ప్రేమ - మోసం - చిన్న పిల్లలపై - పెద్దల పెంపకం
Author Name:Venkata Chaganti
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BSjKivIUVRM
Transcript:
(00:02) ఓం నమస్కారం ఆచార్య నేను మధుమతి సోషల్ టీచర్ ని ఆ నాకు మీతో ఒక మూడు విషయాల పైన మాట్లాడాలని ఆ ఉంది ఆచార్య ఒకటి మోసపూరితంగా కుట్రపూరితంగా ప్రేమ పేరుతో అబ్బాయిలు అమ్మాయిల్ని అమ్మాయిలు అబ్బాయిల్ని ఆ వంచించడం జరుగుతుంది. అలాగే ఆ నిన్నటి రోజు మీ యొక్క వీడియో చూశాను ఒక అమ్మాయి పవన్ చాలా ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది.
(00:39) దానికి మీరు పరిష్కారం కూడా చూపించారు. అట్లాగా సమాజంలో చూస్తుంటే చాలా విషయాలు చాలా చోట్ల ఇట్లా అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మోసపోతున్నారు. దీనికి ఒక టెక్నికల్ గా ఒక పరికరం చేస్తే బాగుంటుందని నా ఆలోచన రిస్ట్ వాచ్ లో ఇన్సర్ట్ చేయడం గానీ లేదంటే బ్రాస్లెట్ లో లేదంటే కమ్మలు నెక్లెస్ బంగారు గాజులు వేస్తే బంగారు గాజులు అలాగా ఒక రక్షణా తంత్రం పేరుతోటి ఆ ఒక పరికరం చేసి అందులో ఇన్సర్ట్ చేస్తే ముందుగానే
(01:25) అట్లా ఒకవేళ అమ్మాయి మోసం పూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే అబ్బాయికి అలర్ట్ చేసేలాగా అబ్బాయి మోసపూరితమైన ఆలోచనలు ఉంటే అమ్మాయిని అలర్ట్ చేసేలాగా తీస్తే బాగుంటుంది అది తయారు చేస్తే బాగుంటుందని మీతో చెప్పాలని నేను పంచుకోవాలని ఆ అంటున్నాను ఆచార్య ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మధుమతి గారి ప్రశ్న విన్నారు కదండ ఆవిడ మూడు మూడు ప్రశ్నలు అడిగారు మొదటి ప్రశ్న వినిఉంటారు మీరు ఇప్పుడు సో రెండో ప్రశ్న తర్వాత చూద్దాం మొట్టమొదటి ఏంటంటే ప్రేమ ప్రేమ పేరుతో మోసపూరితంగా కుట్రపూరితంగా
(02:09) ఆ స్త్రీలు పురుషులు మోసపోతున్నారు ఒకళళనొకళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. అలానే మంచివాళ్ళు మోసపోతున్నారు. చెడ్డవాళ్ళు మోసపూరితంగానే వస్తారు లోపలికి సో మంచివాళ్ళు మోసపోతున్నారని ఆవిడ పాపం బాధపడుతున్నారు ఆవిడ సోషల్ టీచర్ కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ కొద్ది ఆవిడ అడిగారు ప్రశ్న ఆ దానికి సమాధానం చెప్పుకుందాం దానికి ఆవిడ ఏమంటున్నారంటే ఒక డివైస్ ఏదైనా తయారు చేసి చేతికో లేదా మెడలోన వేస్తే మనం దుర్మార్గుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు కదా అని ఆవిడ అడుగుతున్నారు.
(02:45) తప్పకుండానండి దానికి తయారు చేయవచ్చు కానీ తయారు చేసి లాభం ఉండదు మనకి ఎందుకంటే ఇందులో మనిషి తన నిర్ణయం మనసుతో తీసుకుంటాడు. ఆ మనసుకి కావలసిన ఇన్ఫర్మేషన్ వస్తే అతను తీసుకుంటాడు ఉదాహరణకి నేను ఒక షాప్ కి వెళ్ళాను అనుకోండి వెళ్లి [గొంతు సవరించుకోవడం] నేను ఒక వస్తువు కొండానికి వెళ్ళాను ఆ వస్తువు వాళ్ళు చూపించి ఇంత ఖరీదు అని చెప్తారు.
(03:13) చెప్పినప్పుడు నేను అది తీసుకోవాలా వద్దా అంటే నాకు అది కావాలి నాకు ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు ఆ కాస్ట్ పెట్టి తీసుకుంటాను. లేదు అది ఎక్కువ ఖరీదు అనిపిస్తే వద్దులే దీన్ని ఇంకోసారి చూద్దామని వెళ్ళిపోవచ్చు. దాని అవసరాన్ని బట్టి మనకి అవసరం ఎంత ఉందో ఎంత అర్జెంట్ ఉందో దాన్ని బట్టి మనము దాన్ని ఒప్పుకోవడమో ఒప్పుకోకపోవడం జరుగుతుంది.
(03:35) సో ఆ వస్తువు మంచిదా కాదో కూడా తెలియదు మనకి ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఉపయోగించినప్పుడు అది మంచిది కాదో మంచిది అవునో తెలుస్తుంది. మనము బంగారం కొనడానికి షాప్ కి వెళ్తాము. బంగారం వాల్యూబుల్ బంగారం వెరీ గుడ్ అని కొంటాం. వాళ్ళు 22 క్యారెట్ 24 క్యారెట్ బంగారం తీసుకొచ్చి వాళ్ళు కొద్ది కాపర్ అది కలిపే చేయాలి లేకోతే అది వంగదు.
(03:56) సో దేర్ఫోర్ బంగారాన్ని అట్లా వంచడానికి కాపర్ కలుపుతారు తెలుసు మనక అది అప్పుడు అది 22 క్యారెట్ బంగారం మీద అవుతుంది లేకపోతే ఇంకాస్త తగ్గొచ్చు వాళ్ళు చెప్తారు నిజాయితిగా చెప్పాలి వాళ్ళు ఇది ఇన్ని క్యారెట్స్ బంగారం ఉంది దీని వెయిట్ ఎంత అని చెప్పి దాని వెయిట్ కొద్ది కాస్ట్ తీసుకుంటారు. విశేషం ఏంటంటే ఇప్పుడు 24 క్యారెట్ బంగారము 10గ్రమలుఒ50,000 ఇప్పుడు అనుకుందాం కాసేపు అది నాకు నంపర్సరీగా తెలియదు.
(04:19) దానిలో ఇప్పుడు ఒక ఒక 10గ్రమలకిల50,000 అయిందనుకోండి ఆ 10గల,ష50,000 ని మనము కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి ఒక ఒక ఆర్నమెంట్ కింద సో అప్పుడు ఆ 10గ్రమలతో మనం చేస్తామ అంటే లేదు మనం ఏ 8 గ్రాములతోనో 9 గ్రాములతోనో చేసి మిగతాది కాపర్ కలుపుతాం. కానీ కాస్ట్ మటుకు ఆ 10 గ్రాములకి వేసేస్తారు షాప్ వాళ్ళు అది మనం గమనించం గమనించిన ఏమి చేసేది లేదు వాళ్ళంటే ఇష్టం ఉంటే తీసుకోండి లేకోతే లేదు అంటాడు.
(04:53) సో మనం ఏం చేస్తామో ఆ కాస్ట్ పెట్టి తీసుకుంటాం అంటే కొంత మోసం అక్కడే జరిగిందని తెలుస్తుంది మనకి పర్టిక్యులర్ గా తెలిసినా కానీ మనము తీసుకుంటాం ఎందుకంటే మన అవసరం కాబట్టి సో మన అవసరమే ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ సో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ అవసరం ఏంటో గ్రహించుకోవాలి. అవసరం లేకుండా వాళ్ళు గనుక మాయలో పడితే అది మనం ఏం చేయలేము దానికి సో అవసరాన్ని తగ్గించడానికి వాళ్ళ మనసుల్లో ఆ అటువంటి ఆలోచన రాకుండా ఉండడానికి పరమాత్ముని ప్రార్థించి వాళ్ళు ఏమిటి అది నిజంగా ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి.
(05:30) మన పూర్వీకులు ఇదివరకు పెళ్లి చూపులను ఏర్పాటు చేసి తల్లిదండ్రుల సమక్షంలో ఏదో చేసి గొడవ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కొన్నే జరుగుతున్నాయి కానీ ఎక్కువ జరగట్లేదని నా యొక్క అభిప్రాయము ఎక్కువ కూడా జరుగుతుండొచ్చు మరి పెళ్లి చూపులు అవి నాకు అంత ఐడియా లేదు కానీ ఇప్పుడైతే ప్రేమ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ మనసుకి తగ్గట్టుగా ఒక వరుణని ఎన్నుకోవడంలో వాళ్ళకి పూర్తి హక్కు ఉంది స్త్రీలకి అందులో డౌట్ లేదుఅది ఎన్నుకోవాలి కూడా వాళ్ళు ఎన్నుకొనే పెళ్లి చేసుకోవాలి.
(05:59) సో అది కరెక్ట్ కానీ అబ్బాయి యొక్క గుణగణాలు తెలుసుకోవడం మన చేత కాదు ఇప్పుడు రాముడి సీత స్వయంవరంలో చూడండి ఆ శివధనస్సు ఎత్తిన వాళ్ళకే నేను ఇచ్చి చేస్తానని జనక మహారాజు అనౌన్స్ చేస్తాడు. మరి ఇది అబ్బాయి క్యారెక్టర్ ని ఎట్లా చెప్తుంది వీరత్వం చెప్పొచ్చు గాక బలం చెప్పొచ్చు గాక కానీ క్యారెక్టర్ చెప్పదు కదా మరి జనక మహారాజు అట్ల ఎట్లా పెట్టాడు తన కూతురికి అంటే తనకు పుట్టలేదు కాబట్టి ఇష్టం పెట్టేసి పంపించేసాడా అన్న ప్రశ్న మనకు వస్తుంది.
(06:36) మనం బాగా ఆలోచిస్తే అందులో క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. శివధనస్సు అది శివుడి యొక్క ధనస్సు ఎవరు పడితే వాళ్ళు ఎత్తలేరు. ఆ క్యారెక్టర్ ఉన్నవాళ్ళే తగలుగుతారు. ఇది ఆ లింక్ అక్కడ ఉందన్నమాట. అది చాలామంది గ్రహించుకోరు. సో అందులో పెట్టారు. అలానే ద్రౌపది స్వయంవరంలో కూడా ఆమెకి ఆ అది ధనస్సు విల్లుతో మతంత్రాన్ని భేదించడం అది చెప్పారు. సరే అది ఒక రకం మరి ఇక్కడ క్యారెక్టర్ ఎట్లా తెలుస్తుంది అంటే కర్ణుడు భేధించడానికి వచ్చినప్పుడు ద్రౌపది నిరాకరిస్తుంది.
(07:10) నేను అతన్ని చేసుకోను అంటుంది కారణాలు ఏమన్నా కావచ్చు అంటే తనకు హక్కు ఉంది స్త్రీకి ఆ హక్కు ఉంది మీరు చేసినా కానీ తను నేను చేసుకోను అంటే ఇంకఎవరేం చేయలేరు. సో అదన్నమాట సో ఈ హక్కుని మనం పూర్వీకులు స్త్రీలకి బాగా ఇచ్చారమ్మ సో అది ఇప్పుడు ఇవ్వట్లేదు ఆ హక్కుని ఇవ్వాలి ఇచ్చి ఆలోచించమని చెప్పాలి వాళ్ళకి ఆ గుణగణాలన్నీ ముందరే చెప్పాలి ఫలానా వీరుడు వస్తున్నాడు అతని గుణగణాలు ఇవి ఇతని గుణగణాలు ఇవి అన్ని చెప్తారున్నమాట ఇప్పుడు రాముణని లక్ష్మణుని విశ్వామిత్రుల వారు తీసుకొచ్చినప్పుడు జనక మహారాజు దగ్గరికి ఆయన వీరు ఎవరు అంటే ఫలానా అని
(07:46) చెప్తాడున్నమాట చెప్పినప్పుడు ఆ ఎంక్వైరీ అంతా వాళ్ళు చేసుకొని సీతకి ఇస్తారు మరి తప్పదు అది ఎవరైతే ఆ వధువు ఉందో ఆ అమ్మాయికి ఇవన్నీ తెలవాలి గుణగణాలన్నీ ఇదివరకు గురుకులాల నుంచి గుణగణాల్ని ఒక పత్రం కింద పంపించేవాళ్ళు అంటే దానిలో రాసి ఇగో ఈ అబ్బాయి ఇలా ఇలా చదివాడు ఇలా ఉంది ఈ అబ్బాయికి ఇలా వీరత్వం అంటే ఎక్కువ ఇష్టం లేతే శాంతియుతంగా ఉంటాడు లేకపోతే తొందరగా మాట్లాడతాడు ఇలాంటివన్నీ కూడా రాసి పంపిస్తాడు.
(08:17) పంపించినప్పుడు అక్కడ కన్యా గురుకులంలో ఉన్న అమ్మాయిలకి ఇచ్చినప్పుడు ఎవరైతే పెళ్లికి వచ్చారో వయసుక వచ్చారో అలాంటి స్త్రీలు వాటిని చదివి ఓకే ఇలాంటి వాళ్ళు నా మనసుకు నచ్చుతారు అనుకున్నప్పుడు వాళ్ళతో స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి వాళ్ళు మాట్లాడుకొని చేసుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలా జరగట్లేదు. మనం స్కూల్ నుంచి ఇంకో స్కూల్ కి వెళ్ళేటప్పుడు టీసి క్యారెక్టర్ సర్టిఫికేట్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటాం.
(08:41) కానీ ఇక్కడ అలా ఇవ్వట్లేదు. అది ఇవ్వాలి ముఖ్యంగా సో అప్పుడు స్త్రీలు తొందరపడే పని ఉండదు. ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో బాగా చూపించేది ఏంటంటే మగపిల్లలు అమ్మాయిల ఎమ్మట పడటం అవన్నీ చేయడంతో ప్రతి అమ్మాయి ఆ వయసుక వచ్చిన అమ్మాయి నాకు ఒక వరుడు అలా ఉంటే బాగుంటుంది నా ఎమ్మడి పడి నన్ను కూడా ప్రేమించేవాడు కావాలని అనుకోవచ్చు స్త్రీలు కొంతమంది అమ్మాయిలు అట్లా అనుకోవచ్చు కొంతమంది అబ్బాయిలు కూడా అట్లానే అనుకోవచ్చు ఈ సినిమాల పైత్యం బాగా వస్తుంది మనకి మైండ్లోకి వచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి కాబట్టి ఇదంతా మనసుకు సంబంధించిన విషయం ఈ మనసుని మనం కంట్రోల్లో
(09:17) పెట్టుకుంటే ఎవ్రీథింగ్ కెన్ బి కంట్రోల్డ్ ఇంకా ఏ ఇన్స్ట్రుమెంట్ పని చేయదు. మనసే ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ భగవంతుడు మనక ఇచ్చిన అత్యద్భుతమైన పరికరం ఏంటంటే మనసు [గొంతు సవరించుకోవడం] సో దేర్ఫోర్ మనం ఆ మనసుని ఉపయోగించి చేయాల్సిందే కానీ ఇంక ఏ ఒక్క పరికరము పనికి రాదమ్మ ఆ మనసుకి మంత్రాలు ఉన్నాయి ఆరు ఏడు మంత్రాలు ఉన్నాయి అవి చక్కగా మనసు ఆ మంత్రాలు చదువుకుంటూ ఆ మంత్రాలు అర్థం తెలుసుకుంటే మనసు చాలా గట్టిపడుతుంది ఆ మనసు ద్వారా కంట్రోల్ చేసేసుకోవచ్చు ఎస్ ఏ విషయం విషయం తెలిసిపోతుంది ఎదుటి వాళ్ళ యొక్క ఆనో చపలత్వము ఎదుటి వాళ్ళ యొక్క
(09:57) కుట్ర బయటపడతాయి కానీ మనసు ఇస్ వెరీ ఇంపార్టెంట్ చూడండి అందుకే రామాయణంలో సీత రాముణని నాకు జింకను తీసుకురా అంటుంది అని పంపిస్తుంది ఆ మనసంతా జింక మీద ఉంటుంది. ఆ జింక ఎప్పుడు వస్తుంది రాముడు ఎప్పుడు వస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఆంటే హే లక్ష్మణ హే సీత అని అరుపులు వినిపించి లక్ష్మణుని గాబరగా పంపించేస్తుంది.
(10:24) ఆమె మనసంతా అతలాకుతలమై ఉంటుంది. అంటే ఫోకస్ తప్పేసింది. అలా ఫోకస్ తప్పేటట్టు చేసి రావణాసుడు ఎంటర్ అయ్యాడు. ఇది ముఖ్యంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఫోకస్ లో లేమో ఆ పని చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. సో ఫోకస్ గా ఉన్నప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం. ఇది రామాయణంలో పర్టిక్యులర్ గా మనకి చెప్పాడు అన్నమాట మనం సీత చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆ అమ్మాయి సో చాలా జాగ్రత్తైన మనిషి ఎదుటి వాళ్ళ యొక్క హావభావాలను ఈజీగా గమనించగలదు వీళ్ళలో కుట్ర ఉందా అవన్నీ కూడా కనిపెట్టగలదు కానీ ఆ సమయంలో ఆమె వ్యాకులత చెందింది కాబట్టి ఆమె తెలుసుకోలేము. అలా
(11:05) జరిగినప్పుడు ఏమవుతుందంటే తెలుసుకోలేమ అన్నమాట. సో అందుకని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనసుని ప్రశాంతంగా పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. సో ఇది చాలామంది స్త్రీలకి పురుషులకి తెలిీదు. సమాజంలో 98% పీపుల్ తెలియదు. ఈ 98% ఏంటి ఎలా డిసైడ్ చేసాము 2% ఉన్నారు అంటే మనకి అతి తక్కువ ప్రజలు మనకు కనిపిస్తారు. ఏమని అంటే వాళ్ళు ఇట్లా మనసుని కంట్రోల్ లో పెట్టుకొని ఆలోచించి వ్యవహారాలు చేస్తారు.
(11:32) సో అందుకని మనం కూడా మనసుని కంట్రోల్ లో పెట్టుకుందుకు ఆ ఆరు మంత్రాలు ఏవైతే ఉన్నాయో మనసు సంబంధించి ఇదివరకు వీడియో చేశాను అది కనుక మనం ప్రవేశపెట్టి మనసులోకి ఆ చదువుకుంటూ మనం ఆ మనసుతో ఆలోచిస్తూ ఏ విషయమైనా కంగారు పడకుండా ఫస్ట్ ప్రశాంతంగా మనకి మనసుని తెచ్చుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రతి టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకి వాళ్ళకి చెప్పి ఉంటే వాళ్ళు అలానే చేస్తారని నా నమ్మకం కానీ చెప్పాను కదండ మన అవసరం ఉంటే కనుక డామినేట్ చేస్తుంది మన మనసు డామినేట్ చేసి చెడ మంచి ఆలోచించు సో ఒక అమ్మాయి అనుకుంటాంది అనుకోండి నాకు
(12:16) ఒక పిల్లవాడు నా వెంబడిపడి నన్ను లవ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంది అనుకోండి అప్పుడు ఆమెకి దుర్మార్గులు ఎదురుపడిన వాడు లవ్ చేస్తున్నాడు అంటే నమ్ముతు అవుతుంది ఎందుకంటే తన కోరిక అది కాబట్టి సో అలా కోరికలు ఉండబట్టి డెఫినెట్ గా అది అవుతుంది లేదు అవ్వదు కానీ ప్రశాంతంగా ఆలోచించి మనిషి మంచివాడు ఇతన్ని నేను ప్రేమించాలి అని అనుకుంటే అది బాగుంటుంది పద్ధతి సో అతను మంచి తత్వం ఉందా లేదా తెలుసుకొని ఎస్ ఈ పర్సన్ తో నేను ఉండటం నాకు సేఫ్టీ ఉంటుంది.
(12:45) ఈ మనిషి నన్ను సరిగ్గా చూసుకోగలుగుతాడు. ఇతనిలో ఆ క్యారెక్టర్ ఉంది నేను గమనించేంతలో ఈ క్యారెక్టర్ కనిపిస్తోంది అనుకున్నప్పుడు ప్రేమించడం ఉచితం అని నా అభిప్రాయం. అలానే పురుషుడు కూడా స్త్రీలను గమనించినప్పుడు ఏమి కావాలి నీకు ఏ గుణం కావాలో అది ఆలోచించి ఉందా లేదా చూసుకొని పరి పరీక్షించి అప్పుడు ప్రేమించడం అన్నది మొదలు పెట్టాలి లేకపోతే తప్పుఅవుతుంది.
(13:08) సో ఇది వాళ్ళ చేతుల్లో ఉంది అది ఈ మనసు అనే మంత్రాలతోనే వస్తుంది అలానే మనకి సంధ్యావందనంలో ఆరు మంత్రాలు ఉన్నాయి అవి వాటితో మనం ఆరు దిక్కుల నుంచి మనకి పరమాత్ముడు కాపాడాలని చెప్పి మనం ఆ మంత్రాలు చదువుతాము అది కూడా దృష్టి పెట్టి చదివితే గనుక రక్షణ కూడా దొరుకుతుంది. అప్పుడు ఈ డివైస్ లు పనికి రావు కానీ డివైస్ చేయొచ్చు అందులో కష్టం ఏమి కాదు మన యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము తయారు చేస్తాము కష్టపడే మూడు నాలుగు ఏళ్ళనా కష్టపడి దాన్ని తయారు చేస్తామ అంటే మనం చేసుకోవచ్చు.
(13:40) ఇంకే ఇప్పుడు మీ రెండో ప్రశ్న ఇంకో విషయం ఏమంటే ఆచార్య దుర్మార్గులు చిన్న పిల్లల్ని పసి కందాల్ని కూడా అత్యాచారం చేసి వాళ్ళ యొక్క జీవితము నాశనం చేస్తున్నారు. అది వాళ్ళ యొక్క మనసుపైన పూర్తి ప్రభావం చూపిస్తుంది పెరిగే క్రమంలో చిన్న పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా ఖండించాలండి ఖచ్చితంగా అది చేస్తున్న వాడి యొక్క మానసిక దౌర్బల్యము వాళ్ళు ఏ మతము అనుసరిస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
(14:22) వాళ్ళకి ఆ జ్ఞానము ఇవ్వరు కొన్ని మతాల్లో చిన్న పిల్లల్నే పెళ్లి చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అని చెప్పి ఉంది. సో అలాంటి వాళ్ళు దానికి కేరే పిన్ గా తీసుకుంటారు వాళ్ళకి వావి వరసలు కూడా తెలియకుండా అయిపోతాయి అన్నమాట. అలాంటి దుర్మార్గులకి మనము ఒకటే అట్లా చేశారని తెలవంగానే ఇమ్మీడియట్ గా వాళ్ళని శిక్షిస్తే ఇమ్మీడియట్ గా శిక్షించేసేయాలి ఆ శిక్ష మరణ శిక్ష తప్పితే ఇంకో శిక్ష లేదు అలా శిక్షిస్తే కానీ మనకి సమాజంలో ఆ భయం కలగదు ఎప్పుడైతే భయం కలుగుతుందో అరే ఇలా చేయకూడదు అని అర్థం వుతుందో అప్పుడు చేయరు ఇప్పుడు చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళని కూడా
(14:59) చేయకూడదు ఎవ్వరిని బలవంతం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు చెప్పాను ఇందాకే కే చెప్పాను స్త్రీలకు స్వాతంత్రం ఉంది వాళ్ళు వరిస్తేనే పురుషులు ముందుకు రావాలి తప్పితే స్త్రీలు వరించకుండా బలవంతంగా ఎప్పుడూ చేయరు. అది అది చేస్తే చాలా తప్పు అవుతుంది. అలా తప్పు జరగకూడదు కాబట్టి ఆ వరించిన స్త్రీ ఉందనుకోండి అప్పుడు ఆవిడతో మనం బ్రహ్మాండంగా కాలం గడపొచ్చు అందులో డౌట్ లేదు పెళ్లి చేసుకోవచ్చు ప్రేమించవచ్చు ఏమన్నా చేయవచ్చు కానీ స్త్రీల పర్మిషన్ లేకుండా పురుషులు ముందుకు రావటం చేయటం అన్నది చాలా తప్పది దాన్ని శిక్షక అర్హులు అవుతారు సో అలాంటి పని చేయకూడదు ఒకమాట
(15:42) ఇష్టమైన అమ్మాయి కనిపించిందని ఎంబడపడతారు చెప్తారు ఎక్స్ప్రెస్ చేస్తారు ఇవన్నీ జరుగుతాయి యా కొంతవరకు అది ఎలిజిబిలిటీ ఉంది అట్లా చెప్పాలి లేకపోతే తెలియదు కూడా సో తెలిసినప్పుడు స్త్రీ నిర్ణయించుకోవచ్చు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నాకు ఇలాంటి వాళ్ళు కావాలని కోరుకున్నా అని చెప్తే అది సరిపోతుంది అక్కడితో కానీ అక్కడితో అబ్బాయిలు ఆగట్లేదు యసిడ్ పోసేయటం అవి చేయడం ఇవి చేయడం అన్నీ చేస్తున్నారు.
(16:05) సో దీన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అర్థం అయపోతుంది. అంటే ఏంటంటే ఒకవేళ పొరపాటున అమ్మాయి వాడిని పెళ్లి చేసుకొని ఉంటే నరకం అనుభవించేది ఇప్పుడు ఆ యసిడ్ పోయడం దాంతోనే సరిపోయిందని వాడు అనుకుంటున్నాడు అలాంటి వాళ్ళని మనము ఉపేక్షించకూడదు ఇమ్మీడియట్ గా మరణదండని ఇవ్వాలి. మరణదండని తప్పితే ఇంకో మార్గం లేదు. ఇచ్చి ఒకవేళ ఇప్పుడు అప్పుడు ఏమంటారంటే చాలామంది మీరు మరణదండిని ఇచ్చేస్తారు కానీ ఒకవేళ ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అని తెలియంది ఆ అమ్మాయి కావాలని చెప్పింది అని అనుకున్నప్పుడు ఇటు కూడా మరణదాన్ని ఇచ్చేయటమే ఇచ్చి ఫస్ట్ శిక్షించే తర్వాత ఆలోచించాలి ఇవన్నీ
(16:37) ఆలోచిస్తూ కూర్చుంటే ఏళ్ళు గడిచిపోతే 10 ఏళ్లకి 15 ఏళ్ళ కూడా మీకు జడ్జ్మెంట్ రాదు. ఎందుకంటే మన సిస్టమ అలా వీక్ గా ఉంది కాబట్టి కాబట్టి మనము మరణదండని ఇవ్వవలసిందే అది మనుధర్మ శాస్త్రం ప్రకారం అదే జరుగుతుంది అది అలా జరుగుతుందన్నమాట సో అది అలా కాదు క్షమిస్తాము చేసుకుంటాము పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి అది అనిఅంటే వాళ్ళ ఇష్టం అవన్నీ వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అన్నమాట సో ఇది కానీ శిక్ష మటుకు తప్పదు జీవితంలో పరమాత్ముడు ఇచ్చేస్తాడు శిక్ష మనం ఇవ్వకపోయినా పరమాత్ముడు ఇస్తాడు కాబట్టి స్త్రీలకి ఫుల్ ఫుల్ స్వాతంత్రం ఉంటుంది మనం దీనిలో ఎట్టి పరిస్థితిలో వేలు
(17:15) పెట్టకూడదు. వాళ్ళు నచ్చి నేను చేసుకుంటాను అబ్బాయి కూడా నచ్చి నేను చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు కానీ అబ్బాయి బలవంతం చేయడానికి ససేమిరా కుదరదు తల్లిదండ్రులు ససేమిరా బలవంతం చేయదు ఎట్టి [గొంతు సవరించుకోవడం] పరిస్థితిలో సో స్త్రీని తన స్వతంత్రానికి వదలాలి వదిలి తన కోరుకున్న అబ్బాయితో మనము పెళ్లి చేయాలి ముందరే చెప్పాలి అమ్మ అబ్బాయి మంచివాడు కాదు లేదా మంచివాడు లేకోతే అబ్బాయి ఇన్కమ్ ఇంతే ఉంది మనం సరిపెట్టుకోలేవు ఇక్కడేమో నీకు బాగా చూసాము అక్కడికి వెళ్తే నీకు ఉండదు ఇలాంటి విషయాలన్నీ అన్ని చెప్పాలి చెప్పిన తర్వాత కూడా స్త్రీ తనకి నిర్ణయానికి కట్టుబడే
(17:51) ఉంది అంటే తప్పకుండా ఇచ్చి చేయాలి. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లల మీద అత్యాచారం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ మతాలలో ఉన్న తేడా వాళ్ళకి అర్థం కాకుండా తల్లితండ్రులు చెప్పకపోవడము ఆ బాంధవ్యాలు చెప్పకపోవడము వాళ్ళ అక్క చెల్లెలతోను వాళ్ళతోను ప్రవర్తించే తీరు ఎలా ఉండాలని చెప్పకపోవడము ఇవన్నీ చెప్పకపోవడం మూలంగా ఆ మగపిల్లలు అలా తయారవుతారు.
(18:19) అది రాక్షసత్వం ఆ రాక్షసత్వం అన్నది వాళ్ళ మతం నుంచి పుట్టుకొస్తుంది. సో ఇది మన దగ్గర అయితే మన హిందూ మతంలో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండని చెప్తాం కానీ హిందువులో కూడా చాలా మంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి వాడు హిందువు కాదు బేసికలీ వాడు పిశాచి అలాంటి పిశాచి కాబట్టి పసికందులు కూడా వదలకుండా అలా జరుగుతుంది అది ఆ ఆ మైండ్సెట్ వచ్చేసింది అంటే దానికి ఇంకా తిరుగుదు అందుకనే మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్పాడంటే చిన్న పిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు రాంగానే వాళ్ళని గురుకులానికి పంపించేశరు మగపిల్లలని అట్లానే ఆడపిల్లలని కూడా గురుకులానికి పంపించాలి సో అక్కడ కన్యా గురుకులం
(18:56) ఉంటుంది ఇక్కడ పురుషుల గురుకులం ఉంటుంది. సో బాల బాలికల గురుకులాలు ఉంటాయి విడివిడిగా ఉండాలి వాళ్ళు కలిసి ఎడ్యుకేషన్ ఉండకూడదుఅని చెప్పాడు. చెప్పి వాళ్ళు విడివిడిగా ఉండి వాళ్ళు పెద్దగా అయ్యేదాకా రక్షణ ఇవ్వాలి మనం రక్షణ ఇచ్చి వాళ్ళు కుచ్చేస్తాలు చేయకుండా జాగ్రత్త పడాలి. పిచ్చి చేస్తులు వెర్రి వేషాలు వేయకుండా జాగ్రత్తపడి వాళ్ళని పెంచాలి.
(19:16) పెంచి అప్పుడు వాళ్లకి ఒక మ్యాచురిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చేయరు. సో అలా అన్ని ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే కనుక బాగుంటుందమ్మా. కానీ జరగట్లేదు భారతదేశంలో అది స్కూల్స్ ఓపెన్ చేశారు కానీ ఇది జరగట్లేదు. సో ఇది వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ కూడా టీచర్లు చెప్తారు చెప్తారు చాలా మంది టీచర్లు మా చిన్నప్పుడు అయితే చెప్పారు టీచర్ మనం ఏమనా పిచ్చివేషాలు వేస్తే వాళ్ళు కచ్చితంగా శిక్షించేవాళ్ళు అవన్నీ జరిగాయి సో మనకి చిన్నప్పటి నుంచే బాల బాలికలు సెపరేట్ చేసి చదివిస్తే గనుక కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మెచూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి
(19:50) తెలుస్తుంది ఏది తప్పు ఏది ఒప్పు అని నేర్పించిన తర్వాత సమాజంలో వదిలి పెట్టేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. అలా మనం నేర్పించకుండా ఉంటున్నాం కాబట్టే ఈ సిచువేషన్ వస్తుంది. కాబట్టి శిక్ష బాగుండాలి. అంటే ఏంటంటే ఎవరైతే ఇలా తప్పు చేశారో వెంటనే మరణ దాన్ని ఉపయోగించే ఆయుధం ఉంటే మన దగ్గర అప్పుడు ప్రజల్లో ఈ కంపనం బయలుదేరుతుంది.
(20:15) అప్పుడు 100 జరగాల్సిన చోట ఒక్కటి జరగొచ్చు అది కూడా మనం భద్రత చూసుకోకపోతే ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు పసికందుల్ని వదలబెట్టకూడదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళని కాపలా కాస్తూ ఉండాలి. తండ్రి ఎస్పెషల్లీ రక్షణ ఇవ్వాలి. సో పా అనిదే రక్షణ అని అర్థం అన్నమాట. సో అది పతి అని వైఫ్ కి పతి ఎందుకంటే అతను రక్షిస్తాడు. అలాని పిల్లలకి పాలన చూస్తాడు.
(20:46) సో ఇవన్నీ తండ్రి చేయవలసిన బాధ్యత తండ్రి కనుక నా కూతురు పుట్టింది నా కొడుకు పుట్టాడు వీళ్ళకి నేను రక్షణ ఇవ్వాలి వీళ్ళని జాగ్రత్తగా పెంచాలి వాళ్ళకి ఆపద రాకుండా చూసుకోవాలి అని అనుకుంటే అతను అతని భార్య అతను వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తుంటే అంతమందిలో రక్షణ జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళందరికీ మనం అందుకనే పిల్లల్ని ఆడపిల్లల్ని వాళ్ళు తండ్రి రక్షించాలని మన ధర్మ శాస్త్రంలో చెప్తాం.
(21:14) ఆమెకి పెద్దగా అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని కూడా చెప్తాం. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఒక సిస్టమాటిక్ గా జరుగుతాయి కాబట్టి రక్షణ దొరుకుతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తాం చిన్న పిల్లల్ని ఓకే ఆటోలో ఎక్కించే స్కూల్లో డ్రాప్ చేసేయండి అంటాం ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడో తెలవదు బస్సులో ఎక్కించి పంపించేస్తాం బస్ డ్రైవర్ ఏం చేస్తున్నాడో తెలవదు సో ఇలాంటివన్నీ మనం కథలు వింటున్నాం మనం సో ఇవన్నీ ఏం చేస్తున్నామో తెలియదు.
(21:42) సో ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి అంటే ఏంటి మనమే వెళ్లి స్కూల్ కి వెళ్లి డ్రాప్ చేయడం స్కూల్ ఎటువంటి స్కూల్ అది వాళ్ళ టీచర్లు ఎట్లా ఉన్నారు ఇవన్నీ కనుక్కోవడము దాంట్లో తద్వారా మనం ఆ రక్షణ ఇవ్వడం జరగాలి. ప్రతి నిమిషము మన కాపలా ఉండాలి ఇది మనకి సెన్స్ ఉండాలి ఇది మనం ఆ ఇంత ఇంత చేస్తామా మనం కష్టమైదని పిల్లలు కనద్దు సింపుల్ స్టోరీ సో పిల్లల్ని కన్నారు అంటే నేను రక్షణ ఇవ్వగలను అనుకున్నప్పుడే కనాలి అందుకనే ధర్మ అర్థ కామ మోక్షం కాబట్టి అర్థం అంటే ధనం సంపాదించి నేను ఉద్యోగం చేయలేకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు పెళ్లి చేసుకోవడం ఉత్తమం ఆ అప్పటికి 60 వచ్చేస్తాయండి అంటే వస్తే వచ్చాయి గాక
(22:22) మీకు రక్షణ ఇవ్వగలడం జరుగుతుందిన్నమాట లేకపోతే సమాజంలో రక్షణ ఇవ్వలేదు. ఫస్ట్ రక్షణ ఇవ్వాలి పిల్లలకి పసికందులు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి వాళ్ళని వాళ్ళు ఎట్లా రక్షించుకుంటారు మీరే రక్షించాలి పెద్దగా వాళ్ళని మంచి స్ట్రాంగ్ గా చేసి నిలబెట్టిన తర్వాత వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు. సో ఇది మనం చేయవలసిన పని అలానే చిన్న పిల్లలు కూడా వాళ్ళకి పిచి చేసలు చేయకుండా మనం జాగ్రత్త పడాలి చిన్నప్పటి నుంచి జాగ్రత్త పడుతూ ఉంటారు సో ఇది చిన్న పిల్లల విషయం ఇప్పుడు మూడో ప్రశ్నకి వెళ్దాం.
(22:54) ఆ దీని విషయంగా పేరెంట్స్ యొక్క పాలన ఆలన యొక్క హెచ్చుతకులు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కొద్దిగా పార్షియల్ గా అనిపిస్తుంది ఏందంటే అమ్మాయిలని అయితే బాగా జాగ్రత్తగా మెలుకోవాలి చెప్తూ పెంచుతారు పర్టికులర్ గా అమ్మాయిని నిఘా పెడతారు. ఆ మొబైల్ లో ఏమన్నా చాట్ చేస్తుంటే అది గమనిస్తారు. తర్వాత బయటికి ఎక్కడనా వెళ్తుంటే ఫలానా చోటికి ఎక్కడికి వెళ్తున్నట్టు అని గమనించడానికి చూస్తారు కానీ అదే అబ్బాయిల పైన అంతే కంట్రోల్ అంతే నిఘా అంతే కేరింగ్ ఉన్నట్టు అనిపించట్లేదు ఆచార్య ఆ ఈ తల్లిదండ్రులు ఇద్దరిని సమంగా పెంచాలి
(23:40) అంటే కేవలం వస్తువులు సమంగా ఇవ్వడమే కాదు ఈ నైతిక విలువలు కూడా సమంగా ఇవ్వడం అనేది కూడా అవసరం అని నేను అనుకుంటున్నాను. ఆ మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మేము ఆశిస్తున్నాం ఆచార్య నమస్కారం ఆచార్య ధన్యవాదాలు. ఆ అవునమ్మ తల్లిదండ్రులు అబ్బాయిలని అమ్మాయిలని సమానంగా పెంచాలి. అందుకే గురుకులాలు వేరు వేరుగా ఉన్నాయి అనుకోండి అబ్బాయిల గురుకులం వేరు అమ్మాయిల గురుకులం వేరు అప్పుడు అమ్మాయిలకి అమ్మాయిలే టీచర్లు ఉండాలి అబ్బాయిలకి అబ్బాయిలే టీచర్లు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే సాంఘికంగా కూడా వాళ్ళకి అర్థంఅవుతుంది ఇది పరిస్థితి ఇలా ఉంటుంది అని అలా కాకుండా
(24:19) ఎప్పుడైతే మనం కో ఎడ్యుకేషన్ అని మొదలు పెట్టామో అక్కడి నుంచి ఇవన్నీ జరుగుతాయన్నమాట ఎందుకంటే కో ఎడ్యుకేషన్ లో టీచర్ 24/7 వాళ్ళ మీద కాపలా పెట్టలేరు కష్టం సో ఎంత చూస్తున్నా గమనిస్తున్నా కానీ టీచర్లకు కూడా వాళ్ళకు కూడా జీవితాలు ఉంటాయి కదా సో వాళ్ళు కూడా ఇప్పుడు అందుకనే కన్యా గురుకులంలో కన్యలు అక్కడే ఉండి టీచింగ్ చేయాలి.
(24:46) అలానే బాలల గురుకులంలో టీచర్లు మగ టీచర్ అక్కడే ఉండి టీచింగ్ చేయాలి. సో వాళ్ళు పెళ్ళీలు చేసుకోకూడదా అంటే చేసుకుంటే కనుక అప్పుడు గురుపత్ని గురువు ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు పిల్లలు నేర్చుకుంటారు ఇప్పుడు రాముడు వశిష్ట ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ వశిష్టుడు అతని భార్య ఉన్నారు ఆమెనే అందరికీ వండి పెట్టడం అన్ని చేసేది.
(25:09) సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే సో అలా గురుకులాల్లో కొన్నిసార్లు అలా జరుగుతుంది. దట్స్ గుడ్ ఫెంటాస్టిక్ సో అలా జరగొచ్చు కానీ బాలికల గురుకులన్నప్పటికు కన్యలే టీచ్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అది సో అఫ్కోర్స్ పెళ్లి అయిన వాళ్ళు కూడా టీచ్ చేయొచ్చు కానీ వాళ్ళు మళ్ళీ ఆ ఆశ్రమంలో ఉండలేరు ఎందుకంటే పెళ్లి అయింది కాబట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి సో ఇది మనం ఈ రక్షణ అన్నది మనం ఎలా ఇవ్వాలి ఏం చేయాలిని ఆలోచిస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది.
(25:35) అలానే పురుషులకి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య ఇంట్లోనే పెరుగుతున్నారు కాబట్టి అబ్బాయిలకి అమ్మాయిలకి సమానంగా టీచ్ చేయాలి అబ్బాయిల కూడా క్లియర్ గా చెప్పాలి నీకేమి వింత ఆ ఇవి లేవు ఏమంటారు అది ఫెసిలిటీస్ ఏం లేవు అక్కడ అమ్మాయికి ఎలా ఉందో అబ్బాయికి అలా సో కాకపోతే అమ్మాయి విషయంలో మనం ఎక్కువ జాగ్రత్త పడుతూ ఉంటాం ఎందుకంటే అబ్బాయి విషయం జాగ్రత్త పడం కానీ ఈ రోజుల్లో అబ్బాయి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త పడాలి.
(26:01) ఇలా బిహేవ్ చేయాలి ఇలా చేయకూడదు పరాయ స్త్రీలని మనకి అమ్మాయిల్ని మనం మన దగ్గరికి వెళ్లి ఇలా చేయకూడదు అని చెప్పి టీచ్ చేస్తే కొంతవరకు ఉంటుంది కొన్నిసార్లు అది జరగకపోవచ్చు దీనిలో నేను అంత నిపుణుని కాదు కాబట్టి ఇంతకంటే నేను చెప్పలేను కానీ మీరు గమనించుకుంటే మీరు అలా చేసుకుంటూ వెళ్లొచ్చు చెప్పుకోవచ్చు నేను నేను పెంచినప్పుడు అయితే బ్రహ్మాండంగా పెంచాను నేను అలానే అందరూ కూడా అలానే పెంచుతున్నారు అనుకుంటా కాబట్టి నాకు అంత పరిచయం లేదు ఇలాంటి కుటుంబాల్లో ఎలా పెంచుతున్నారు అన్నది నేను గమనించట్లేదు.
(26:35) సో ఇది ఇంతకన్నా ఏం చెప్పలేదు మీరు టీచర్ కాబట్టి మీరే ఎక్కువ చెప్పగలుగుతారు ఈ విషయం మనకు వయసు వచ్చినప్పుడు పిచ్చి వేషాలు వేస్తామఅమ్మ అది మగపిల్లలు ఇంకా ఎక్కువ వేసేస్తారు. నేను నా వయసులో నాకు తెలుసు కానీ ఎన్ని పిచ్చ వేషాలు వేస్తాను కాబట్టి అన్ని వేస్తాం కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ అవుతారు చూసేవాళ్ళు ఇండియాలో తొందరగా మిస్అండర్స్టాండ్ అయిపోతారు.
(26:54) ఏదనా ఏదనా కొద్దిగా మనం అబ్బాయి అమ్మాయి మాట్లాడితే చాలు మిస్అండర్స్టాండింగ్ అయిపోతూ ఉంటాం అది ఎక్కువగా జరుగుతుంది. కానీ అలా మాట్లాడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే సొసైటీ అట్లా దగ్గరికి తీసుకొచ్చి పెట్టేసింది కో ఎడ్యుకేషన్ సిస్టం ఇవన్నీ తెప్పించినప్పుడు మాట్లాడ పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక విషయంలో జరుగుతుంది.
(27:11) ఇప్పుడు స్కూల్లో మీరు మీరు మీ టీచర్ గా ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు అనుకోండి ఒక అమ్మాయి బాగా చదువుతున్నప్పుడు మెచ్చుకొని నువ్వు బాగా చేసావు అమ్మాయి వెరీ గుడ్ అంటే ఎవరనా అబ్బాయి గారి తనకు తెలియదు అనుకోండి అమ్మాయి దగ్గరికి వెళ్లి నేర్చుకోవాలి అనుకుంటా అది నేర్చుకోవాలని ఉద్దేశంతో వెళ్ళొచ్చు కానీ ఆ ఉద్దేశం తర్వాత ఏం మారుతుందో తెలియదు.
(27:27) కానీ ఇలానే అమ్మాయి కూడా ఒక అబ్బాయి బాగా చదువుతున్నాడు అనుకోండి అబ్బాయిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. సో ఇవన్నీ మనము మిస్అండర్స్టాండ్ కాకూడదు అక్కడ కూడా ఎందుకంటే సొసైటీ ఆల్రెడీ బైండ్ అయిపోయింది కో ఎడ్యుకేషన్ సిస్టం తో మనం దాన్నిఏం మార్చలేము ఇప్పుడు కాబట్టి మార్చకపోయినా మనం కన్వేసి పెట్టాలి ఓ టీచర్ కింద మీరు కన్నేసి పెడితే మీకు గమనిస్తే తెలుస్తుంది.
(27:46) ఇవన్నీ కూడా మనం స్టూడెంట్స్ చెప్పేటప్పుడు చాలా సున్నితంగా చెప్పాలి వాళ్ళ మనసు బాధపడకుండా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కూడా మిస్ అండర్స్టాండ్ అయిపోయి స్కోప్ వస్తుంది అన్నమాట ఎందుకు ఈవిడ ఊరికే మా అమ్మడ పడుతుంది ఇది చెప్తుంది నన్ను నేను అంటే ఎందుకు అంత ద్వేషం అనే సూచనలు కూడా వస్తాయి. ఇలా జరుగుతాయి.
(28:05) సో మనం అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇది మటుకు తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవ్వాలి తల్లిదండ్రులే మాక్సిమం రెస్పాన్సిబిలిటీ కానీ పిల్లలు ఏడుఎనిమిది గంటలు టీచర్ల దగ్గర ఉంట ఒక టీచర్ దగ్గర ఉండొచ్చు రకరకాల టీచర్ దగ్గర అంటే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దాన్ని కొట్టక్కర్లేదు తిట్టక్కలేదు జాగ్రత్తగా చెప్పడం తల్లిదండ్రుల పిలిచడం లే చెప్పడం ఇది ఎప్పటికప్పుడు మీరు తీసుకుంటూ ఉండాలి మిమ్మల్ని బ్యాడ్ టీచర్ అనుకున్నా కానీ అది చెప్తూ ఉండాలి ఇలా జరుగుతుంది అది ఎప్పుడు పడితే అప్పుడు వాడి మీద కంప్లైంట్ గా చేయలేరు ఎందుకంటే వాళ్ళు పాపం ఏ మనసుతో
(28:34) వాళ్ళ ఆ పనులు చేస్తున్నారు మనం గమనించుకొని అండర్స్టాండ్ అయి అప్పుడు చేయడం మంచిదని నా ఉద్దేశం. కానీ అందరికీ మగపిల్లలకి ఆడపిల్ల ఇద్దరికీ సమానంగా టీచ్ చేయవలసింది. ఏమమ్మా మీ ప్రశ్న సమాధానం బహుశా మీకు అర్థమై ఉంటుంది అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమైందా నేను ఉంటానండి. ఓం
No comments:
Post a Comment