Sexual Energy ని పైకి మళ్లించే బ్రహ్మాస్త్రం | సూర్య నమస్కారం రహస్యం!😱21 days life changing ??
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hm02o1qQ2rg
Transcript:
(00:00) మనం రోజు ఉదయాన్నే లేచి దండాలు పెట్టే సూర్యనమస్కారాలు కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు ఇది మన భారతదేశపు ఋషులు విశ్వశక్తిని మన శరీరంలోకి ఆవాహన చేసుకోవడానికి కనిపెట్టిన ఒక శాస్త్రీయ సాధనం. అసలు వేల సంవత్సరాల క్రితం మన ఋషులు సూర్యుని ఒక గ్రహంగా మాత్రమే కాదు మనశక్తిని మేలుకొలిపే ఒక దివ్య శక్తిగా ఎలా ఆరాధించారు? బ్రహ్మచర్యం ద్వారా వారు ఈ శక్తిని ఎలా నిరుపుకున్నారు? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం.
(00:41) మీ జీవితాన్ని మార్చే రహస్యాలు కూడా ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సూర్య నమస్కారాలు అంటే చాలామంది శారీరక దృఢత్వం కోసం చేయాలేమో అనుకుంటారు. కానీ దీని వెనుక చాలా సైన్స్ తాగి ఉంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన శరీరంలో చాలా హార్మోన్స్ అనేటివి ఉత్తేజితం అవుతాయి. వాటిలో ఫస్ట్ వన్ సర్కాడియన్ రితం ఉదయాన్నే లేత సూర్యకాంతిలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన శరీరంలో అంతర్గతమైన గడియారం సరిగ్గా పనిచేస్తుంది.
(01:17) దీనివల్ల నిద్రలేని మీ సమస్య తగ్గిపోయి కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ తగ్గిపోతుంది. ప్రతి వ్యక్తిలో ఈ అంతర్గత గడియారం అనేది ఉంటుంది. కానీ కొంతమందిలో అది ఆఫ్ లో ఉంటుంది కొంతమంది ఆన్ లో ఉంటుంది. సెకండ్ వెన్నెముక మరియు నాడి వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. మనం ఎప్పుడైతే డైలీ సూర్య నమస్కారాలు చేస్తామో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన వెన్నెముక ముందుకు వెనుకకు వంగుతుంది.
(01:49) ఇది మన వెన్నెముకని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. వెన్నెముక ఆరోగ్యంగా ఉంటే నాడి వ్యవస్థ మొత్తం నియంత్రణలో ఉంటుంది. థర్డ్ శ్వాసక్రియ ప్రాణాయామం ప్రతి ఆసనంలోనూ మనం శ్వాసని పీల్చడం వదలడం జరుగుతుంది. ఇది శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ ని అందిస్తుంది. రక్తం అనేది శుద్ధి అవుతుంది. లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది.
(02:20) ఫోర్త్ ఎండోక్రైన్ గ్రంధులు నియంత్రితం అవుతాయి. ఈ 12 దశల్లోనూ శరీరంలో పిట్యుటరీ థైరాయిడ్, అడ్రినల్ వంటి ముఖ్యమైన గ్రంధులు ఉత్తేజితం అవుతాయి. దీనివల్ల శరీరంలో హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు అసలైన రహస్యానికి వద్దాం. మన ఋషులు బ్రహ్మచర్యాన్ని ఎందుకు అంతగా పాటించారు? సూర్య నమస్కారానికి బ్రహ్మచర్యానికి ఏంటి రిలేషన్ బ్రహ్మచర్యం అంటే చాలామంది శారీరక నియంత్రణ అనుకుంటారు.
(02:58) కానీ కాదు మానసికమైన నియంత్రణ మన స్పిరిచువల్ శక్తిని నిలుపుకునే ఒక అద్భుతమైన మార్గం సూర్య నమస్కారాల ద్వారా ఉత్పత్తి అయ్యే మన ప్రాణశక్తి నిలబెట్టుకోవడానికి బ్రహ్మచర్యం ఒక కవచంలా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తారో ఆ శరీరంలో ఓజస్సు తేజస్సు రెండు పెరుగుతాయి. ఋషులు ఈ శక్తిని ఇంట్యూషన్ జ్ఞాపక శక్తిని పొందారు సూర్య నమస్కారాల ద్వారా సూర్య నమస్కారాలు శరీరంలోని వీర్య శక్తిని ఊర్త్వముఖంగా అంటే అప్వర్డ్ మూమెంట్ మలచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది.
(03:41) అందుకే దీన్ని యోగశాస్త్రంలో ఊర్త్వరేతస్సు అంటారు. ఇది ఆధ్యాత్మిక సాధనలో అత్యున్నతమైన స్థాయి. సూర్య నమస్కారాల్లో మొదటిది ప్రణమాసనం. ఇది మొదటిది 12వది కూడాను ఇది మనసుని కేంద్రీకరించడానికి నాడి వ్యవస్థని ప్రశాంతపరచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్ హస్త ఉత్తనాసనం చేతులు పైకెత్తి వెనక్కి వంగే ఆసనం దీని ద్వారా లంగ్స్ పూర్తిగా తెచ్చుకుంటాయి.
(04:15) శరీరానికి ఆక్సిజన్ అనేది చాలా వరకు పెరుగుతుంది. థర్డ్ భుజంగాసనం ఈ ఆసనం ద్వారా వెన్నెముక దృడంగా మారుతుంది. నాడి వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఫోర్త్ అతోముఖ శ్వేశనాసనం తల కిందికి ఉండే ఈ ఆసనం మెదడుకి ఎక్కువ బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కి బ్లడ్ సప్లై పెరుగుతుందో మన ఏకాగ్రత గాని ఇంట్యూషన్ గాని జ్ఞాపక శక్తి గాని మెరుగుపడుతుంది.
(04:45) ఫిఫ్త్ పర్వతాసనం ఈ ఆసనంలో మన శరీరం కొండ ఆకారంలో ఉంటుంది. ఇది చేతులు భుజాలు మణికట్టిని చాలా బలంగా మారుస్తుంది. ఇలా సాగడం వల్ల రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సిక్స్త్ అష్టాంగ నమస్కారం ఇందులో శరీరం యొక్క ఎనిమిది భాగాలు అంటే కాళ్ళు మోకాళ్ళు రొమ్ము రెండు చేతులు గడ్డం ఇవి నేలను తాకుతాయి. అష్టాంగ నమస్కారం అనేది మన ఈగోని తగ్గించడం మనసులో వినయాన్ని పెంచుతుంది శారీరకంగా చాతి కండరాలని బలం చేస్తుంది.
(05:28) సెవెంత్ అశ్వ సంచలనాసనం గుర్రం పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ ఆసనం వల్ల పొత్తి కడుపు భాగాలు అనేటివి సాగుతాయి. ఇది చేయడం వల్ల మన జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైనా మలబద్ధకం ఉంటే ఆ ప్రాబ్లం ని కూడా ఇది నివారిస్తుంది. ఎయిత్ పాదహస్తనాసనం నిలబడి ముందుకు వంగి చేతులతో పాదాలను తాకే స్థితి ఇది పొట్ట దగ్గర చాలా కొవ్వు ఉంటుంది కదా ఈ కొవ్వుని కరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
(06:03) కాలేయం కిడ్నీల పనితీరుని ఇంప్రూవ్ అవుతుంది. [సంగీతం] నైన్త్ అశ్వ సంచలనాసనం ఇందాక మనం చేసామే అంటే ఇప్పుడు రెండవ వైపు ఫస్ట్ రైట్ లెగ్ తో తర్వాత లెఫ్ట్ లెగ్ తో ఇందాక చేసిన కాళ్ళకి వ్యతిరేక దిశలో శరీరంలో ఎడమ కుడి భాగాలు బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ చాలామందికి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి కదా బ్యాక్ పెయిన్స్ అనేటివి రాకుండా ఉంటుంది.
(06:34) టెన్త్ 10త్ పాదహస్తనాసనం రెండోసారి చేయడం వల్ల వెన్నెముఖ మరింత ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. ఇప్పుడైతే ఆ వెన్నెముక ఫ్లక్సిబుల్ గా మారుతుందో మన మనసు ప్రశాంతపరిచి ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. 11త్ హస్త ఉత్తనాసనం ఇది మళ్ళీ చేయడం వల్ల మన థైరాయిడ్ గ్రంధి అనేది ఉత్తేజితం అవుతుంది. శరీరంలో తొందరగా అలసట రాకుండా ఆపుతుంది.
(07:07) ప్రణమాసనం అంటే ముగింపు స్థితి అన్ని అన్ని ఆసనాల చక్రం పూర్తయిన తర్వాత శరీరం పొందిన శక్తిని స్వీకరించడానికి ఇది సహాయపడుతుంది. నమస్కార ముద్ర ద్వారా హృదయ స్పందనలు సాధారణ స్థితికి వస్తాయి. ఇప్పుడు అర్థమైందా సూర్య నమస్కారాల వెనక ఉన్న మన సైన్స్ చూశరుగా సూర్య నమస్కారాలు అంటే ఏదో పొద్దున లేచే చేసి ఎక్సర్సైజ్ మాత్రమే కాదు దాని వెనుక ఇంత సైన్స్ ఉంది.
(07:38) మన ఋషులు పూర్వీకులు మనకఇచ్చిన ఓ అద్భుతమైన వరం [పాడటం] ఆ చాలామంది లైఫ్ లో ఏదైనా సాధించాలన్నా ఫోకస్ పెరగాలన్నా ఏం చేయాలి అంటారు. నేను చెప్పేదయతే ఒకటే మీ డైలీ రొటీన్ లో ఈ 12 ఆసనాలని యాడ్ చేయండి. రోజు కేవలం 15 టు 20 మినిట్స్ దీనికోసం ఇస్తే చాలు. కచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. కొన్ని రోజుల తర్వాత మీ బాడీలో వచ్చే చేంజ్ ఏంటో మీకే తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు.
(08:12) మీ మైండ్ లో వచ్చే నెగిటివ్ థాట్స్ గాని సెక్షువల్ థాట్స్ ని గాని కంట్రోల్ చేసి మీ ఎనర్జీని మీ సక్సెస్ వైపు మల్లించే శక్తి ఈ సూర్య నమస్కారాలకి మాత్రమే ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
(08:39) సి యు బై బాయ్
No comments:
Post a Comment