లేడీస్ లో ఈ qualities వుంటే మీ భర్త మీకు బోలెడు time ఇస్తాడు! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=08RCr1zcVY0
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ వేస్తానండి అదేమిటి అంటే మీ భార్యకి మీరు ఇంట్లో టైం ఇస్తున్నారా లేదా మీ భార్యని పట్టించుకుంటున్నారా లేదా ఇదే నా క్వశ్చన్ అండి ఆ ఎందుకు అడిగాను అంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళందరూ తెగ బాధపడిపోతూ ఉన్నారు. నా భర్త నాకు టైం ఇవ్వట్లేదు నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు ఇవే చెప్తున్నారు.
(00:32) ఆడవాళ్ళందరూ ఇలా ఆలోచించి కేవలం వాళ్ళ బుర్ర ఒకటే జడగొట్టుకోవట్లేదండి వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. తెగ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇంటి బాధ్యతలు గాని ఉద్యోగ బాధ్యతలు గాని పట్టించుకోక పిచ్చివాళ్ళ అయిపోతున్నారు. మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి సమాధానం ఏం చెప్తారు? దయచేసి ప్రతి ఒక్క భర్త కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లోకి రండి.
(01:01) ఆడవాళ్ళందరూ ఎక్కడ గుమ్ము కూడినా ఒక చోట ఉన్నా ఒక పెళ్లా పేరెంటమా? ఫంక్షన్సా? లేకపోతే ఇళ్ల దగ్గర ఇవే మాట్లాడుకుంటున్నారు ఎక్కువగా. ఈ దీన్ని గమనించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నా భర్త నాతో తప్ప అందరితో బాగానే ఉంటారు, నవ్వుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్నతో ఎంతసేపు మాట్లాడుతూనే ఉంటారు.
(01:25) ఫోన్లు మాట్లాడుతారు. తోడపు పుట్టిన వాళ్ళతో. అంటే వాళ్ళ అక్కాళ్ళతో వాళ్ళ అన్నయలతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ రిలేటివ్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తో చుట్టుపక్కనోళ్ళతో అందరితో బానే ఉంటాడు నాతో తప్ప అని తిట్టుకుంటూనే ఉంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అది కాక ఆడవాళ్ళు చెప్పిన దాంట్లో అంతో ఇంతో నిజం ఉందండి అదేమిటంటే మీరు ఇంటికి రాగానే భార్యని పట్టించుకోరు.
(01:51) కనీసం తిన్నావా భోజనం చేశవా అని కూడా అడకరంట ఫోన్ పట్టుకొని అదే పనిగా నా మొగుడు ఫోన్ ని చూస్తూనే ఉంటాడు మరి ఫోన్లో ఏం చేస్తాడో వాళ్ళు ఇదే చెప్తున్నారండి రాగానే టీవీ పెట్టుకొనే చూస్తాడు కనీసం స్నానం భోజనం వీటిలు కూడా పట్టించుకోరంట పిల్లలు చదువుతున్నారా పిల్లలు తిన్నారా పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఇవి కూడా ఉండవంట మరి ఇంతలా వాళ్ళ విసిగిపోవడానికి కారణం ఏమిటి మగవాడు ఎందుకు ఇంతలా మార్పు చెందాడు అసలు మగవాళ్ళకి ఇదివరకు రోజుల్లో లాగా అంత టైం ఉంటుందా కచ్చితంగా చెప్పొచ్చండి ఉండట్లేదని ఎందుకంటే ఈ టెక్నాలజీ యుగంలో వ్యాపారాలని బిజినెస్
(02:37) లని పెద్ద పెద్ద జాబులని సాఫ్ట్వేర్లని కనీసం తన్ని తాను మర్చిపోయి అంటున్నారు. భోజనం చేసే సమయం కూడా ఉండట్లేదు. మరి ఈ గంధరగోలమైన బిజీ లైఫ్ లో ఇంకా వేరొకళకి టైం ఎలా ఇస్తారు వేరే ఒక్కరఏంటి శ్రీదేవి గారు మేమేనా బయటోలమా నేను ఆయన భార్యని పెళ్లానికి టైం ఇవ్వకపోతే వాడేం మొగుడు అని ఖచ్చితంగా మీ భార్యలు నన్ను కోసిన వేస్తారు.
(03:09) ఇది చాలా నిజం కదండీ కానీ మనం అంచలంచలుగా పైకి ఎదగాలని చూస్తున్నాం డబ్బు పిచ్చి పట్టుకుంది డబ్బు వెంటే పరిగెడుతున్నాం కనీసం మన జీవితాల్ని సర్దుబాటు చేసుకునేంత డబ్బు గురించి ఎవరు ఆలోచించట్లే ఒక మెట్టు పైనే ఉందాం అనుకుంటున్నాం కాబట్టి మనం చేసే పనికి మన ఆలోచనలకే టైం పెట్టలేకపోతున్నాం ఇంకా పెళ్ళానికి ఏం ఇస్తారు నేను చెప్పేది ఇది మాట అసలు మగవాడి తప్పు ఎంత ఉంది ఆడవాళ్ళ తప్పు ఎంత ఉంది ఇందులో తెలుసుకుందాం ముందుగా లేడీస్ కి ఇప్పుడు ఖచ్చితంగా నేను ఆన్సర్ చెప్తాను.
(03:43) మీరు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆడవాళ్ళందరికీ నేను ఒక సీక్రెట్ చెప్పాలండి అదేమిటి అనుకుంటున్నారు అసలు మీ భర్త మీకు టైం ఎందుకు ఇవ్వాలి? టక్కుమని ఆన్సర్ చెప్పండి చూద్దాం రెండు ముక్కల్లో చెప్పండి చెప్పలేరు ఎందుకంటే అక్కడ నో ఆన్సర్ కేవలం మీ చేతులారా మీరు చేసుకున్నారని అయతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఎందుకంటే ప్రతి క్షణం భర్త మీతోనే ఉండాలని భర్త ప్రేమ గెలుచుకోవాలని నా మొగుడు నాకే సొంతం అని పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు.
(04:19) మొగుడు వెనకాతలే కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటారు కలిసి తిరగాలి నా మొగుడితోనే ఉండాలి ఇవే ఉన్నాయి ఇప్పుడు ఆడవాళ్లో ఆలోచనలు మీరు తప్పుగా అనుకోవద్దు చాలామంది ఆడవాళ్ళు అందరూ కాకపోయినా ఇటువంటి కోవకు చెందినోళ్ళు 90% వీలే ఉన్నారంటే మీరు నమ్ముతారా ఆడది తన ఓర్పుతో నేర్పుతో భర్తని గెలుచుకోవాలి గానీ భర్తని ఇబ్బంది పెట్టి గొడవలు పడి శాసించి మొగుడిని కాళ్ళ కింద ేసి తొక్కేసి అతి ప్రేమలో అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిలేషన్షిప్ లో నష్టపోతూ ఉంటారు.
(05:02) అదే వేరొక ఆడదాన్ని చూడండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఏ నా భర్త నా మొగుడు నా దగ్గరే ఉంటాడు ఏడకి పోతాడు ఏడ తిరిగొచ్చినా రాత్రికి నా కాడకే రావాలి అని ఉంటారు చూసారా మీరు ఎంతసేపు భర్త బుజ్జగించాలని భర్త బ్రతిమలాడాలని భర్త అన్నం తినిపించాలని ఎప్పుడు ఎంతసేపు ఇదే బ్రతిమలాట లేదా ఎంతసేపు మీరు ఏడుస్తూ ఉంటే బుజ్జగిస్తూ ఉంటాడా చెప్పండి బ్రతిమలాడుతూ ఉంటాడా రోజు ఇదే పనిగా చేసుకుంటారా ఎప్పుడో ఒకసార అయితే నెలలకో సంవత్సరానికో వాళ్ళకు కూడా అదిఒక సరదాగా ఉంటుంది అదిఒక త్రిల్లు గా ఉంటుంది మిమ్మల్ని ఒక చిన్న పాపాయిలా చూస్తారు.
(05:44) రోజు మీరు ఇదే పని పెట్టుకుంటే వాళ్ళకు కూడా విసుక వస్తది అసహ్యం వస్తది వేసారిపోతారు. దాన్ని బట్టి తగ్గుదారులు ఎన్నుకుంటారు. ఈ రోజుల్లో దొడ్డిదారులు, అడ్డదారులు, కోకళ్లలు ఉన్నాయి అదిఒకటి గమనించండి. మీ మొండి పట్టుదలతో మీ సంసారాలని నాశనం చేసుకోకండి. మీకు ఇచ్చిన టైం ని మీరు ఉపయోగించుకోరు. ఎందుకంటే ఇంటికి రాగానే భర్తని సాధిస్తారు వేధిస్తారు ఎందుకు ఇంటికి తొందరగా రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇప్పటివరకు ఎక్కడ తిరుగుతున్నావు చెడు తిరుగులు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తారు.
(06:18) దాన్ని బట్టే వాళ్ళు విసుగుపోతారు ఆ ఇచ్చిన టైం అంటే భర్త వచ్చిన తర్వాత కూడా మీకు ఇచ్చిన టైం ని కేవలం మీ గొడవలతోనే ముగిస్తారు. ఇది మీరు తెలుసుకోవట్లేదు తెలివైన మనిషి అయితే ఆ ఇచ్చిన టైంనే సద్వినియోగం చేసుకొని మరలా ఈ తప్పు జరగకుండా చూసుకుంటారు. ఆడవాళ్ళలో ఇదే వీక్ పాయింట్ మరి భర్త ఏం చేస్తాడు మీ పక్కన కూర్చొని మీరు గొడవలు పడుతుంటే వినడు కదా ఏ ఎప్పుడు ఇదే సోధా ఇదే తలకే నొత్తుద్ది అని చెప్పి అక్కడి నుంచి లేచిపోయి చక్కగా ఆయనకి ప్రశాంతంగా ఎక్కడ అనిపిస్తుంది ఆయనతో ఎవరు మంచిగా మాట్లాడుతారు ఆయన మనసుకి ఎవరు దగ్గర అవుతారు ఆయనకి ఎవరు బాధని పోగొడతారు
(07:00) చేదోడు వాదోడుగా ఎవరు ఉంటారు ఆయన్ని ఎవరు అర్ధం చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది తల్లిదండ్రులు అవ్వచ్చు తోడపుట్టినోళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకా వేరే అఫైర్ అవ్వచ్చు అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు కేవలం మన పొరపాట్లే మన గ్రహపాట్లు అన్నమాట అదిఒకటి అర్థం కాక మనం తల బాధుకుంటూ ఉంటాం. అసలు నేనేం చేశాను నాకఎందుకు దగ్గర అవ్వట్లే నాకెందుకు టైం పెట్టట్లా ఆఫీస్ టైం ఉంది అన్ని అవుతున్నాయి అన్ని మనల్ని చూసుకుంటున్నారు మరి మిగతా టైం కూడా నాతో ఎందుకు ఉండట్లేదు అని ఇదంతా మీ ప్రవర్తన వల్లే అని మీరు తెలుసుకోవట్లేదు చాలామంది
(07:38) ఆడవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పమంటారా ఎప్పుడు బయట తిరగాలనే చూస్తున్నారు భర్త బయటికి తీసుకెళ్ళకపోతే ఇంట్లో పెద్ద గొడవలు ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు ఏడుపులు పెడబలు గిన్నెలన్నీ విసిరేటాలు సామాన్ ఇసరేయడాలు ఆ కోపంఅంతా పిల్లల మీద చూపించడాలు అంతేకాదు భర్త ఎందుకు పట్టించుకోవట్లేదని అది కూడా పిల్లల్ని తిట్టడం పిల్లల్ని కొట్టడం అఫైర్స్ పెట్టుకుంటారు వేరే ఎందుకంటే నా భర్త నన్ను పట్టించుకోవట్లే నేనెందుకు ఆయన్ని పట్టించుకోవాలి అని ఈవిడ దొడ్డిదారిని వెళ్తూ ఉంటది.
(08:13) మరి ఇది ఎంత తప్పు ప్రతి భార్య భర్త నమ్మకం మీద ఆ రిలేషన్ కొనసాగాలి ధర్మం మీద ఉండాలి అప్పుడే ఆ రిలేషన్ ముందుకు వెళ్తూ ఉంటది. పగలల్ల అలసిపోయి కష్టపడి గొడ్డు జాకిరి చేసి ఇంటికి వచ్చిన భర్తనే ఆఫీస్ లో అవ్వనివ్వండి చేతి పనులు అవనివ్వండి రకరకాల పనులు మన పొట్ట పోషించుకోవడానికి భార్య బిడ్డల కోసమే కదా ఇదంతా అలసిపోయి వచ్చిన భర్తనే కనీసం గ్లాసుడు మంచి నీళ్లు కూడా ఇవ్వరు సాధింపులు వేధింపులు వెంటనే బయటికి వెళ్ళాలంటారు సినిమాలు శికార్లు పార్కులు ఇంకా రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ చెప్పనవసరంలే పెద్ద పెద్ద టూర్లు కూడా భర్త పర్మిషన్ లేకుండా వీళ్ళే ప్లాన్
(08:56) చేసేస్తూ ఉంటారు. మరి ఆయనకి రెస్ట్ ఎక్కడ ఉంటది మీరు జాబ్ చేసినా కూడా మీకు ఇందులో ఇంట్రెస్టే ఉంటది మీ జాబ్ మీ జాబే మొగుడిని వదలరు. భార్యా భర్తల బంధం అంటే ఒక్కటే అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కలిసి అయస్కాంతంలో తిరగాలి అని అసలు భార్యా భర్తల బంధం అంటే అర్థం తెలుసుకుంటే మీరు అలా ప్రవర్తించరు. ఇది కూడా ఎవరి లైఫ్ వాళ్ళదే ఒక్కొక్క మూమెంట్ లో మనం కలుస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం మన బాధ్యతలను నెరవేర్చుతూ ఉంటాం అది తెలుసుకోలేక అయస్కాంతం ఇనుము అయస్కాంతం పట్టుకొని ఉంటాయి చూసారా అలా పట్టుకొని వదలకుండా ఉండాలేమో అని చెప్పి భర్తని
(09:36) ఇరకాటంలో పడేస్తున్నారు కాబట్టే మొగుళ్ళు బైరాగులు అయిపోతున్నారు. మరి వాళ్ళకి నచ్చినట్టు మీరు వాళ్ళకి టైం ఇవ్వకపోయినా వాళ్ళని పట్టించుకోకపోయినా ఇంట్లో గిన్నెల సౌండ్ బాగా వస్తుంది. పొరిగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు పక్కింటి పిన్ని గారు వేసుకున్న కాసులు పేరు చూడు అంటూ గిన్నెల సౌండ్ అదొక మ్యూజిక్ గా అదొక రిథమ్ గా మనకి వినిపిస్తూ ఉంటుంది.
(10:00) అందుకనే ప్రతి మగవాడు భయపడిపోతూ దీంతో ఎందుకు ఎదవ నస అని చెప్పి చక్కగా బయట తిప్పేసి తీసుకొస్తారు ఆయనకి ఇష్టం లేకపోయినా ఎవరినైనా ఇష్టపడాలి అంటే కచ్చితంగా స్పెషల్ క్వాలిటీస్ ఉండాలండి లేకపోతే అందరం అందరినీ ఇష్టపడొచ్చు కదా అది ఎప్పటికీ జరగదు ఈవెన్ భార్య భర్తలతో సహా అవి క్వాలిటీస్ ఉన్నట్టు మీరు సంపాదించుకోవాలి భర్త మనసుని గెలుచుకోవాలి నమ్మకంతో మీ రిలేష ముందుకు తీసుకెళ్ళాలి అదొక పసి పాప లాంటిదిఅండి బంధం అన్నది దాన్ని ఎప్పుడైతే మీరు అశ్రద్ధ చేశారో నిర్లక్ష్యం చేశారో అది సాగుతూనే ఉంటుంది అంటే తెగే అంతవరకు మీరు సాగదిస్తారు అన్నమాట స్పెషల్
(10:46) క్వాలిటీస్ లేనప్పుడు ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి అలాగే మీరు మీ భర్తని ఎందుకు పట్టించుకోవాలి ఆ క్వాలిటీస్ ఉన్నట్టు మనం మన ప్రవర్తననే రోజు రోజుకి డెవలప్ చేసుకోవాలి హుందాగా ప్రవర్తించాలి ఇప్పుడు ఉన్న మగవాళ్ళకి అనేక రకమైన బాధ్యతలతో పాటు ఫ్రెండ్షిప్లు క్లబ్బులు పబ్బులు అన్ని సరదాలు వీళ్ళు కుదురుగున్న ఫ్రెండ్స్ మొత్తం తిప్పేస్తూ ఉంటారు.
(11:13) టైం పెట్టడానికి అస్సలు ఉండదండి మీకు టైం ఇవ్వడానికి మరి మగాడికి ఇల్లు గుర్తు రావాలంటే ఏం చేయాలి మీ భర్తకి ఏం లేదండి చిన్న టెక్నిక్ అంతే మీరు అందంతో కట్టిపడేయాలి అంటే అది మీ శరీర సౌందర్యమా లేదా మీ మాట మీ మనసా మీ క్యారెక్టరా కచ్చితంగా ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీ భర్త మీ వెంటే తిరుగుతాడు మీరు వద్దన్నా తిరుగుతాడు. బాబోయ్ మహాప్రభు నాకు పనులు ఉన్నాయి నన్ను వదిలిపెట్టు నాకు కొంచెం స్పేస్ కావాలన్నా వదిలిపెట్టరు అంత ప్రేమ పెరిగిపోద్ది ఎందుకంటే మగవాడి మనస్తత్వం పసిపిల్లో లాంటిది మరి మగవాడిని అర్థం చేసుకోకపోవటం
(12:01) మీ పొరపాటు అమ్మ తర్వాత అమ్మలా చూసేది ఎవరిని అంటే భార్యనే ఒక తల్లిని అమ్మ నాకు వేటమాంసం చెంచుగురు కూర వండిపెట్ట అమ్మ నాకు తినాలని ఉంది అని ఎంత పర్ఫెక్ట్ గా ఇంత గట్టిగా అడగగలడో మారం చేసి అదే మారం భార్య దగ్గర కూడా చేస్తాడు. ఏమే నాకు ఇవాళ పరాటా వేసి పెట్టవే ఏమే నాకు ఇవాళ కొబ్బరి చట్నీ చేసి పెట్టవే అని తల్లి తర్వాత తల్లిని భార్యనే అడుగుతాడు.
(12:32) ఆ ప్లేసు మనం ఇవ్వలేకపోతున్నాం. మరి ఇది ఎంత దౌర్భాగ్యం అందం అంటే ఇవన్నీ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోండి కేవలం అందం అంటే తెలుపా ఒక ముఖ సౌందర్యమా శరీర సౌష్టమా కాదు అందం అంటే మనసు అర్థం చేసుకునే గొప్ప మనసు సర్దుకుపోయే అంత ఓర్పు నేర్పు ఇవి ఏ ఆడదానిలో ఉంటాయో ఆ ఆడదాన్ని మగాడు పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తాడు. మీరు వద్దన్నా కూడా రోటి పచ్చడిలాగా నలిపేస్తాడు మరి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు మగాడికి ఇల్లంటేనే గుండెదడ వచ్చేస్తుంది అన్నమాట బాబోయ్ అని చెప్పి ప్రశాంతంగా ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చొని ఇంటికి వస్తున్నారు. అంత భయంకరమైన పరిస్థితులు
(13:17) ఎందుకు వచ్చేసినయి ఇల్లాల్ని చూసి ఒక బ్రహ్మ రాక్షసి లాగా బ్రమ పడుతున్నారు. ఈ బ్రహ్మ రాక్షసి చేతిలో పడితే నన్ను ఇప్పుడు తన నోట్లో వేసుకొని ఆహారం చేసుకుంటదే అని కూడా ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెప్తున్నారు. మీరు ఒక బ్రహ్మ రాక్షసి లాగా సెకండ్ లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ మగాడైనా సరే మీకు దూరమైపోతూనే ఉంటాడు.
(13:41) మీకు సమయం ఇవ్వడు అర్థం చేసుకోవాలి కష్టాలు పంచుకోవాలి కష్ట సుఖాలు తెలుసుకోవాలి ఒక అమ్మలా ప్రవర్తించాలి తోబట్టులా తోడుండాలి మంత్రిలా సలహాలు ఇవ్వాలి ఒక స్నేహితురాలు లాగా కడవరకు సలహాలు ఇస్తూనే ఉండాలి. మరి ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయా లేడీస్ మిమ్మల్నే అడిగేది కచ్చితంగా మీరు కూడా కామెంట్ బాక్స్ లోకి వచ్చి కామెంట్ చేయండి దయచేసి ఎవరూ అన్యతగా వ్యవహరించవద్దు అందరూ రియాలిటీలోకి రండి కామెంట్స్ చేసే ముందు కొంచెం ఆలోచించి చేయండి ఇదంతా మన భవిష్యత్తు కోసమే మనం అర్థం చేసుకొని ముందుకు వెళుతూ ఆ సంసారం అనే బాండింగ్ సంపాదిస్తే రేపు అన్నటి రోజున మన పిల్లలు
(14:25) ఇందులో ఎటువంటి డౌట్ లేకుండా మీ నుంచే మంచి సూచనలు సలహాలతో ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఆడవాళ్ళందరికీ చిన్న సలహా అండి భర్త సమస్యల్లో పాలుపంచుకోవడం ఒక్కటే కాదు కష్ట సుఖాల్లో తోడుండటం ఒక్కటే కాదు అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు ఎక్కువ టైం బయట వాళ్ళకి బయట తిరగటం మన ఫంక్షన్స్ కానీ షాపింగ్స్ కానీ ఇవి ఒక్కటే కాదు.
(14:54) ఆడవాళ్ళు భర్తకి ఎందులో ఎక్కువ టైం ఇవ్వాలి అంటే మీ ఫిజికల్ రిలేషన్ లో ఎక్కువ టైం ఇవ్వాలి. అక్కడ మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది అదే దానికి మీకు ఓపిక ఉండదు కానీ గొడవ పడటానికి అయితే ఓపికలు వస్తాయి. మరి మీ ఫిజికల్ రిలేషన్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి దృఢంగా మీరు బలపరుచుకోవాలి అంటే కచ్చితంగా నేను చెప్పినట్టు మీరు వ్యవహరించాలి. అప్పుడే మీకు దాంపత్యంలో ఎటువంటి సమస్యలు గాని గొడవలు గాని రావు అనుకోకుండా మీరే లక్కలాగా ఒకరినొకరు అతుక్కుంటూ ఉంటారు.
(15:29) భర్త ఇంటికి వచ్చేసరికి అది మీరు హౌస్ వైఫ్ అవ్వనివ్వండి లేదా మీరు జాబ్ చేస్తున్నా సరే మీ శరీర శుభ్రం అన్నది చాలా ముఖ్యం. ఒక నైటీ వేసుకొని రోజు వేసిన నైటీే వేసుకొని తెలిసిపోయిన నైటీలు వేసుకొని పదే పదే అదే గెటప్ తో ఉంటే మీ భర్తకి మీరు ఎలా నచ్చుతారు ఆడవాళ్ళు అందంగా ఉన్నా అందం లేకపోయినా అందం తక్కువ వాళ్ళైనా సరే మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలి అంటే వస్త్రధారణ అనది చాలా ముఖ్యం అది తెలుసుకోవాలి అంటే బయట ఇంట్లో నలిగిపోతూ ఈ తరం మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసిందే కానీ దీనికి కూడా కొంత టైం ఇచ్చి చూడండి మీ లైఫ్ లో
(16:14) కొత్త కొత్త రంగులు కనిపిస్తాయి. ఇదివరకు ఆడవాళ్ళు ఎలా ఉండేవారో ఒక్కసారి అది కూడా చిన్న మాట భర్త ఇంటికి వచ్చేసరికి చక్కగా నీట్ గా స్నానం చేసి శుభ్రంగా మంచి సారీ కొట్టుకొని తలనిండా మల్లెపూలు పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ భర్తకి ఎదురొచ్చి చక్కగా మంచి నీళ్లు ఇచ్చేవారు దాని తర్వాత వన్ బై వన్ వాళ్ళ పనులు ముగించుకొని వాళ్ళు కూడా ఏకాంత సమయం గడిపేవారు అందులో పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేవారు వారా అత్తమామలని పట్టించుకోకుండా ఉండేవారా వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులనా ఇంకా వంట వార్ప ఏమి వదిలేసేవారు కాదు అన్ని చాలా టాలెంటెడ్ గా
(16:58) ముందుకు తీసుకెళ్ళేవారు. మరి మనం ఏం చేస్తున్నాం కచ్చితంగా మొగుడికి ఇష్టమైన వంటలు కూడా వండి పెట్టలేకపోతున్నాం కడుపునిండ భోజనం కూడా పెట్టలేకపోతున్నాం కడుపు నిండ బాగా తిట్లు అయితే పెడుతున్నారు. మరి ఇది ఎంత తప్పు ఒక్కసారి ఆలోచించండి. మీ భర్తకి మీరు దగ్గరయ్యే ప్రయత్నం కచ్చితంగా చేయండి. మీ లైఫ్ లో ఖచ్చితంగా మార్పు చేసుకుంటుంది.
(17:22) మీ భర్త మీకు టైం ఇవ్వట్లేదని పట్టించుకోవట్లేదని మీరు అనారోగ్యం పాలవ్వద్దు. కుటుంబ బాధ్యత లేకుండా ఉండొద్దు. పిల్లల్ని పట్టించుకోండి పిల్లల లైఫ్ కోసం మీరు ఫైట్ చేయండి అంటే రోజువారి దినచర్య ఫైట్ అంటే ఇక్కడ గజిని మహమ్మద్ గోరి మహమ్మద్ యుద్ధాలుఏం కాదు రోజు మనం చేసే పనికి న్యాయం చేయాలి అదే ఫైట్ మన రిలేషన్షిప్ లో ధర్మం మీద నిలబడాలి మీరు ఒకరినొకరు ఇష్టపడనప్పుడు ఒకరికొకరు ఇష్టం లేనప్పుడు దీనంతటికీ అర్థం ఏంటంటే అర్థం చేసుకోకపోవడం కాదు మీ భర్త మనసులో లేదా మీ మనసులో వేరొకరికి స్థానం ఉన్నప్పుడు మీ రిలేషన్షిప్ ముందుకి వెళ్ళదు అని
(18:03) చెప్తున్నాను. అప్పుడు మీరు అడ్డదారులు తొక్కకుండా ఎఫైర్లు పెట్టుకోకుండా మీరు కచ్చితంగా కూర్చొని మాట్లాడుకొని మీ రిలేషన్ ని అక్కడికి ముగించుకున్న తర్వాతే మీ ఇష్టమైన వాళ్ళతో జీవితం సాగిస్తారా అది ధర్మం మీద మంచి ఆలోచన చేసి తీసుకోండి అని నేను చెప్తున్నాను. చివరిగా ఒక మాట అండి ఈ వీడియో ముగించేద్దాం ఎప్పుడూ ఒక్కరి మీద లైఫ్ డిపెండ్ అయి ఉండకూడదు భార్య లేదా భర్త అదే అలవాటు పిల్లలకు కూడా చేయాలి ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన జీవన ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసు ఎప్పుడు ఉంటున్నామో ఎప్పుడు పోతున్నామో తెల్లారితే అసలు
(18:44) లెగుస్తున్నామో లేదో కూడా తెలియట్లే అలాంటి అయినప్పుడు అతి నమ్మకాలతో గుడ్డి ప్రయాణాలు చేయొద్దు దయచేసి మన జీవితంలో ఏమైనా జరగొచ్చు ఎదురు దబ్బలు తగలొచ్చు గోబ గుయ్యి అనొచ్చు ఇవన్నీ జరుగుతాయి. భర్త లేక భార్య లేనప్పుడు ఒంటరి ప్రయాణం చాలా చేదుగా ఉంటుంది. దాన్ని అనుభవించడం ఆ బ్రహ్మతరం కూడా కాదేమో అని అనిపిస్తుంది. సాక్షాత్తు ఆ పరమశివుడే ఒంటరితనాన్ని అనుభవించలేక పిచ్చోడు అయిపోయాడు అన్నమాట.
(19:15) మరి మనం ఎందుకు ఇలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఎవరున్నా లేకపోయినా స్ట్రాంగ్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి అంటే లేడీస్ కే నేను చెప్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే భర్త లేకుండా మీరు ఉండరు ఆయన రాకుండా మీరు నిద్రపోరు భోజనం చేయరు ఆయన వచ్చే మీకు గోరుముద్దలు పెట్టాలి ఆయన వెంటే మీరు కుక్క పిల్లలా తిరగాలి లేకోతే ఆయన తిరగాలి ప్రతిది ఆయన్ని అడిగే చేయాలి లేకపోతే మిమ్మల్ని అడిగి ఆయన చేయాలి ఇవన్నీ వదిలేసేయండి దయచేసి మీ ఆరోగ్యాన్ని పట్టించుకోండి మీ పిల్లల్ని పట్టించడి చుకోండి మీరు ధైర్యంగా ఉంటే మీ భర్త కూడా నాకేంటి నాకు స్ట్రాంగ్ భార్య ఉంది అని చెప్పి మురిసిపోతూ ధైర్యంతో ముందుకు అడుగులు
(19:55) వేస్తూ ఉంటారు. అలాగే మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోండి అది బిజినెస్ ఉద్యోగాలా మీ ఇంట్లో పరిస్థితులా ఇంకా సంసారాన్ని ఇంకా మంచిగా గ్రోత్ చేస్తారా పిల్లల్ని ప్రయోజకులని చేస్తారా మీ గోల్ ఏంటి వీటిల మీద మీ టైం పెట్టండి. అంతేగానీ టైం అంతా భర్త నాకు ఇవ్వాలి లేతే నేను నా భర్తకి ఇవ్వాలి అని మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి మరి ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
(20:26) ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment