Sunday, May 24, 2026

స్త్రీ మగాడిని వాడుకుంటోందని చెప్పే 3 గుర్తులు! | Relationship Psychology

స్త్రీ మగాడిని వాడుకుంటోందని చెప్పే 3 గుర్తులు! | Relationship Psychology

Author Name:Bujji Creations

Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oQPoJzQ2aB8



Transcript:
(00:01) మగాడు ఎంత పెద్ద కష్టాన్నైనా నవ్వుతూ భరిస్తాడు కానీ తను ప్రాణంగా నమ్మిన ఒక స్త్రీ తనని కేవలం తన అవసరాల కోసమే వాడుకుంటుందని తెలిసినప్పుడు అతని మనసు ఎంతగానో గాయపడుతుంది. కొంతమంది స్త్రీలు మగాడికి తనపై ఉన్న ఇష్టాన్ని చాలా స్మార్ట్ గా వాడుకుంటారు. ఆమె కూడా చాలా చనువుగా ఉంటూ ఇష్టాన్ని నటిస్తూ తన పనులన్నీ చేయించుకుంటుంది.
(00:34) మగాడేమో ఆ చనువును చూసి ప్రేమ అనుకొని ఒక అడుగు ముందుకేస్తాడు. కానీ కరెక్ట్ గా అక్కడే అసలైన షాక్ తగులుతుంది. తీరా మగాడు తన మనసులోని మాట చెప్పేసరికి ఆమె ఒక్కసారిగా ప్లేట్ పిరాయించి ఏమి తెలియనట్టు ఏడుస్తూ మా నాన్నకు చెప్తా లేదా మా ఆయనకు చెప్తా అని ఎదురు తిరిగి ఆ మగాడినే బ్లేమ్ చేస్తుంది. అసలు స్త్రీ ఇలా ఎందుకు చేస్తుంది? ఆ టైంలో మగాడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకుంటూ ఆమె ట్రాప్ నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో చూసేద్దాం.
(01:19) మొదట సైకాలజీ కోణంలో చూస్తే స్త్రీ మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టాలని అనుకోదు కానీ ఇక్కడ ఒక వింతైన హ్యూమన్ బిహేవియర్ దాగుంది. పెళ్లి కాని అమ్మాయి అయినా పెళ్లైన స్త్రీలకైనా సరే తన లైఫ్ లో ఎమోషనల్ గ్యాప్ వచ్చినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు బయట ఉన్న ఒక మగాడి అటెన్షన్ అతని సపోర్ట్ కావాలని కోరుకుంటారు.
(01:52) ఆ మగాడికి తనపై ఉన్న ఇష్టాన్ని లేదా ఆకర్షణను వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళ పనుల కోసం లేదా బోర్ కొట్టినప్పుడు టైం పాస్ కోసమో వాడుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ మొగాడు దాన్ని సీరియస్ లవ్ అనుకొని ప్రపోజ్ చేస్తాడో అప్పుడు ఆ స్త్రీకి ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. సమాజంలో ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతో వాళ్ళు వెంటనే ఒక విక్టిం కార్డు బయటకు తీస్తారు.
(02:31) ఏమి తెలియనట్టు ఏడుస్తూ ఆ తప్పంతటిని మగాడి పైకి నెట్టేసి వాళ్ళు చాలా అమాయకులమని నమ్మించడానికి ట్రై చేస్తారు. మిమ్మల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక మగాడిగా మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఫస్ట్ ఎమోషనల్ గా లొంగిపోకండి. ఆమె ఏడవగానే భయపడిపోకండి. మీరు ఎంత భయపడితే ఆమె మిమ్మల్ని అంత ఎక్కువగా బ్లేమ్ చేస్తుంది. ఎలాంటి గొడవలు పడకుండా వాదించకుండా సైలెంట్ గా ఆమె లైఫ్ నుండి బయటకు వచ్చేయండి.
(03:12) మీ వైపు నుండి ఎటువంటి కాల్స్ కానీ మెసేజ్లు కానీ వెళ్ళకుండా చూసుకోండి. ఎందుకంటే మీ నిశశబ్దమే ఆ బ్లేమ్ కి పెద్ద సమాధానం. అసలు ఇలాంటి ఎమోషనల్ బ్లేమింగ్ లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్త్రీ ప్రవర్తనలోని ఈ మూడు లక్షణాలను ముందే కనిపెట్టాలి. నెంబర్ వన్ అవసరాల అజెండా ఆమెకు ఏదైనా హెల్ప్ కావాలన్నా అర్జెంట్ గా ఏదైనా పని కావాలన్నప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేస్తుంది. చాలా తీయగా మాట్లాడుతుంది.
(03:47) ఆ పని అయపోయాక మళ్ళీ కనిపించదు. నెంబర్ టూ మీ ఉనికిని దాచడం ఆమె మీతో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా క్లోజ గా ఉంటుంది. కానీ నలుగురిలోకి వచ్చేసరికి మిమ్మల్ని జస్ట్ ఒక తెలిసిన వ్యక్తిలా చూపిస్తుంది. నెంబర్ త్రీ మీపై అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవడం. మీరు తనకోసం అన్ని పనులు చేస్తారు మీ టైం ఇస్తారు కానీ మీరు ఎలా ఉన్నారు మీ ఇష్టాలుఏంటి మీ కష్టాలుఏంటి అని మీ గురించి తెలుసుకోవాలనే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఆమెకు ఉండదు.
(04:30) ఎప్పుడూ తన ముచ్చట్లు తన అవసరాలే తప్ప మీ లైఫ్ కి ఆమె అస్సలు ఇంపార్టెంట్ ఇవ్వదు. ఇలాంటి ఎమోషనల్ బ్లేమింగ్ లో పడకుండా ఉండాలంటే అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఒక స్త్రీ కేవలం అవసరాలకే వాడుకుంటుందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఆకర్షణను పక్కన పెట్టి నో నేను చేయలేను అని హుందాగా దూరం జరగడమే మగాడికి శ్రీరామ రక్ష గుర్తుపెట్టుకోండి ఆకర్షణ వేరు నిజమైన ప్రేమ వేరు ఒకరి టైం పాస్ అవసరాల కోసం మీ లైఫ్ ని పాడు చేసుకోకండి.
(05:14) ఈ మాటలు వింటున్నప్పుడు మీ జీవితంలోనో లేదా మీకు తెలిసిన వాళ్ళ లైఫ్ లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ గుర్తొచ్చిందా ఈ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపిస్తే కింద కామెంట్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మెచ్యూర్డ్ సైకాలజీ వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.

No comments:

Post a Comment