మనిషి గొప్పగా బ్రతకాలీ అంటే? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=s1-uKeAWvuE
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం మనిషి గొప్పగా జీవించడానికి కొన్ని సాధనాలు చాలా అవసరంఅండి దానినే సౌందర్య సాధనం అంటారున్నమాట ఇంకొకటి జీవన సౌందర్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు సౌందర్య సాధనాలు అంటే మొఖానికి పోసుకునే మేకప్ులు లిప్స్టిక్లు ఇంకా అందం పెంచుకునేవి ఏవైతే ఉంటాయో సాధనాలు అవి కాదండి ఇక్కడ ప్రతి మనిషి అందంగా కనిపించాలని ఆరాట పడతాడు కుతూహల పడతాడు సాటి వాళ్ళతో పోల్చుకుంటాడు అంటే పక్కనోళ్ళతో ఎవరైతే అందంగా ఉన్నారు ఎవరైతే ఫెయిర్ గా ఉన్నారు ఎవరి దగ్గర అయితే క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళతో పోటీ పడుతూ
(00:47) ఉంటారు. అంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందని నిజమైన సౌందర్యం ఏమిటి అన్నది గ్రహించలేరు. మరి ఇక్కడ ప్రతి మనిషి అందంగా ఉండాలని ఎలా ఆరాటపడతాడో ఆశపడతాడో చిన్న లాజిక్ మిస్ అవుతున్నాడు. అదేమిటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మన జీవితం కడవరకు హ్యాపీగా అంటే తెలుగులో చెప్పుకుందాం సంతోషంగా ఆనందంగా సుఖంగా గౌరవంగా ఇవన్నీ ఉండాలి చివరి వరకు మరణించే వరకు జీవితం సౌందర్యంగా ముగియాలి అంటే ఖచ్చితంగా జీవన సాధనాలు ఏమిటో మనం గుర్తించి మన లైఫ్ లో దాన్ని అమలు పరచాలి
(01:32) వాటి గురించే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను మనిషి అందంగా ఉంటే సరిపోదు కదండీ నిలువెత్తు అందం ఎందులో ఉంటుంది అని నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నాను. అది క్వాలిటీస్ లో ఉంటాయి. మంచి మనసు మంచి మాట మంచి బుద్ధి ఈర్షాద్వేషాలు లేకుండా సహనంగా ఎవరైతే లైఫ్ ని లాక్కవస్తారో వాళ్ళు నిజమైన అందగత్తులు వాళ్ళు నిజమైన అందగాళ్ళు ఇదే నేను నమ్ముతాను అన్నమాట కాబట్టి మంచి రూపం ఉంటే సరిపోదండి ఊరికే ఏది రాదండి మరి ఇటువంటి క్వాలిటీస్ అన్నీ ప్రతి మనిషిలో ఉండాలని నింపాలని ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో మీకు అందించడం జరిగుంది జరుగుతుంది. అత్యుత్తమ సౌందర్య సాధనాలు
(02:17) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అంటే మనిషి జీవితానికి కడ వరకు గౌరవంగా ఒక హుందాగా జీవితం అంతా ఒక నిండుగా ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే ఈ సాధనాలు ఖచ్చితంగా మనం పాటించాల్సిందే ఎప్పుడూ మన పెదవులతో సత్యమే పలకాలండి అబద్ధం అన్నది దరిదాపులకు కూడా రానివ్వకూడదు ఎందుకంటే నిజం నిప్పు లాంటిది ఒక్కసారి మనం అది ఎవరికి ఎంత ఎంత ఇబ్బంది పెట్టినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తే అది జీవితాంతం అదే సత్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది.
(02:53) అదే మీరు ఒక్క అబద్ధం చెప్పి చూడండి వేలక వేలు అబద్ధాలు పుట్టుకవస్తాయి దేని మాదిరి అంటే అరిటి పిలకల మాదిరి ఒక అరిటి మొక్క అంటే అరిటి పిలక తీసుకొచ్చి మీరు పాతితే దాని చుట్టూ వందల వేల పిలకలు తయారవుతాయి అబద్ధం కూడా దీన్ని పోలే ఉంటుంది. దీని వలన మన జీవితం నాశనం అవుతుంది సుఖం ఉండదు దుఃఖమే మిగులుతుంది ఇరకాటంలో పడుతుంది అందుకనే భగవంతుడు ఇచ్చిన ఈ అందమైన పెదవులతో ఎప్పుడూ సత్యమే పలకండి మరి మరొక విషయం కూడా తెలుసుకుందాం కన్నులకి దయ ఉండాలంటే అండి అంటే ఈ భగవంతుడు ఇచ్చిన కళ్ళు మనల్ని మనం చూసుకోవడానికే కాదని ఇంకా ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించాలని ప్రతి మనిషిలో
(03:40) లో ఒక దైవాన్ని చూడాలని అందమైన ఈ లోకాన్ని ఆరాధించాలని ఈ కనులు ఇచ్చాడు భగవంతుడు మరి ఈ కళ్ళతో మనం ఏం చేస్తున్నాం అనుక్షణం ద్వేషంగా చూస్తున్నాం అంటే ద్వేషం కక్కుతూనే ఉంటాం ఎదటి మనిషి మీద ప్రతి మనిషిని గాని ప్రతి సమస్యని గాని దయతో చూడాలి అని చెప్పి దీని అర్థం అన్నమాట కళ్ళకు దయ ఉండాలి భగవంతుడు ఇచ్చిన కళ్ళు దానికే అని చెప్పి మనం గుర్తించాలి ద్వేషం నింపుకొని కలల్లో నిప్పులు పోసుకొని ఎర్రటి కళ్ళు ఎదటివారి మీద ఒక నిప్పులు వర్షాన్ని కురిపించినట్టు కురిపిస్తున్నారు.
(04:22) ఈనాటి యువత గాని చిన్న పిల్లలు గాని పెద్దవారు ముసలివారి సైతం గాని మరి ఈ లోకం ఎటువైపు అడుగులు వేస్తుంది. మరి అటువంటి కళ్ళు ఉండడం కన్నా గుడ్డివారిలాగా పుట్టి గుడ్డివారిలాగా బతకడం చాలా మేలని చెప్పి నా ఉద్దేశం. మరి ప్రతి ఒక్కరిని దయతో చూస్తారు కదు మీరు మన చేతులకి దానం చేయగలిగే అలవాటు ఉండాలండి చేతులకి దానం మాట ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి దానం చేయని చేతులు వరదా మాట సాటి వారికి సహాయం చేయటం సాటి వారి ఇబ్బంది అర్థం చేసుకోగలగటం మనతో పాటు సాటివారు కూడా తింటారని చెప్పి కాతో కూతో పెట్టడం వారి కడుపు కూడా నిండేటట్టు చేయటం ఇవన్నీ చాలా
(05:10) మంచి సౌందర్య సాధనాలుండి మరి వీటిల్ని అర్థం చేసుకోగలిగే హృదయం ఎవరికి ఉంటుంది అంటే ప్రతి మనిషిలో భగవంతుడు ఉండాలి అని చెప్తున్నాను కదా అటువంటి వారికే ఉంటుంది మరి ఈ రోజుల్లో వాళ్ళు కరివైపోయారు. చేతులకి దానం అన్న పాయింటు చాలా ముఖ్యం అండి మనం చేసిన కర్మలు పోగొట్టుకోవడానికి పాపాలను పోగొట్టుకోవడానికి ఎదుటి వారు మనతో పాటే సమానం మనతో పాటే వాళ్ళు పుట్టారు జీవించడానికి అర్హులు వాళ్ళ జీవితాన్ని అంతో ఇంతో పైకి తీసుకురావాలని ఉద్దేశంతో మనకి తగిన సహాయం చేయడం అంటే తాహతకి మించి చేయమని నేను చెప్పట్లా మీ వీలు బట్టి మీ వెసులుబాటు బట్టి చేయటం మరి
(05:55) ఈ అలవాటు కూడా మీరు గుర్తుంచుకోండి. ఫోర్త్ పాయింట్ కి వచ్చేసామండి మొఖానికి చిరునవ్వు మరి ఈ చిరునవ్వు అన్న అస్త్రంతో ఎవరి మనసైనా గెలుచుకోవచ్చు అంట అది మీకు తెలుసా మరి ఈ సాధనం గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనుషుల్లో చాలా రకాలు ఉంటారు. మంచివారు చెడ్డవారు క్రూరంగా ఉన్నవారు ఉంటారు. అలాగే నలుపు, తెలుపు, చామంచాయ ఇంకా అందంగా ఉన్నవాళ్ళు అంద విహీనమైనోళ్ళు కురువిపులు అందం తక్కువైన వాళ్ళు అందరూ ఉంటారు.
(06:29) వీరందరికీ కలిపి ఒకటే అస్త్రం ఏమిటి అంటే చిరునవ్వు మీరు ఎదుటివారిని చిరునవ్వుతో పలకరించినప్పుడు సకం సమస్యలు అక్కడే తీరిపోతాయి. పలకరింపులోనే ప్రాణం పెడతాం అన్నది ఎదుటివారికి అర్థంవుతుంది. మరి ఇది నోట్లో నుంచి వచ్చిన మాట కాదండి హృదయంలో నుంచి వస్తుందన్నమాట. అటువంటి చిరునవ్వుని ఎవ్వరూ వదులుకోవద్దు మరి ఎంత ద్వేషం ఉన్నా ఎంత కక్షలు ఉన్నా నీ శత్రువైనా సరే చిరునవ్వుతో పలకరించినప్పుడు మీ ఇద్దరి మధ్యన దూరం మంచులా కరిగిపోతుంది.
(07:04) మరి ఈ చిరునవ్వు అన్న అస్త్రాన్ని మీరు అలవరుచుకుంటారు కదు ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ అన్నా విషపూరితమైన అలవాటు ఒకటి పెట్టుకున్నారు. ఒత్తిడి ఉన్నా లేకపోయినా కూడా మొఖం చిట్లించుకోవటం మాడుచుకోవడం కోపంగా చూడటం బాగా గుడ్లుమి చూడటం ఇంకా అసహ్యంగా చూడటం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ మన పిల్లలతో ఖచ్చితంగా మాన్పెంచాలి చిరునవ్వు అన్న అస్త్రం అలవాటు చేయాలి అప్పుడే కుటుంబాలు గాని మన చుట్టుపక్కల గాని మన ప్రదేశాలు గాని బాగుంటాయని నా ఉద్దేశం ఇక ఐదవ పాయింట చెప్పుకుందాంఅండి హృదయానికి ప్రేమ మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరికి హృదయం ఉంటుంది. మానవ జన్మ
(07:51) ఎత్తడమే ఒక వరం అది ఒక అద్భుతం ఆ జన్మని సార్ధకం చేసుకోవడం ఇంకా అద్భుతం అంటే ఈ సృష్టిలో ఎవరికీ లేనంత అదృష్టాన్ని భగవంతుడు నీకు ఇచ్చాడు. మరి దాన్ని వేస్ట్ చేసుకొని కాలయాపన చేసి ఎదుటివాళ్ళ మీద కక్షలు కక్కుతూ గొడవలక వెళుతూ శత్రుత్వాన్ని పెంచుకుంటూ ప్రతి సమస్యని భూతద్దంలో చూస్తూ చిన్న సమస్యను కూడా పెద్దది చేస్తూ మన చుట్టుపక్కన వాళ్ళు ఎవరైతే క్యారెక్టర్లతో ఎవరైతే సహృదయాలతో ఉన్నారో వాళ్ళ మీద పట్టిస్తున్నారు.
(08:28) ఇరుగు పొరుగు వాళ్ళ సఖ్యత అన్నది చాలా ముఖ్యంండి ఈ రోజుల్లో ప్రతి హృదయానికి ప్రేమ ఉండాలి దయ ఉండాలి అంటే ప్రేమించే హృదయం ఎలా ఉండాలి అని మీరు నన్ను అడగొచ్చు. ఇప్పుడు మన అన్నదొమ్ములు గాని తల్లిదండ్రులు గాని మన పిల్లలు గాని తప్పు చేస్తే మనం ఎలా సర్దుకుంటున్నాం దాన్ని ప్రేమగా సరిపెట్టుకుంటాం. అలాగే బయట వాళ్ళు గాని తెలియని వాళ్ళు గాని మన చుట్టుపక్కల వాళ్ళు గాని ఎటువంటి తప్పులు చేసినా దాన్ని క్షమా గుణం ఉండాలి శిశుబాలుడు 100 తప్పులు చేసేంతవరకు శ్రీకృష్ణుడు ఓర్పుగా వేచి ఉన్నాడు అదే మాదిరి మనం కూడా ఉండాలన్నమాట ఎన్నో
(09:13) అవకాశాలు ఇవ్వాలి క్షమాగుణం కలిగి ఉండాలి సాటి వారిలో కూడా ప్రేమను చూడాలి తెలియని వారిలో కూడా మన హృదయంలో లో ప్రేమ నింపుకోవాలి. అంతేగాన వాడు తప్పు చేశాడని కక్షలు సాధించి వాడిని ఎలాగన్నా గెలవాలని చెప్పి నీకు మనశశాంతి లేకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ప్రేమించే హృదయం ప్రతి ఒక్కరిలో ఉండాలంటూ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సౌందర్య సాధనాల్ని నింపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
(09:46) దానివలన మన కుటుంబాలు గాని మన పిల్లలు పెద్దవాళ్ళయి తరతరాలు మార్పు చెందడానికి గాని మన చుట్టుపక్కల ఉన్నవారు గాని మన ఊరు వాడ గాని మన సొసైటీ బాగుపడేటట్టు మనం ఆణిముత్యాలని తయారు చేయాలి. అది ఎలా సాధ్యం అంటే మనం ఇటువంటి సౌందర్య సాధనాలు ఉపయోగించి జీవితాన్ని మరింత సౌందర్యంగా చేసుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుందని మీరు గమనించాలి. మరి ఈ సౌందర్య సాధనాలని బాగా ఉపయోగించి ప్రతి మనిషి బాగా ఉపయోగించండి.
(10:21) మన జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకుందాం అని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ వీడియో ముగించడం జరుగుతుంది. మనం ఒంటరిగా పుడతాం ఒంటరిగా పోతామండి అది మాత్రమే మన చేతిలో లేనిది మిగిలినదంతా మన ఇష్టమే మన నిర్ణయాల సమూహమే జీవితం అంటే అంటే మన ఇష్టమే అంటే ఏది పడితే అది చేయాలని కాదు ఇక్కడ మంచియినా చెడైనా నీ చేతిలోనే ఉంటుందని నీ ఆలోచనలోనే ఉంటుందని నీ మనస్సాక్షిగా నువ్వు ఎటువైపు వెళ్ళాలి అన్నదే ఆలోచించుకోవాలని ఇవి తెలిపేదే ఈరోజు ఈ వీడియో అండి హాయ్
No comments:
Post a Comment