ప్రేమలో కూడా పోటీ ఉంటదా? #telugushorts #telugufacts #telugustories
https://youtube.com/shorts/7VvsFTaK9DM?si=_alXPbikKQV8yoIh
https://www.youtube.com/watch?v=7VvsFTaK9DM
Transcript:
(00:00) ఇద్దరు అన్నదమ్ములు వారికి ఉన్న ఒకే ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తుండేవారు అందులో తమ్ముడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు కానీ అన్నయ్య మాత్రం ఒక్కడే ఉండేవాడు సరే ఆ పండించిన పంటని ఇద్దరు అన్నదమ్ములు సమానంగా పంచుకునేవారు అయితే అన్నయ్య ఏమనుకున్నాడంటే నేనంటే ఒక్కడినే ఉంటా గాని తమ్ముడికి భార్య పిల్లలు కూడా ఉన్నారు సో పంటని సమానంగా పంచుకోవడం న్యాయం కాదు అని ప్రతి రోజు అర్ధరాత్రి తన వాటలో సగం తీసి తమ్ముడి వాటలు కలిపిస్తూనే వాడు అయితే తమ్ముడు కూడా మా అన్నయ్యకి వయసు పెరుగుతుంది ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు ముసలయ్య నన్ను చూసుకోవడానికి నా
(00:31) పిల్లలు ఉన్నట్టు తనని చూసుకోవడానికి ఎవరూ ఉండరు సో ఈ హాస్పిటల్స్ మందులు ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని తన పంటలో సగం వాటన్నిటిని అన్నయ్య పంటలో కల్పిస్తుండేవాడు అయితే ఒక రోజు అర్ధరాత్రి ఆ చీకట్లో ఇద్దరు ఎదురెదురు పడి ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఇలా సహాయం చేసుకుంటున్నారని రియలైజ్ అయ్యారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజమైన ప్రేమ అంటే అర్థం నువ్వు నాకేం చేసావని లెక్కలు వేయడం కాదు నేను నీకేం చేయగలనని ఆలోచించగలగడం
No comments:
Post a Comment