Wednesday, July 8, 2026

వాదనలో గెలిచినా ఓడినట్లే | Why Winning Arguments Fails You | Satyagrahi

వాదనలో గెలిచినా ఓడినట్లే | Why Winning Arguments Fails You | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=of1mAQ0KtLo



Transcript:
(00:01) [సంగీతం] ఒక చిన్న ప్రశ్న మీకు ఒక కుక్క మీ మీద మొరిగితే మీరు కూడా తిరిగి మొరుగుతారా? [సంగీతం] ఒక పిచ్చివాడు రోడ్డు మీద నిలబడి మిమ్మల్ని తిడితే మీరు కూడా పిచ్చివాడిలా మారి వాడిలా ప్రవర్తిస్తారా? మరి అలాంటప్పుడు ప్రతి నెగిటివ్ మనిషికి ప్రతి పనికి రాని వాదనకి మీ జీవితాన్ని మీ ప్రశాంతతని ఎందుకు బలి చేస్తున్నారు? నిజం ఏంటంటే బురదలో దిగితే మీరు గెలిచినా ఓడిపోయినట్లే.
(00:30) ఎందుకంటే ఆ బురద మీరు గెలిచినా ఓడిపోయినా సరే మీకు అంటుకుంటుంది కాబట్టి ఈ రోజుల్లో మనకు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా మనకి శత్రువులు ఎక్కువ అవ్వడం కాదు మనం ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోవడం పక్కింటివాడు ఏదో అన్నాడు సోషల్ మీడియాలో ఎవడో అనామకుడు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టాడు ఆఫీస్ లో ఒక కొలీగ్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాడు వెంటనే మీలో ఈగో హర్ట్ అయిపోతుంది.
(00:52) కోపం నరాల్లోకి పాకుతుంది. వాడికి నేను సమాధానం చెప్పాలి. నేనేంటో నిరూపించుకోవాలని చెప్పేసి యుద్ధానికి సిద్ధమైపోతారు. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద ట్రాప్ లో పడుతున్నారు. మీకు తెలియకుండానే మీరు ఒక బురద గుంటలోకి అడుగు పెడుతున్నారు. [సంగీతం] జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు మీ ఎదురుగా నిలబడిన వ్యక్తి కాదు అతని స్థాయిని చూసి అతని స్థాయిని వదిలేసి అతని స్థాయికి మీరు దిగి పోవటమే అసలైన ప్రమాదం ఈ బురద అనేది కేవలం ఒక వ్యక్తి కాదు మన చుట్టూ రకరకాల రూపాల్లో ఈ బురద గుంటలు ఉన్నాయి.
(01:28) ఈగో కోపం, అసూయ అంతులేని వాదనలు సోషల్ మీడియా కామెంట్లు టాక్సిక్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు లేకపోతే పగతీర్చుకోవాలనే ఆలోచన అవ్వచ్చు. ఇవన్నీ మిమ్మల్ని బురదలోకి నెట్టేస్తున్నాయి. మీరు ఎంత గొప్పగా బ్రతకాలనుకున్నా ఆ బురద గుంటలు ఒక్కసారి కాలు వేస్తే ఆ మురికి మీ శరీరానికి అంటుకొని తీరుతుంది. మనం చాలాసార్లు అనుకుంటాం నేను నిజాయితిగా ఉన్నాను కదా నా వాదనలో నిజం ఉంది కదా మరి నేను ఎందుకు తగ్గాలి అని కానీ సమస్య అక్కడ లేదు.
(01:56) సమస్య ఎక్కడఉందంటే మీరు ఎవరితో వాదిస్తున్నారు అనే దానిలోనే ఉంది. మీరు ఒక జ్ఞానితో వాదిస్తే అక్కడ ఒక అర్థం ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు మారతాయి. కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళలో ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళ తెలుసా వాళ్ళకి జీవితంలో పైకి రావడం చేత కాదు. ఒక స్థాయిని అందుకోవడం అసలే తెలియదు. మరి అలాంటప్పుడు వాళ్ళు సాధించే విజయం ఏంటి? మిమ్మల్ని కిందకి లాగడమే వాళ్ళు సాధించే విజయం.
(02:19) మిమ్మల్ని కూడా వాళ్ళ స్థాయికి దించేస్తే వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవుతారు. యుక్తేశ్వర్ గిరి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నీ శాంతిని ఎవడైతే దోర్చుకోగలడో వాడు నీ జీవితానికి యజమాని అయిపోయినట్లే అని. ఒకసారి ఆలోచించండి ఎవడో రోడ్డు మీద పోయేవాడు మిమ్మల్ని ఒక మాట అంటే మీ రోజంతా పాడైపోతుంది. అంటే మీ మూడ్ ని మీ ప్రశాంతతని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ ని వాళ్ళ చేతుల్లో మీరు పెట్టారు అని అర్థం.
(02:45) వాడు ఏం చేస్తాడంటే వాడికి ఎలాగో ఒక జీవిత లక్ష్యం లేదు. వాడి జీవితంలో పైకి రాడు. కానీ వాడు ఈ భూమ్మీద ఉన్నంత కాలం మిమ్మల్ని నాలుగు మాటలని మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని కిందకు లాగేసి మిమ్మల్ని కూడా వాడి స్థాయికి తీసుకొచ్చి దాన్ని ఒక అచీవ్మెంట్ లో ఫీల్ అవుతూ ఉంటాడు మీరు కింద పడిపోయిన తర్వాత ఆనందంగా ఉంటాడు అసలు మనం కింద పడటం ఎందుకు వాడితో గొడవ పట్టడం ఎందుకు వాడు అన్నదానికి ఫీల్ అవ్వడం ఎందుకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు ఏ గోల ఉండదు అందులోనూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల మిమ్మల్ని కిందకి లాగాలి అనుకున్నవాడు కుమిలి కుమిలి ఏడుస్తాడు అందులోనూ మనం
(03:19) చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా ఎవరైనా మనతో గొడవ పడినప్పుడు ఎవరైనా మనతో వాదించినప్పుడు ప్రతి చోట నేను గెలవాలి అనుకోవటం కానీ అవతలవాడు కోరుకునేది కూడా అదే వాడికి మీతో గెలవాలని లేదు మిమ్మల్ని రెచ్చగొట్టాలని ఉంది. మిమ్మల్ని కోపంలో ముంచేసి మీ విచక్షణని పోగొట్టాలని ఉంది. మీరు ఎప్పుడైతే వాడి మాటలకి రియాక్ట్ అయి గట్టిగా అరిచారో అక్కడే వాడు అనుకున్నది సాధించాడు.
(03:44) మీరు వాదనలో గెలిచినా మీ మనశశాంతిని పోగొట్టుకునే దాంట్లో మాత్రం ఓడిపోయారు. ఈ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి మనకు ప్రపంచంలో ఏది ఖరీదైనదో తెలియకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తాయి. చాలా మంది అనుకుంటారు టైం చాలా ఖరీదైనది అని కొందరు అనుకుంటారు మనీ చాలా గొప్పది అని కానీ నిజం ఏంటంటే అవి గొప్పవే కానీ ఈ ప్రపంచంలో అన్నిటికైనా ఖరీదైన వస్తువు మీ ఇన్నర్ పీస్ అంటే మీ అంతర్గత ప్రశాంతత డబ్బు పోతే సంపాదించుకోవచ్చు.
(04:11) టైం పోతే మళ్ళీ మనకు రేపు అంటూ వస్తుంది కదా ఎంత కాదన్నా సరే కానీ ఒక్కసారి ప్రశాంతతను కోల్పోతే మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఎంత సమయం ఉన్నా మీరు బ్రతికున్న శవంతో సమానం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో బాధలో మునిగిపోతూనే ఉంటారు. కాబట్టి ప్రశాంతత అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి ప్రశాంతత లేనప్పుడే తిన్న తిండి అరగదు. పడుకుంటే నిద్ర రాదు.
(04:34) మరి ఇంత ఖరీదైన వస్తువుని ఎవడో దారిని పోయే దానయ కోసం ఎందుకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాదన అనేది ఒక మాయాజాలం దానిలోకి దిగితే మీరు నిజాన్ని నిరూపించవచ్చేమో చూసారా నేను గెలిచాను నేనే కరెక్ట్ అని చెప్పేసి కాళ్ళు ఎగరేయొచ్చేమో కానీ ఆ ప్రాసెస్ లో మీరు మీ క్యారెక్టర్ ని మీ సంస్కారాన్ని మీ విలువైన ఎనర్జీని కోల్పోతారు.
(04:56) కొంతమంది మనుషులు ఉంటారు ఈగల్లాగా ఈ ఈగ ముందు ప్రపంచంలోని అత్యంత అందమైన సువాసన ఇచ్చే పువ్వుని పెట్టండి దాని పక్కనే ఒక చెత్త కుప్పను పెట్టండి. ఈ ఈగ ఎక్కడ కూర్చుంటుందో తెలుసా ఆ చెత్త మీదే కోర్చుంటుంది. దానికి సువాసన తెలియదు సువాసన అక్కర్లేదు కూడా దానికి కావాల్సింది కేవలం మురికి మాత్రమే. మన చుట్టూ ఉండే సమాజంలో కూడా కొంతమంది మనుషులు సరిగ్గా ఇలాగే తయారవుతారు.
(05:17) మీరు ఎంత మంచిగా మాట్లాడినా ఎంత లాజికల్ గా చెప్పినా వాళ్ళక అందులో ఉండే మురికే కనిపిస్తుంది. వాళ్ళు మీలో మీ మాటల్లో ఆ చెత్తనే వెతుకుతారు. మరి అలాంటి ఈగలతో కూర్చొని మీరు గంటలు గంటలు చర్చలు చేయాలా వాళ్ళకి మీ సంస్కారం గురించి వివరించాలా ఒకవేళ వివరించినంత మాత్రాన వాళ్ళు అర్థం చేసుకుంటారా? నిజం చెప్పండి అవసరమా మీకు ఈ రోజుల్లో ఇంకా ఘోరం ఏంటంటే ఈ బురద గుంటలన్నీ మీ చేతిలో ఉన్న మొబైల్ లోకి వచ్చేసాయి.
(05:45) అదేనండి సోషల్ మీడియా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడో ఎవడో పెట్టిన పోస్ట్లకి ఇంకెవడో రాసిన కామెంట్లకి ఇక్కడ కూర్చొని మనవాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. కీబోర్డు మీద వీళ్ళు అరిగిపోయేలా టైప్ చేస్తూ కామెంట్ల సెక్షన్ లో రక్తం చెందిస్తూ ఉంటారు. ఇక్కడ గెలిస్తే ఏదో దేశాన్ని జయించినట్లు ఫీల్ అవుతారు. కానీ నిజం ఏంటంటే వాళ్ళు కోల్పోతున్నది వాళ్ళ జీవిత సమయాన్ని వాళ్ళ ఆలోచన శక్తిని వాళ్ళ విలువైన మనశశాంతిని.
(06:10) అసలు మీ ముఖం తెలియనివాడు మీ జీవితానికి రూపాయి సహాయం చేయనివాడు ఫోన్ లో ఏదో రాస్తే మీ గుండె వేగం ఎందుకు పెరిగిపోవాలి మీ రక్తం ఎందుకు మరిగిపోవాలి ఎందుకంటే మనలో అవగాహన లేదు కాబట్టి అసలైన విజేత ఎవరు అనేది మనం మర్చిపోతున్నాం. ప్రతి వాదనలో ప్రతి గొడవలో దూరి గెలిచిన వాడు విజేత కాదు ఏ వాదన నా జీవితానికి అవసరం లేదు అని దాన్ని నవ్వుతూ వదిలేసి వెళ్ళిపోయేవాడే నిజమైన విజేత.
(06:39) మరి ఆ బురద నుంచి మనం ఎలా బయటపడాలి? మన ప్రశాంతతను మనం ఎలా కాపాడుకోవాలి అంటే మాత్రం దీనికి ఒకటే మార్గం రియాక్ట్ అవ్వడం ఆపేయండి. మీ వైపు నుంచి ఒక అడుగు వెనక్కి వేయండి. స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి గారు చెప్పిన జ్ఞానాన్ని మీ జీవితానికి అప్లై చేయండి. ఎదుటివాడు మీ మీద కోపంతో వస్తున్నాడంటే వాడు మానసికంగా ఒక రోగంతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోండి.
(07:02) ఒక రోగిని చూస్తే మనకి జాలి కలగాలి కానీ వాడితో కలిసి మనం కూడా రోగిలా మారిపోకూడదు. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు సైలెంట్ గా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి తప్పుకోండి. అది మీ చేతకానితనం కాదు మీ మానసిక ఎదుగుదలకి నిదర్శనం. సింహాన్ని చూడండి అడవిలో ప్రతి కుక్క మొరిగినప్పుడు అది వెనక్కి తిరిగి మొరగదు.
(07:23) అలా మొరగడం మొదలు పెడితే దానికి వేటాడే టైం ఉండదు. అడవికి రాజుగా ఉండే అర్హత అసలే ఉండదు. సూర్యుడు చూడండి ఆకాశంలో ప్రతి మేఘం అడ్డం వచ్చినప్పుడు ఆ మేఘంతో యుద్ధం చేయడు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మేఘాలు వస్తాయి, పోతాయి కానీ సూర్యుడు అలాగే ఉంటాడు. సముద్రం చూడండి తీరంలో ఉన్న ప్రతి రాయితోనూ అది గొడవ పడదు. రాయి తన స్థానంలో ఉంటుంది.
(07:47) సముద్రం తన అలలతో అనంతంగా సాగిపోతూ ఉంటుంది. ఒక జ్ఞాని కూడా అంతే. ప్రతి మనిషికి సమాధానం చెప్పుకుంటూ కూర్చోడు. తన దారి ఏంటో తనకు తెలుసు ఆ దారిలోనే సైలెంట్ గా దూసుకుపోతూ ఉంటాడు. మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎప్పుడూ ఒక ప్లాన్ ప్రకారమే వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని వాళ్ళకి నచ్చిన చోటికి లాగాలని చూస్తారు.
(08:07) మీకు నచ్చిన ప్లేస్ లో కాదు వాళ్ళకి నచ్చిన పిచ్చి మీద మిమ్మల్ని ఆడించాలని చూస్తారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక వెధవ తన జీవితంలో ఏమి సాధించలేక ఫ్రస్ట్రేషన్ లో ఉండి మీ మీద పడుతున్నాడంటే వాడు ఆల్రెడీ నరకంలో ఉన్నాడు అని వాడు నరకంలోకి మిమ్మల్ని కూడా లాగి మీతో కలిసి ఆ బురద ఆట ఆడటమే వాడికి కావాల్సింది.
(08:29) మీరు ఎప్పుడైతే వాడి మాటలకు స్పందించి కోపంతో ఊగిపోతారో వాడు ఎంచుకున్న యుద్ధభూమికి మీరు అడుగు పెట్టినట్లే గుర్తుంచుకోండి మీ జీవితాన్ని నాశనం చేసేది నీ శత్రువు కాదు. శత్రువు ఎంచుకున్న యుద్ధభూమిలో నువ్వు పోరాడాలని తీసుకున్న నీ తప్పుడు నిర్ణయం మాత్రమే కారణం. బురదలోకి దిగిన మరుక్షణమే ఇద్దరు మురికిగా మారిపోతారు. కానీ ఇద్దరిలో ఒక చిన్న తేడా ఉంటుంది.
(08:52) అవతలి వాడు బురదను ప్రేమించేవాడు కాబట్టి వాడు అక్కడ ఆనందంగా ఉంటాడు. కానీ మీరు ప్రశాంతతను కోరుకునే వాళ్ళు కాబట్టి ఆ మురికిలో ఊపురాడక చనిపోతారు. అందుకే ఒక క్లారిటీకి రండి జ్ఞాని అయినవాడు గెలవడానికి ప్రతి యుద్ధము చేయడు. తన అంతర్గత ప్రశాంతతను కాపాడుకోవడానికి అవసరం లేని ప్రతి యుద్ధాన్ని నవ్వుతూ వదిలేస్తాడు. అదే నిజమైన విజయం.
(09:15) ఇప్పుడు అసలైన పాయింట్ కి వద్దాం. మన జీవితాన్ని మార్చుకోవాలంటే మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి? ఈరోజు నుంచి మీ లైఫ్ లో ఒక కొత్త రూల్ పెట్టుకోండి. సెలెక్టివ్ ఇగ్నోరెన్స్ అంటే ఏది పట్టుకోవాలో ఏది పూర్తిగా వదిలేయాలో స్పష్టంగా తెలుసుకోవడం ప్రతి మనిషికి ఒక ఎనర్జీ లిమిట్ ఉంటుంది. మీరు మీ రోజువారి శక్తిని మీ ఆలోచనని ఆఫీస్ వర్క్ మీద మీ కెరియర్ మీద మీ ఫ్యామిలీ మీద పెడితే మీరు ఎదుగుతారు. అందులో అసలు డౌటే లేదు.
(09:42) కానీ అదే ఎనర్జీని తీసుకెళ్లి ఎవడో అన్న మాటల్ని గుర్తు చేసుకొని వాడి మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి ప్లాన్ వేస్తే మీ ఎనర్జీ మొత్తం అయిపోతుంది. చివరికి [సంగీతం] మీ చేతిలో మిగిలేది శూన్యం. మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఒక క్షణం ఆలోచించండి. వెంటనే రియాక్ట్ అవ్వకండి.
(10:01) మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఈ మనిషి మాటలకి సమాధానం ఇవ్వడం వల్ల నా జీవితంలో ఏమైనా వాల్యూ యాడ్ అవుతుందా అని సమాధానం లేదు అని వస్తే జస్ట్ లైట్ తీసుకోండి. మీ సైలెన్స్ కంటే పవర్ఫుల్ ఆయుధం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అవతలి వాడు మిమ్మల్ని రెచ్చగొట్టాలని 100 మాటలు అంటాడు. కానీ మీరు మాత్రం ఏమి ఎరగనట్లు సైలెంట్ గా ఉంటే ఆ 100 మాటల విషయం తిరిగి వాడికే తగులుతుంది.
(10:27) వాడి కోపం వాడిలోనే ఉండిపోయి వాడే మానసిక రోగిగా కుంగిపోతాడు. నిజమైన పవర్ అంటే అవతలి వాడిని కొట్టడం కాదు. అవతలివాడు మిమ్మల్ని ఎంత కదిలించాలని చూసినా మీ స్థానం నుంచి మీరు కదలకుండా ఉండటమే అసలైన పవర్. చివరిగా ఒక మాట చెప్తాను ఈ జీవితం చాలా చిన్నది. ఇక్కడ ఎవడికో నిరూపించుకోవడానికి ఎవరితోనో గొడవ పడటానికి మనకి టైం లేదు. మీ దారి మీది, మీ గమ్యం మీది, నడిచే దారిలో 100 కుక్కలు మొరుగుతాయి. వేల ఈగలు తిరుగుతాయి.
(10:54) వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే మీరు అనుకున్న చోటికి ఎప్పటికీ చేరలేరు. సింహంలా బ్రతకడం నేర్చుకోండి. మీ ప్రశాంతతని మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించండి. ఎప్పుడైతే మీరు అనవసరమైన వాదలను వదిలేయడం అలవాటు చేసుకుంటారో అప్పుడే మీరు ఒక సాదాసీదా మనిషి నుంచి జ్ఞానిగా మారుతారు. అలా మారిన మరు క్షణమే మీ జీవితానికి మీరు రాజు అవుతారు.
(11:18) ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్ హ

No comments:

Post a Comment