DEAR MOTHER ❤️ || ప్రతి కూతురు తప్పక చూడాల్సిన కథ SEETAKANTH FILMS #mother #lifelesson #motivation
Author Name:SEETAKANTH FILMS
Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHFILMS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DUbpMEzUrRk
Transcript:
(00:01) [సంగీతం] అమ్మ నా లంచ్ బాక్స్ ఎక్కడ అని నందిని గట్టిగా అరిచింది. కాలేజీకి ఆలస్యం అవుతుందనే తొందరలో గది మొత్తం వెతుకుతూ పరుగులు తీస్తుంది. వంటగదిలో తాయారు నిలబడే ప్రయత్నం చేస్తుంది. [సంగీతం] శరీరం మొత్తం నెప్పులతో ఉంది తల బరువెక్కిపోయింది జ్వరం ఒంటిని కాల్చేస్తుంది. ఆ ఉదయం మంచం మీద నుంచి లేవడమే ఆమెకు ఒక యుద్ధంలా అనిపించింది.
(00:28) ఆ సమయంలో ఆఫీస్ కు సిద్ధమవుతున్న భర్త రమేష్ ని చూసి మెల్లిగా రమేష్ నాకు ఈరోజు బాగా జ్వరంగా ఉంది. మధ్యాహ్నం [సంగీతం] బయటే భోజనం చేస్తావా రమేష్ ఆమె వైపు కూడా చూడలేదు బయట ఎందుకు తినాలి లేచి వంట చేసేయ్ కానీ నాకు చాలా జ్వరంగా ఉంది. జ్వరం అందరికీ వస్తుంది. ముందు వంట పూర్తి చెయ్ తాయారు నిశబ్దంగా తలువుపోయింది. మనసులో బాధఉన్నా అడుగుల్లో శక్తి లేకపోయినా వంటగదిలోకి నడిచింది.
(00:56) ప్రతి అడుగు భారంగా అనిపించింది. అయినా కుటుంబం కోసం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం చేయడానికి వంట మొదలు పెట్టింది. కొద్దిసేపటికి నందిని వంటగదిలోకి దూసుకొచ్చింది. అమ్మ నా లంచ్ బాక్స్ పెడుతున్నానమ్మా ఇంకా కాలేదా తాయారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిశబ్దంగా లంచ్ బాక్స్ నింపసాగింది. అంతలో నందిని మళ్ళీ అడిగింది నా వాచ్ ఎక్కడుంది? నీ గదిలో షెల్ఫ్ మీద ఉండొచ్చమ్మ కొన్ని క్షణాలకే గది నుంచి అరుపు వినిపించింది ఇక్కడ లేదు బాగా చూసుకో నందిని కోపంగా బయటిక వచ్చిన నందిని అంది నువ్వే వచ్చి వెతకలేవా నాకు ఇప్పటికీ ఆలస్యం అయిపోతుంది. తాయారు తన కూతురిని చూసింది.
(01:36) ఆ చూపులో ప్రేమ మాత్రమే ఉంది. నందిని నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదమ్మ కానీ ఆ మాటలు నందిని మనసును తాకలేదు అమ్మ నువ్వు తర్వాత విశ్రాంతి తీసుకో నేను నాన్న ఇద్దరం రోజంతా బయట ఉంటాం నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా తాయారు గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. నందిని ఇంకా ఆగలేదు. నువ్వు చదవాల్సిన పని లేదు ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు రోజంతా విశ్రాంతే కదా నీకు ఆ మాటలు వినగానే తాయారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
(02:04) నీ వాచ్ స్టడీ టేబుల్ మీద ఉండిఉంటుందమ్మ. నందిని వాచ్ తీసుకొని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. ఇల్లు ఒక్కసారిగా నిశశబ్దం అయింది. తాయారు కుర్చీలో కూర్చుంది జ్వరం మరింత పెరిగింది. కానీ ఆమెకు విశ్రాంతి తీసుకునే హక్కు ఆమె కోసం ఎదురుచూస్తున్న ఆమె ఇంటి పనులు ఆమెకు ఇవ్వలేదు. రోజులు గడిచాయి కానీ జీవితం మాత్రం మారలేదు.
(02:30) ఒక మధ్యాహ్నం నందిని సోఫాలో కూర్చొని ఫోన్లో మునిగిపోయి తన స్నేహితులతో మాట్లాడుతుంది. పక్కనే తాయారు మామిడికాయ ఆవకాయ పెడుతుంది. ఇంటినిండ కొత్త మామిడికాయల సువాసన ఆవాల పరిమళం వెదజల్లుతుంది. అప్పుడే కిటికీ బయటకి చూసిన తాయారుకు ఆకాశంంతా నల్లని మేఘాలు కమ్ముకున్నట్టు కనిపించింది. నందిని ఏంటమ్మా డాబా మీద ఆరేసిన బట్టలు తీసుకురమ్మ వర్షం పడేలా ఉంది.
(02:53) నందిని ఫోన్ లో నుంచి తల కూడా ఎత్తలేదు నువ్వే తెచ్చుకోమ్మా ఈ ఆవకాయ పని పూర్తి చేయాలి కదమ్మా నేను చదువుకోవాలి అని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది తలుపు మూసుకుంది. కొన్ని క్షణాలు ఆ మూసుకున్న తలుపునే చూస్తూ నిలబడిపోయింది తాయారు ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆ నవ్వులో బాధ ఉంది ఆవేదన ఉంది కానీ కోపం మాత్రం లేదు. నెమ్మదిగా చేతులు కడుక్కుంది మెట్లెక్కింది డాబా మీద ఉన్న బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొచ్చింది.
(03:20) చివరి బట్ట చేతిలోకి తీసుకునేసరికి ఆకాశం ఒక్కసారిగా చీలిపోయినట్టు వర్షం కురవడం మొదలైంది. ఆ రాత్రి ఆ బట్టలు మడత పెడుతూ తన గదిలో చదువుకుంటున్న నందిని చూసింది. ఆమె మొహంలో మళ్ళీ అదే చిరునవ్వు [సంగీతం] ఎందుకంటే పిల్లలు తన ప్రేమను అర్థం చేసుకోకపోయినా అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. కాలం గడిచిన పరిస్థితులు మారినా అది అలాగే ఉంటుంది.
(03:46) మూడేళ్ళు గడిచిపోయాయి నందిని చదువు పూర్తి చేసుకుంది రాహుల్ అనే అతనిని వివాహం చేసుకుంది. భర్త ఇంటికి వెళ్ళింది కొత్త జీవితం మొదలైంది ఇప్పుడు ఇంటి బాధ్యతలన్నీ తన భుజాల మీద పడ్డాయి. వంట చేయటం ఇల్లంతా శుభ్రం చేయటం బట్టలు ఉతకడం ఇంటి పనులన్నీ చూసుకోవటం మొదట్లో ఇవన్నీ చాలా సులభంగా అనిపించాయి కానీ జీవితం తన అసలు రూపాన్ని చూపించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.
(04:08) ఒక ఉదయం నందిని తీవ్రమైన జ్వరంతో కళ్ళు తెరిచింది ఒంట్లో అసలు శక్తి లేదు తల తిరుగుతుంది మంచం మీద నుంచి లేవడమే కష్టంగా అనిపించింది. అప్పటికే రాహుల్ ఆఫీస్ కు సిద్ధం అవుతున్నాడు. రాహుల్ అని మెల్లగా పిలిచింది. ఏమైంది నాకు బాగా జ్వరం వచ్చింది ఈరోజు ఆఫీస్ లో క్యాంటీన్ లో ఫోన్ చేస్తావా నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. రాహుల్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు నేను వెళ్ళిపోయాక ఇంకేం చేస్తావ్ నందిని ఆశ్చర్యంగా చూసింది. అంటే అని అడిగింది.
(04:38) రోజంతా తిని పడుకొని విశ్రం తీసుకుంటావు కదా ఆ మాటలు నందిని గుండెల్లో పిడుగులో పడ్డాయి. అవి ఎప్పుడో తన తల్లితో తానే అన్న మాటలు అక్షరాలా అదే మాటలు ఒక్క అక్షరం కూడా మారలేదు. రాహుల్ నిజంగానే నాకు చాలా నీరసంగా ఉంది అని బతిమాలింది. రాహుల్ క్లాక్ వైపు చూసి నాకు ఆలస్యం అవుతుంది ఏదో ఒకటి సింపుల్ గా చేసేయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు.
(05:00) తలుపు మూసుకున్న శబ్దం ఇల్లంతా మారుమోగింది. జీవితంలో మొదటిసారిగా తన తల్లి అనుభవించిన బాధ ఎంత లోతైనదో అర్థమయింది. నెమ్మదిగా లేచి వంటగదిలోకి నడిచింది. ప్రతి అడుగు భారంగా అనిపిస్తుంది కూరగాయలు కోస్తూ ఉండగా కళ్ళలో నుంచి కన్నీళ్లు జారిపడ్డాయి. ఆ వంటగది ఆమెకు మరో వంటగదిని గుర్తు చేసింది. ఆ జ్వరం మరో జ్వరాన్ని గుర్తు చేసింది.
(05:23) ఆ [సంగీతం] ఉదయం మరో ఉదయాన్ని కళ్ళ ముందు నిలబెట్టింది. తన అమ్మ తాయారు అలసిపోయిన మొహం నీరసంగా కనిపించిన కళ్ళు జ్వరంతో వణకుతున్న శరీరం అయినా ఒక్క మాట కూడా అనకుండా తమ కోసం వంట చేసిన ఆ తల్లి అన్ని ఒక్కసారిగా జ్ఞాపకాలై మనసును ముంచెత్తాయి. తనే నిర్లక్ష్యంగా మాట్లాడిన మాటలు నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా రోజంతా విశ్రాంతే కదా అనే ప్రతి మాట ఇప్పుడు తన గుండెల్లో కత్తిలా గుచ్చుకుంటుంది.
(05:48) అమ్మ నన్ను క్షమించు అని మనసులోనే ఏడ్చుకుంది. వెంటనే ఫోన్ తీసుకొని తల్లికి కాల్ చేసింది. కొన్ని రింగ్స్ అయ్యాక అవతల నుంచి వినిపించిన స్వరం హలో నందిని ఆ ఒక్క పిలుపు నందిని కన్నీళ్ళను ఆపలేకపోయింది. ఏం చేస్తున్నావ్ అమ్మా అని వణకుతున్న గొంతుతో అడిగింది. తాయారు నవ్వుతూ చెప్పింది నీకు ఇష్టమైన మామిడికాయ ఆవకాయ పెడుతున్నానమ్మా ఆవకాయ అని నందిని కన్నీళ్ళ మధ్య చిరునవ్వుతూ అడిగింది.
(06:14) అవునమ్మా నీకు చాలా ఇష్టం కదా నువ్వు వచ్చినప్పుడు ఇవ్వాలని నీకు నచ్చే పిండి వంటలు కూడా చేస్తున్నానమ్మ ఆ మాటలు విన్న నందిని గొంతు బిగుసుకుపోయింది కన్నీళ్లు ఆగటం లేదు ఇన్ని సంవత్సరాలు గడిచినా తనకు ఏది ఇష్టమో ఏది తినాలని అనిపిస్తుందో అమ్మ ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పటికీ తన సంతోషమే ఆమె ప్రపంచం. తన అవసరాల కంటే కూతురి ఆనందానికే ఆమె ఎక్కువ విలువిస్తుంది నందిని అని తాయారు మెల్లగా పిలిచింది.
(06:41) ఏమైందమ్మా బానే ఉన్నావా నందిని వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది ఏం లేదమ్మా నేను బానే ఉన్నాను. నిజమేనా అవునమ్మా కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశబ్దం అలుముకుంది. ఆ తర్వాత నందిని ఎంతో నెమ్మదిగా అంది అమ్మ థాంక్యూ తాయారు నవ్వి దేనికమ్మా అంది. అన్నిటికీ అవతల నుంచి మళ్ళీ అదే ఆప్యాయమైన నవ్వు పిచ్చి పాప అమ్మకి ఎవరైనా థాంక్యూ చెప్తారా నందిని పెదవలపై చిన్న నవ్వు మెరిసింది.
(07:11) కానీ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి ఎందుకంటే కొన్ని రుణాలు జీవితంలో ఎన్నటికీ తీర్చలేవు. అమ్మ ప్రేమ అనే రుణం వాటిలో మొదటిది అప్పుడే మరో గది నుంచి రాహుల్ పిలుపు వినిపించింది నందిని వస్తున్నాను అని సమాధానం చెప్పి అమ్మ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అంది సరేనమ్మ జాగ్రత్తగా ఉండు అని తల్లి తాయారు అంది నువ్వు ఆరోగ్యం జాగ్రత్తమ్మ అని నందిని చెప్పి ఫోన్ కట్ చేసింది.
(07:36) నందిని కొద్దిసేపు అలాగే వంటగదిలో నిలబడి ఉంది తాను ఉండుతున్న వంటని చూసింది [సంగీతం] తాను జీవిస్తున్న జీవితాన్ని చూసింది ఆ తర్వాత ఎప్పుడో తన తల్లి జీవించిన జీవితాన్ని మనసారా అర్థం చేసుకుంది. ఒక కన్నీటి బొట్టు ఆమె చెంప పై నుంచి జారింది కానీ ఆ కన్నీటిలో ఈసారి బాధ మాత్రమే లేదు పశ్చాత్తాపం ఉంది కృతజ్ఞత ఉంది. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకున్న ఆనందం కూడా ఉంది.
(08:00) ఆ రోజు ఆమె జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకుంది. తల్లి చేసే త్యాగాల విలువ ఆమె మోసిన బాధ్యతల బరువు మనమే మోయాల్సిన రోజు వచ్చినప్పుడు మాత్రమే పూర్తిగా అర్థంవుతుంది. ఆ క్షణంలో నందిని తన తల్లిని నిజంగా అర్థం చేసుకుంది. మీ అమ్మ దగ్గరలో ఉంటే ఈరోజే [సంగీతం] ఒకసారి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేతిని పట్టుకొని అమ్మ థాంక్యూ అని చెప్పండి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిఫలం ఆశించకుండా మనల్ని ప్రేమించే ఏకైక వ్యక్తి అమ్మ.
(08:50) [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment