Thursday, January 22, 2026

Sahasravadhana-Garikapati is the pinnacle of their intelligence #ytshorts #sahasravadhana #garika...

Sahasravadhana-Garikapati is the pinnacle of their intelligence #ytshorts #sahasravadhana #garika...

https://youtube.com/shorts/DOczmJOSRIc?si=PtundKcSshfjuWu_


https://www.youtube.com/watch?v=DOczmJOSRIc

Transcript:
(00:01) 1000 మంది పృషకులను కూర్చోబెట్టి ఇలా మీరు ఇవాళ విద్యార్థులు కూర్చున్నారు. కాదు ఇదే సంఖ్యలో విద్వాంసులు కూర్చున్నారు 1996లో కాకినాడ సూర్య కళా మందిరంలో ఇంత సంఖ్యలో 1000 మంది పైన విద్వాంసులు తెలుగులో సంస్కృతాల్లో అఖండమైన విద్వాంసులు నన్ను మించినటువంటి విద్వాంసులు నాకు నేను పాదాభివందనం చేయదగిన విద్వాంసులు అప్పుడు నా వయసు ఎంత 34 ఏళ్ళు ఆ వయసులో అంతమంది విద్వాంసులువెయ్యి రకాల ప్రశ్నలు వేస్తే అందులో సమస్యలు అనే పేరు మీద 250 దత్తపదులు అనే పేరు మీద 250 వర్ణనలు అనే పేరు మీద 250 ఆశువుగా అప్పటికప్పుడు పద్యాలు చెప్పడం అనే పేరు మీద 250 మొత్తం
(00:34) 1000 రకాలు ప్రశ్నలు వేస్తే ఒక్కొక్కరికి 1000 మందికి ఒక్కొక్క పాదం చొప్పున చెప్పుకు రావడానికి ఐదు రోజులు పడుతుంది. ఒక్కొక్క పాదం రోజుకి 200 25 200 పాదాలు 200 పాదాలు మించి అవ్వవు ఆరో రోజు మళ్ళీ రెండవ ఆవృత్తి ప్రారంభం అయినప్పుడు 1000 మంది అలా వాళ్ళ చోట్లో వాళ్ళు నిలబడి ఉంటారు అంతే వాళ్ళ పేరు చెప్తారు వారు చెప్పగానే ఐదు రోజుల క్రితం వారు ఏ ప్రశ్న వేశరో దానికి నేను అప్పుడు చెప్పిన ఒక పాదం ఏమిటో చెప్పి ఇప్పుడు రెండవ పాదం చెప్పాలి మీకు ఎనిమిదో తరగతి నుంచి పద్యాలు పరిచయం ఉండి ఉంటాయి తెలుగులో పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి వారి
(01:03) ప్రశ్నకి దేనికి నేను మాటల్లో జవాబు చెప్పకూడదు పద్యంలో చెప్పాలి అది అప్పటికప్పుడు సృష్టించిన పద్యం అయ్య ఉండాలి పాత పద్యం ఎవరిదీ కాపీ కొట్టకూడదు సొంతంగా చెప్పాలి అప్పటికప్పుడు చెప్పాలి వారు అడిగిన ఛందస్సులో చెప్పాలి ఉత్పలమాల చంపకమాల తేటకీ తేటవలది శేషం ఏది అడిగితే అది అనేక రకాల ఛందస్సులు కనీసం 32 రకాల చందస్సులు బురలో ఉండాలి అప్పటికప్పుడు పద్యం చెప్పగలిగే శక్తి ఉండాలి.
(01:24) ఇంతమందికి మొదటి పాదాన్ని ఐదు రోజుల్లో చెప్పి రెండవ పాదం మొదలైనప్పుడు మళ్ళీ ఎవరిని అడగకుండా ఎక్కడ రాసుకోకుండా ఏ ఫోను చూడకుండా స్మార్ట్ ఫోన్ చూడకుండా అసలు అప్పుడు లేవు కూడా 96లో సెల్ ఫోన్ే లేదు స్మార్ట్ ఫోన్ ఎక్కడ ల్యాండ్ ఫోన్ తప్పితే ఏం లేదు ఏ పుస్తకం మీద రాయకుండా అన్ని బుర్రలోనే పెట్టుకొని మళ్ళీ అంతమందికి మొదటి పాదం అప్పగించి రెండో పాదం చెప్పాలి మళ్ళీ 11వ రోజు మూడో ఆవృత్తి మొదలైనప్పుడు రెండు పాదాలు అప్పగించి మూడో పాదం చెప్పాలి 16వ రోజు నాలుగో ఆవృత్తి ప్రారంభమైనప్పుడు మూడు పాదాలు అప్పగించి నాలుగో పాదం చెప్పాలి ఈ రకంగా వెయి పద్యాలు ఇటనాలుగునా
(01:53) 4వేల పాద వాదాలు పూర్తఅయ్యాక 21వ రోజున మొత్తం పద్యాలన్నీ తిరిగి ఏకదాటిగా అప్పగించాలి ఒకే రోజులో దీన్ని సహస్రావధానం అంటారు. అది మా అమ్మ దయవల్ల నేను చేయగలిగాను అందుకని మహా సహస్రావధాని అన్నారు ఇక్కడ [ప్రశంస] అది ఎవరు ఒక్కసారిగా చేయలేరు అంతకంటే ముందు ఎనిమిది మందితో చేసిన అష్టావధానాలు 300 పైగా చేశాను.
(02:14) 100 మందితో రెండు రోజుల్లో చేసే శతావధానాలు 10 పైగా చేశాను. 200 మందితో ఐదు రోజుల్లో చేసే ద్విశతావనం 200 అది ఒకసారి చేశాను. ఇలా చేశక అనుభవం మీద ఇది చేసి చేస్తే అది సాధ్యమైంది. ఇంతటి ప్రజ్ఞ నాకు కలగడానికి నాకు కలిగి నాకున్న ఆత్మవిశ్వాసం నాలో పెరగడానికి కారణం మా అమ్మ అందుకే ఆ అమ్మకు ముందుగా నమస్కారం చేస్తున్నాను నేను తల్లిని నమ్మినవానికి ఎన్నడైనంత బిబ్బులంచుండుని ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తాను చదువుకున్నా చదువుకోకపోయినా మా చదువులకు ఎంతో సహకరించింది ఆవిడ

No comments:

Post a Comment