Friday, January 16, 2026

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(291వ రోజు):--
       ప్రశ్న :- అందరూ ఒకేవిధమైన ప్రయత్నం చేసి నట్లనిపించినా, ఈ సత్యాన్ని కొందరు మాత్రమే గ్రహిం చడం, మిగిలిన వారు గ్రహించక పోవడం ఎందుకు జరుగుతోంది?
       స్వామీజీ :- ప్రయత్నం మనో పరి కరాన్ని సిద్ధం చేయటం కోసం చెయ్యాలి. ఆత్మ నిగ్రహాన్ని అతిగా వాడితే, ప్రకృతికి విరుద్ధంగా పోరాడి నట్లే. అణగద్రొక్క కూడదు. అణగద్రొక్కడం పరిపూర్ణత అనిపించు కోదు. మనసునూ, బుధ్ధి నీ అధిగమించ డానికి నిజంగా ప్రయత్నించ డానికి ముందు, మొదట వాటిని సిద్ధపరచాలి. ఉత్త మోత్తమమైన సందేశాన్ని అందు కొనే టందుకు వీలుగా మనోపరికరాన్ని శృతి చేయాలి. అలా చెయ్యకపోతే, ఫలితం అంతరిక్షం లోకి క్షిపణులను పంపడానికి మన దేశంలో చేస్తున్న ప్రయత్నాలలా ఉంటుంది. అంతా సిద్ధమౌతారు, మీట నొక్కుతారు, పెద్ద వెలుగు మెరుపులా మెరుస్తుంది, పొగ గాలి లోకి లేస్తుంది. కాని, పొగ పోయాక చూస్తే, క్షిపణి నేలమీదనే ఉంటుంది! 
      అమెరికాలో నైతే అవి అంతరిక్షం లోకి పరుగులు తీస్తాయి ; ఇక్కడ మాత్రం అవి చేసేది పెద్ద చప్పుడు, మెరుపు, పొగ మాత్రమే. తేడా ఎందులో ఉంది ? పరికరాన్ని సిద్ధం చేయటానికి చేసిన ప్రయత్నం లోనూ సాఫల్యం కోసం పడిన శ్రమలోనూ ఉంది. సరైన ప్రయత్నం చేస్తే, ఇక్కడ కూడా అవి సరిగానే ఎగురుతాయి. అందుచేత, కావలసినది పరిపూర్ణ మైన, పరిశుద్ధమైన క్రమశిక్షణతో ఉన్న మనసు. 
       ప్రశ్న :- నేను నాలుగు సంవత్స రాల నుంచీ ధ్యానం చేస్తున్నాను. ఐనప్పటికీ, ఉపన్యాసాల్లో మీరు చెప్తున్న సత్యం గురించి నాకు కొంచ మైనా తెలియదు. నా కాలం వృధా చేశానని నాకిప్పుడని పిస్తోంది. నా మనసును తగినంతగా పరిశుద్ధం చేయక పోవటమే దీనికి కారణమా? 
        స్వామీజీ :- అదే కాకపోవచ్చు. మనసును ప్రాపంచిక విషయాల నుంచి వేరు చేశారు కాని, దానిని ఎటువైపు మరల్చాలో మీకు తెలియ లేదు. మీ మార్గం నిర్దేశించు కోడానికి మీరు వెతుకుతున్నది దేనికోసమో మీకు తెలియాలి. ఎలా ఎగరాలో ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీరు! 
       ప్రశ్న :- క్షిపణి ఎప్పుడు ఎగురు తుందనేదే ప్రశ్న. 
        స్వామీజీ :- అది జరిగినప్పుడే! భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ వస్తు ప్రపంచ మంతటికీ ఆధారభూత మైన దేమిటో సూచించాడు. ఆ ఏకత్వాన్ని మీరు గ్రహించినపుడు క్షిపణి యొక్క మొదటి స్థాయిని ప్రయోగించి నట్లు. ఉన్నత స్థానాన్ని చేరినపుడు, ప్రపం చం లోని వస్తువులన్నీ ఒకటిగానే కనిపిస్తాయి ; ఇది క్షిపణి యొక్క రెండవ స్థాయిని ప్రయోగించి నట్లు. పూర్తి గ్రహింపు కలిగినపుడు, మీరు రెండు తీరుల్లోనూ ప్రపంచాన్ని చూడ గలుగుతారు : ఒక్కనిలో సర్వమూ, సర్వంలో ఒక్కడూ. 
      ప్రశ్న :- ఈవిధమైన చిత్రీకరణలో 'భగవంతుని కృప' అనే భావనకు స్దాన మెక్కడుంది ? 
       స్వామీజీ :- భగవంతుని కృప మనందరికీ సమానం గానే అందుతోంది. పెట్రోలు చాలానే ఉన్న ప్పటికీ కారు దారిలో ఆగిపోతే, పెట్రోలును నిందించ గలమా ? నిందించలేము. సమస్య ఉన్నది వాహనం తోనే. 
        సూర్యరశ్మి అంతటా ఉంది - గులాబి తోట, కూస్తున్న కోయిల, దోమ, చెత్తకుప్ప - వీటన్నిటికీ వెలుతురు నిస్తూ, జాతి వర్ణ భేదాన్ని, ప్రయోజనాన్నీ పట్టించు కోకుండా. సూర్యుని కృప ఉంది. కాని మీరు ఇంట్లో తలుపులూ, కిటికీలూ మూసుకొని కూర్చొని, చీకటిగా ఉంద ని ఫిర్యాదు చేస్తున్నారు. కిటికీలు తెరవండి ; సూర్యరశ్మి దానంతటదే లోనికి వస్తుంది. 
       ప్రశ్న:- ఈ దివ్యమైన స్థితియొక్క అనుభవం మీకు ఎప్పుడూ ఉంటుందా ?
       స్వామీజీ :- అనుభవం శరీర మనో బుద్దులకు సంబంధించినది. నేను ఆత్మను ; అనుభవాన్ని కాను. నా చుట్టూ అనుభవాల నుండనిస్తా నంతే. శూన్యంలా సూక్ష్మమైన వాడిని నేను; ఏదీ నన్నంటదు. 
        నేను దాని లోపల ఉన్నానో, బయట ఉన్నానో చెప్పటం సాధ్యం కాదు ; కాని, దాని నుంచి దూరంగా ఎన్నడూ లేను. 
                      --***--
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ 🌺

No comments:

Post a Comment