Saturday, September 5, 2026

True Meaning of Desire | శృంగారం అంటే ఏమిటి? | శృంగారం పవిత్రమా లేక వినోదమా?

True Meaning of Desire | శృంగారం అంటే ఏమిటి? | శృంగారం పవిత్రమా లేక వినోదమా?

Author Name:Srungara Thapaswi

Youtube Channel Url:https://www.youtube.com/@SrungaraThapaswi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zwfudAcuozQ



Transcript:
(00:02) [సంగీతం] శృంగారం అనేది ఒక తపస్సు హార్మోన్ల ఫలితంగా శారీరక కోరికల నుండి ఉద్భవించిన భావోద్వేగాలను సంతృప్తి పరచుటకై వివాహితుల ప్రేమ కలాపాలకు ఇచ్చిన ఒక పవిత్ర కార్యరూపమే శృంగారం [సంగీతం] అది వారి ఆనందం కోసం జరగవచ్చు లేదా సంతానం కోసము జరగవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే సంతానోత్పత్తికై జరిగే దంపతుల కలయకే శృంగారం అనబడుతుంది.
(00:38) కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో శృంగారం యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. [సంగీతం] శృంగారాన్ని ఒక విలువైన కార్యంగా భావించడం అనేది చాలా చాలా అరుదైపోయింది. [సంగీతం] దీన్ని భూమిపై ఒక అద్భుత కార్యంగా ఏమాత్రం చూడటం లేదు. కేవలం [సంగీతం] మర్మాంగాలను తృప్తిపరిచే ఒక సాధనంగా దీన్ని పరిగణిస్తున్నారు. తమలోని కామవాంచని సాధించుకోవడానికి శారీరక సుఖాన్ని ఇచ్చే ఆట [సంగీతం] అని భ్రమించేవారుగా తయారవుతున్నారు.
(01:05) వివాహానంతరం దంపతుల మధ్య జరిగే రతిని మాత్రమే శృంగారం అంటాం. యువత వివాహానికి ముందు చేసే రతి అత్యంత మూర్ఖులు చేసే ఒక దురాచారమే. [సంగీతం] వివాహ పరిమితులలో మాత్రమే కామవాంచలను నెరవేర్చుకోవలసి ఉంటుంది. వ్యామోహం వల్ల జనించిన కోరికలకి ప్రేమ [సంగీతం] అంటూ లవ్ అంటూ పెడార్థాలను సూచించే పేర్లను ఆపాదించి విచ్చలవిడిగా పరాయి సంబంధాలను ఏర్పరచుకొని అదేదో గొప్ప పని చేస్తున్నామనే భావాలను సృష్టించుకొని [సంగీతం] వారి శారీరక సుఖాలను నెరవేర్చుకోవడం కోసం పవిత్రతను కోల్పోయి శృంగార గౌరవాన్ని భ్రష్టు పట్టించే నీచ బుద్ధి గల కామాందులుగా మార్పు చెందుతున్నారు. భార్యా
(01:40) భర్తల మధ్య ప్రేమానురాగాలు పెంచే కార్యంగా [సంగీతం] సంతానోత్పత్తికై జరిపే భగవత్ కార్యంగా శృంగారాన్ని భావించినప్పుడే సమాజంలో జరిగే ఎన్నో ఘోరాలను అదుపు చేయగలుగుతాం. లేకపోతే భవిష్యత్తరం అనే మాటే లేకుండా పోతుంది. [సంగీతం]

No comments:

Post a Comment