GEN Z Showoff Culture Exposed | Kranthi Vlogger
https://youtu.be/DzXwtaGE6IA?si=L7OAQ7LEjX4qlc3G
https://www.youtube.com/watch?v=DzXwtaGE6IA
Transcript:
(00:05) హే గాయస్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన సొంత చేతులతోని క్రియేట్ చేసిన ఒక వైరస్ గురించి మాట్లాడుకుందాం. ఇది కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదకరం. దీని పేరు షో ఆఫ్ వైరస్. ఈ వైరస్ మనుషుల్లోకి దూరి మన విలువల్ని మార్చేస్తుంది. ఈరోజు మన దగ్గర ఏముంది అనేది ముఖ్యం కాదు. మనం లోకానికి ఏం చూపిస్తున్నాం అనేది ప్రధానం అయిపోయింది.
(00:26) ఒకప్పుడు మనిషికి విలువ ఉండేది. తర్వాత డబ్బుకి విలువ వచ్చింది కానీ ఇప్పుడు కేవలం బ్రాండ్స్ కి మాత్రమే విలువ మిగిలింది. చేతిలో ఐఫోన్ సూపర్ బైక్ ఉంటే ప్రతివాడు వాడికి వాడే తోపు అనుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. బట్ ఈ ఆలోచన ఎంతమంది జీవితాల్ని భగ్నం చేస్తుందో మీకు తెలుసా? ఈ వీడియోలో చూపించబోయే ఆరు ఇన్సిడెంట్స్ గురించి గనుక మీరు వింటే ఒకటే అంటారు.
(00:48) ఎవడబ్బా స్వామి ఇది? ఏ తమాతున్నారు మీరు కేస్ నెంబర్ వన్ బంగారు కొడుకు ఆగస్టు 2 2024 ఢిల్లీ ఒక తల్లి మధ్యాహ్నంమూడు గంటలకి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో ఆవిడ బంగారం మిస్ అయింది. ఎవడో దొంగనా కొడుకు దొంగతనం చేశాడు అనుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అందులో రెండు బంగారు గొలుసులు, ఒక ఉంగరం మరియు రెండు జతల చెవి కమ్మలు కూడా ఉన్నాయంట.
(01:12) ఆ దొంగనా కొడుకు నా కొడుకే అని ఏ తల్లికి డౌట్ వస్తుంది చెప్పండి. పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ మొత్తం చూశారు అంతా బానే ఉంది. ఎవరు లేరు ఇంటి పక్కన వాళ్ళని అడిగారు వాళ్ళు కూడా ఏం చూడలేదు అని చెప్పారు. పోలీసులక ఎందుకో ఇది ఇంట్లో వాళ్ళ పనే అని డౌట్ వచ్చింది. సో ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంక్వైరీ చేశారు దొంగతనం తర్వాత ముద్దుల కొడుకు కనపడకుండా పోయాడని పోలీసులకు అర్థమయింది.
(01:33) వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి మనోడి గురించి అడిగారన్నమాట. అప్పుడు పోలీసులకి షాకింగ్ విషయం చెప్పారు. బంగారు కొడుకు పెద్ద మనసు చేసుకొని జస్ట్ 50వేల రూపాయలు పెట్టి తన గర్ల్ ఫ్రెండ్ కోసం చిన్న ఐఫోన్ కొన్నాడంట. ఆరు రోజుల పాటు పోలీసులు దారంపుర కర్కోల ఇలా అన్ని ప్రదేశాలు గాలిచ్చి ఆగస్టుఆ సాయంత్రం 6గంట 15న తన ఇంటికి వస్తున్న బంగారు కొడుకుని పట్టుకున్నారు.
(01:59) అతనికి తన తండ్రి జబ్బుతో మరణించిన తర్వాత నుంచి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోయిందంట. తన క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయితో ప్రేమ కాని ప్రేమలో పడ్డాడు గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రోజు తన ఇంప్రెస్ చేయడానికి తల్లిని డబ్బులు అడిగాడు. చెప్పు తెగిద్ది అంటే ఫీల్ అవుతాడని మన ఫైనాన్షియల్ పొజిషన్ బాలేదు నాన్న నేను ఇవ్వలేను ఇవన్నీ కాదు ఫస్ట్ బాగా చదువుకో అని చెప్పింది.
(02:19) మరి ఈ రోజుల్లో పిల్లలకి కోపం ఎక్కువ ఆలోచన తక్కువ కదా ఆ కోపంలోనే తల్లి బంగారం దొంగతనం చేశాడు. ఆ బంగారం ఒకే షాప్ లో అమ్మకుండా రెండు షాప్స్ లో అమ్మేసాడు అన్నమాట. పాపం వీడి వల్ల ఆ గోల్డ్ షాప్ ఓనర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. గోల్డ్ మాత్రం రికవర్ చేశారు. ఆ పిల్లోడికి బ్రాండెడ్ ఫోన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది స్కూల్లో పిల్లల మధ్య నీ దగ్గరే ఉంది అనే పోటీ ఎంత తీవ్రంగా అయిపోయి ఉంటుంది తండ్రి చనిపోయిన తర్వాత ఆ తల్లి ఆ బంగారంతో ఏం చేయాలనుకుందో బహుశా తన కొడుకు హైర్ ఎడ్యుకేషన్ కోసం లేదా ఫ్యూచర్ లో అర్జెంట్ నీడ్స్ కోసం అయి ఉంటుంది. కానీ ఆమె కొడుకు ఒక బర్త్డే
(02:53) గిఫ్ట్ కోసం దాన్ని నమ్మేసాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 సర్వే ప్రకారం 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతలో 62% మంది తమ సోషల్ ప్రెజర్ కింద ఉన్నారు అని భావిస్తున్నారు. ఇందులో 45% పీర్ ప్రెజర్ కారణంగా తమ సామర్థ్యానికి మించిన వస్తువులని కోటున్నారు. కేస్ నెంబర్ టూ emఐ మర్డర్ ఫిబ్రవరి 7 2023 కర్ణాటక హసన్ లోని ఒక ఇంట్లో 20 సంవత్సరాల హేమంత్ దత్త fl్ipకార్ట్ నుంచి 42,000 విలువైన సెకండ్ హ్యాండ్ ఐఫ 14 ఆర్డర్ చేశడఅన్నమాట డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ ఫోన్ తీసుకొచ్చాడు కన్ఫ్యూజ్ అవ్వద్దు.
(03:31) ఆ డెలివరీ పెట్టినోడు హేమంత్ దత్త డెలివరీ తీసుకొచ్చిన అతను హేమంత్ నాయక్ అన్నమాట. సో హేమంత్ దగ్గర మొత్తం డబ్బులు లేదు అతను ఒక స్మాల్ ఎంప్లాయి నెలజీతం ఒక 18000 వస్తది ఆ ఈఎంఐలు ఎలా తీర్చాలనే భయం అతన్ని పూర్తిగా కదిలించింది అన్నమాట డెలివరీ బాయ్ కి టీ ఇవ్వాలని చెప్పి లోపలికి రమ్మన్నాడు అబ్బా ఎంత మంచోడు అనుకొని డెలివరీ బాయ్ లోపలికి వెళ్ళాడఅన్నమాట బట్ హేమంత్ వెనక నుంచి వచ్చి కత్తితో పొడిచేసాడు.
(03:56) డెలివరీ బాయ్ స్పాట్ డెడ్ ఇక్కడ విషయం ఏంటంటే హేమంత్ ఈఎంఐ నుంచి తప్పించుకోవాలని ఆ హత్యకు పాల్పడ్డాడు. శవాన్ని మూడు రోజులు ఇంట్లోనే దాచిపెట్టాడు. మూడో రోజు డెలివరీ బై కుటుంబం మిస్సింగ్ కేస్ నమోదు చేయడంతో పోలీసులు వచ్చారన్నమాట. అఫ్కోర్స్ దొరికిపోయాడు. హేమంత్ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్ లు ఉండటంతో తనకి కూడా ఐఫోన్ ఉండాలని భ్రమలోకి వెళ్ళిపోయి ఫోన్ ఆర్డర్ చేశాడు.
(04:20) కానీ ఆ ఫోన్ కొన్న తర్వాత నెలకి ₹4000 రూపాయలు ఈఎంఐ కట్టాలి అని గ్రహించాడు. అతని జీతంలో సగానికి పైగా పోతుంది. ఈ భయం ఈ ఆందోళన అతన్ని హంతకుడిని చేస్తుంది. కోర్ట్లో అతను ఏం చెప్పాడో తెలుసా నాకు తెలిీదు సార్ నేను ఏం చేస్తున్నానో ఆ భయం నన్ను పిచ్చోడిని చేస్తుంది అని చెప్పాడు. సీ ఒక ఫోన్ కోసం మర్డర్ చేశాడంటే వాడు ఏ రేంజ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకొని ఉంటాడు.
(04:40) అసలు ఈఎంఐ అంటే ఏంటో వాడికి నిజంగా తెలుసా 24 36% వడ్డీ రేట్లు అంటే ఏంటో అర్థం చేసుకున్నాడా లేదు అతనికి తెలిసింది ఒక్కటే నా ఫ్రెండ్స్ దగ్గర ఐఫ ఉంది నాకు లేదు నేను తక్కువగా ఉన్నాను. సోషల్ మీడియా మనకు ఒక ఫేక్ రియాలిటీని చూపిస్తుంది. ప్రతి ఒక్కరు ఐఫోన్లు తీసుకుంటున్నారు లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనుకుంటాం.
(05:03) కానీ ఆ వెనకున్న ఈఎంఐలు లోన్లు టెన్షన్లు మనకు కనిపించవు. 2023 లో రిలీజ్ అయిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇండియాలో అమ్ముడవుతున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లో 68% ఈఎంఐ లేదా లోన్ ఆధారంగా కొంటున్నారు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఉన్న యూత్ లో ఒక స్మార్ట్ ఫోన్ మీద యవరేజ్ ఈఎంఐ 3,500 నుంచి 4,500 స్పెండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ మంత్లీ ఇన్కమ్ లో 20 టు 25% కేస్ నెంబర్ 3 క్యాష్ ఆన్ డెలివరీ మండర్ సెప్టెంబర్ 23 2024 లక్నవ గజనాన్ మరియు ఆకాష్ అనే ఇద్దరు యువకులు fl్ipకార్ట్ లో150వ000 రూపాయల విలువైన ఐఫ ని ఆర్డర్ చేశారన్నమాట ఈసారి క్యాష్ ఆన్ డెలివరీ బట్ వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు
(05:43) కానీ ఆ ఫోన్ మాత్రం కావాలి. సెప్టెంబర్ 25 డెలివరీ బాయ్ భరత్ సాహు ఫోన్ తీసుకొచ్చాడు. గజ్వాన్ మరియు ఆకాష్ భరత్ ని లోపలికి రమ్మన్నారు. చిన్నగా మాటలు కలిపి అతన్ని సోఫాలో కూర్చోబెట్టారు. సడన్ గా గజనాని వెనక నుంచి వచ్చి లాప్టాప్ చార్జర్ తో గొంతు బిగించేసాడు అన్నమాట. ఆకాష్ ఏమో కాళ్ళు పట్టుకొని ఉన్నాడు. జస్ట్ వన్ మినిట్ లో భరత్ ప్రాణాలు కోల్పోయాడు.
(06:05) ఇంకా దారుణం ఏంటో తెలుసా ఆ డెలివరీ బాయ్లు బ్యాగ్ తీసుకొని వస్తారు కదా సో ఆ డెలివరీ బాయ్ బ్యాగ్ లోనే సెవాని ఆ ఫ్లిప్కార్ట్ బ్యాగ్ లోని పెట్టేసి ఇంద్రా కాలనీలో పడేశరన్నమాట భరత్ సాహు తన తల్లికి ఒక్కడి కొడుకు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయింది. జస్ట్ టూ డేస్ లో పోలీసులు కేస ని సాల్వ్ చేశారు. ఇద్దరు యువకులు కూడా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే వారికి ఫోన్ కావాలి కానీ డబ్బు లేదు బట్ వాళ్ళ మనసులో రెండు భావాలు పోరాడుతున్నాయి.
(06:31) ఫోన్ కావాలి బట్ డబ్బు లేదు. ఈ పోరాటంలో వాళ్ళ మానవత్వం ఓడిపోయింది. జస్ట్ ఒక వస్తువు కోసం ఒక మనిషి ప్రాణం తీయడం వారికి సులభం అనిపించింది. అసలు ప్రెసెంట్ యూత్ ఎటు పోతున్నారు. ఒక ఫోన్ బాక్స్ ఎంత బరువు ఉంటుంది? 500 g లేదా ఒక కేజీ కానీ భరత్ సాహు తల్లి కళ్ళల్లో ఆ బాక్స్ బరువు ఎంతో ఆమెకి తన కొడుకు సెవెన్ దొరికినప్పుడు ఆ బాక్స్ ఎన్ని టన్నుల బరువు అనిపించిందో.
(06:54) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి 2024 డేటా ప్రకారం ఆస్తి కారణంగా జరిగిన హత్యల్లో 18% లగ్జరీ వస్తువులు బ్రాండెడ్ ఐటమ్స్ కారణంగా జరుగుతున్నాయంట. ఇది 2020 నుంచి 9% కు పెరిగింది. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ వారిలో ఈ నేరాలు 40% పెరిగాయి. కేస్ నెంబర్ ఫోర్ పూలకొట్టు కొడుకు పెట్టు ఆగస్టు 2024 తమిళనాడులో ఒక చిన్న పట్టణంలో పూలంబే తల్లి ఉందన్నమాట.
(07:23) ఆమె రోజుక ఒక 300 నుంచి 400 సంపాదిస్తుంది ఆమెక ఒక కొడుకు ఉన్నాడు. ఏజ్ ఒక 19 నుంచి 20 ఇయర్స్ ఉంటాయి అతనికి కూడా ఐఫోన్ కావాలి. ఇదేంట్రా ఏం చేస్తావ్ అగైన్ అతని ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది కానీ అతని దగ్గర లేదు సో మీరు గెస్ చేసిందే తల్లిని డబ్బులు అడిగాడు తల్లి డబ్బులు ఇవ్వకపోతే హంగర్ స్ట్రైక్ చేస్తా అన్నాడు. బెదిరిచ్చాడు అన్నట్లుగానే మూడు రోజుల పాటు ఏమి తినలేదు కొడుకు చదువు కోసం తల్లి ఒక చిన్న పెట్టులో డబ్బు దాచిపెట్టింది.
(07:49) ఆ పెట్టులో 74వే రూపాయలు ఉన్నాయి. ఆమె తన లైఫ్ లో ఎప్పుడ అంత డబ్బు చూడలేదు. కష్టపడి సంపాదించి కూడ పెట్టిన డబ్బు అది కానీ మూడో రోజు కొడుకు బలహీన పడిపోయాడు. తల్లి గుండె విరిగిపోయింది. ఆమె పెట్టులో మొత్తం డబ్బులు తీసుకొని మొబైల్ షాప్ కి వెళ్లి ఐఫోన్ గురించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయింది 2 మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయి చాలా మంది కామెంట్స్ లో కొడుకుని విమర్శించారు.
(08:12) ఏం పిల్లాడు వీడు సిగ్గు లేదా తల్లి కష్టం అర్థం చేసుకోలేదు ఇలా వేలది కామెంట్స్ వచ్చాయి అన్నమాట. కానీ తల్లి ఒక పోస్ట్ లో ఏం చెప్పిందో తెలుసా దయచేసి నా కొడుకుని విమర్శించకండి అతను ఒక పిల్లాడు సొసైటీ వాళ్ళని ఇలా తయారు చేసింది అని చెప్పింది. ఆ తల్లి బాధ ఎవరికీ తెలుసు ఆమె రోజు పూలు అమ్మటం రూపాయి రూపాయి కూడబెట్టడం ఇదంతా కొడుకు భవిష్యత్తు కోసం కానీ ఆ భవిష్యత్తు ఎప్పుడు ఒక్క ఫోన్ లో మారిపోయింది.
(08:36) సోషల్ మీడియా ఈ కొడుకుని విమర్శిస్తుంది కానీ అతన్ని అలా తయారు చేసింది ఈ సొసైటీనే మనం ప్రతిరోజు లగ్జరీ బ్రాండెడ్స్ షో ఆఫ్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. బట్ పిల్లలు అలా చేస్తే వారిని దూషిస్తున్నాం. ఇండియన్ సైకాలజీ అసోసియేషన్ 2024 సర్వే ప్రకారం 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల బాయ్స్ లో 58% మంది తమ తల్లిదండ్రులని వారి స్తోమతికి మించిన వస్తువులు కొనమని ఒత్తిడి చేస్తున్నారంట.
(09:02) ఇందులో 30% ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటే కొనివకపోతే ఏడవటం తిండి మారేయటం ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం చేయి కోసుకోవటం ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కేస్ నెంబర్ ఫైవ్ నాన్న నా కొడుకు ఒక స్పోర్ట్స్ బైక్ 2023 అక్టోబర్ విజయవాడలో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు తన 20 సంవత్సరాల కొడుకు కోసం 2.5 లాక్స్ పెట్టి స్పోర్ట్స్ బైక్ కొందామని వేరే వాళ్ళ దగ్గర అప్పు చేశాడు.
(09:23) ఎందుకంటే కొడుకు కాలేజీలో ఫ్రెండ్స్ అందరికీ బైక్లు ఉన్నాయి. వీడికి వెళ్లేదు. సో నాకు బైక్ కొనివ్వు లేకపోతే చచ్చిపోతా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగాడు. వాళ్ళ నాన్న ప్రెజర్ తట్టుకోలేక అప్పు చేసి మరి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు. బైక్ చేతికి రాగానే బైపాస్ ఎక్కాడు. బైక్ కొన్న బూడో రోజు ఫ్రెండ్స్ తో రైడింగ్ అని బైపాస్ రోడ్ వైపు వెళ్ళాడు.
(09:43) ఒక రీల్ చేసి ఇన్స్టాల్ లో పెడదాం అని కుతూహాలంతో ఫాస్ట్ గా వెళ్ళాడు. బట్ ఒక ట్రక్ కి గుద్దుకొని స్పాట్ లో చచ్చిపోయాడు. అతను హెల్మెట్ వేసుకోలేదు మరియు ఓవర్ స్పీడ్ గా వెళ్ళటం వల్లనే చనిపోయాడని పోలీసులు చెప్పారు. తండ్రి కొడుకు మరణంతో సోకంలో మునిగిపోయాడు. అదే టైంలో 2.5 లాక్స్ రూపాయల అప్పుతో బాధపడుతున్నాడు. నెలకి 5000 రూపాయలకి పైగా కిస్తీలు చెల్లించడం అతని ఆటో డ్రైవర్ ఆదాయానికి భారంగా మారింది.
(10:09) సామాజిక ఒత్తిడి కుటుంబాల్ని ఫైనాన్షియల్ గా డెస్ట్రాయ్ చేసే స్థితికి ఎందుకు నెట్టు వేస్తుంది. 20 సంవత్సరాల అబ్బాయికి 2.5 5 లాక్స్ బైక్ అవసరమా అది కూడా తన ఫాదర్ నార్మల్ ఆటో డ్రైవర్ అయి ఉండి. మార్చ్ 2023 డేటా ప్రకారం 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల యువకులు మోటార్ సైకిల్ యక్సిడెంట్స్ లో 35% మరణాలు నమోదు అవుతున్నాయంట.
(10:31) రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 72% మంది హెల్మెట్ ధరించని వారు. సో లాంగ్ జర్నీస్ అప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. ఆ యువకుడిలో సోషల్ కంపారిజన్ పక్కవాడి దగ్గర ఉంది నాకు కావాలి అనే భావన తండ్రిలో గుడ్ ప్రొవైడర్ సిండ్రోమ్ కుటుంబ అవసరాలు ఏమైనా తీర్చాలి అనే తప్పన ఫైనాన్షియల్ రియాలిటీని ఇగ్నోర్ చేయడం లెట్ మీ టెల్ యు సం స్టాటిస్టిక్స్ ఈఐ ఎపిడమిక్ 2025 క్వార్టర్ 3 లో ఇండియాలో అమ్ముడవుతున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లో 70% కంటే ఎక్కువ ఈఐ లేదా క్రెడిట్ ఆధారంగా కొనుగోళ్ళ అవుతున్నాయి.
(11:04) అంటే 10 ఫోన్లలో ఏడు ఫోన్లు నేరుగా కొనలేక ఈఎంఐ లో కొంటున్నారు. రెండోది 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతలో 65% మంది తమ ఆదాయంలో 25% కంటే ఎక్కువ ఈఎంఐ లకి చెల్లిస్తున్నారు. 68% యువత సోషల్ మీడియాలో తమను ఇతరులతో పోల్చుకుంటున్నారు. మరియు తక్కువగా ఉన్నావు అని భావిస్తున్నారు. ఇది సోషల్ కంపారిజన్ థియరీ ప్రకారం చాలా పెద్ద మానసిక సమస్య.
(11:29) నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇల్లిటరసీ. 85% భారతీయ యువతకు ప్రాథమిక ఆర్థిక అవగాహన లేదు వడ్డీ రేట్లు మొత్తం వడ్డీ ఈఎంఐ యొక్క మొత్తం ఖర్చు ఇలాంటి వాటి మీద సరైన అవగాహన లేదు దీనంతటికీ మూలం సోషల్ మీడియా మరియు ఫేక్ రియాలిటీ మనం రోజు మూడు నాలుగు గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నాం. ఆ సమయంలో మనం ఎక్కువగా చూసేవి లగ్జరీ కార్లు, ఖరీదైన ఫోన్లు, ఫేమస్ రెస్టారెంట్లో భోజనం విదేశీ పర్యటనలు కానీ నిజం ఏంటంటే Instagram లో మనం చూసి 85% లగ్జరీ కంటెంట్ అంతా ఫేకే ఆ లగ్జరీ కార్లు రెంట్ కి తెచ్చుకుంటారు.
(12:05) ఆ బంగ్లాలు వాళ్ళవి కాదు ఆ బట్టలు ప్రమోషన్ కోసం ఆ ఇంటర్నేషనల్ ట్రిప్లు కూడా లోన్ల మీద వెళ్తూ ఉంటారు. కానీ మన మనసు దాన్ని నిజం అనుకుంటుంది. మనం ఒక రీల్ చూస్తాం. ఆ రీల్ ని మనం బిహైండ్ ద సీజన్స్ తో పోల్చుకుంటాం. ఇదొక మానసిక యుద్ధం అన్నమాట. యుద్ధంలో మనం ఓడిపోతాం. మరి దీంట్లో నుంచి ఎట్లా బయట పడాలి ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రతి స్కూల్ కాలేజీలో తప్పనిసరిగా ఈఎంఐ వడ్డీ రేట్లు బడ్జెటింగ్ ని నేర్పించాలి.
(12:30) అండ్ సెకండ్ వన్ వెయిటింగ్ పీరియడ్ ఏదైనా ఖరీదైన వస్తువు కొనే ముందు కనీసం ఏడు రోజులు ఆలోచించండి. ఏడు రోజుల్లో 90% కొనాలి అని ఇంట్రెస్ట్ పోతుంది. అన్లెస్ అండ్ అంటిల్ అది మీకు ఖచ్చితంగా కావాలనుకుంటేనే థర్డ్ వన్ వచ్చేసి 30 30 రూల్. మీ నెల ఆదాయంలో 30% కంటే ఎక్కువ ఈఎంఐ పే చేయకూడదు. 30% సేవ్ చేయాలి 30% మీ నీడ్స్ కోసం స్పెండ్ చేయాలి.
(12:55) ఫోర్త్ వన్ రియాలిటీ చెక్ సోషల్ మీడియాలో మీరు చూస్తుంది 1% మాత్రమే మళ్ళీ ఆ 1% లో 90% ఫేక్ మిగతా 99% ప్రజలు మీలాగే సాధారణ జీవితం జీవిస్తున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ విలువలు నేర్పించండి. బ్రాండ్ కాదు క్యారెక్టర్ ముఖ్యం. వస్తువులు కాదు విలువలు ముఖ్యం. పొదుపు కాదు ఫ్రీడమ ముఖ్యం పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే మోస్ట్లీ మనం ఆ షో ఆఫ్ ఊబి నుంచి బయట పడొచ్చు.
(13:21) రియాలిటీ ఏంటంటే 10వేల రూపాయ ఫోన్ కూడా లక్ష50వే రూపాయ ఫోన్ లాగే కాల్ చేస్తుంది. మన విలువ మీరు వాడే ఫోన్ లో ఉండదు మన క్యారెక్టర్ లో ఉంటుంది. అది విషయం. ఐ నో ఈ వీడియోకి పెద్దగా వ్యూస్ రావని బట్ చాలా యూస్ఫుల్ వీడియో కుదిరితే కచ్చితంగా షేర్ చేయండి. నా గోల్ ఒకటే ఈ వీడియో చూసి కనీసం ఒకరిద్దరైనా అర్థం చేసుకుంటే ఐ యమ వెరీ హ్యాపీ మీ పిల్లలకు కూడా ఈ షో ఆఫ్ కల్చర్ గురించి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు కూడా ఈ ఊబిలో పడకుండా ఉంటారు.
(13:48) అండ్ ఇంకోటి ఏంటంటే నాకు టూ డేస్ నుంచి ఫుల్ త్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ కఫ్ కోల్డ్ ఫీవర్ అన్నమాట. సో మీకు కనిపిస్తా ఉంటది మాట్లాడటం కూడా కొంచెం కష్టంగా ఉంది అంటే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా ఇక్కడ బాగా జలుబుగా ఉందన్నమాట కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది బట్ టు డేస్ గ్యాప్ ఇచ్చాను కదా అందుకని కచ్చితంగా వీడియోస్ చేయాల్సి వచ్చింది సో వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయడా నాకు సపోర్ట్ చేయాలనుకుంటా వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం
(14:12) అంతవరకు సెలవ్ బాయ్ బాయ్
No comments:
Post a Comment