Friday, January 16, 2026

 143C5;2111d6;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

                 *ధర్మ రక్షణ*
                ➖➖➖✍️
               ( జ్యోతిర్మయం)
       -అమ్మాజీ ఉమామహేశ్వర్
```
ఒకసారి రాక్షస రాజు ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు,  అంగీరస ముని  కుమారుడు సుధన్వుడు ఒక కన్యను పొందడానికి, ‘నేను శ్రేష్టుడినంటే కాదు నేనని’ వాదించుకుని ప్రాణాలను పణంగా పెట్టుకొని పందెం వేసుకున్నారు.

తమలో శ్రేష్ఠుడెవరో  తీర్పు చెప్పమని ప్రహ్లాదుని కలిశారు.

ఒకవైపు కొడుకు, మరోవైపు ధర్మం ఉన్నాయి కాబట్టి సులువుగా నిర్ణయించకుండా కశ్యపుని కలుసుకుని….                                          “ధర్మ సంకటంలో ఇరుక్కున్నాను. ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వక పోవడం వలన,  తెలిసి తెలిసి ఏదో ఒక  సమాధానం చెప్పడం వల్ల ఎటువంటి గతి కలుగుతుందో చెప్పమని”  కోరాడు ప్రహ్లాదుడు.

“తెలిసి కూడా రాగద్వేషాలకు, భయానికి లోనై సరైన సమాధానం చెప్పని వాడు,   సాక్ష్యం చెప్పడంలో వెనుకంజ వేసే సాక్షి,  ఏదో ఒకటి చెప్పేవాడు — వరుణుని యొక్క సహస్ర పాశాలలో చిక్కుకుంటారు. ఏడాదికొక్క  పాశం ముడి మాత్రమే  వీడుతుంది.  కాబట్టి నిజం స్పష్టంగా తెలిసినవాడు, సత్యాన్ని చెప్పి తీరాలి . ఎక్కడైనా సభలో అధర్మం ధర్మాన్ని అణిచి వేసినప్పుడు అక్కడి సభ్యులు అధర్మాన్ని తొలగించకపోతే సభా సదులకు కూడా పాపం అంటుకుంటుంది.  సభలో నిందితునికి శిక్ష వేయకపోతే సభాపతికి అధర్మఫలంలో సగభాగం,  చేయించిన వాడికి నాలుగో వంతు,  ఇతర సభ్యులకు నాలుగో వంతు పాపం చుట్టుకుంటుంది. నిందితునికి తగిన శిక్ష విధించబడితే సభాపతికి,  సదస్సులకు పాపం అంటకుండా నిందితునికే మొత్తం చెందుతుంది.

తెలిసికూడా ప్రశ్నకు ధర్మ విరుద్ధంగా సమాధానం చెబితే అతనికి ముందు వెనుకల ఏడు తరాలకు శ్రౌతస్మార్తాది శుభకర్మలు నశించిపోతాయి.  ప్రత్యక్షంగా చూసి, విని,  జ్ఞాపకం తెచ్చుకొని కూడా సాక్ష్యం ఇవ్వవచ్చు.  సాక్షి సత్యవాది అయితే అతని ధర్మార్ధాలు నశించవు”  అన్నాడు  కశ్యపుడు.

ధర్మమార్గంలో నిలవాలనుకున్న ప్రహ్లాదుడు, తన  కొడుకు ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ ,  విరోచనుడికంటే సుధన్వుడు శ్రేష్టుడని తీర్పు చెప్పాడు.

పుత్ర ప్రేమకు లోబడని ప్రహ్లాదుని  ధర్మ రక్షణ నిరతికి మెచ్చుకుని విరోచనుడు వందేళ్ళు జీవిస్తాడని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సుధన్వుడు.✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

No comments:

Post a Comment