Don't Fall Into the EMI Trap | Eye-Opening Short Moral Story Telugu
Author Name:Kushi TV - Telugu Moral Stories
Youtube Channel Url:https://www.youtube.com/@kushitvyt
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jl8DE8jh9zc
Transcript:
(00:00) ఒక ఊరిలో సుమంత్ అనే 30 ఏళ్ల యువకుడు ఉండేవాడు ఇంట్లో అందరూ చింటూ అని పిలిచేవారు. చింటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఒకరోజు అతని తాతగారు ఒరేయ్ చింటూ కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టి ఇటు రా అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తాతయ్య పిలవగానే చేతిలో కొత్త ఐఫోన్ తిరగేస్తూ వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు 30 ఏళ్ల సుమంత్ ఏంటి తాతయ్య చాలా సీరియస్ గా ఉన్నావు అని అడిగాడు సుమంత్ ఏం లేదురా నిన్న రాత్రి నీ గది పక్క నుంచి వెళ్తుంటే నువ్వు మీ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నావు. ఈ నెల క్రెడిట్ కార్డు
(00:40) బిల్ కట్టాలిరా కొత్త కార్ ఈ అమ్మాయి పడింది. అసలు జీతం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. చాలా స్ట్రెస్ గా ఉంది అని అంటున్నావు. అందుకే నీతో మాట్లాడదామని పిలిచాను. చింటూ నీకిప్పుడు 30 ఏళ్ళు సంపాదన బాగుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో పూర్వం రోజుల్లో రాజులు ఎవరినైనా బంధించాలంటే ఇనుప గొలుసులు వేసేవారు కానీ ఈ రోజుల్లో ఈ సమాజం యువతని బంధించడానికి ఒక కొత్త రకం గొలుసు కనిపెట్టింది.
(01:09) దాని పేరే ఈ అమ్మాయి. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఒకప్పుడు మనుషులు వస్తువులను కొనేవారు. కానీ ఈ రోజుల్లో వస్తువులే మనుషులను కొంటున్నాయి. అర్థం కాలేదు తాతయ్య అన్నాడు సుమంత్ అయోమయంగా [సంగీతం] ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను మన పక్కింటి రాము ఉన్నాడు కదా నీ వయసే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక మూడేళ్ల క్రితం వాడు తన బైక్ మీద హ్యాపీగా ఆఫీస్ కి వెళ్ళేవాడు.
(01:37) కానీ ఆఫీస్ లో మిగతా వాళ్ళని చూసి నా హోదాకి తగ్గట్టు కారు ఉండాలి అనిపించి దాదాపు 12 లక్షల కారు కొన్నాడు. చేతిలో అంత డబ్బు లేదు కదా రె లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగతాది ఈఎంఐ పెట్టుకున్నాడు. నెలకి 20వేల రూపాయలు ఈ అమ్మాయి అయితే ఏమైంది తాతయ్య కార్ రావడం మంచిదే కదా మంచిదే కానీ ఆ కార్ కొన్నాక వాడి జీవితం ఎలా మారిందో గమనించావా కార్ కొన్న ఆనందం ఒక రెండు నెలలు ఉంది.
(02:04) ఆ తర్వాత ప్రతి [సంగీతం] నెల ఒకటో తారీకు రాగానే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అబ్బా 20,000 కట్టాలి. దానికి తోడు పెట్రోల్ ఖర్చులు మెయింటెనెన్స్ ఇన్సూరెన్స్ పోనీ ఆ కార్ వాడికి రోజువారీగా అంత అవసరమా అంటే అది లేదు కేవలం శని ఆదివారాలు తిరగడానికే మధ్యలో వాడికి ఉద్యోగం నచ్చక వేరే కంపెనీకి మారదాం అనుకున్నాడు.
(02:28) [సంగీతం] కానీ చేతిలో ఈఎంఐ ఉంది. ఒక్క నెల జీతం ఆగినా కార్ లాగేసుకుంటారు. ఆ భయంతో నచ్చని ఉద్యోగాన్ని నచ్చని మేనేజర్ ని భరిస్తూ రోజు నరకం చూస్తున్నాడు. వాడు కార్ ని డ్రైవ్ చేయడం లేదురా ఆ కార్ ఈఎంఐ రాము జీవితాన్ని డ్రైవ్ చేస్తోంది. వాడు ఆ ఈఎమ్ఐ కి బానిస అయిపోయాడు. తాతయ్య సుమంత్ భుజం మీద చెయ్యి వేసి నువ్వు ఇప్పుడు పట్టుకున్న ఫోన్ ధర ఎంతరా అని అడిగాడు.
(02:54) 20వే తాతయ్య కానీ నేను మొత్తం ఒకేసారి పెట్టలేదు. నో కాస్ట్ ఈఎంఐ లో నెలకి 10వే చొప్పున కడుతున్నాను అన్నాడు గర్వంగా తాతయ్య నవ్వి ఒరేయ్ పిచ్చి వెధవ నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒక పెద్ద మాయ. వాడు నీకు వడ్డీ వేయకపోవచ్చు కానీ నీ చేత లక్ష రూపాయల వస్తువును కొనిపించగలిగాడు చూడు అక్కడ వాడు గెలిచాడు. నీ దగ్గర ఒకేసారి లక్ష రూపాయలు ఉంటే ఆ ఫోన్ కొనేవాడివా ఖచ్చితంగా కొనవు అంత డబ్బు పట్టడం దండగా అనిపిస్తుంది.
(03:26) కానీ నెలకి 10వేలే కదా అని నిన్ను భ్రమలో ముంచి నీకు అవసరం లేని నీ శక్తికి మించిన వస్తువుని నీ నెత్తిన పెట్టారు. 2000 ఫోన్ అయినా లక్ష రూపాయల ఫోన్ అయినా చేసే పని ఒక్కటే ఫోన్ మాట్లాడడం మెసేజ్ చేయడం కేవలం నలుగురిలో నేను గొప్ప అనిపించుకోవడానికి [సంగీతం] నీ భవిష్యత్తుని తాకట్టు పెట్టకు నీ జేబులో డబ్బు ఉండి ఒక వస్తువును ఒకేసారి రెండు సార్లు కొనగలిగే శక్తి నీకు ఉంటేనే ఆ వస్తువును నువ్వు భరించగలవని అర్థం.
(03:52) అంతేకానీ రాబోయే జీతాల మీద ఆశపడి ఈరోజే ఖర్చు పెట్టడం మూర్ఖత్వం. చింటూ 30 ఏళ్ళ అంటే జీవితంలో ఎన్నో పనులు చేయొచ్చు కొత్తగా వ్యాపారం చేయొచ్చు నచ్చిన ఊరు తిరగొచ్చు ప్రశాంతంగా బతకవచ్చు కానీ నువ్వు చుట్టూ ఈ అమ్మాయిలనే కోటగోడలు కట్టేసుకుంటే నువ్వు ఆ కోటలో ఖైదీవైపోతావు. ఏ క్షణంలోనైనా ఉద్యోగం పోతే ఏంటి పరిస్థితి డబ్బు సంపాదించడం గొప్ప కాదురా ఆ డబ్బుతో స్వేచ్ఛను కొనడం గొప్ప అప్పులు లేనివాడే నిజమైన ధనవంతుడు రాత్రి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపట్టాలి కానీ రేపు ఏ ఈఎంఐ కట్టాలా అనే భయంతో నిద్రపోకూడదు.
(04:32) ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకో అవసరమైతేనే కొను ఆడంబరాల కోసం కాదు డబ్బు కూడబెట్టి వస్తువు కొను వస్తువు కొన్నాక డబ్బులు కట్టకు నా మాటలు బాగా ఆలోచించుకో ఈ ఈఎమ్ఐల బానిసత్వం నుంచి బయటపడి నీ జీవితానికి నువ్వే యజమానివ్వు తాతయ్య మాటలు సుమంత్ గుండెల్లోకి నేరుగా దూసుకెళ్ళలాయి చేతిలో ఉన్న ఐఫోన్ వైపు చూశాడు. ఇప్పుడు అది ఒక ఫోన్ లా కాకుండా తన చేతికి ఉన్న ఇనుప గొలుసులా అనిపించింది.
(05:00) తాతయ్య కాళ్ళకి నమస్కరించి నిజం చెప్పావు తాతయ్య ఇకపై నా సంపాదనను నా స్వేచ్ఛ కోసం వాడుకుంటాను కానీ ఇలాంటి ఈ అమ్మాయిల కోసం కాదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
No comments:
Post a Comment