*గత స్మృతులు (1955_1975 మధ్య పుట్టిన వాళ్ళు పాత తరం కొత్త తరం రెండింటినీ చూస్తున్న.....)*
*నాకు హిమాలయాలు ఎక్కాలని లేదు. స్వర్గానికి దారులు వెతకాలనీ లేదు. అంతరిక్షంలో అడుగు పెట్టాలనీ లేదు.*
*ఒక్కసారి మా ఊరెళ్ళి వద్దామని ఉంది. అప్పటి లాగానే ఉండాలి. ఆ చిన్నతనమే మళ్ళీ గడపాలి.*
*ఆ చల్లని గాలిలో మత్తు, ఆ ప్రకృతి ముద్దు ముద్దు. ఆ మట్టి వాసన ఎంత హాయిగా ఉండేదో. దారిలో పలకరింపులు ఎంత సరదాగా ఉండేవో. పాడైపోయిన టైర్లు, తిని వదిలేసిన తాటి కాయలు కూడా ఆట వస్తువులే.*
*అమ్మా వాళ్ళు ఇంట్లో ఉపయోగించే వస్తువులు జ్ఞాపకం వస్తూ వుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పొయ్యి వెలిగాంచాలంటే రెండు బండరాళ్లు చాలు. పోపు దంపుడు, పిండి రుబ్బడం, సానపెట్టడం, బియ్యం నూరడం....ఇలా ఏం చేయాలి అన్నా బండలతో చేసిన పరికరాలు చాలు. ఒక పొత్రం కూడా బండరాయే. నాపరాళ్ళ వసారా, పేడతో అలికిన వాకిలి.*
*అన్ని బండల మధ్య, ఆ మంటల వేడిలో కూడా ఎంత ప్రేమగా ఉండేవారో. అలసట తెలిసేది కాదు.*
*ఇది కదా స్వర్గసీమ.*💕🙏
No comments:
Post a Comment