Tuesday, December 16, 2025

'సర్.. ఈ మధ్య వచ్చిన ఒక సాంగ్ అప్రయత్నంగా నేను హమ్ చేస్తున్నాను. వదిలేద్దామని ప్రయత్నిస్తున్నాను. కానీ వదలలేక పోతున్నాను. అది ఏ సాంగ్ అని మాత్రం నన్ను అడగవద్దు.'
'ఎందుకు వదిలేయాలని అనుకుంటున్నావు.?' 'మీకు ఎలా చెప్పను? అటువంటి సాంగ్ వింటున్నందుకు నన్ను తప్పుగా అనుకుంటారేమో..!!' 'ఒక సాంగ్ వినడాన్ని బట్టి వ్యక్తిని తప్పుగా కానీ, ఒప్పుగా కానీ భావించే స్థితిలో ఏ సైకాలజిస్ట్ ఉండరు. నేనయితే అలా అనుకోను.' 'అదొక ఐటెం సాంగ్. అది వింటున్నాను అంటే నాకు గిల్ట్ గా ఉంది.' 'ఒక పాటను విన్నా లేదా పాడినంత మాత్రాన వారి భావజాలం అదే అని అర్థం కాదు. అలా అనుకుంటే నేను ఎన్నో రామదాసు, అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలను పాడుకుంటూ ఉంటాను. అంత మాత్రాన నేను దేవుడిని నమ్ముతున్నానని కాదు కదా..' 'అయితే ఆ పాటలో తప్పు లేదంటారా?' 'ఆ పాట ఏంటో తెలియకుండా నా అభిప్రాయాన్ని నేను ఎలా చెప్పగలను?' 'అదే.. రీసెంట్ గా వచ్చిన సమంతా సాంగ్.' 'అది నేను కూడా ఈ రోజు మధ్యాహ్నం యూట్యూబ్ లో విన్నాను.' 'మీరు కూడా అటువంటి పాటలు వింటారా?' 'అప్పుడే కంక్లూషన్ కు జంప్ చెయ్యవద్దు. పాటలు వినడాన్ని బట్టి వ్యక్తిత్వం అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ లో అందరూ కామెంట్ చేస్తుంటే ఆ లిరిక్స్ ఏంటి అని తెలుసుకోడానికి విన్నాను.' 'లిరిక్స్ లో చెప్పింది కరెక్టే నా సర్..' 'ఒక విషయంపైన నా విశ్లేషణ అందించేటపుడు సాధ్యమైనంత వరకూ మిస్-కమ్యూనికేట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఒక సైకాలజిస్టుగా నా మీద ఉంటుంది.' 'అవును. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.' 'మొదట నేను చూసిన ఆఖరి సినిమా 1998లో. ఆ తరువాత ప్రత్యేక అవసరాల కోసం ఎప్పుడయినా సినిమాలోని భాగాలను చూడడం తప్ప పూర్తి సినిమాను వినోదం కోసం చూడడం జరగలేదు.' 'మీరు సినిమాలు ఎందుకు చూడరు?' 'సినిమాలలో సన్నివేశాలు చాలా వాస్తవ విరుద్ధంగా ఉంటాయి. సినిమాలలో లాంటి ప్రేమలు, పగలు, హీరోలు, విలన్లు నిజజీవితంలో ఉండరు. వాటిని నేను ఆనందించ లేను.' 'కొన్ని సినిమాలు చాలా వాస్తవంగా ఉంటాయి కదా..' 'సాధారణ ప్రేక్షకులకు వాస్తవంగా అనిపించ వచ్చు. కానీ నాకు అలా అనిపించవు. సినిమా యాక్టర్ల కళ్లజోడులలో కెమెరాలు, లైట్లు, డైరెక్టర్ల సైగలు కనిపించడం. యాక్టర్ల బాడీ లాంగ్వేజిలో అసహజత్వం తొణకిసలాడడం వంటివి నన్ను సినిమాను ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తుంటాయి.' 'ఒకే..' 'బాహుబలి సినిమాలో ప్రభాస్ అట్ట శివలింగాన్ని అంత కష్టపడి ఎత్తుతుంటే సాధారణ ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుస్తాయి కావచ్చు. కానీ నాకు అందులో అసహజత్వం కనిపిస్తుంది.' 'మీరు టాపిక్ వదిలి ఎక్కడికో వెళ్లిపోతున్నారు. పాట గురించి చెప్పండి సర్..' 'చెబుతున్నాను. సినిమాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం కేవలం వ్యాపారం. వినోదాన్ని పంచి డబ్బు సంపాదించడం మాత్రమే. దాని కోసం ఆ సినిమాలు చట్ట పరిధిలో ఏదయినా చూపిస్తారు. అదే సమయంలో ఒక సినిమా బలమైన మీడియా కూడా. ప్రజల ఆటిట్యూడ్ ని ప్రభావితం చేయగల శక్తి సినిమాకు ఉంది. అమెరికా వంటి అగ్ర రాజ్యాలు త్వరలో తాము యుద్ధం చెయ్యబోతున్న దేశాలను శత్రువులుగా చూపుతూ సినిమాల ద్వారా అక్కడి ప్రజల మనసులలో బీజాలు నాటుతారు. తద్వారా ఆ యుద్ధం పైన ప్రజలలో వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు.' 'అవునా' 'అందులో చూపించే ప్రతీ సీన్ కూడా వీక్షకులను భావోద్వేగాలకు గురిచేసి తమను తాము మర్చిపోయేలాగ చెయ్యడమే. ఒక రకంగా వీక్షకుల మనసులతో ఆడుకోవడం వంటిది. ప్రేక్షకుడిని సినిమా హాలుకు తీసుకు రావడం కోసం కొన్నిసార్లు ఈ ఆడుకోవడం సినిమా దాటి బయటకు వస్తుంది. అది పబ్లిసిటీ రూపంలో కావచ్చు లేదా వివాదాల రూపంలో కావచ్చు. రాంగోపాల్ వర్మ తన సినిమాలను ప్రమోట్ చేసుకునే విధానం చూస్తే అర్థమవుతుంది.' 'సాంగ్ లిరిక్స్ లో చెప్పింది నిజమే కదా సర్..?' 'ఒక విషయాన్నీ పార్టు పార్టులుగా చూస్తే అర్థం కాదు. మొత్తంగా చూడాలి. లిరిక్స్ లో మగవాళ్ళు సెక్స్ కోసం స్త్రీ వెంటపడతారని చెప్పబడింది. మగవాళ్ళు సెక్స్ కోసం స్త్రీని, స్త్రీ పురుషుడిని కోరుకోవడం నేచర్. ఇందులో మంచివారు, చెడ్డవారు, గొప్పవారు, హీనమైన వారు అనే తేడా ఉండదు. ప్రకృతి అందరికీ ఒకే విధంగా ఉంటుంది.' 'అదే పాటలో చెప్పారు కదా..' 'కాదు. పాటలో చెప్పింది వేరు. మగవారందరూ స్త్రీని కేవలం సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చూస్తారు అని చెప్పారు. స్త్రీని కేవలం సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చూడడానికి, స్త్రీతో సెక్స్ కోరుకోవడానికి చాల తేడా ఉంది.' 'రెండిటి మధ్య తేడా ఏంటి?' 'సెక్స్ కోసం స్త్రీ పురుషులు ఒకరినొకరు కోరుకోవడం సహజం. ఇది ప్రకృతి ధర్మం. ఇక్కడ ఇరువురు కూడా అవతలి వ్యక్తి అంగీకారంతో మాత్రమే సెక్స్ లో పాల్గొంటారు. ఇక్కడ పురుషుడు తనతో సెక్స్ లో పాల్గొన్న స్త్రీని గౌరవిస్తాడు. తనను సాటి మనిషిగా ట్రీట్ చేస్తాడు.' 'మరి సెక్సువల్ ఆబ్జెక్ట్ గా ట్రీట్ చెయ్యడమంటే..?' 'ఇక్కడ పురుషుడికి స్త్రీ పట్ల గౌరవం ఉండదు. స్త్రీని కోవాలం సెక్స్ కోసం వాడుకుంటాడు. దాని కోసం ఆమె మనసుని నేరుగా కాకుండా ఇతర మార్గాలలో ప్రభావితం చేస్తాడు.' 'అంటే?' 'ఆమెను ఎక్సప్లోయిట్ చెయ్యడం, ప్రేమ పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బుని ఎరగా చూపడం, అధికారాన్ని వినియోగించి లొంగ తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.' 'ఒకే' 'స్త్రీని సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చూడడం కల్చర్ నుండి వచ్చింది. పురుషాధిక్య భావజాలం దీనిని కారణం. ఈ భావజాలం కేవలం పురుషులలో మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. స్త్రీలలో కూడా తెలియకుండా ఉంటుంది.' 'స్త్రీలలో ఉండడం ఏంటి?' 'చాలా మంది స్త్రీలు కూడా పురుషుడు అధికుడు, అతనికి సెక్స్ అందించడమే స్త్రీ యొక్క ప్రధాన బాధ్యత అని విశ్వసిస్తారు. ఈ సాంగ్ కూడా అదే చెబుతుంది.' 'అలా ఎక్కడ ఉంది సర్? ఈ పాట పురుషుల వంకర బుద్దిని ఎండకట్టింది కదా??' 'కేవలం లిరిక్స్ చూస్తే అలా అనిపిస్తుంది. ఈ పాట రాయడం, తీయడంలో ప్రధమ పాత్ర పురుషులదే. కేవలం పాడిన గొంతు, నటించిన శరీరం మాత్రమే స్త్రీది.' 'అవును.' 'ఈ పాట మగవారు, మగవారి కోసం తీయబడింది.' 'అది ఎలా సర్?' 'ఐటెం సాంగ్ యొక్క ఉద్దేశ్యమే పురుషుడిని సెక్సువల్ గా రెచ్చ కొట్టడం. ఆ విషయం తీసేవారికి, నటించేవారికి, చూసేవారికి తెలుసు. ఒక రకంగా పోర్న్ మూవీ చేసే పని మాత్రమే ఇది చేస్తుంది.' 'మరీ అంత హీనమా..?' 'మనకు కల్చరల్ గా అలవాటు అయిపోవడం వలన హీనంగా అనిపించక పోవచ్చు. ఇంకా చెప్పాలంటే పోర్న్ లో స్త్రీ తన సహచరుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఐటెం సాంగులో అది కూడా ఉండదు. కేవలం నేనొక సెక్సువల్ ఆబ్జెక్ట్ ని మాత్రమే. నువ్వు డబ్బుగాని, నగలుగాని, మరేదయినా నా మోహన కొట్టి నన్ను అనుభవించ వచ్చు అనే అర్థం ఐటెం సాంగ్స్ లో ధ్వనిస్తుంది.' 'ఈ పాటలో అలా లేదు కదా సర్..' 'ఈ పాట లిరిక్స్ లో ఆ అమ్మాయి పురుషుడి బుద్ధే వంకర అని చెబుతుంది. కానీ అది ఏ సందర్భంలో చెబుతుంది? నువ్వు అంత హీనమైన వాడివి కాబట్టి నా వద్దకు రావద్దు అని హెచ్చరించడం లేదు. నువ్వు అంత హీనమైన వాడివయినా నేను నువ్వు పడేసే డబ్బు కోసమో మరో దాని కోసమే లొంగిపోతాను అని చెబుతుంది.' 'అలా అని ఆమె చెప్పలేదు కదా సర్. ఆమె చెప్పకుండానే ఆమెకు ఉద్దేశ్యాలు ఎలా ఆపాదిస్తారు.' 'ఐటెం సాంగ్ యొక్క ఉద్దేశ్యం అదే. అది కాదు సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి లేదా స్త్రీ స్వేచ్ఛ, సాధికారిత కోసం అని నమ్మితే నేను ఏమీ చెప్పలేను. ఆ అమ్మాయి అందుకే శరీరాన్ని ఎక్సపోజ్ చేస్తుంది. ఆ భంగిమలు డాన్స్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ అమ్మాయి అంటే నా ఉద్దేశ్యంలో క్యారెక్టర్ మాత్రమే. ఆ నటిని వ్యక్తిగతంగా అనడం లేదు.' 'సినిమాలో ఏ సందర్భంలో తీశారో తెలియదు కదా..' 'తెలియదు కానీ. ఇప్పటి వరకు మనకు లభించిన సమాచారం మేరకు ఆ క్యారెక్టర్ పురుషుడిని వ్యతిరేక పదాలతో రెచ్చగొట్టి తనవైపు ఆకర్షితుడిని చేసుకోవడానికి చేసే ప్రయత్నంలాగ అనిపిస్తుంది.' 'ఫైనల్ గా ఏమంటారు?' 'ఈ సాంగ్ పురుషుడు స్త్రీని అంగడి వస్తువులాగా చూపుతూ పురుషుడిని సెక్సువల్ గా రెచ్చగొట్టడం కోసం తీసినది. ఇది కేవలం స్త్రీ వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చేదిగా ఉంది. పురుషుడి బుద్ధి హీనమైనదని చెబుతూనే అయినప్పటికీ నీకు నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అతనిని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తీయబడిందని మాత్రం చెప్పగలను.' 'పూర్తిగా అర్థమయ్యిందని చెప్పలేను గాని, నా బుర్ర మాత్రం వేడెక్కింది సర్..' #HariRaghav 14.12.2021




Source link - https://m.youtube.com/post/Ugkx-bcKvhvuafV2NzwYbsuy2NqAvvQHVK84

No comments:

Post a Comment