విషసర్పాలు కూడా వీరికి పసి పిల్లలే #satyanandiraju #sanatandharma #devotional #hindu #ytviral
https://youtu.be/4oTi3FRXm3M?si=8cwMmhr_wcgTbSKo
https://www.youtube.com/watch?v=4oTi3FRXm3M
Transcript:
(00:01) శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు మనం చాలాసార్లు భగవాన్ యొక్క ఫోటో ఇలా చూసి ఉంటాం. వారి పాదాల దగ్గర ఒక వ్యక్తి కూర్చున్నారు చూసారా ఆయన ఎవరో కాదు ఆయన పేరు యోగి రామయ్య. మనకి ఎలా సుపరిచితం అంటే అన్నారెడ్డి పాలెం రామయోగిగా. వీరి బాల్యమే ఒక అద్భుతం. అసలు వీరు చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుందాం అనుకుంటే ఒక యోగివర్యులు ఆపేశారు.
(00:35) ఆయన ఎవరు ఎందుకు ఆపేశారు? అలాగే ఏ సందర్భంలో రమణ మహర్షిని కలిశారు అరుణాచలంలో ఇక్కడికి వెళ్ళినప్పుడు కావ్యకంట గణపతి మునిని ఏమని ప్రశ్నించారు. అలాగే భగవాన్ యొక్క విదేశీ భక్తుల్లో ప్రముఖులు పాల్ బ్రంటన్ ఈ రామయోగి గురించి ఏం రాశారు? అలాగే స్వామి పరమహంస యోగానంద యొక్క శిష్యులు క్రియానంద. అసలు పేరు డొనాల్డ్ వాల్టర్స్.
(01:02) ఆయన తన బయోగ్రఫీలో ఈ రామయోగి గురించి ఏం రాశారు. అసలు అద్భుతమైనటువంటి వారి జీవితం గురించి ఇవాళ మనం సత్సంగం చేసుకోబోతున్నాం. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విశేషాలు ఇవాళ సత్సంగం చేసుకుందాం. ఈ సత్సంగంలో వెళ్లే ముందు నా మనవి. ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెందుకు ఆలస్యం వెళ్లి యోగివర్యుల గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలుసుకుందాం పదండి మనందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రం దీనికి దగ్గరలోనే మోపూరు అనే గ్రామం ఉండేది. అక్కడ
(01:41) పిచ్చి రెడ్డి రామమ్మ అనేటువంటి దంపతులు ఉండేవారు. వారి వంశపారంపర్యంగా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేది. ఏమిటంటే ప్రతి తరంలోనూ ఒకే ఒక మగబిడ్డ జన్మించడం ఆ మగబిడ్డ జన్మించిన కొద్ది కాలానికి ఆ బిడ్డ యొక్క తండ్రి కాలం చేయడం ఇలాంటివి మనం కొన్ని కుటుంబాల్లో వింటూ ఉంటాం అంటే కొంతమందికి అది శాపం కావచ్చు కొంతమందికి అది వరంగా కూడా మారవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో అది ఒక రకంగా వరంగా మారింది అని చెప్పవచ్చు ఎలాగంటే శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం 29 జులై 1895 వ సంవత్సరంలో ఈ మోపూరు గ్రామంలోనే ఈ రామమ్మ పిచ్చిరెడ్డి దంపతులకు ఒక పండంటి మగబిడ్డ జన్మించాడు. అంటే ఆ
(02:32) సమయంలో ఆ తల్లి కానుపు కోసం పుట్టింటికి వెళ్ళింది. ఆ పుట్టిల్లు ఏమిటంటే అన్నారెడ్డి పాలెం. కాబట్టి ఆ పిల్లవాడు జన్మించింది అన్నారెడ్డి పాలెంలోనే. సరే రామిరెడ్డి నమ్మంగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. నేను ఇందాక ఏదైతే చెప్పానో వారికి వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఆ ప్రత్యేక లక్షణం ఆ విధంగానే రామరెడ్డి పుట్టిన కొంతకాలానికే తండ్రి పిచ్చి రెడ్డి మరణించారు.
(02:56) సరే చదువు సంధ్యలన్నీ కూడా అన్నారెడ్డి పాలనలోనే కొనసాగుతున్నాయి. మనం చాలామంది యోగుల యొక్క గర్భావాసంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు కానీ వారి పూర్వీకులకు కానీ ఒక దివ్యమైన సూచన అందుతూ ఉంటుంది. అట్లాగే ఈ రామేరెడ్డి పుట్టబోయే ఒక రోజు ముందు ఈ రామమ్మ గారికి కలలో ఒక దివ్య పురుషుడు కనిపించి లోక పూజ్యుడయ్యే శిశువు నీకు రేపు పుట్టబోతున్నాడు అని చెప్పి వరం ఇచ్చి అంతర్హీతులు అయిపోయారు.
(03:28) అలా కల వచ్చిన మర్నాడే నేను ఇందాక చెప్పిన విధంగా అన్నారెడ్డి పాలెంలో ఈ రామిరెడ్డి జన్మించారు. సరే చదువు సంధ్యలన్నీ కొనసాగుతున్నాయి చాలా చురుగ్గా ఉండేవారు కానీ పాఠశాల పరంగా తరగతుల పరంగా ఈ పిల్లవాడు చదివింది ఒకరకంగా తక్కువ అని చెప్పాలి కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన చాలా ఉన్నతమైనటువంటి చదువులను చదివారు చిన్నప్పటి నుంచి రామాయణం భారతం భాగవతం ఇవన్నీ కూడా వంట పట్టించుకున్నారు.
(03:59) చదవడంతో సరికాదు సత్యాసత్య విచక్షణ ధర్మధర్మ విచక్షణ దేనికోసం మనిషి నిజంగా తాపత్రయపడాలి దేన్ని వదులుకోవాలి ఇవన్నీ కూడా నర నరాల్లో కూడా ఇంకిపోయినాయి ఆ పిల్లవాడికి వైరాగ్యం మీద తీవ్రమైన జిజ్ఞాస పుట్టింది రామాయణం చదివేటప్పుడు ఆ పిల్లవాడు కన్నీరు కారుస్తూ ఉండేవాడు ఇటువంటి సంఘటనలు నేను కొంతమంది మహాపురుషుల జీవితాల్లో కూడా విన్నాను అది చాలా గొప్ప సూచన అంటే మీరు భగవంతునితో మమేకం అవుతున్నారు అనడానికి అదొక కీలకమైన సూచన అంటే మీరు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని పొందబోతున్నారు.
(04:45) కాబట్టి అటువంటి కొలమానాలు మన ఆధ్యాత్మిక సాధనలో చాలా కీలకం. సరే పిల్లవారికి ఇంకో కోరిక ఏం కలిగిందంటే ఈ రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి లాగా నేను కూడా తపోనిష్టాగరిష్టుడిని అవ్వాలి అని కోరిక పుట్టింది. తపస్సు మీదకి మనస్సు మళ్ళింది. అంతటితో ఆగలా. ఆ పొలాల దగ్గర, గట్ల దగ్గర ఆ బావుల దగ్గర, తూముల దగ్గర కూర్చుని తీవ్రమైన ధ్యానంలో మునిగిపోతూ ఉండేవాడు.
(05:19) ఒకసారి వేసం కాలంలో ఏమైందంటే ఒక తూము దగ్గర కూర్చుని తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితి నుంచి బయటికి వచ్చాక తీవ్రమైన మంట పట్టడం మొదలు పెట్టింది కాళ్ళ దగ్గర అప్పుడు తెలిసింది తేలి కుట్టిందని ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు తెలియ తేలు కుట్టిన విషయం అంతటి తీవ్రమైన సాధన చేస్తూ ఉండేవాడు రామిరెడ్డి అప్పటికి ఆ కుర్రవాడికి 16 ఏళ్ళు వయసు మాత్రమే ఇక్కడి నుంచి మనం ఈ రామిరెడ్డి గారిని రామయ్య గారు అని పిలుచుకుందాం.
(05:52) దాని తర్వాత ఈ రామయ్య గారు ఎక్కడ పడితే అక్కడ తపస్సు చేయడం మొదలు పెట్టారు ఒకసారి రైలు పట్టాల దగ్గర కనిపించేవారు దాని తర్వాత ఆయనకి నేను ఇందాక చెప్పినట్లు తపస్సు మీద తీవ్రమైన కోరిక కలిగింది. అలాగే జ్ఞాన వైరాగ్యాలు ఒక రకంగా పరిపూర్ణమైనటువంటి స్థితికి వచ్చేసినాయి. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్ళు కేవలం అంతే దాని తర్వాత ఆ రోజులు ఎలాంటివి అంటే నెల్లూరు మండలంలో ఒక ఆధ్యాత్మికతకు స్వర్ణ యుగం అని చెప్పాలి అంటే ఆ బాపట్ల బ్రహ్మానంద తీర్థులు నెల్లూరు నిత్యానందులు కూడా కలిసి ఆధ్యాత్మిక స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చారు నెల్లూరు మండలానికి ఆ కాలం అంతా కూడా ధార్మిక
(06:35) కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు దేవాలయాల నిర్మాణం అద్భుతమైన ైనటువంటి రోజులు ఆ రోజులు ఆ రోజుల్లోనే ఈ బాపట్ల బ్రహ్మానంద తీర్థుల స్వామి వారిని కలిశారు ఈ రామయ్య గారు వారు అమితానందం పొందారు అటువంటి శిష్యుడు దొరికితే ఏ గురువుగారు మాత్రం ఆనందపడరు దాని తర్వాత రామయ్య గారికి రామతారక మంత్రాన్ని ఉపదేశించి రోజుకి ఐదు లక్షల సార్లు జపం చేయమని చెప్పారు.
(07:02) బాగా ఆకలి వేసిన వాడికి ఈ పంచపక్ష పరమాణులు దొరికితే ఎలా ఉంటుంది రామయ్య గారిది కూడా అదే పరిస్థితి ఇంకా ఆ మంత్ర సాధనకి ఎన్ని రకమైన కఠోర సాధనలు చేయాలో అన్నీ చేసి తీవ్రమైనటువంటి జపజానాదుల్లో మునిగిపోయారు సరే దాని తరువాత రామయ్య గారికి ఏం అనిపించింది అంటే ఎంత సాధన చేసినా కూడా కళ్ళ ముందే బంధువులు తల్లిగారు వారి యొక్క ఆస్తులు ఎందుకంటే రామయ్య గారి కుటుంబం సంపన్నమైనటువంటి కుటుంబమే ఇవన్నీ కూడా ఏదో ఒక సమయంలో మనసుని లాకుపోతాయి అందుకని ఇవన్నీ కూడా పరిచజించి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నారు.
(07:47) సరే వెళ్తూ వెళ్తూ ఏం చేశారంటే బాపట్లలో ఈ బ్రహ్మానంద తీర్థులు వారిని కలిశారు. సరే వారు రామయ్య అంతా బాగానే ఉంది ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగారు. స్వామి మీకు తెలియంది కాదు హిమాలయాలకు వెళ్తున్నాను అంటే తల్లిగారి యొక్క అనుమతి తీసుకున్నావా అని అడిగారు లేదు స్వామి అని చెప్పారు రామయ్య అలా అయితే నువ్వు తిరిగి ఇంటికి వెళ్లి నీ తోటలోనే ఒక కుటీరం నిర్మించుకొని అక్కడ సాధన చెయ్ నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను పరివేక్షిస్తూ ఉంటాను అని చెప్పారు బాపట్ల బ్రహ్మానంద తీర్థులు మారు మాట్లాడకుండా రామయ్య గారు మళ్ళీ ఇంటికి వచ్చేసి వారి ఇంటి తోటలోనే
(08:29) కుటీర నిర్మించుకుని తీవ్రమైన సాధన మొదలు పెట్టారు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఆ దగ్గరలోనే ఈ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రం అని చెప్పాను కదా దానిని నరసింహుల కొండ అని కూడా అంటారు. రాత్రిపూట అక్కడికి వెళ్లి తపస్సు చేసుకుని తెల్లారికల్లా వచ్చేసేవారు అంటే వారి ఇంటి నుంచి ఆ నరసింహుల కొండ ఒక ఆరు మైళ దూరం ఉండేది.
(08:55) కానీ అదంతా కూడా అప్పట్లో అది ఒక దట్టమైన అడవి ఎన్నో క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి కానీ ఏనాడు కూడా ఈ రామయ్య గారికి ఎటువంటి ఇబ్బంది కలగల అంతేకాదు వీరికి ఇంకో అద్భుతమైనటువంటి ప్రత్యేక లక్షణం ఉండేది అదేంటో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆయన సాధనలో ఏం చేసేవారు అంటే ఈ నాసాగ్ర దృష్టితో తీవ్రమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు అలా వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన వెలుగుతో ఒక సర్పం కదులుతూ శిరస్సులో లీనమైనట్లు ఆయనకి ఒక దృశ్యం గోచరించింది అంతవరకు కూడా శ్రీరాములు వారు కనబడుతూ ఉండేవారు ఆ ధ్యాన స్థితిలో దాని తరువాత వారి యొక్క రూపం మాయమైపోయి ఒక
(09:38) అనంతమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి ఒక సముద్రం ఒక అద్భుతమైన వెలుగుతో గోచరించింది. అంటే అక్కడ ఎటువంటి రూపాలు లేవు ఉన్నద ఒకటే అద్భుతమైనటువంటి వెలుగు ఆయనకి అనుమానం వచ్చింది ఇదేంటి మొత్తం కూడా ఒకే వస్తువుగా కనిపిస్తోంది అప్పటిదాకా కూడా శ్రీరాములు వారి యొక్క దర్శనం లభించేది ఇప్పుడు ఒక వెలుగు కనబడుతోంది ఇటువంటి ఆకారం కూడా లేదు అని వారి మదిలో ఈ ప్రశ్న తులుస్తూనే ఉండేది అప్పటికీ గురువుగారు బాపట్ల బ్రహ్మానంద తీర్థులు వారు కాలం చేసేసారు.
(10:21) అప్పటికీ రామయ్య గారి వయసు కేవలం 23 సంవత్సరాలే ఇంత ప్రావీణ్యం సంపాదించారు యోగ సాధనలో దాని తరువాత వారికి గుర్తుకు వచ్చింది చిన్నప్పుడు వారి తల్లి బంధువులతో ఈ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ అరుణాచలం కూడా వెళ్లారు. గుర్తుకు వచ్చి అరుణాచలం చేరుకున్నారు రామయ్య గారు. అప్పుడు ఈ కావ్య కంఠ గణపతి ముని అడిగారు. ఈ సమాధి స్థితిలో ఇన్ని ఉంటాయా? అంటే చూసేది, చూడబడేది చూసేటటువంటి ఈ క్రియ ఇన్ని ఉంటాయా? అని అడిగినప్పుడు ఈ గణపతి ముని ఏం చెప్పారంటే ఈ దృక్దృశ్యాలు వేరు వేరుగా ఉంటాయి అని చెప్పారు.
(11:08) ఎందుకో రామయ్య గారికి ఆ సమాధానం అంతగా ఆయన భుజించల ఆయనకి. సరే భగవాన్ వైపు తిరిగారు ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే సమాధి స్థితిలో ఇవన్నీ కూడా ఏకమైపోతాయి ఈ దృదృశ్యాలు ఇన్ని ఉండవు ఉండేదల్లా ఒకటే వస్తువు ఇటువంటి ఆకారాలు ఉండవు అదే నువ్వు సాధించింది అని చెప్పిన తర్వాత ఈ రామయ్య గారి మనసు కుదుటపడింది అప్పటి నుంచి రామయ్య గారు భగవానికి అంతేవాసిగా మారిపోయారు కూర్చ శిష్యులుగా మారిపోయారు ఎంతగా అంటే కొండెక్కి కి కొండ దిగుతున్న కూడా భగవాన్తోనే ఉండేవారు భగవాన్ అసలు భోజనం చేసేటప్పుడు ప్రత్యేకంగా పిలిపించుకునేవారు ఈ రామయ్య గారిని పక్కన కూర్చోబెట్టుకునేవారు అంతగా అంతేవాసిగా మారిపోయారు అసలు ఎంతగా
(11:53) అంటే రామయ్య గారి కోసమే భగవాన్ యొక్క రచనలు ఉపదేశ సారం ఉన్నది నలుబది అటువంటివి తెలుగులో అనువదించబడ్డాయి కేవలం రామయ్య గారి గురించే ఆ విధంగా రామయ్య గారు అరుణాచలం వెళ్ళిన తర్వాత రామయోగిగా మారిపోయారు ఇక నుంచి మనం వీరిని రామయోగిగా పిలుచుకుందాం వీరు 12 ఏళ్ళు తీవ్రమైనటువంటి మౌనంలో ఉండి కఠినమైనటువంటి సాధన చేశారు రామయోగి గారు అంతేకాదు భగవాన్ యొక్క ఆజ్ఞను స్వీకరించి ఈ అన్నారెడ్డి పాలనలోనే రామాశ్రమాన్ని కూడా నెలకొల్పారు దేనికోసం అంటే ధార్మిక కార్యక్రమాల కోసం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించడానికి ఒక కేంద్రం కావాలి కదా అందుకోసం అని చెప్పి ఈ
(12:39) రామాశ్రమాన్ని స్థాపించారు రామయ్య గారు ఎక్కడ ఈ అన్నారెడ్డి పాలెంలో ఇప్పటికీ కూడా మనం వెళ్లి చూడవచ్చు ఆశ్రమం అద్భుతంగా ఉంటుంది. దాని యొక్క లొకేషన్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అప్పటికి రామయోగి గారి యొక్క వయసు ఎంతో తెలుసా కేవలం 42 సంవత్సరాలు మాత్రమే. అదే కాలంలో రామయోగి గారు పల్లెపాడు ఆశ్రమంలో ఉన్నారు రాత్రి 11 గంటలు అయింది.
(13:05) అఖండమైనటువంటి దివ్య తేజస్సు కనబడింది. ధ్యానంలో కాదు సుమ భౌతికంగానే ఆ దివ్యమైనటువంటి వెలుగులో చతుర్భుజాలతో మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం లభించింది రామయోగి గారికి ఆ స్వామి ఇలా ఇలా లేవదీశారు అంటే రామయోగి కనపడగానే సాష్టాంగ నమస్కారం చేసేసారు మహావిష్ణువు అలా లేవనెత్తి ఇలా ఆశీర్వదించంగానే రామయోగ్ గారు అడిగారు నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను స్వామి అంటే ఇప్పుడే కాదు నాయనా దానికి చాలా సమయం ఉంది నువ్వు చేయాల్సింది చాలా ఉందని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయారు మహావిష్ణువు కానీ అప్పటికే ఈ రామయ్య గారు అంటే ఈ రామయోగి గారు నిర్వికల్ప సమాధి
(13:50) స్థితిని పొందేశారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేశారు మహావిష్ణువు యొక్క దర్శనాన్ని కూడా పొందేశారు అయినా కూడా వారిలో సేవాతి అలాగే అన్నదానం పట్ల ఉన్నటువంటి ప్రీతి మాత్రం పెరిగిందే గాని తగ్గలేదు ఎందుకంటే వారు ఆత్మజ్ఞాన స్థితిలో అలాగే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు కానీ పక్కవారిని ఉద్ధరించేవారు ఎవరున్నారు కాబట్టి అటువంటి దైవిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామయోగి గారు వారు ఉద్ధరింపబడడమే కాదు తన తోటి వారిని కూడా ఉద్ధరించారు.
(14:29) వీరి యొక్క తపస్శక్తి ఎలా ఉండేదో నేను చెప్తాను చూడండి. భగవాన్ రమణ మహర్షి యొక్క విదేశీ భక్తుల్లో పాల్ బ్రెంటన్ చాలా ప్రముఖులు మనందరికీ బాగా తెలిసినటువంటి పేరు వారికి రామయోగి గారితో అద్భుతమైనటువంటి సాహిత్యం ఉండేది ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఉండేవి వారు ఒక పుస్తకం రాశారు ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని దాంట్లో ఈ రామయోగి గారి గురించి కొన్ని అద్భుతమైన సంఘటనలు రాశారు ఆల్ బ్రంటన్ ఒకసారి ఏమైందంటే తమ కుటీరంలోనే తలుపు తీశారు ఇట్లా పాల్ బ్రంటన్ పెద్ద కొండనాగు అది పడగ విప్పి దరిదాపు కాటు వేయబోతుంది.
(15:15) అలా కాటు వేసే సమయానికి ఎక్కడి నుంచి వచ్చారు రామయోగి వచ్చి తనే తరమల కర్ర తీసుకుని మనం పెంపుడు జంతువుల్ని ఎట్లా ఇలా తల రాస్తామో అట్లా రామయోగి ఆ పడగని ఇట్లా దువ్వారు ఏది కొండ నాగు యొక్క పడగని అది పడగ ఇట్లా దించేసి అలా వెళ్ళిపోయింది నేను మొదట్లో చెప్పాను చూసారా రామయోగి గారి గారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేదని అది ఇదే ఆయన యొక్క తపోశక్తితో అంత విషపూరితమైనటువంటి సర్పాలను కూడా సాధుసత్వంతో నింపేసేవారు అవి అంతే సాధు స్వభావాన్ని పొంది అలా పక్కకు తప్పించుకొని వెళ్ళిపోయేవి.
(16:03) పాల్ బ్రంటన్ గారికి ఆశ్చర్యం వేసింది. ఇక్కడ తమాషా ఏంటంటే పాల్ బ్రంటన్ గారికి తెలుగు రాదు రామయోగి గారికి ఇంగ్లీష్ రాదు అయినా కూడా వారు సైగల్ ద్వారా వారు మాట్లాడుకునేవారు ఇప్పుడు పాల్ బ్రెంటన్ సైగ చేసి అడిగారు నాకు చాలా భయం వేసింది ఇదేంటి మీరు ఇట్లా దువ్వారు అది అట్లా వెళ్ళిపోయింది అని అప్పుడు ఈ రామయోగి గారు రాసిచ్చారు ఏమని రాసిచ్చారు అంటే అది నాకు అన్యమైనది అన్న భావన కలగల నా మనసు మనసులో ఎటువంటి ద్వేషం కూడా లేదు దాని మీద ప్రేమమయమైనటువంటి హృదయంతో దాని దగ్గరికి వెళ్ళాను.
(16:44) అది కూడా అలాగే ప్రతిస్పందించి వెళ్ళిపోయింది. ఇందులో వింతము ఉందని రాశారు. ఇటువంటి అనుభవమే ఒకసారి ఈ రామయోగి గారు అరుణాచలం కొండ మీద ఉన్న ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటే వారి శిష్యునికి కూడా ఇదే ఎదురైంది ఇటువంటి అనుభవమే. ఒక పెద్ద పాము వచ్చింది రామయోగి గారు చిటికి వేస్తే అట్లా వెళ్ళిపోయింది అదో పిల్లి పిల్లలాగా అది వారి యొక్క తపస్శక్తి ఇంకో ఆసక్తికరమైన విశేషం చెప్తాను అప్పట్లో సుప్రసిద్ధమైనటువంటి దేశభక్తురాలు ఉండేవారు కొనకా కనకమ్మ గారు దురదృష్టం కొద్దీ వారి ఏకైక పుత్రిక చిన్నతనంలోనే మరణించింది.
(17:23) మనశశాంతి కోసం అని చెప్పి అరుణాచలం వచ్చారు. సరే రమణ మహర్షి ఇంకా కూడా రాలేదు భక్తుల యొక్క దర్శనార్థమై సరే ఇంకా సమయం పడుతుంది కదా అని చెప్పి ఈ రామయోగి గారి యొక్క ఆశ్రమానికి వచ్చారు అదే ప్రాంగణంలో అప్పుడే రామయోగి గారు తన ధ్యానాన్ని తపస్సును ముగించుకుని అట్లా లేస్తున్నారు. కనకమ్మ గారు అలా వెళ్లారు. అప్పుడు రామయోగి గారి చుట్టూ కూడా అద్భుతమైనటువంటి కాంతి పుంజాన్ని చూశారు.
(17:58) రామయోగి గారు అలా మెల్లగా చూశారు కనకమ్మ గారి వైపు ఆ చల్లని చూపులతోనే ఆ కనకమ్మ గారి యొక్క దుఃఖం అంతా కూడా సగం పైగా తగ్గిపోయింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి యోగి రామయ్య గారి యొక్క కంటి చూపు చాలు వారి యొక్క వాత్సల్యం చాలు మనుషుల యొక్క ఎంతటి దుఃఖమైనా కూడా తీరిపోయేది అది వారి తపస్శక్తి ఇంకో సందర్భంలో యోగి రామయ్య గారు ఒక అందు బంధురాలికి ధ్యానస్థితిని పొందేలా చేశారు.
(18:30) అటువంటి మహాయోగి మన యోగి రామయ్య గారు అటువంటి రామయోగి గారు మాఘశుద్ధ అష్టమి సోమవారం ఫిబ్రవరి 12 1962వ సంవత్సరంలో ఆ పరబ్రహ్మలో ఐక్యం అయిపోయారు. వారి సమాధిని వారి అన్నారెడ్డి పాలెం ఆశ్రమంలో మనం ఇప్పటికీ చూడవచ్చు. దాన్ని యోగి రామవమటం అంటారు లేదా కొంతమంది రామాశ్రమం అంటారు అద్భుతంగా ఉంటుంది 18 ఎకరాల్లో విస్తరించి చక్కగా భక్తులకి భోజన వస్తి సౌకర్యాలు ఉంటాయి అలాగే గ్రంధాలయం ఉంది అలాగే చివరి రోజుల్లో ఈ రామయోగి గారు కొన్ని గదుల్లో తపస్సు చేసుకున్నారు ఆ గదులను కూడా చూడవచ్చు అక్కడ అలాగే భక్తులకు ప్రత్యేకించి కొంతమంది సాధన చేసుకునేందుకు
(19:18) చిన్న గుహ కూడా ఉందని చెప్తారు కాబట్టి ఆ నెల్లూరు దరిదాపుర్లో ఎప్పుడైనా మీరు వెళ్ళినట్లయితే అయితే అన్నారెడ్డి పాలెంలో ఉన్నటువంటి వారి ఆశ్రమాన్ని తప్పకుండా సందర్శించి తీరండి. ఒకవేళ ఆ దత్తస్వామి నన్ను ఆశీర్వదిస్తే ఆదేశిస్తే తప్పకుండా ఆ ప్రాంతం దృదాపుల్లోకి వెళ్ళినప్పుడు నేను ఈ ఆశ్రమాన్ని నేను దర్శించడమే కాకుండా మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను.
(19:44) ఇంకొక అద్భుతమైన విషయం చెప్పి నేను ఈ సత్సంగాన్ని ముగిస్తాను. అదేమిటంటే స్వామి పరమహంస యోగానంద శిష్యులు స్వామి క్రియానంద వారు విదేశీయులు అసలు పేరు డోనాల్డ్ వాల్టర్స్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ వెస్ట్రన్ యోగి అనే పుస్తకంలో ఏం రాసుకున్నారు అంటే ఈ రామయోగి గారి గురించి నేను 1935వ సంవత్సరంలో అరుణాచలం వెళ్ళాను అక్కడ రమణ మహర్షి యొక్క అంతేవాసి రామయోగితో నాకు పరిచయం కలిగింది.
(20:17) వారితో చెయ్యిలో చెయ్యి వేసుకుని మరి నేను వారితో సాన్నిహిత్యం పొందాను వారు జీవన్ముక్తులు నేను ఇంకొక అరగంట సమయం కనుక రామయోగితో గడిపి ఉంటే భారతదేశాన్ని విడిచి నేను వచ్చి ఉండేవాడిని కాదేమో అని చెప్పి వారు రాసుకున్నారంటే రామయోగి గారి యొక్క సాధనా స్థాయి వారి యొక్క యోగస్థాయి ఏమిటో మీరు ఆలోచించండి అంటే వారితో సహవాసం చేస్తే చాలు తరించిపోతాం అని చెప్పి చెప్పకనే చెప్పారు స్వామి క్రియానంద అటువంటి మహాయోగి మన తెలుగు నేలపై పుట్టడం మనందరి అదృష్టం మీరు అంటారేమో యోగులక ఏంటండి ఈ భాషా భేదాలు ఈ ప్రాంతీయ భేదాలు అంటగడుతున్నారు మీరు అని ఇలాంటి
(21:09) సందర్భాల్లోనే ఎక్కడో చిన్న స్వార్థం బయటకు వచ్చి ఇలా చెప్పుకోవాలని అనిపిస్తుంది ఆ యోగులు మాతి తెలుగువారేనని ఇది అందమైన స్వార్థం అటువంటి మహాయోగి రామయ్య గారి గురించి మనం సత్సంగం చేసుకుని ఇవాళ మనం తరించిపోయాం. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ రామయోగి గారి యొక్క ఆశీస్సులు అలాగే దత్తస్వామి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చిన్న మనవి ఏంటంటే ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
(21:47) మరొక అద్భుతమైన సత్సంగంలో మళ్ళీ మనమందరం కలుద్దాం. శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు.
No comments:
Post a Comment