Friday, January 16, 2026

 💐33శ్రీ లింగ మహాపురాణం💐

🌼క్షుప దధీచిల సంవాదం🌼

#ముప్పై మూడవ భాగం#

సనత్కుమారుడు నందిని "మహాత్మా! శివ భక్తుడైన దధీచి మహర్షి విష్ణువుని జయించాడు అని చెప్పారుకదా.ఆసంఘటన ఎందుకుజరిగిందిఎలాజరిగిందివివరించండి" అని అడిగాడు.

నంది వివరించ సాగాడు :

"పూర్వము బ్రహ్మదేవుని పుత్రుడైన క్షుపుడు తన బల పరాక్రమాలతో భూమండలాన్ని సుక్షత్రియుడైన మహారాజుగా పరిపాలిస్తున్నాడు. దధీచి మహర్షితో క్షుపునికి స్నేహము ఏర్పడింది. ఇరువురు అనేక ఆధ్యాత్మిక, వేద శాస్త్ర సంబంధ విషయాలపైచర్చించుకునేవారు
ఒకసారి వారిరువురికి "రాజు అందరికన్నాగొప్పవాడు.ప్రజలకు దేవుడి వంటివాడు" అనే విషయం చర్చకు వచ్చింది. క్షుపుడు"క్షత్రియుడుఅష్టదిక్పాలకుల అంశలతో,మహావిష్ణువు అంశంతో జన్మించి రాజుగా ప్రజలను పరిపాలిస్తాడు.ప్రజలు రాజునిదేవునిగాభావించిపూజిస్తారు. కనుక రాజు గొప్పవాడు" అని వాదించాడు.

దధీచి మహర్షికి  క్షుపుని వాదన నచ్చలేదు.  "మానవులందరు బ్రహ్మదేవుడు సృష్టించినవారే! నీవే స్వయంగా బ్రహ్మదేవుని నాసిక నుంచి తుమ్ము ద్వారా జన్మించావు. బ్రహ్మదేవుడు వేదాలు, వేదవిధానాలు, ధర్మ వ్యాప్తికి,పరిరక్షణకుమానవులను నాలుగు వర్ణాలుగా చేశాడు. ఒకరు గొప్ప, మరోకరు తక్కువ లేదు" అంటూ మందలిస్తున్నట్టు క్షుపునికి తలపై  ఎడమచేతితో కొట్టాడు.

క్షుపునికి కోపం వచ్చింది. రాజు అని చూడకుండా తనపై చేయి చేసుకున్నందుకు ఇంద్రుడు ప్రసాదించిన వజ్రాయుధంతో దధీచిని రెండు ఖండాలుగా ఖండించి వెళ్లి పోయాడు.శరీరం రెండు భాగాలై మరణించబోయే ముందు దధీచి తన గురువైన శుక్రచార్యుని తలచుకొన్నాడు.  శుక్రచార్యుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై దధీచిమహర్షిశరీరపు రెండు భాగాలను కలిపిఒకటిగా చేసి మృతసంజీవని విద్యతో ప్రాణాలు పోసి బ్రతికించాడు.

పునర్జీవుతుడైతనకునమస్కరించినదధీచినిచూసి"నాయనా!దధీచీపరమేశ్వరునిఆరాధించి ఎవరు నిన్ను సంహరించకుండా మృత్యువుపైవిజయంసంపాదించు!శివభక్తులకుమృత్యుభయం ఉండదు.ఈశ్వరుడుఅనుగ్రహంతో నాకు ప్రసాదించిన మృత సంజీవని విద్య ద్వారానే మరణించిననిన్నుబ్రతికించగలిగాను. మృత సంజీవని అయిన త్ర్యంబకమంత్రాన్నిఉపదేశిస్తాను" అని ఉపదేశించాడు.

మృత్యుంజయ మహా మంత్రం :

" త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం
  ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్"

ముల్లోకాలకు తండ్రి ఐనవాడు, జీవుల ప్రాణమనే సుగంధం కలిగినవాడు, దేవతలకు, జీవులకు పుష్టిని (ప్రాణశక్తి) పెంపొందించేవాడు,మృత్యువన్నదేలేనివాడుఅయినపరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మహా దేవుడు దోసతీగ నుండి పండిన దోసపండు విడిపోయినట్లు, మృత్యుపాశం నుండి నన్ను విడిపోయేటట్టు చేయు గాక"

దధీచి మహర్షీ! శివ సన్నిధిలో మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించిన నీరు త్రాగి, మృత్యుంజయ మంత్రంతో హోమం చేస్తే అపమృత్యు (అకాల మృత్యు) భయం ఎన్నటికి కలుగదు" అని శుక్రచార్యుడు బోధించి వెళ్లి పోయాడు.

దధీచి మహర్షి శుక్రచార్యుడు చెప్పినట్టు మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ హోమం చేసి శివానుగ్రహంపొందాడు.ఆయన శరీరంఅవధ్యత్వాన్ని(ఖండించబడకుండా ఉండటం),  శరీర అస్థికలు (ఎముకలు) వజ్రం లాగా ధృడత్వాన్ని పొందాయి.

క్షుపుడి దగ్గరకు వెళ్లి తనను సంహరించినందుకు ప్రతిగా క్షుపుని తలపైకాలితోతన్నాడు. క్షుపుడు తన వజ్రాయుధాన్ని దధీచి మహర్షి వక్షస్థలం పై ప్రయోగించాడు.వజ్రాసమానమైనదధీచిశరీరంతగిలివజ్రాయుధంవంకరపోయింది.శివానుగ్రహం పొందిన దధీచి మహర్షిని తను ఏమి చేయలేనని తెలుసుకునిక్షుపుడుఅవమానంతో అడవికి వెళ్లి తన ఆరాధ్య దైవమైన మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. 

చాలా కాలం కఠోర తపస్సు తరువాత విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు. క్షుపుడు విష్ణు స్తుతి చేసి ఆయన పాదాలకు ప్రణమిల్లాడు. నారాయణుడు ప్రసన్నుడైవరంకోరుకోమన్నాడుక్షుపుడు చేతులు జోడించి "ప్రభూ! నా స్నేహితుడైన దధీచి మహర్షికి నాకు వాగ్వివాదం జరిగింది. నన్ను రాజునని చూడకుండా అవమానిస్తే నేను శిక్షించాను.అతనుశివానుగ్రహంతో వజ్రకాయుడై వచ్చి నన్ను కాలితో తన్నాడు. "శివానుగ్రహం పొందినవాడిని. నన్ను ఏమి చేయలేవు" అని గర్వంగా వెళ్లిపోయాడు.స్వామీ! నేను అతనినిఎలాగైనాఓడించాలి. అందుకు తగిన శక్తిసామర్థ్యాలు ఇచ్చే వరం ప్రసాదించుము"  అని కోరాడు.

విష్ణువు మనస్సులో శివుని స్మరించి "రాజా! శివభక్తులు దేనికిభయపడరు.శివానుగ్రహం వారినిసదారక్షిస్తుంది.శివభక్తితో దధీచి మహర్షి సంహరింప లేని వజ్రశరీరం పొందాడు. కనుక దధీచిని నీవు జయించడం అవ్వదు.  అయినాభక్తిశ్రద్థలతో నన్నుకొలిచావుకనుకనీతరపున నేను వెళ్ళి నీ విజయం కోసం ప్రయత్నిస్తాను"అనిఅదృశ్య
మయ్యాడు. క్షుపుడు తన నగరానికి వెళ్లాడు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.

🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment