Friday, January 16, 2026

 💐32శ్రీలింగమహాపురాణం💐

🌼పరమేశ్వరుని భస్మధారణ, దిగంబర లీలల వివరణ🌼
   
  #ముప్పై రెండవ భాగం#

భృగు, అంగిరస, అత్రి,పులస్త్య, పలహ, క్రతు, మరీచి, వసిష్టాది మహర్షులుదారుకావనమునులతోచేరిమహేశ్వరునికినమస్కరించి "మహాదేవా! భస్మధారణ చేయడం,దిగంబరంగాతిరగటంపూజలలో వామచారాలను పాటించటం , సశ్మానంలో నివాసం, పరస్పర విరోధమైన కార్యాలు చేయడం  మొదలైన తమరి శివలీలలలో దాగిన గుప్తతత్త్వములనుతెలియ
చేయండి. ఈ సేవ్యా సేవ్యా రూపముల అంతరార్థం ఏమిటి"? " అని ప్రార్ధించారు.

పరమేశ్వరుడు దయాళుడై "మహర్షులారా! లోకహితము కోసం నా లీలల అంతరార్థం వివరిస్తాను.నేనేఅగ్నిదేవుడను. అలాగే అగ్నికి ఆశ్రయమైన సోముడనునేనేఅగ్నిప్రపంచములోగలచరాచరవస్తువులన్నింటిని కాల్చిదహనంచేస్తుంది.కాల్చి దహనమైన వాటినుంచిబూడిద అనగా భస్మముపుడుతుంది.ఈ భస్మమువలనచంద్రునకు,చంద్రునినుంచిభూమికిఓషధులను ఉత్పత్తి చేసే శక్తి లభిస్తుంది.

ఓషధులు ప్రాణుల రోగములు నివారించి శక్తి సామర్థ్యాలు ఇస్తాయి. కనుకనే మానవులు యజ్ఞాలుమొదలైనఅగ్నికార్యాలుచేసిఆహుతులుసమర్పిస్తారు. తద్వారా తమ పాపాల నుండి విముక్తి పొందుతారు. అందుకు ఆహుతుల భస్మం లోని పాపహరణ శక్తి నా శక్తి అవ్వడం కారణము.

"భస్మన్" అనే శబ్దం 'భాస' అనే శబ్దంనుండివచ్చింది.భాసనము అనగా ప్రకాశించుట అనేఅర్ధం. అలాగే భూ ధాతువు నుండి వచ్చిన భక్ష లేక భక్షతి అంటే తినుట అని అర్థం వస్తుంది.  పాపములను భక్షణ చేస్తుంది కాబట్టిభస్మముఅనిచెప్ప
బడుతోంది.

పితృదేవతలు ఊష్మాదులను త్రాగుతారు.దేవతలుసోమపానముచేస్తారు.ఈచరాచరప్రపంచమంతా అగ్ని, సోముల ప్రకృతి. అగ్ని సోమాత్మకుడు.నేనుమహా తేజస్బు గల అగ్ని అయితే, నా  అర్థభాగమైనఉమాదేవియేసోముడు.పురుషుడు,ప్రకృతికూడా నేనే అని మీకు తెలుసును కదా.మునులారా! కావున భస్మము నా శక్తి అవుతుంది. నేను నా శరీరము నుంచే శక్తిని ధరిస్తున్నాను. అందుకని భస్మము ప్రజలను అశుభ కార్యముల నుండి రక్షిస్తూ ఉంది.  భస్మధారణ చేత పవిత్ర మైనవాడు ఇంద్రియములను, కామక్రోధాదులను జయిస్తాడు.  శివ సాయిజ్యం పొంది తిరిగి జన్మ ఎత్తడు.

ఇందుకోసంపాశుపతయోగముకపిలుని సాంఖ్య యోగము నేనే సృష్టించి వృద్ధిచెందేట్టుచేసాను. మొదట పాశుపత యోగాన్ని పూర్ణ రూపంలో ఏర్పాటు చేసాను. తరువాత బ్రహ్మ మానవులకు నాలుగు ఆశ్రమాలు ఏర్పరిచాడు. మోహము, భయము, సిగ్గు లజ్జాయుతమైన సృష్టిని నేనే చేశాను.

మునులారా!  ప్రాణులందరు పుట్టినప్పుడు దిగబరంగానే పుడతారు. జంతువులు, మృగాలు, పశు పక్ష్యాదులు జీవితాంతం దిగబరంగానే ఉంటాయి. వాటికి ఎటువంటి తేడా లేదా బేధము ఉండదు. కానీ మనస్సు, బుద్ది, జ్ఞాన కర్మేంద్రయాలు గల మానవులు సిగ్గు లజ్జ మోహ భరితమైన మానవప్రపంచంలోఅడుగిడగానే తమ  శరీరాలను వస్త్రాలు, జంతుచర్మాలతోకప్పిదాచుకుంటారు.ఎందుకంటేవారిశరీరాలన్ని ఒకటిగా ఉన్నా   దేహానికి సంబంధించిన సిగ్గు లజ్జ మోహము మొదలైన లక్షణాలు వారిని ఒకరి నుంచి ఒకరిని వేరు చేస్తాయి. తమకు తామే ప్రత్యేకం అని భావిస్తారు. 

కాని జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రయాలను, మనస్సు, బుద్దిని మానవుడుస్వాధీనంలో ఉంచుకోగలిగితే ఎటువంటి మానసిక శారీరక వికారాలు మనిషికి కలుగవు. శరీరం పై వస్త్రములు ధరించినా, ధరించక పోయినా ఎటువంటిబేధముకన పడదు. మనుషులు తమలోని జీవాత్మలనుమాత్రమేచూస్తారు.

నిజానికిమానవులకుక్షమ,ధైర్యం,అహింస,వైరాగ్యం,మానావ మానాలను సమానంగా చూడటం మొదలైనవి ఉత్తమ ఆచ్ఛాదనంవస్త్రముఅవుతుందిభస్మ ధారణ అనేది బాహ్య శరీరాన్ని పవిత్రం చేస్తుంది, అంతర శరీరాన్ని (మనస్సు) శివధ్యానంలో ఉండేటట్టు చేస్తుంది. సర్వ పాపాలు అగ్నికి అడవి భస్మంఅయినట్టుభస్మమై పోతాయి.

యజ్ఞయాగాదులు, వ్రతాలు చేసి మహాదేవుని మహత్మ్య లీలలు అర్థం చేసుకుని పరమేశ్వరుని మనస్సులో ధ్యానము చేసేవారు ఉత్తర మార్గంలో ప్రయాణం చేసి అమరత్వం పొందుతారు.దక్షిణ మార్గము ద్వారా యతులు, సిద్దులు అణిమాది అష్టసిద్దులు పొంది కోరిన వాటిని లభింప చేసుకుంటారు. సిద్దుల పొందిన తరువాత శివయోగులై అమరత్వం పొందుతారు.

మద మోహ రహితులు, తమ రజోగుణ రహితులు పాశుపత యోగం పాటించి జితేంద్రియులై సమస్త పాపముల నుండి విముక్తులై రుద్రలోకం చేరు కుంటారు. అందుకే వసిష్టాది మునులందరు తమ శరీరముల పైభస్మధారణచేసుకునివిరాగులై విరక్తులై జీవించి  ప్రతి కల్పాంతము నందు రుద్రలోకం చేరుకుంటున్నారు.

ఇటువంటిశివభక్తులనుశివునితో సమానంగాసేవించాలి.పాశు పత వ్రతము స్థిరచిత్తంతో ఆచరించిన వాడు పాపములు పోగొట్టుకుని నా అనుగ్రహం పొంది శివభక్తుడు అవుతాడు. శివభక్తి చేత ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదు.   శివభక్తి చేతనే దధీచి మహర్షి దేవతలకుదేవుడైనమహావిష్ణువుని జయించ గలిగాడు. కావున శివభక్తులైన జటా ధారులు, ముండిత శిరస్సులు, దిగంబరులు, భస్మధారులు శివునితో సమానులై లోకంలో అందరికి పూజనీయులు అవుతారు"

అన్న మహాదేవుని భాషణం నందిద్వారావిన్నసనత్కుమారుడు నందిని విష్ణువుని ఓడించిన దధీచి మహర్షి కథ చెప్పమని కోరాడు.*తరువాత కధ రేపటి భాగంలో చెప్పుకుందాం
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment