Saturday, September 5, 2026

😡పిల్లల్ని ఆస్తిగా భావిస్తున్నారా..! సిగ్గులేదా?

😡పిల్లల్ని ఆస్తిగా భావిస్తున్నారా..! సిగ్గులేదా?

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XUSKUf1FcPI



Transcript:
(00:00) ముగ్గురిని కంటే 30,000 ఇస్తా నలుగురిని కంటే 40,000 ఇస్తా భవిష్యత్తులో పిల్లల ఆస్తి పిల్లలు పుడితే భారం కాదు ఆదాయంగా మార్చేస్తామ అంటున్నారు. బాధ్యత కలిగిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఈ పిల్లల్ని పుట్టించడం అనేది ఏ విధంగా ఆశతో ఎవరికి ఆదాయమో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ భూమిలో సహజ వనరులు ఇంకిపోతున్నాయి.
(00:26) ఇప్పుడు నా జనాభాకే కనీసం తాగడానికి నీరు కూడా అందని పరిస్థితి పీల్చే గాలి కలుషితం అయిపోతుంది. చెట్లని నరికేసి కొండల్ని కొట్టేసి డెవలప్మెంట్ పేరుతో మొత్తం ప్రకృతినే ధ్వంసం చేసుకొని వెళ్ళిపోతుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే ఇలా ఉన్నప్పుడు ఇక్కడికి ఇంకో పాతికేళ్ళ తర్వాత అసలు మనుషులు బ్రతికే పరిస్థితి ఎంత భయంకరంగా మారబోతుందో కనీసం ఆలోచించారా? అంటే ఇప్పుడు పుట్టే పిల్లలు వాళ్ళ యుక్త వయసుక వచ్చేసరికి అసలు ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తదో కనీసం అవగాహన అయినా ఉందా మనం అసలు మనుషుల గురించి మాట్లాడుతున్నామా లేక ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రొడక్ట్స్ గురించి
(01:01) మాట్లాడుతున్నామా అసెట్ ఇన్కమ్ బడన్ ఇవన్నీ కూడా ఎకనామిక్స్ కి సంబంధించిన పదాలు. ఒక మనిషి ప్రాణాన్ని ఒక బిడ్డ భవిష్యత్తుని కేవలం ఆదాయం అనే ఒక ఎకనామిక్ మెట్రిక్ తో కొలవడం వెనక ఉన్న అసలైన సైకాలజీ ఏంటి? అసలు ఆస్తి అంటే ఏంటి మన అవసరాల కోసం మన కంఫర్ట్ కోసం మన సెక్యూరిటీ కోసం మనం వాడుకునే ఒక వస్తువు సో ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని భవిష్యత్తులో వీళ్లే మన ఆస్తి అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు రేపు పెద్దయక మనల్ని పోషిస్తారు టాక్స్లు కడతారు దేశ జీడిపి ని పెంచుతారు అని అంటే ఒక ప్రాణాన్ని ఈ భూమి మీదకి తీసుకొస్తుంది కేవలం మన స్వార్థం
(01:42) కోసమా వాళ్ళని ఒక ఇన్కమ్ జనరేటింగ్ మిషన్ గా చూడటమేనా మన వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇది అహంకారం కాదా అంటే మనం పిల్లలకు జన్మనిస్తున్నది వాళ్ళు ఈ అద్భుతమైన సృష్టిని ఆస్వాదించడానికి కాదు మన ముసలితనాన్ని కాపాడటానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా అన్నమాట ఇకపోతే మనం పిల్లల్ని ఆస్తి అంటున్నాం సరే మరి ఆస్తి అనుకుంటున్న ఆ పిల్లలకి మనం ఎలాంటి ప్రపంచాన్ని ఇస్తున్నాం వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రపంచంలో గ్రౌండ్ వాటర్ ని అత్యంత దారుణంగా తోడిస్తున్న దేశం మనదే చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీస్ ఆల్రెడీ డే జీరో సిచువేషన్స్ ని చూసాం.
(02:19) తెలియని వాళ్ళ కోసం డే జీరో అంటే భూమిలో ఉన్న నీరు పూర్తిగా అయిపోయి నీళ్ళ కోసం ట్యాంకర్ల వెనక కొట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడున్న జనాభాకే తాగడానికి కనీసం గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఉంటే రేపు పుట్టబోయే మీరు అనుకుంటున్న ఆ ఆస్తికి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన సిటీస్ లో సగానికి పైగా మనవే మనం పీల్చే గాలిలో కాలుష్యం ఎంత దారుణంగా పెరిగిందంటే అప్పుడే పుడుతున్న పిల్లల ఊపరితిత్తులు కూడా వాళ్ళు పెరగకముందే పాడైపోతున్నాయి.
(02:56) అంటే గాలిలో విషాన్ని నింపి వాళ్ళ ఆయుష్యును ముందే కోసేసి నువ్వు నా ఆస్తివి అని అనడం ఎంత దుర్మార్గం అసలు డెవలప్మెంట్ అనే ముసుగులో మనం ఏం చేస్తున్నాం కొండల్ని పిండి చేస్తున్నాం అడవుల్ని నరికేస్తున్నాం చెరువుల్ని కూడా వదలకుండా కబ్జా చేసి కాంక్రీట్ జంగిల్స్ ని కట్టేస్తున్నాం అసలు ఎవరి కోసం ఈ డెవలప్మెంట్ పేల్చడానికి కలుచితం కాని గాలి తాగడానికి స్వచ్ఛమైన నీరు ఎంటకి తట్టుకోవడానికి పచ్చని చెట్టుని కూడా నరికేస్తున్న ఈ కాంక్రీట్ నగరాల్లో కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే మనిషి బ్రతికేస్తాడా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇక్కడ నుండి పాతికేళ్ళ తర్వాత పరిస్థితిని
(03:34) ఊహించుకోండి. ఈరోజు మీకు పుట్టబోయే పిల్లలు పాతికేళ్ళ యుక్త వయసులోకి వచ్చేసరికి సంవత్సరం 2051 వస్తుంది. ఐపిసిసి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ లాంటి సైంటిఫిక్ ఆర్గనైజేషన్లు పదే పదే మొత్తుకుంటున్నాయి. భూమి రోజు రోజుకి వేడికిపోతుంది. 2050 నాటికి దేశవ్యాప్తంగా వేసవి కాలంలో టెంపరేచర్ లో 50°లు దాటిపోతాయి.
(03:58) బయట అడుగు పెడితే చర్మం కాలిపోయే పరిస్థితి వస్తది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా ఒక లగ్జరీ అయిపోద్ది అని. అలాంటి భయంకరమైన సిచువేషన్ లో మీ పిల్లడు ఉదయం లేచి ఒక గ్లాసు మంచి నీళ్ల కోసం కాస్త స్వచ్ఛమైన గాలి కోసం ఎండ వేడికి చనిపోకుండా ఉండటం కోసం ప్రాణ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు సంపాదించిచ్చిన 15వ అంతస్తులోని ఫ్లాట్ బ్యాంకులో ఉన్న కోటి రూపాయలు ఆస్తి మీ అబ్బాయిని గాని మీ అమ్మాయిని గాని బ్రతికిస్తాయా వాళ్ళక మనం ఇస్తున్నది జీవితమా లేక జీవితం పేరుతో ఒక నరకమా అసలు మనం మన స్వార్థం కోసం ఇంత క్రూరంగా ఎందుకు ఎందుకు మారిపోతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా?
(04:38) సమస్య ఏంటంటే మనం రియాలిటీని ఉన్నది ఉన్నట్టుగా యక్సెప్ట్ చేయడానికి భయపడుతున్నాం. పిల్లలు దేవుడి ఇచ్చిన వరం వాళ్ళు మన ఆస్తి లాంటి ఎమోషనల్ కవరింగ్స్ వేసుకొని అసలు ప్రాబ్లం ని పక్కదారి పట్టిస్తున్నాం. ప్రేమ కలిగి ఉండటం అంటే ఇప్పుడు ఒక కొత్త ప్రాణాన్ని సృష్టించడం కాదు ఆల్రెడీ పుట్టి ఉన్న ప్రాణులకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం.
(05:03) మీకు నిజంగా పిల్లల మీద అంత ప్రేమ ఉంటే ముందు వాళ్ళు బ్రతకడానికి ఒక అందమైన సారవంతమైన భూమినైతే మిగల్చాలి కదా ప్రకృతిని సర్వనాశనం చేసేసి గాలిని నీటిని కలుషిందం చేసేసి కేవలం మీ ముసలితనంలో మీకు ఒక తోడుండడానికి లేదా దేశ ఆర్థిక వ్యవస్థను నడపడానికి వాళ్ళని కనడం అసలు ఇలా ఆలోచించడానికైనా మీకు అసలు ఏ మాత్రం క్రూరంగా అనిపించట్లేదా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట రాజకీయంగా ఎకనామికల్ గా కరెక్ట్ కావచ్చు ఎందుకంటే అంటే దేశానికి హ్యూమన్ రిసోర్స్ అవసరం ఉంది కానీ ఒక మనిషిగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆలోచించండి.
(05:40) ఒక నిస్సహాయమైన జీవిని ఎటు పోతుందో తెలియని ఒక వినాశకరమైన భవిష్యత్తులోకి కేవలం మన దేశ జీడిపి కోసం లాకురావడం న్యాయమేనా పిల్లలు ఆస్తి కాదు ఆదాయం అంతకంటే కాదు వాళ్ళు ఊపిరి పిలుస్తున్న ప్రాణాలు వాళ్ళకంటూ ఒక ఇండివిడ్యువల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. అలాంటి ప్రాణాల్ని పట్టుకొని మన బ్యాలెన్స్ షీట్ లో ఒక నెంబర్ గా చూడటం కరెక్టేనా చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే రేపటి తరానికి మనం ఇవ్వాల్సిన నిజమైన ఆస్తి కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కాదు తాగడానికి గుక్కెడు స్వచ్ఛమైన నీళ్లు కోట్ల విలువ చేసే స్థలాలు కాదు పేల్చడానికి [గొంతు సవరించుకోవడం]
(06:16) స్వచ్ఛమైన గాలి డెవలప్మెంట్ అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టామ అనేది కాదు ఎన్ని చెట్లు బ్రతికించామ అన్నదే అసలైన డెవలప్మెంట్ అవునా కాదా అవునా

No comments:

Post a Comment