Brain Stroke FAQs Answered | Symptoms, Treatment, BEFAST & Recovery | Dr Neeraja
Author Name:Dr K Neeraja - MD, DM (Neurology)
Youtube Channel Url:https://www.youtube.com/@neerajaneurocare2686
Youtube Video URL:https://www.youtube.com/watch?v=r1QuQAuTYnc
Transcript:
(00:00) స్ట్రోక్ లేదా పక్షవాతం అనేది మనం తరుచుగా వినేదే ప్రతి నలుగురిలో ఒకళళకి పక్షవాతం అనేది రావచ్చు కాబట్టి మనం ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళ ఉంటారు దీని బారిన పడ్డవాళ్ళు చాలాసార్లు నేను హాస్పిటల్లో చూసేది ఏంటి అంటే ఇది వచ్చింది అనగానే కంగారుపడిపోతా ఉంటారు నెక్స్ట్ ఏం జరిగిద్దో తెలియదు నేను చెప్పేది పాపం అర్థం చేసుకునే కండిషన్ లో ఎవరు ఉండరు.
(00:25) దానివల్ల చాలా కన్ఫ్యూజన్ ఉండిద్ది. సో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే మనకి చాలా కామన్ అనుకునే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి డాక్టర్ని అడగాలంటే మొహమాట పడేవి బేసిక్ క్వశన్స్ సో ఇట్లాంటివన్నీ నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేశాను అంటే నేను వింటుంటాను కదా రోజు వాళ్ళు అడిగే ప్రశ్నలు సో అట్లా నేను ఒక కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను.
(00:46) సో దాని ద్వారా మనకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా స్ట్రోక్ ఉన్నా గాని ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే మనకి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కానీ వీటన్నిటికీ మనకి వీడియో అనేది హెల్ప్ ఫుల్ గా ఉండటానికి తయారు చేశాను. సో నాకు రజయా హెల్ప్ చేస్తుంది రజయా కొన్ని క్వశ్చన్స్ అడిగిద్ది పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ వి సో వాటికి నేను కొన్ని ఆన్సర్స్ చెప్తాను దాని ద్వారా మనం సబ్జెక్ట్ ని డీటెయిల్ గా తెలుసుకోవచ్చు.
(01:13) సో ఫస్ట్ స్ట్రోక్ అంటే ఏంటి మేడం స్ట్రోక్ పక్షవాతం అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా స్ట్రోక్ అంటే చాలా మంది అడిగేది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ ఆ హార్ట్ స్ట్రోక్ ఆ అడుగుతారు కామన్ గా మెదడు కి వచ్చేదాన్నే మనం స్ట్రోక్ అంటాం. హార్ట్ కి వచ్చేదాన్ని హార్ట్ ఎటాక్ అంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్ మనం వాడుక భాషలో దాన్ని పక్షవాతం అంటాం.
(01:33) సో ఇది రావటానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి పక్షవాతానికి నేను మీకు పిక్చర్స్ లో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈజీగా అర్థం అవ్వటానికి అన్నట్టు నాకు అంత బొమ్మలు సరిగ్గా రావు కాకపోతే నేను గీసి చూపిస్తాను అర్థమయ్యేంత వరకు సో ఇప్పుడు మనం ఇది బ్రెయిన్ అనుకోండి రెండు ఎందుకు తీసానంటే ఒక సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నట్టు అనుకోండి సో ఇప్పుడు మెథడ్ రెండు వైపులా మనకి రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ ని కంట్రోల్ చేసిద్ది లెఫ్ట్ బ్రెయిన్ అనేది రైట్ సైడ్ కంట్రోల్ చేసేది ఆపోజిట్ సైడ్స్ అందరికి సో ఇప్పుడు రెండు వైపుల మెథడ్ కి మామూలుగా రక్త సర్ఫరా
(02:14) అయిద్ది ముందు వెనక రెండు రక్త నాళాలు వెనకాల రెండు ఉంటాయి. సో ఇప్పుడు ఇది మెయిన్ రక్తనాళం అనుకోండి సో లోపలికి వెళ్ళిన తర్వాత అది బ్రాంచెస్ గా ఫామ్ అవుద్ది. సో అట్లా మళ్ళీ ఇటు వైపు వెళ్ళేది కూడా అట్లాగే సో బ్రాంచెస్ లాగా అట్లా వెళ్తా ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూడండి ఈ రక్తనాలం బ్లాక్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా రక్తం గడ్డ కట్టింది అంటే అప్పుడు ఈ పార్ట్ కి రక్త సరఫరా అనేది మనకి తగ్గిపోతుంది.
(02:45) సో ఈ పార్ట్ కి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల మనకి పక్షవాతపు లక్షణాలు వస్తాయి. ఇది మాటకి సంబంధించిన బ్రెయిన్ లో పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేసేది. ఇది మనకి మూతికి సంబంధించింది అనుకోండి మూతి వంకలు రావడం చెయ్యి కాలు పడిపోవడం అట్లా రావచ్చు ఇది ఒక రకమైన స్ట్రోక్ ఇంకొక రకం ఏంటి అంటే ఒకవేళ ఈ రక్తనాళం జస్ట్ పగిలిపోయింది అనుకోండి బ్రేక్ అయిపోతే దీంట్లోనుంచి బ్లడ్ అంతా బయటికి వచ్చేసిది సో మనకి చేతిలో బ్లీడింగ్ అయితే బయటికి వచ్చిద్ది కానీ బ్రెయిన్ కి చుట్టూ మనకి బోన్ ఉండిద్ది కదా కాబట్టి బయటికి రాలేదు.
(03:19) సో ఈ ప్లేస్ అంతా బ్లడ్ తో నిండిపోద్ది. సో ఇది ఇంకొక రకమైన స్ట్రోక్ బ్లీడింగ్ సో ఇది క్లాటింగ్ ఇది బ్లీడింగ్ రెండు ఆపోజిట్ కాకపోతే ఒకటే రోగం పక్షవాతం సో మనకు కనిపించే లక్షణం పక్షవాతం కానీ అన్నిటికీ ఒకే కారణం ఉండదు. కాకపోతే తరచుగా చాలా మందిలో చూసేది క్లాట్ కొంతమందిలో మనకి రక్తస్రావం అవుద్ది. సో ఈ రెండు పక్షవాతానికి గల కారణాలు అన్నట్టు.
(03:46) సో దీంట్లో ఏది జరిగినా గాని ఒక్క సెకండ్ లో జరిగిపోద్ది సో మనకి గ్లాట్ ఫామ్ అయినా బ్లీడింగ్ అయినా గన ఒక్క సెకండ్ లో హటాత్గా బాగున్న మనిషి ఒకే నిమిషంలో మనకి తేడా అనేది కనిపిస్తుంది. సో అందుకే దీన్ని స్ట్రోక్ అంటాం. సడన్ గా మనల్ని ఎదురుగు పద్ధతి స్ట్రైక్ చేసిద్ది అన్నట్టు సో లక్షణాలు ఎలా ఉంటాయి మేడం వీటికి గల కారణాలు ఏంటి సో ఇప్పుడు మనకి పక్షవాతం అనంగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక చెయ్యి ఒక కాలు మూతి వంట రావడం అన్నమాట సో ఒక సైడ్ వచ్చే లక్షణాలు పక్షవాతం సో కామన్ గా మనం చూసేది అదే హటాత్తుగా చేయి తిమ్మిరెక్కింది చేతిలో
(04:26) ఉన్నది జారిపోయింది పట్టుకోవడానికి రాలేదు అన్ని తేలిక అయిపోయింది అని చెప్పారు నడుస్తా నడుస్తా తూడు వచ్చింది పిలవాలనుకున్నాను కానీ పిలవలేకపోయాను సో ఇది స్ట్రోక్ యొక్క కామన్ లక్షణం ఒకవైపు వచ్చింది అన్నట్టు అది వచ్చే విధానం కూడా మనకి కొన్ని నిమిషాల్లోనే బాడీలో తేడాలు అర్థమైపోతా ఉంటాయి.
(04:50) సో ఇది కామన్ కాకపోతే ప్రతి స్ట్రోక్ ఇట్లాగే వచ్చిద్దా అంటే అట్లా రాదు. కొన్నిసార్లు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉండిద్ది. దాని వల్ల పేషెంట్స్ కూడా అర్థం కాదు చాలా సార్లు మిస్ అయిపోతుంటాం. దీంట్లో ఇప్పుడు లక్షణాలు ఎట్లా అంటే మాట మాట్లాడుతున్నారు ఏదో ఏదో వేరే వేరే వర్డ్స్ వస్తున్నాయి వాళ్లకి అర్థం కావట్లేదు అంటారు ఐదు 10 నిమిషాల్లో తగ్గిపోయింది అంటారు.
(05:12) సో ఆ ఐదు 10 నిమిషాలది కూడా పక్షవాతం కిందకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను కొన్ని పేషెంట్స్ ది. ఒక పేషెంట్ అయితే ఏం చెప్పారంటే లెక్క పెడుతున్నారు నోట్స్ నోట్స్ లెక్క పెడతా లెక్క పెడతా ఆయన క్యాషియర్ కొంతసేపుటికి ఎంతకీ లెక్క రావట్లేదు ఈజీ లెక్కే కానీ మళ్ళీ మళ్ళీ లెక్క పెడతా ఉన్నారు సో అది క్యాలిక్యులేషన్ ఏరియాలో ఆయనకి స్ట్రోక్ వచ్చింది ఓకే సో ఇంకొక పేషెంట్ రీసెంట్ గా వచ్చాడు సడన్ గా ప్యాంట్ వేసుకుంటా ఒకే దాంట్లో కాళ్ళు రెండు కాళ్ళు రెండులో కదా ఒకే దాంట్లో రెండు కాళ్ళు వేసాడు దాని తర్వాత కొంతసేపు రిసెట్ అయ్యాడు హాస్పిటల్ కి వచ్చి నాకేం కాలేదు నాకేం
(05:46) కాలేదు అంటాడు కాకపోతే చూసిన వాళ్ళకి అర్థమయింది ఇంత పెద్దయన రెండు కాళ్ళు ప్యాంట్ ఒకటే దాంట్లో వేశరు అంటే అది డౌట్ కదా సో అతనిది కూడా స్కాన్ తీస్తే స్ట్రోక్ ఉంది నేను వెళ్ళిపోతాను నాకు ఏం లేదని గొడవ చేసిన గట్టిగా పట్టుకొని ఇంకా హాస్పిటల్ లో కూర్చోబెట్టాను ఇది పక్షవాతం చిన్న విషయం కాదు అని అట్లాగే ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా తీసాను ఒకతను ఒక లెక్చర్ అంతా ఇచ్చేసాడు అందరి ముందు ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఏం లెక్చర్ ఇచ్చాడో గుర్తులేదు కాకపోతే లెక్చర్ అంతా కరెక్ట్ ఇచ్చారు సో ఇట్లా చిన్న చిన్న చిన్న చిన్నవి ఉంటాయి సో పెద్ద పక్షవాతం వచ్చినప్పుడు
(06:21) అందరూ కనిపెడతారు కానీ చిన్న చిన్నవి వచ్చినప్పుడు చాలా సార్లు వదిలేస్తారు. తగ్గేంత వరకు వెయిట్ చేస్తారు అంటే దానంతటవే తగ్గిపోయిద్దేమో అని అది కొంచెం సార్లు తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత ఏంటంటే నిర్లక్ష్యం చేస్తారు దీన్ని మినీ స్ట్రోక్స్ అంటాం ఓకే అప్పుడప్పుడు చిన్న చిన్న స్ట్రోక్స్ లాగా వస్తా ఉంటాయి.
(06:40) అవి మనం పట్టుకోవాలి అన్నట్టు హటాతుగా ఒకవైపు చూపు కనిపించట్లేదు అంటే ఒక కన్ను కాదు ఒకవైపు కనిపించట్లేదు ఒకవైపు కన్ను సరిగ్గా కనిపించట్లేదు మూతి వంక వచ్చింది ఇట్లా ఎన్నో లక్షణాలు మనం ఒక మామూలుగా ఉండే మనిషి అతని బిహేవియర్ కానీ నడక గాని మాట కానీ తెలివి తేటల్లో కానీ మనం అనుకోని విధంగా ఏదైనా మార్పు వచ్చింది అంటే మామూలుగా ఇది పక్షవాతం అయ్యే ఛాన్స్ ఎక్కువ సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇట్లాంటి విషయాలు మనం వెంటనే న్యూరాలజీస్ ని సంప్రదించాలి.
(07:15) సో ఈ స్ట్రోక్ రావడానికి కదా కారణాలు ఏమనా రిస్క్ ఫాక్టర్స్ వీటికి ఉంటాయా మేడం స్ట్రోక్ అనేది మనకి చెప్పాను కదా అదఒక సింటమ్ బయట పడింది అన్నట్టు కానీ ఈ క్లాట్ ఎందుకు ఫామ్ అయింది అనేదానికి కారణాలు ఉంటాయి. సో మనం ఎక్కువగా చాలాసార్లు వాటి మీద కాన్సంట్రేట్ చేసాం ఈ రీసన్స్ ఏంటి అని ఒకసారి సో ఇప్పుడు మనం ఎందువల్ల పక్షవాతం వస్తాయి అనే వాటిని రిస్క్ ఫాక్టర్స్ అంటాం.
(07:42) సో ఏ పేషెంట్ అయినా పక్షవాతంతో వచ్చారు అంటే మేము వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆలోచించేది ఏంటి అంటే రిస్క్ ఫాక్టర్స్ ఏంటి ఎందువల్ల వచ్చాయి అని దీంట్లో కామన్ గా ఏంటంటే బిపి హైపర్టెన్షన్ బిపి ఎక్కువ ఉండడం వల్ల రావచ్చు అన్నట్టు సో రెండోది షుగర్ షుగర్ షుగర్ ఉన్నవాళ్ళలో రక్తనాళాలు చాలా తొందరగా పాడైపోతాయి బీపి షుగర్ ఉన్నవాళ్ళలో సో వీళ్ళల్లో పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇవి కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇది కాకుండా మనం చేతుల్లో ఉండేవి ఏంటి స్మోకింగ్ హాబిట్స్ హ్యాబిట్స్ అలవాట్లు చెడు అలవాట్లు స్మోకింగ్ కి చాలా చెడ్డ పక్షవాతాలు
(08:28) వస్తాయి పెద్ద పెద్ద క్లాట్స్ వస్తాయి బ్రెయిన్ లో చాలా మంది పక్షవాతం వచ్చిన తర్వాత కూడా స్మోకింగ్ చేస్తా ఉంటారు టాబ్లెట్లు వేసుకుంటా దీంతో పాటు డ్రింకింగ్ సో ఇవి మెయిన్ ఇవి కాకుండా కూడా కొన్ని ఉంటాయి ఒకటి ఏంటి అంటే వయసే ఒక రిస్క్ ఫాక్టర్ అంటాం ఏజ్ ఇది మన చేతుల్లో లేనిది ఏజ్ అనేది పెరుగుతానే ఉంటుంది ఏమి లేకపోయినా అంతా బాగున్నా కూడా ఒక వయసు తర్వాత పక్షవాతం అనేది రావచ్చు.
(09:01) ఇది కాకుండా కొన్నిసార్లు మన జీన్స్ లో కూడా ఉంటుంది అంటే కొన్నిసార్లు పేరెంట్స్ నుంచి చాలా తక్కువ కాకపోతే జీన్స్ కూడా పక్షవాతానికి దారి తీయొచ్చు ఇవి కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఆ మళ్ళీ కొన్ని రకాల మెడిసిన్స్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా చాలా కారణాలు ఉంటాయి కాకపోతే మనం కాన్సంట్రేట్ చేసేదంతా కూడా ఈ మొదటి ఐదిటి మీద ఇంత చేసి కూడా కొంతమందిలో ఎందువల్ల వచ్చిందో కూడా తెలియదు.
(09:33) ఓకే సో అది క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అంటాం. ఎంత వెతికినా కానీ కారణం దొరకకపోవచ్చు అన్నట్టు సో చిన్న వయసు ఉన్నలో కూడా కొన్నిసార్లు వచ్చిది కానీ కారణం తెలియదు. సో మెయిన్ రిస్క్ ఫాక్టర్స్ ఇవి ఇది చాలా ఇంపార్టెంట్ పక్షవాతానికి ఎందుకు అంటే ట్రీట్మెంట్ అంతా కూడా వీటి మీదే ఆధారపడి ఆధారపడి ఉంటుంది సో పేషెంట్ నాకు మళ్ళీ వచ్చిద్దా అనంగానే ఫస్ట్ ఇదే అడుగుతాం ఎందువల్ల వచ్చిందో దాన్ని ట్రీట్ చేస్తే మళ్ళీ రాదు.
(10:03) ఓకే సో కాబట్టి ఇవి చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అన్న ఓకే స్ట్రోక్ కి మనకి ట్రీట్మెంట్ చికిత్స ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు మనకి పక్షవాతం వచ్చింది అనుకోండి రాత్రి ఒంటి గంటకి నేను లేచాను బాత్్రూమ్ కి వెళ్ళాల్సి వచ్చింది హటాతగా నా కాలు రాలేదు పిలవాలనుకుంటే మాట రాలేదు ఒక రెండు మూడు నిమిషాల్లో సెట్ అయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు పెద్దవారికి కదా వచ్చేది పిల్లల్ని ఎందుకు లేపేది ఈ టైంలో అందరూ హడాబిడి పడతారు ఇప్పుడు బానే ఉన్నానుక కదా రేపు పొద్దున్న చూసుకుందాం అనుకుంటారు సో అట్లా చేయకూడదు ఇప్పుడు పక్షవాతం
(10:38) సింటమ్స్ వచ్చాయి అంటే అది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు వెంటనే అలర్ట్ చేయాలి. సో పక్షవాతం అనేది నరాల రోగాల్లో ఎమర్జెన్సీ సో ఎమర్జెన్సీ కింద దీనికి ట్రీట్మెంట్ చేయాలి మనిషి నడుచుకుంటా వచ్చినా అంతా బాగున్నా కూడా ట్రీట్మెంట్ మాత్రం ఎమర్జెన్సీ ఏ సో ఇట్లా ఏదైనా పక్షవాత లక్షణాలు వచ్చాయంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి ఫస్ట్ వెళ్లిపోవాలి.
(11:02) ఇంట్లోనే టాబ్లెట్ వేసేసుకోవడం బిపి ఉందో చూసుకొని బిపి కరెక్ట్ చేసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు మనం. కాకపోతే షుగర్ కొన్నిసార్లు డౌన్ అయిన వాళ్ళలో కూడా ఈ లక్షణాలు రావచ్చు కాబట్టి షుగర్ డౌన్ అయిందంటే మాత్రం వెంటనే ఏదైనా మనం ఇవ్వచ్చు. షుగర్ బాగుంది అంటే మాత్రం నోటి ద్వారా ఏమీ ఇవ్వకుండా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లిపోవాలి.
(11:22) సో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ లో చేశాను పక్షవాతానికి ట్రీట్మెంట్ అనేది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఓకే సో నేను మీకు ఎందుకు అనేది ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదా బ్రెయిన్ ది సో ఇప్పుడు ఈ బ్రెయిన్ కి వెళ్లే రక్తనాలు ఇక్కడ బ్లాక్ అయిందనుకోండి సో ఇట్లా ఈ పార్ట్ అనేటికి రక్త సరఫరా తగ్గిపోయింది.
(11:48) సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ బ్రెయిన్ డామేజ్ అవుద్ది సెంటర్ లో బాగా రక్త సర్ఫరా దీనికి తగ్గింది కాబట్టి సో ఇప్పుడు ఏమైద్ది అంటే ఈ పార్ట్ లో ఎక్కడ సెంటర్ లో ఉందో అవి ఆల్రెడీ డామేజ్ అయిపోయాయి మీకు లక్షణాలు రాగానే ఇవి నూటికిన శాతం పాడైపోయాయి సో దీంట్లోనే లక్షల నరాలు ఉంటాయి డామేజ్ అవుతాయి. సో టైం గడిచేకది నిమిషం నిమిషం గడిచేకొద్ది ఇది స్ప్రెడ్ అవుతా ఉండుదది అంటే మిగతా పార్ట్ కి కొంచెం ఏదో కొంచెం రక్త సర్పరా జరుగుతా ఉండిద్ది అది కూడా బ్లాక్ అయిపోతా వచ్చిదది సో మెల్లగా నిమిషాలు నిమిషాలు నిమిషాలకి ఇది పెరుగుతా పెరుగుతా పెరుగుతా
(12:23) పెరుగుతా ఉండిద్ది. ఓకే సో దాంతో ఈ పార్ట్ మొత్తం డామేజ్ అయిపోద్ది టైం గడిచేయకూడదు ఓకే సో మనకి ఎంత తొందరగా వస్తే అంత పార్ట్ ని మనం కాపాడుకొచ్చు పర్మనెంట్ గా డామేజ్ అయిపోయిన దాన్ని ఏమి చేయలేంు ఇంత ట్రీట్మెంట్ వచ్చింది కదా అంత రీసెంట్ సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది కదా అంటే చచ్చిపోయిన నరాన్ని పుట్టించడం అనేది ఇప్పటివరకు మనం కనిపెట్టింది లేదు మనం చేయగలిగిందల్లా మిగిలిన బ్రెయిన్ ని కాపాడుకోవడమే కాబట్టి మనం ఎంత తొందరగా గా వెళ్తే మనం వెళ్ళే టైం కళ ఇంత డామేజ్ అయింది అనుకోండి అట్లీస్ట్ మిగతా దాన్ని కాపాడొచ్చు మనం వెళ్లేదే ఒక రోజు తర్వాత
(13:01) వెళ్ళామంటే ఇది మొత్తం డామేజ్ అయింది. సో అప్పుడు ఇంకేం చేస్తాం మనం ఫ్యూచర్ లో ఇంకొక చోట రాకుండా ఉండటానికి ట్రీట్మెంట్ చేయడమే గానీ దీనికి మనీ మనం కాపాడలేం. సో కొన్నిసార్లు ఏమైది అంటే ఒకవేళ ఇక్కడ క్లాట్ పెద్దగా ఉంది అంటే మనం వేరే రకంగా కూడా దీన్ని తీసేయొచ్చు క్లాట్ ని మనం ఇంటర్వెన్షన్ అని చేస్తాం ఇప్పుడు హార్ట్ కి యంజియో ఎట్లా చేస్తామో అట్లా యంజియో చేసి లోపలికి వెళ్లి దీన్ని తీసేయొచ్చు కాకపోతే అందరిలో కాదు దీన్ని త్రాంబెక్టమీ అంటాం ఓకే కొంతమందిలో దీన్ని తీసేయొచ్చు.
(13:35) కొంతమందిలో ఏంటంటే మనంనాలుగున్నర గంటల లోపు వస్తే ఒక ఇంజెక్షన్ ఇచ్చి దీన్ని పగలగొట్టొచ్చు ఓకే అంతా లేట్ చేసేసి ఒక రోజు తర్వాత క్లాట్ కరగదీయలేరా అంటే ఒక రోజు అయిపోయింది ఇదంతా డామేజ్ అయిపోయింది ఇప్పుడు క్లాట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి తేడా ఏం లేదు ఇప్పుడు మనకు అంతా నష్టం జరిగిన తర్వాత క్లాట్ తీసేసినా కానీ ఈ పార్ట్ మళ్ళీ వెనక్కి రాదు రాదు సో మనం ఈ క్లాట్ పగలగొట్టడం అయినా లోపలికి వెళ్లి క్లాట్ తీయడం అయినా గాని ఇవన్నిటికీ కొంచెం టైం ఉండేది గోల్డెన్ సో అది గోల్డెన్ అవర్స్ అంటాం సోనాలుగు నాలుగున్నర గంటకల్ల మనం వెళ్లి స్కానింగ్
(14:14) ఈ క్లాట్ పడవడం అన్ని జరిగిపోవాలి అన్ని జరిగిపోతేనే మనం ఏమైనా సేవ్ చేయగలం బ్రెయిన్ లో ఉన్నప్పుడు కాబట్టి మనం అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా వెంటనే వెళ్ళిపోవాలి సో హాస్పిటల్లో మెయిన్ స్ట్రోక్ కి ట్రీట్ చేసేది ఏంటి అంటే రక్తం పలచబడటానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అవి వాడుకోవాలి టైం కి వస్తే క్లాట్ పగలగొట్టే ఇంజెక్షన్ ఉండిద్ది ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి ఇంకొంచెం లేట్ గా వెళ్ళాము క్లాట్ పెద్దగా ఉంది బ్రెయిన్ ఇంకా పర్లేదు బానే ఉంది అంటే అప్పుడు మనం త్రాంబెట్టనీకి వెళ్తాం క్లాట్ తీసేయడం అనేది కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కాకపోతే ఆ
(14:55) టైంలో మనకి తప్పకపోవచ్చు సో ఇవి మూడు మెయిన్ ట్రీట్మెంట్స్ అన్నట్టు సో ఇవన్నీ నేను చెప్పింది ఏంటి ఫస్ట్ మొదటి రోజులో చేసే ట్రీట్మెంట్లు ఇప్పుడు ఒక రోజు అయిపోయింది అనుకోండి ఒక రోజు అయిపోయిన తర్వాత జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది అనుకోండి సో నెక్స్ట్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే బ్లడ్ కింగ్ టాబ్లెట్స్ సో పల్చబడే టాబ్లెట్స్ ఇస్తానే ఉంటాం.
(15:21) సో పల్చబడే టాబ్లెట్స్ ఆల్రెడీ నష్టం జరిగింది కదా ఎందుకు ఇస్తున్నారు అంటే ఒకచోట క్లాట్ ఫామ్ అయింది అంటే మన బాడీలో వేరే చోట కూడా ఫామ్ అవ్వచ్చు అని అర్థం అక్కడితో ఆగాలని లేదు. ఓకే సో ఇంకఎక్కడైనా రావచ్చు సో రాకుండా మనం జాగ్రత్తగా మిగతా బ్రెయిన్ ని కాపాడుకుంటే ఇప్పుడు మనక ఒక పార్ట్ డామేజ్ అయింది కదా దాని చుట్టూ నార్మల్ బ్రెయిన్ ఉంటది కదా ఆ నార్మల్ బ్రెయిన్ ఏం చేసిదంటే కొత్త కనెక్షన్స్ ఫామ్ చేసుకుంటది రీవైరింగ్ అంట దీన్ని ప్లాస్టిసిటీ అంటాం న్యూరోప్లాస్టిసిటీ సో బ్రెయిన్ మిగతా పార్ట్ అంతా రీవైరింగ్ అవ్వడం స్టార్ట్ అయిద్ది. సో మనం ఆ రీవైరింగ్ లో హెల్ప్
(15:56) చేస్తాం. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కొంచెం ఒక 48 గంటలు దాటి పేషెంట్ బాగున్నారు పర్లేదు అంటే వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవడం అన్నట్టు సో ఈ ఫస్ట్ టూ డేస్ 48 అవర్స్ అనేది క్లాట్ మరీ పెద్దగా ఉంది అంటే బ్రెయిన్ లో కొన్నిసార్లు వాపు రావచ్చు స్వెల్లింగ్ ఒకవేళ వాపు వచ్చింది అంటే మనక ఏంటంటే చెయ్యికి వాపు వస్తే బయటికి ఇట్లా వాచిదిద్ది మెథడ్ ఏంటంటే వాపు వస్తే మనకు కళ్ళ కనిపించదు లోపల లోపల వాచిపోతా ఉంటది అప్పుడు అప్పుడు లైఫ్ కి రిస్క్ ఉండిద్ది ఓకే సో అట్లా లైఫ్ కి రిస్క్ ఉన్న వాళ్ళలో పెద్ద పక్షవాతం వచ్చిన వాళ్ళలో
(16:33) కొన్నిసార్లు ఇక్కడ బోన్ ని తీసేసి మనం పొట్లో పెట్టేస్తాం అంటే వాయడానికి ప్లేస్ ఇస్తాం అన్నమాట ఇది బ్రెయిన్ సర్జరీ కాదు బ్రెయిన్ డీకంప్రెస్ చేయడం అంటే జస్ట్ ప్రాణాలు కాపాడటం కోసం మనం కొన్నిసార్లు సర్జరీ చేస్తాం అన్నట్టు సో ఇది స్ట్రోక్ కోసం అని కాదు చాలా చాలా బ్రెయిన్ డిసీసెస్ లో వాడుకుంటాం డీకంప్రెషన్ అనేది ఎందుకంటే చుట్టూ ఉన్న బోన్ అనేది ప్రొటెక్షన్ే మెదడికి కాకపోతే వాపు వచ్చినప్పుడు మాత్రం ఆ చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ే మన బ్రెయిన్ ని నొక్కేసి ఇబ్బంది పెట్టిద్ది.
(17:06) సో కొంతమందిలో సర్జరీ రావచ్చు. మనకి ఇప్పుడు రావడం రావడమే స్ట్రోక్ చాలా పెద్దది వచ్చినప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి రావచ్చు లైఫ్ రిస్క్ ఉండొచ్చు సో కొన్నిసార్లు మాత్రం పెద్ద స్ట్రోక్ వస్తే టైం కి హాస్పిటల్ కి తీసుకొచ్చినా కూడా కొన్నిసార్లు డాక్టర్ల చేతుల్లో ఉండకపోవచ్చు అందుకే పక్షవాతం విషయంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ రాకుండా చూసుకోవడం మోర్ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొంచెం చిన్నవి మీడియం సైజ్ వచ్చిన ఈజీ గాని పెద్ద సైజు వచ్చిందంటే మాత్రం కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినా కూడా ప్రాణాలు కాపాడలేకపోవచ్చు కొన్నిసార్లు మరి పెద్ద స్ట్రోక్ వచ్చి ప్రాణాలు
(17:48) కాపాడినా కూడా కొంతమందిని మనం చూస్తుంటాం మంచం మీదే ఉంటారు కొన్ని సంవత్సరాలు అట్లా కూడా జరగొచ్చు అని ఓకే ఓకే సో కొంతమంది స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటనే రికవర్ అవుతారు బట్ కొంతమంది మాత్రం బెడ్ రిడన్ గా మంచం మీద ఉంటారు సో దీనికి కారణాలు అలా రీసెంట్ గా ఒక పేషెంట్ కూడా వచ్చి అడిగాడు ఇద్దరు ఒకేసారి అడ్మిట్ అయ్యారు నాతో పాటు అడ్మిట్ అయిన ఆయన బాగానే తిరుగుతున్నాడు నేనేంటి ఇంకా పుట్టుతున్నాను అని సో ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్ ఇప్పుడు ఇద్దరికీ స్ట్రోక్ వచ్చినా కూడా ఒకటే జబ్బు కిందకి రాదు ఇప్పుడు మనకి పక్షవాతం వచ్చిందనుకోండి రికవరీ అనేది రెండిటి మీద
(18:23) ఆధారపడిద్ది ఒకటి ఏంటి అంటే ఎంత త్వరగా హాస్పిటల్ కి వెళ్ళాము అనేది కొంచెం తొందరగా వచ్చినవాడికి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి తొందరగా రికవరీ అవ్వచ్చు ఇంకొకటి ఏంటి అంటే వచ్చిన సైజు అప్పుడప్పుడు చూస్తాం రావడం రావడమే పెద్ద రక్తనాలం బ్రెయిన్ కి వెళ్ళ మెయిన్ దాంట్లోనే క్లాట్ వచ్చిందనుకోండి ఆ హాస్పిటల్ కి కొన్నిసార్లు వెంటనే వచ్చిన కూడా అప్పటికే కొంచెం డామేజ్ బ్లీడింగ్ ఏదో జరిగిపోయి ఉంటుంది సో రావడం వచ్చినది ఆల్రెడీ చాలా పెద్దది జరగాల్సిన పర్మనెంట్ డామేజ్ అయిన పార్ట్ ఆల్రెడీ పెద్దది అనుకో రికవరీ నాచురల్లీ లేట్
(18:58) అవుది చాలాసార్లు చూస్తుంటాం ఇప్పుడు తలలో సడన్ గా బ్లీడింగ్ అయింది గంటలో వచ్చింటారు కానీ ఆల్రెడీ బ్రీడింగ్ పెద్దది అయి ఉంటుంది. సో దానికి మనం ట్రీట్ చేసినా కూడా మనం చేస్తుంది ఏంటి హెల్తీగా ఉన్న బ్రెయిన్ ని కొంచెం బార్డర్ లైన్ లో ఉన్న బ్రెయిన్ ని రికవర్ చేయడానికి ఆల్రెడీ డామేజ్ చాలా పెద్దదిగా జరిగింది అంటే రికవరీ స్లో అవ్వచ్చు కొంతమందిలో అసలు సాటిస్ఫై మనం సాటిస్ఫై అయ్యేంత రికవరీ కూడా రాకపోవచ్చు సో మన చేతుల్లో ఉన్నదయితే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బట్ వచ్చిన సైజ్ అనేది మనం చాలాసార్లు దానికి హెల్ప్ చేయలేం. సో కొంతమంది
(19:34) పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఇంజెక్షన్ ఇంట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవచ్చా అని కూడా అడుగుతూ అదే స్ట్రోక్ రాంగానే నాలుగున్నర గంటల్లో ఇంజెక్షన్ తీసుకోవాలి కదా సో దానికి నన్ను కూడా కొంతమంది అడుగుతుంటారు మళ్ళీ మన ఇంట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు తీసుకోవచ్చా అంటే ఇప్పుడు మనకి చెప్పాను కదా రెండు రకాల స్ట్రోక్స్ క్లాట్ రావచ్చు బ్లీడింగ్ రావచ్చు సో ఇప్పుడు మనం క్లాట్ పగలకొట్టడానికి ఇంజెక్షన్ ఇస్తాం ఒకవేళ తలలో అయింది బ్లీడింగ్ే అనుకోండి మనం ఆ టైంలో ఆ ఇంజెక్షన్ ఇస్తే ఏమైది ఎంత బ్లీడింగ్ కాస్త పెద్ద బ్లీడింగ్ అవుద్ది. సో మనం
(20:05) ఏదో తెలియకుండా ఎట్లా ఇస్తాం కాబట్టి పేషెంట్ ని చూడాల్సిందే స్కాన్ అవ్వాల్సిందే స్కాన్ అవ్వకుండా ఎందువల్ల జరిగింది అనేది డాక్టర్ కి కూడా తెలియదు. కాబట్టి కచ్చితంగా స్కాన్ తర్వాతే మనం పక్షవాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది కొంతమంది ఇంట్లోనే యస్పిరిన్ కూడా వేసేసుకొని వస్తారు కానీ మనకు తెలియదు కదా ఏంది అనేది తెలియకుండా మనం అట్లా లాటరీ వేసినట్టు వేయం ట్రీట్మెంట్ సో కచ్చితంగా స్కాన్ బేసిస్ మీదనే మనం ఇంజెక్షన్ కి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
(20:36) సో కొంతమందిలో మనం అది ఇవ్వకూడదు. సో పేషెంట్ ని ఈ పేషెంట్ కి ఇది సెట్ అవుద్ది అనుకుంటేనే మనం ఇస్తాం. ఈ మధ్య కాలంలోనే బ్లీడింగ్ అయింది ఇట్లాంటివి ఉన్నాయి అంటే మాత్రం ఇచ్చాము అంటే అప్పుడప్పుడు రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే సో ఈ పక్షవాతం వస్తుందా లేదా అనేది ముందుగానే మనం ఏమైనా కనిపెట్టే అవకాశం ఉంటుందా మేడం చాలా మంది ముందే అడుగుతారు ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరికైనా స్ట్రోక్ ఉందని గాని రీసెంట్ గానే ఎవరికో పక్షవాతం వచ్చి చూసి ఉంటారు దాంట్లో వాళ్ళకి భయం వేస్తా ఉండిద్ది నాకే వచ్చిద్దేమో ముందే నేను ఏమైనా చేయొచ్చా అని
(21:09) సో మామూలుగా ఇప్పుడు మీకు ఎటువంటి రావడానికి ఇప్పుడు నేను రిస్క్ ఫాక్టర్స్ అని చెప్పాను కదా ఏ రిస్క్ లేదనుకోండి మనం టెస్ట్ చేయం ఎందుకంటే ఏమి రాకపోవచ్చు మనకి ఆల్రెడీ షుగర్ ఉంది బిపి ఉంది ఫ్యామిలీలో చాలా మందికి ఉంది ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే మనం అప్పుడు చెక్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది షుగర్ కంట్రోల్ లో ఉందా బిపి కంట్రోల్ లో ఉందా ఇక్కడ బ్లడ్ సర్క్ులేషన్ ఎట్లా ఉంది సో ఇట్లా కొన్ని టెస్ట్లు ముందు చేసి మనం కనిపెట్టొచ్చు ఏది లేకుండా ముందే స్కాన్ చేసుకొని చూసేసుకుందామా అంటే అట్లా అవసరం లేదు మనం ఒకదానికి చేయబోయి ఇంకేదో బయటపడి అనవసరంగా
(21:46) టెన్షన్ పడడం తప్ప ఏమ ఉండదు సో రిస్క్ ఫాక్టర్ ఉన్నాయి అంటే మనం ముందే జాగ్రత్త పడొచ్చు రిస్క్ ఫాక్టర్స్ ఏమి లేవు అంటే మనం దాని గురించి ముంద ముందుగా వెళ్ళ టెస్ట్ చేయించుకోవాల అంటే అట్లాంటి అవసరం లేదు. ఓకే సో కొంతమంది అడుగుతారు నాకు స్ట్రోక్ వచ్చి వన్ మంత్ అయింది నేను ఇంకా రికవర్ అవ్వలేదు ఇలాంటి విషా ఇప్పుడు నేను ఊపీలో చాలా మందిని చూస్తాను.
(22:09) పక్షవాతం వచ్చి మెలయ ఉంటుంది అప్పటికి నేను నాలుగో డాక్టర్ని అయ ఉంటాను అన్నమాట అంటే వాళ్ళ అక్కడి నుంచి ఇంకో డాక్టర్ కి ఇంకో డాక్టర్ నుంచి ఆయుర్వేదాకి ఆయుర్వేద నుంచి మళ్ళీ నాకు ఇట్లా తిరుగుతా ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు నాకేంటో ఇది తగ్గట్లేదు ఆ సో ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ గా తగ్గిద్దేమో అని మళ్ళీ దానికి తోడు పక్కింటోళ్ళు చెప్తారు మా వాళ్ళకి అక్కడికి వెళ్తే తగ్గింది వీళ్ళకి ఇక్కడికి వెళ్తే తగ్గింది నువ్వు ఇట్లా చేస్తున్నావు అవును పత్తి అని ఉండట్లేదు ఇట్లా పక్షవాతం గురించి అందరికీ తెలుసు
(22:42) అనుకుంటారు కాకపోతే అక్కడ ఏంటంటే చాలా మందికి ఏం తెలియదు తెలియకుండానే ఒక్క పాయింట్ తెలిసిఉంటుంది ఆ ఒక్క పాయింట్ తో నాకు అంతా తెలుసు అనుకొని చెప్పేస్తారు. సో దాంతో తిరుగుతానే ఉంటారు ఆ ట్రీట్మెంట్ కి ఒక కంటిన్యూేషన్ అనేది ఉండదన్నమాట మూవ్ అవుతా ఉండేటప్పటికి సో ఇప్పుడు ఏంటి అంటే ఒకసారి పక్షవాతం వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించిన తర్వాత ట్రీట్మెంట్ పని చేస్తుందా లేదా అనేది మనకి ఎట్లా తెలిసిద్ది అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండటానికి కొత్త లక్షణాలు రావట్లేదు అంటే ట్రీట్మెంట్ పనిచేస్తుంది
(23:17) అన్నట్టే మరి వచ్చిన లక్షణాలు నేను ఏం చేయాలి అంటే దానికి గట్టి ఫిజియోథెరపీ చేయించాలి ఇప్పుడు చిన్న వయసులో 40 ఏళ్లకి పక్షవాతం వచ్చి నా దగ్గరికి వచ్చి నడవలేకపోతున్నాను అంటే డిస్చార్జ్ చేసిన తర్వాత నేను వాళ్ళని ఇంటికి పంపించను నువ్వు ఫిజియోథెరపీ రీహాబ్ సెంటర్ కి వెళ్ళు ఎంతసేపు ఫిజియోథెరపీ చేయిస్తే అంత మంచిది సో చేయించుకుంటా ఉండు ఎంత బాగా చేస్తే అంత మంచిది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళకుండా గట్టిగా చేయించు అని చెప్తాం.
(23:46) అదే పెద్ద వయసులో వచ్చింది పర్వాలేదు నడుస్తున్నారు అంటే వాళ్ళ ఇంటి మీద భయం ఎక్కువ ఉండేది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఒక ఫిజియోథెరపిస్ట్ ని పెట్టుకో వచ్చి చేస్తా ఉంటారు అన్నట్టు సో మనకి ఒక స్టేజ్ వరకు మెడిసిన్ ఇబ్బంది పెరగకుండా ఉండటానికి మిగతాదంతా కూడా ఎక్సర్సైజెస్ మీదే ఆధారపడి ఉండిది మరి టాబ్లెట్స్ వాడాల అంటే వాడాలి ఎందుకంటే వాడకపోతే మళ్ళీ మనకి వచ్చిన రోగం తిరుగుపెట్టిది కాబట్టి సో వాడుకుంటానే వాళ్ళఎవరో మంచి మెడిసిన్ ఇస్తారంట వీళ్ళఎవరో అంటే ఎవరు ఇచ్చినా పక్షవాత అనుకున్నది బ్లడ్ టిన్నర్స్ే కొన్ని రకాలే మూడు నాలుగు రకాల బ్లడ్ తిన్నర్స్ ఉంటాయి
(24:24) అంతే వాటిలోనే మార్చి మార్చి ఇవ్వడం కానీ కొత్త ట్రీట్మెంట్ ఏ డాక్టర్ పెట్టలేరు సో ఎక్కువ మంది చుట్టూ తిరగడం అనేది మనం ఆపాలి. సో మన కాన్సంట్రేషన్ అంతా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీదే ఉండాలి. మామూలుగా పక్షవాతం వచ్చిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల వరకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిద్ది. ఓకే సో నేను ఆరు నెలలు రెస్ట్ తీసుకొని ఇప్పుడు మొదలు పెడతా అంటే అట్లా కుదరదు.
(24:47) సో ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది మనం ఎంత కష్టపడితే సో ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్ మంచి చేంజ్ చూస్తాం ఓకే సిక్స్ మంత్స్ తర్వాత అది స్లో అయిపోద్ది అంటే సిక్స్ మంత్స్ కి వచ్చే రికవరీని బట్టి మనం అర్థమయ్ది ఈయన ఎంత రికవర్ అవుతారు అనేది సో సిక్స్ మంత్స్ కి మనకి ఒక ఫిజియోథెరపీ అన్ని గట్టిగా చేయించిన తర్వాత అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చాలా ఎక్కువగా చూడం కొత్త కొత్త ఫిజియోథెరపీలు కొత్త కొత్త కత్తయి మనకి వచ్చిన పవర్ తగ్గిన బలం ఉండేది కదా మనకు వచ్చిన బలంలోనే నేను ఇంటి పని ఎట్లా చేసుకోవాలి
(25:25) నా పనులు నేను ఎట్లా చేసుకోవాలి ఇంకొకళ సపోర్ట్ లేకుండా నేను ఇండిపెండెంట్ గా ఎట్లా చేసుకోవాలి అవసరమైతే వాకర్ వాడాలా స్టిక్ వాడాలా ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ తర్వాత ఎందుకంటే సిక్స్ మంత్స్ తర్వాత చాలా చేంజ్ వచ్చిద్దా అంటే మనం యక్సెప్ట్ చేయాలి సిక్స్ మంత్స్ తర్వాత చేంజ్ రాదు రెండేళ్ల వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చిద్ది కానీ చాలా స్లో గా వచ్చిది రెండేళ్ళ వరకు కొంతమంది వస్తుంటారు రెండేళ్ళ అయిపోయింది స్ట్రోక్ వచ్చి ఇప్పుడు మీరు ఏదైనా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి కదా సొత్తగా ఏమైనా ట్రీట్మెంట్ పెట్టగలరా అని రెండేళ్ల
(25:58) తర్వాత పెద్దగా మార్పు రాదు మనం ట్రైన్ చేసుకోవడమే మనల్ని మనం ఎట్లా మనం ఉన్న వాటితో ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మనం ట్రైన్ చేసుకోవడం ఒకవేళ చెయ్యి టైట్ అయిపోయింది కాలు టైట్ అయిపోయింది అంటే బొటాక్స్ లాంటివి ఉంటాయి మనం ఇంజెక్షన్ ఇస్తే కొంచెం లూజ యూస్ అవుతాయి ఇది బ్రెయిన్ కి ఇచ్చే ట్రీట్మెంట్ కాదు చెయ్యి టైట్ ఉంది కాబట్టి టైట్ తగ్గించడానికి కాలు టైట్ ఉంది కాబట్టి టైట్ తగ్గించడానికి సో బ్రెయిన్ కి మనం చేయట్లేదు ఇంప్రూవ్మెంట్ కోసం సో తర్వాతంతా ఫిజియోథెరపీ సో సిక్స్ మంత్స్ ఎంత చెమట కారిస్తే అంత మంచిది అన్నట్టు రెస్ట్ తీసుకోకుండా చేయాలి సిక్స్ మంత్స్
(26:35) తర్వాత ఇంట్లో ఎట్లాంటి మార్పులు చేస్తాం మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో మనం ట్రీట్మెంట్ మాత్రం జీవితాంతం కంటిన్యూ చేస్తాం ఎందుకంటే స్ట్రోక్ మళ్ళీ రాకుండా ఉండటానికి అన్నట్టు సో కంటిన్యూ చేస్తానే ఎక్సర్సైజ్ చేసుకుంటా మనం కంటిన్యూ చేసుకుంటాం. సో టూ ఇయర్స్ తర్వాత ఇంకొక డాక్టర్ని కలిసి త్రీ ఇయర్స్ తర్వాత ఇంకొక డాక్టర్ని కలిసి అంటే చేసేదయతే ఏమ ఉండదు.
(26:58) ఓకే సేమ్ అవే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాం ఫిజియోథెరపీ చేయమంటాం కానీ మనం డాక్టర్స్ ని చేంజ్ చేయడంలో అంత యూస్ ఉండదు సో స్ట్రోక్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అయితే కంటిన్యూ చేయాలి ఎందుకంటే షుగర్ వల్ల బిపి వల్ల వచ్చిందనుకోండి ఓకే షుగర్ పోయేది లేదు బిపిన పోయేది లేదు ఏజ్ కూడా రిస్క్ ఫ్యాక్టరే ఏజ్ ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఇంకా పెరగొచ్చు మనకి సో ఆ రిస్క్ ఎక్కడికి పోదు కాబట్టి రిస్క్ ఉన్నంత కాలం ట్రీట్మెంట్ ఉండాలి ల్సిందే సో మనం లైఫ్ టైం ఎట్ రిస్క్ అన్నట్టు సో ఎప్పటికీ టాబ్లెట్స్ ముందంత డోసులు
(27:34) అవసరం తగ్గించుకొని తగ్గించుకొని ఇప్పుడు ఆస్పిరిన్ ఏదో కంటిన్యూ చేయమంటాం ఆ టాబ్లెట్ ఎంత రూపాయి కూడా ఉండదు ఆస్పిరిన్ టాబ్లెట్ సో ఆ టాబ్లెట్ ని మనం ఎప్పటికీ కంటిన్యూ చేసుకుంటా రిస్క్ ఫాక్టర్స్ షుగర్ ఎట్లా ఉంది బిపి ఎట్లా ఉంది స్మోకింగ్ ఉందా లేదా డ్రింకింగ్ చేస్తున్నావా లేదా కొలెస్ట్రాల్ ఇవే అడుగుతాం పేషెంట్ వచ్చిన ప్రతిసారి తిట్టుకుంటా ఉంటారు ఇవి తప్ప మీరు ఇంకేమి అడగరా మెదడు గురించి నుంచి చూడరా నా చెయ్యి కాలు చూడరా అని తిట్టుకుంటారు కానీ రియాలిటీ అది సో మన ఫోకస్ అంతా ఒక స్టేజ్ వరకు మెడిసిన్స్ మీద ఉంటాయి ఒక స్టేజ్ తర్వాత ప్రివెన్షన్
(28:09) మీదకి మనం వచ్చేస్తామ అన్నట్టు కొంతమంది పేషెంట్స్ కి ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం స్ట్రోక్ వస్తది అలా ఇప్పుడు మనకి ఇప్పుడు రిస్క్ ఉంది షుగర్ ఏమో 400లో పెట్టుకున్నాను కానీ ఈ టాబ్లెట్స్ నేను జాగ్రత్తగా వాడాను అయినా మళ్ళీ వచ్చిద్దా అంటే కచ్చితంగా వచ్చిద్ది ఎందుకంటే అది కంట్రోల్ అవ్వలేదు కదా సో అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి.
(28:29) కొన్నిసార్లు రక్తం పల్చబడే పిల్లలకి కూడా కొంతమందికి రెసిస్టెన్స్ ఉండేది వాళ్ళ బాడీకి మనం ఇచ్చినా కూడా పనిచేయదు. సో అట్లాంటి వాళ్ళలో మనం డ్రగ్స్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ టెస్ట్లు చేసుకుంటాం ఎక్కడైనా హార్ట్ నుంచి క్లాట్ బ్రెయిన్ కి వెళ్తుందా ఏదైనా వీళ్ళ బ్లడ్ లోనే క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం.
(28:50) కొంతమందిలో ఏముంటదంటే ఈ రక్తనాళాలు సన్నపడిపోయి ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం స్టెంటల్ లాంటివి చేస్తాం యంజియో చేసి స్టెంటింగ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు హార్ట్ కి చేసినట్టే వీటికి కూడా సో ఎందువల్ల రిపీట్ అవుతుంది అనేది మళ్ళీ టెస్ట్లు అన్నీ చేసుకొని కనిపెట్టి ఎందువల్ల అయిందో దాన్ని మళ్ళీ ట్రీట్ చేయాలి అన్నట్టు సో మనక ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు రికవరీ ఫాస్ట్ గా రావచ్చు సెకండ్ టైం వస్తే రికవరీ స్లో అవ్వచ్చు.
(29:18) సో చాలాసార్లు నేను చూసేది ఏంటంటే ఫస్ట్ టైం వచ్చింది చిన్న స్ట్రోక్ వచ్చింది. ఆ మనం చెప్తాం జీవితాంతం వాడుకోండి పిల్లలు అని వెంటనే డాక్టర్ని మార్చేస్తారు ఈ డాక్టర్ ఏంటి ఎప్పటికీ వాడమని చెప్తున్నారు నేను ఎప్పటికీ పేషెంట్ నేనా అని ఇంకెక్కడో ఆయుర్వేదాకి అట్లా వెళ్ళాను వాళ్ళు నెలలో తగ్గిస్తా అన్నారండి అని చెప్పేసి నెలవాడి ఆపేస్తారు.
(29:39) రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు వస్తది. రెండోసారి వచ్చినప్పుడు పెద్దది రావచ్చు ఈసారి వచ్చింది తగ్గకపోవచ్చు. ఓకే ఆ సో కాబట్టి మన దృష్టి ఎప్పుడు ఇప్పుడు 50 ఏళ్ళ వచ్చినత నా దగ్గర స్ట్రోక్ వచ్చా అనుకోండి నేను ఆలోచించేది ఏంటంటే ఈయన లైఫ్ స్పాన్ 80 ఏళ్ళు ఉండొచ్చు. 80 ఏళ్ళ వరకు ఈమె ఎట్లా మనం మళ్ళీ పక్షవాతం రాకుండా కాపాడాలి అనేది ఇప్పుడు గుళ్ళు పోటు అనుకోండి ప్రాణాల మీదకు వచ్చిద్ది.
(30:04) పక్షవాతం ప్రాణాల మీదకు వచ్చేది కొంచెం తక్కువే కాకపోతే మంచం మీద వేసిద్ది. సో అది మంచి రోగమా ఇది మంచి రోగమా? అంటే నుండి పోటే మంచి రోగం పక్షవాతం కన్నా ఎందుకంటే మనల్ని ఇంకొక మనిషి మీద ఆధారపడేటట్టు చేయకపోవచ్చు అది ఇది మాత్రం ఆధారపడేటట్టు చేసేది. సో ఇంతకుముందు వచ్చిన పక్షవాతం చిన్నదైనా కానీ డాక్టర్ గారు లేదు ఇది పెద్ద రోగం జాగ్రత్తగా వాడుకోండి అంటే డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి కానీ నేను చూసేది కామని డాక్టర్ చేంజ్ అనేది మాత్రం వీలైనంత వరకు చేయకపోవాలి సో వీళ్ళు ఇంత ఫ్రీక్వెంట్ గా డాక్టర్ ఫాలో అప్ లో ఉంటే బెటర్ అంటారు
(30:40) ఆ ఇప్పుడు ఒకసారి పక్షవాతం వచ్చిందనుకోండి ఇప్పుడు ఫస్ట్ లో చెప్పాను కదా సిక్స్ మంత్స్ మంచి రికవరీ సో సిక్స్ మంత్స్ మంత్లీ మంత్లీ రమ్మంటా ఎంత వస్తుంది ఎంత వస్తుంది చూడటానికి సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రతిసారి మళ్ళీ గట్టిగా చెప్పాలిగా ఫిజియోథెరపీ చెయి చెయి చెయి నువ్వు ఈసా నా దగ్గరికి నడుచుకుంటా రావాలి నడుచుకొని వాళ్ళని నెక్టాను అన్నమాట సో దీనికి సిక్స్ మంత్స్ కంటిన్యూస్ గా రావాలి షుగర్లు బీపిలు బాగా చూసుకోవాలి.
(31:04) సిక్స్ మంత్స్ తర్వాత ఓకే అనుకుంటే తర్వాత త్రీ మంత్స్ కి ఒకసారి ఆ షుగర్ బీపీలు అన్నీ బాగున్నాయి స్మోకింగ్ ఆపేసారు చక్కగా ఉన్నారు అంటే సిక్స్ మంత్స్ కి ఒకసారి తర్వాత వన్ ఇయర్ కి ఒకసారి అట్లా మనం తగ్గించుకుంటా తగ్గించుకుంటా వస్తాం. ఓకే సో ఫస్ట్ లో మాత్రం తరచుగా రావచ్చుగా రావాలి. సో వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటే బెటర్ అంటారు అందరూ అడుగుతారు పత్యాలు పత్యాలు చెప్పండిే రూమ్లోనుంచి వెళ్లరన్నమాట చెప్పండి చెప్పండి చంపండి అని పక్షవాతానికి గోంగూర తినొద్దు వంకాయ తినొద్దు ఇట్లాంటివి ఏమి లేవు ఓకే అలోపతీలో సో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నా రిస్క్
(31:40) ఫాక్టర్స్ షుగర్ ఉంది షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవడానికి పత్యాలు అంటే తీపి తినొద్దు ఫ్రై చేసిన ఫుడ్స్ తినొద్దు రైస్ ఎక్కువ తినొద్దు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకో ప్రోటీన్ ఎక్కువ తీసు తీసుకోవాలి మళ్ళీ బీపి ఉంది కాబట్టి సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు కొలెస్ట్రాల్ కి ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు రెడ్ మీట్ అంటే మతను బీఫ్ పోర్క్ ఇట్లాంటి రెడ్ మీట్ తీసుకోవద్దు ఫిష్ ఎగ్స్ ఇట్లాంటివి తీసుకో సో పక్షవాతం వచ్చిన చెప్పేదంతా హెల్తీ హ్యాబిట్స్ అంటే ఏ రోగం లేనివాళ్ళు కూడా ఇి ఫాలో అవ్వచ్చు మంచి ఫుడ్ అన్నట్టు సో అందరికీ ఏం చెప్తాం బజ్జీలు తినొద్దు బండాలు తినొద్దు బయట
(32:16) ఫుడ్ తినొద్దు ఫ్రై చేసుకొని తినొద్దు ఈగురు కూరలు తీసుకోండి సో ఇట్లా హెల్తీ ఫుడ్ ఉండే ఈ కూరగాయ తినొద్దు ఆ కూరగాయ తినద్దు అని ఉండదు కూరగాయలు చిరు కూరగాయలు మంచి కూరగాయలు ఏమ ఉండవు. సో మనం హెల్తీ డైట్ తీసుకుంటా లిమిట్ లో తీసుకొని ఇన్ఫెక్షన్స్ రాకుండా బాగా చూసుకుంటే అదే పత్యాలు అంతకుమించి వేరే పత్యాలు ఏమ లేవు చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఫ్యామిలీకి ఒక కూరగాయ చెప్తారు ఆ పత్యాలన్నీ ఫాలో అవితే ఇంకేమ ఉండదు వీక్ అయిపోతారు ఫిజియోథెరపీ చేసే ఓపిక కూడా ఉండదు వాళ్ళని సో కొంతమంది పేషెంట్స్ మేడం మీకు స్ట్రోక్ వచ్చింది అని చెప్పిన తర్వాత హాస్పిటల్ లో
(32:52) ఉండాల్సిందేనా మెడిసిన్ తీసుకొని వెళ్తాము ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు. అవును ఎందుకు అంటే కొన్నిసార్లు మినీ స్ట్రోక్స్ అట్లా వచ్చినప్పుడు పేషెంట్ రికవర్ అయిపోతారు బానే ఉంటారు. కాబట్టి నడుచుకుంటా వచ్చిన పేషెంట్ నేను బాగున్నప్పుడు ఫస్ట్ టైం లైఫ్ లో నువ్వు హాస్పిటల్ లో ఉండు అనగానే చాలా భయపడతారు ప్లస్ ఫైనాన్షియల్ గా వరీ అవుతారు నేను ఉండాలా అనేది.
(33:17) కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఆ స్ట్రోక్ అనేది అందరిలో ఒకలాగా బిహేవ్ చేయదు. సో ఈరోజు చిన్న స్ట్రోక్ వచ్చి రేపు పెద్దది రావచ్చు అది ఎవరికి వచ్చిద్ది అనేది నేను గెస్ చేయలేను. ఓకే కాబట్టి ఎందుకు వచ్చిందో కనిపెట్టడానికి కొంచెం టైం కావాలి ఎంత సివియర్ గా వచ్చింది ఈయనకి ఎంత డోస్లు అవసరం పడతాయి వీటన్నిటికీ స్టడీ చేయడానికి మనకి ఆ పేషెంట్ తో అట్లీస్ట్ 48 గంటలు కావాలి.
(33:40) ఓకే సో ఆ 48 అవర్స్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా టాబ్లెట్స్ అన్ని బాగా సెట్ అయి ఉంటే మనం పేషెంట్ ని ఇంకా వెంటనే ఇంటికి పంపించేసేయొచ్చు కాకపోతే మనం ఏదైనా మిస్ అయ్యామ అనుకోండి చిన్నది అయి ఉండొచ్చు మిస్ అయ్యి పెద్ద స్ట్రోక్ వచ్చింది అనుకోండి అప్పుడు లైఫ్ లాంగ్ మనం సఫర్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటే మనం ప్రాణం మీద భయంతో హాస్పిటల్ లో ఉండిపోతామా లేదా నొప్పి తగ్గిపోయినా అమ్మో హార్ట్ అటాక్ వచ్చింది నేను ఏమైపోతాను అని ఉంటాం కదా పక్షవాతం కూడా అట్లాగే అమ్మో పక్షవాతం మళ్ళీ వస్తే నేను మంచాన పడతాను కదా అనే భయం కూడా మనకు
(34:16) ఉండాలి. సో స్ట్రోక్ వచ్చినప్పుడు చిన్నదైనా కూడా 48 గంటలు అయినా కానీ అది ఎట్లాగైనా బిహేవ్ చేయొచ్చు కాబట్టి మనం ఒక టూ డేస్ మాత్రం డాక్టర్ కి టైం ఇవ్వాలి అబ్జర్వేషన్ లో ఉండాల్సిందే ఇంటికి వెళ్లి మళ్ళీ వచ్చి చూపించుకుంటారని అట్లా కుదరదు కొంతమంది స్ట్రోక్ రాంగానే ఈ ఆయుర్వేదిక్ పసర్ మందు ఇట్లా వెళ్ళాము అంటా ఉంటారు దీని గురించి ఆ ఇప్పుడు ఏంటి అంటే పక్షవాతం వచ్చింది అనుకోండి ఒకవేళ పెద్దదే వచ్చిందంటే మనక ఆ టైంలో చాలా అబ్జర్వేషన్ అవసరం బ్రెయిన్ కి స్వెల్లింగ్ వస్తుందా ఇట్లాంటివి కొన్ని వాటికి కొన్నిసార్లు ఐసియు సెటప్ అవసరం
(34:58) పడిద్ది సో నేనే చూస్తున్నారు కదా పేషెంట్ చాలాసార్లు ఆయుర్వేదిక్ కి వెళ్లి అక్కడ వాళ్ళు చెప్తారు పేషెంట్ ఇంత ఇబ్బంది పడతా ఉంటే మనక అది ఎమర్జెన్సీ కేర్లో ఆయుర్వేదిక్ ఎట్లా పని చేసిది పని చేయదు కదా ప్రివెన్షన్ కి లాంగ్ టర్మ్ కి అట్లాంటి వాటికి మనం ఆలోచించొచ్చేమో కానీ ఎమర్జెన్సీ కేర్లో మనం వాటిని చేయకూడదు. ఓకే కాబట్టి ఎమర్జెన్సీ వచ్చింది అంటే నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు నేను ఏం చేయలేను నా వెనకాల ఒక టీమ ఉండాలి.
(35:26) గంటక గంటకి బీపి చూసుకునేవాళ్ళు గంట గంటకి షుగర్ చూసుకునేవాళ్ళు ఎట్లా ఉన్నారు మన ప్యూపిల్స్ అని చెక్ చేస్తాం ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉండటానికి ఒక టీమ ఉండాలి. సో దానికి మనం ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలి అక్కడ ఉండాలి. సో అప్పటికప్పుడు ఆయుర్వేద తీసిన పసర్ మనం తీసుకున్నాను అంటే అది మనం రిస్క్ తీసుకున్న వాళ్ళమే అవుతాం ఓకే కాబట్టి హెల్తీగా ఉన్నప్పుడు ప్రివెన్షన్ కి మీరు అట్లాంటి వాటికి వాళ్ళని అప్రోచ్ అవుతాను అంటే నేను దానికి నో చెప్పలేను కానీ ఇట్లా ఎమర్జెన్సీలో హటాతగా పక్షవాతం వచ్చింది నేను అర్జెంట్ గా ఆయుర్వేదిక్ కి వెళ్ళిపోతాను అంటే ఈనాలుగున్నర గంటల్లో
(36:01) ఇంజెక్షన్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు కదా కాబట్టి మనం హాస్పిటల్ కే వెళ్ళాలి వీళ్ళంతవరకు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి న్యూరాలజిస్ట్ చుట్టుపక్కల్లో లో ఎవరూ లేరు అంటే జనరల్ ఫిజీషియన్ దగ్గరికైనా మనం వెంటనే వెళ్ళవాలి ఓకే చాలా వరకు నాకు తెలిసి ఉన్న క్వశ్చన్స్ అన్ని కవర్ చేశ నాకు గుర్తున్నవి నీకు గుర్తున్నవి అన్ని కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను రాకుండా చూసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం వచ్చిన తర్వాత మన చేతుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ పొరపాటున వచ్చింది అనుకోండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెప్పింది
(36:38) వినాలి అన్నట్టు సో ట్రీట్ మళ్ళీ ఓన్లీ ఫాలో అప్స్ ఒకసారి వచ్చింది తగ్గింది అని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికీ ఆ జాగ్రత్తలు అనేది కంటిన్యూ చేసుకోవాలి అన్నట్టు సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా అవసరమైన చోట ఫిజియోథెరపీ దాన్ని కూడా చూసుకుంటా ఉంటే మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు
No comments:
Post a Comment