుపులోకి ఇచ్చేస్తే కడుపులో చెట్టు అయిపోతున్నారు అది ఇది మీకు తెలుసా మరుగు మందు కడుపులో లో చెట్టు అయిపోతుంది వేళ్ళు తన్నేస్తాయి కొన్నాళ్ళకి పట్టించుకోకపోతే వేళ్ళు తన్నేస్తే ఆ మనిషి పేగులు చిద్రమైపోయి చనిపోతాడు దారుణమైన బాధ చనిపోతాడు మూడు నెలల్లో చనిపోతారు అటువంటి ప్రమాదకరమైనది వేళ్ళు దిగిపోవడం అంటారు మా ప్రాంతంలో ఇవేం కట్టుకథలు కావండి నిజాలు ఆ అందువల్ల ఆ వేళ్ళు దిగిపోవడం అంటారు ఆ వేళ్ళు దిగిపోవడం అనే పరిస్థితికి రాకుండా ఉండాలి అనిఅంటే ఆ కడుపులో వెళ్ళిపోయింది అది దాన్ని ఎలాగ బయటికి రప్పించడం అని నేను ఆలోచిస్తూ నాకు తెలిసిన మరొక మనిషి
(34:24) దగ్గరికి వెళ్లి ఇతను అనేబుల్ గా ఉన్నాడు కాబట్టి మరొక దగ్గరికి వెళ్లి ఆ రాత్రి మీద 11 గంటల రాత్రికాడ ఆ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ మనిషిని లేపి తీసుకొచ్చి అమ్మాయిని చూపెట్టి మొత్తం విషయం అంతా ఇచ్చేసి నేను చేసిన పనిఅంతా చెప్పి చేస్తే అది విరగడ చేయడానికి రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము ఉండవలసి వచ్చింది వదిలేస్తే ఎక్కడ చచ్చిపోద్దో అని ఆ దుర్మార్గుడు ఆ ప్రసాదు అన్నవాడు నెక్స్ట్ నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేసాడు ఇక్కడికి వచ్చేసి నాకు కావలసిన లలితని మీరు నాకు కాకుండా చేస్తారా అందుకే నేను దానికి అలా చేశను అని చెప్పేసి
(35:00) పిచ్చి పిచ్చిగా మోహన్ నిండ రక్కేసుకొని మోహన్ నిండ ఇచ్చేసేసుకొని జుట్టు పీకేసుకుని సారా సారా అలా తాగేసి కొంతసేపు అయిన తర్వాత గోడ గోడ కాదు ఏంటంటారు రోడ్డు రోడ్డు అంచుకి తల కొట్టేసుకుని స్పృహకోలిపోయాడు రక్తస్రావంతోటి తర్వాత వాడు గవర్నమెంట్ హాస్పిటల్ లో పడేసారు వాడు ఏమయ్యాడో మాకు తెలియదు ఈ రోజు వరకు నాకు తెలియదు నాకు అనవసరం కూడా ఆ ఎంత ఒక మనిషిలో ఉండే చెడు ఎంత చేస్తుందో చూడండి ఈ తీ మరుగు మంద అంటే ఆ పిల్లకి కనీసం ఒక పాతికి వాంతులు అయ్యాయండి ఈ టు డేస్ లో లోపల ఉన్న పెట్టుడు మందంతా పసర రూపంలో బయటికి రావడం మొదలు పెట్టింది ఆ ఒక పచ్చటి ద్రవం ఇంకా
(35:40) నాకు భయంవేసి రెండో రోజు ఎప్పుడైతే మొదటి రోజు 15 వాంతులు అయ్యాయో డీహైడ్రేట్ అయిపోతుంది కదండీ వెంటనే శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసేసాం ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ ఇది అవుతోంది అది అవుతుంది జాయిన్ చేసేసాం జాయిన్ చేసేసి ముందు ట్రీట్మెంట్ అవ్వాలి ఆమెకి ఏదో పసరమందు మింగేసిందని డాక్టర్ చెప్పి అన్ని రకాల అన్ని ఇబ్బంది అవుతాయి కదండీ రీడింగ్స్ మారిపోతాయి కదా అన్ని చేసి ఆమెక అన్నీ సెట్ చేసి మాట్లాడి ఆ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేపించి మొత్తం అంతా వామిటింగ్ చేపించి మామూలుగా ఆమె తిన్న పాలు పాలల్లాగా వామిటింగ్ అయినంత వరకు
(36:16) చేయించి ఇంకా కడుపులో లేదు ఇంకా ఆ పిల్లకి పేగులు కూడా వచ్చేస్తాయేమో అన్నంత బాధ కలిగింది నాకు ఆ యాతన చూసిన తర్వాత మనిషిలో ఉండే దౌర్భాగ్య లక్షణాలు దుర్మార్గం కంటే ఏ దెయ్యం పిశాచం పెద్దది కాదు అని మరోసారి అనిపించింది నాకు అనిపించింది ఆ తర్వాత నేను చేయాల్సింది డాక్టర్ దగ్గర ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో ఇంక మేము విజృంభించామ అన్నమాట ఇంక మేము చేయాల్సిందల్లా చేశము ఆ రాత్రి పిశాచబలి పెట్టాము పెట్టి తీసుకెళ్లి ఊరవతలు పెట్టాము శ్రీ కుర్మ ఊరవతలు పెట్టి మొత్తం అంతా సెట్ చేసి అంతా అయ్యిన తర్వాత మొత్తం క్లీన్ అయిన తర్వాత ఆ పిల్ల కోలుకోవడానికి
(36:53) త్రీ మంత్స్ పట్టిందండి ఒక రోజు రెండు రోజులు కాదు త్రీ మంత్స్ పట్టింది ఇలా అయిపోయింది సన్నగా అయిపోయింది ఎలా ఉండేది ఎలాంటి పిల్ల అలాగ అయిపోయిందంటే అలాగ అయిపోయింది. మూడు నెలల తర్వాత ఆ పిల్ల తిరిగి మనిషి అయిందండి మనిషి అయింది ఈలోపు జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఈ వరదమ్మకి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి దారిలో ఉన్న ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన తీగలు అన్ని మెడలో వేసుకొని ఇదిగో చంద్రహారం ఇదిగో కాసుల పేరు అని అనుకొని గెంతుకొని తిరగటం పిచ్చిది అయిపోయింది ఇప్పటికీ కూడా నరసన్నపేట బస్ స్టాండ్ లోన తర్వాత అక్కడక్కడ అక్కడక్కడ కనపడుతూ ఉండేది ఎంతవరకు అనిఅంటే ఒక ఏడుఎనిమిద ఏళ్ల
(37:32) కిందటి వరకు కనబడుతూ ఉండేది తర్వాత మనకు కనపడలేదు దాని కొడుకు ఏమయ్యాడో మాకు తెలియదు. అయితే ఇదండి కథ ఇందులో దెయ్యం ఉందా భూతం ఉందా ఆ దుష్టశక్తి ఏదో ఆ మీదకు వచ్చి మాట్లాడింది అది మాత్రమే నాకు అర్థమయింది తప్ప నాకు అర్థమైందంతా భయంకరమైన మరుగుమందు ప్రయోగం ఈ దుష్టశక్తి ప్రయోగం మరుగుమందు రూపంలో ఆ పిల్ల కడుపులోకి వెళ్ళిపోయి వేళ్ళు తన్ని ఆమె జీవితాన్ని బలి తీసుకోవాలనుకుంది.
(37:57) ఆ బలి తీసుకోవాలనుకున్న లోపు ఆస్తి అంతా రాయిపించేసుకోవాలి అనుకుంది. ఇవన్నీ జరగకుండా మేము అడ్డుకోవడం అనేది భగవత్ సంకల్పం అనుకోవాలి మా గొప్ప ఏమీ లేదు ఇందులో భగవత్ సంకల్పం అనుకోవాలి ఆవిడకి నూకలు ఉన్నాయి అనుకోవాలి అంతేనండి ఆ దీనికంటే కూడా ఎప్పుడ నేను చెప్పేది ఒకటేనండి ఇష్టపడితే ఎవరినైనా పెళ్లి చేసుకోండి ఇష్టపడకపోతే ఊరుకోండి మీరు ఇష్టపడిన మనిషికి మరొకళ్ళతో పెళ్లి అయిపోతే మీకు రాసి పెట్టి లేదనుకొని ఓర్చుకోండి కొన్నాళ్ళకు ఆ బాధ మానబట్టిపోతుంది.
(38:29) ఎంత పెద్ద బాధ అయినా కొన్నాళ్ళకి గాయం మానపట్టిపోతుంది. అటువంటిది తల్లిదండ్రులని పోగొట్టుకున్న సొంత పిల్లల్ని పోగొట్టుకున్న ఆ బాధ కూడా కొన్నాళ్ళకి మానపట్టిపోతుంది అంతకంటే గొప్పదా ఇది ఈ వ్యామోహాలు అంతకంటే గొప్పవా అంతమాత్రం చేత ఆ పిల్లకో పిల్లోడికో మరొకళ్ళతో పెళ్లి అయిపోయిందని చెప్పి వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళని నాశనం చేసేసి ఇంత కక్ష సాధించే హక్కు మనుషులుగా మనక ఎవ్వరికీ లేదండి.
(38:55) అందుచేత దయచేసి అటువంటి పిశాచ ప్రవృత్తి ఉంటే గనుక దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి ఎవ్వరైనా గాని అంుచేత ఇంతకంటే దెయ్యాలు భూతాలు ఎంతవరకు భయంకరం అండి ఇటువంటి వాడికంటే ఏ దెయ్యము భయానకం కాదు నా దృష్టిలో ఇదే భయానకం కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఆ మీకు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా తెలిసి ఉన్నట్లయితే ఎవరెవరికి తెలుసో కామెంట్ చేయండి అలాగే మనం మరుగుమందుల గురించి నమ్మకాలు నిజాలు శీర్షికన చాలా వీడియోస్ చేసిున్నాము మన ఛానల్ లో ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు కూడా చాలా మేటర్ అందులో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవన్నీ చూడండి ఈ వీడియో మీకు
(39:36) నచ్చితే తప్పకుండా ఈ వీడియో ఎక్కువ మందికి చేరవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అటువంటి పైశాచిక ప్రవృత్తి ఎవరికీ మంచిది కాదు. కనుక తప్పకుండా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో అట్లాగే మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి సరేనా అండి సదా ఎప్పుడూ కూడా మీ సపోర్ట్ ని నేను ఈ రకంగా కోరుకుంటున్నాను.
(40:02) కనుక నాకు ఈ సపోర్ట్ ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హార్ట్ టచింగ్ మరొక హార్ట్ టచింగ్ అండ్ వియర్డ్ అండ్ టెరిఫయింగ్ స్టోరీతో మళ్ళీ రేపే మనం కలుద్దాం ఓకే అంటిల్ దెన్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు బాయ్ బాయ్ జై హింద్
No comments:
Post a Comment