Why Mantena Doesn’t Brush — And Why You Still Must
https://youtube.com/shorts/h4keiZuVArU?si=5m1ksN8Yyb555dBa
https://www.youtube.com/watch?v=h4keiZuVArU
Transcript:
(00:00) మామా మంతని గారు 35 ఏళ్లుగా బ్రష్ చేయట్లేదట. సాక్స్ ఉకట్లేదట. ఇది వినగానే మనం కూడా బ్రష్ మానేద్దామా అని ఫిక్స్ అవ్వకండి. అక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. సైన్స్ ప్రకారం ఆయన చెప్పింది 100% నిజం కానీ అది ఆయనకి మాత్రమే సెట్ అవుద్ది. ఎందుకంటే ఆయన తినేది పచ్చి కూరగాయలు, పండ్లు, వేపాకు వీటిలో ఉండే పీచు పదార్థం పళ్ళని నాచురల్ స్కల్పింగ్ చేస్తుంది.
(00:19) ఉప్పు, నూనె తినరు కాబట్టి ఆయన బాడీలో చెమట వాసన తెప్పించే బ్యాక్టీరియా పెరగదు. సో ఆయన బ్రష్ చేయకపోయినా సాక్స్ ఉతకపోయినా నడుస్తుంది. కానీ మన పరిస్థితి ఏంటి మనం తినేది చికెన్ బిర్యానీ, పిజ్జా, స్వీట్స్ ఇవి పళ్ళకి గట్టిగా అతుకుపోతాయి. మనం గనక ఆయనలా బ్రష్ మానేస్తే నోటి నుంచి వచ్చే స్మెల్ కి పక్కనోడు సొమ్మసిల్లి పడిపోతాడు.
(00:37) కొన్ని రోజులకు పళ్ళు మొత్తం పుచ్చిపోయి రాలిపోతాయి. సో మావ ఆయన ఆహారం వేరు మన ఆహారం వేరు. ఆయన డైట్ ఫాలో అయితేనే ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. లేకపోతే మర్యాదగా పేస్ట్ వేసి రుద్దాల్సిందే. లాజిక్ మిస్ అవ్వకండి. ఆరోగ్యం పాడు చేసుకోకండి.
No comments:
Post a Comment