*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼♂️భక్తుడు : భగవాన్ ! మోక్ష సామ్రాజ్య సిద్ధికి ఈశ్వరానుగ్రహం అవసరమా ! ఎవరిని చేరుకుంటే మరల మరల జనన మరణాలు కలుగవో వాని దరికి జీవుని శ్రద్ధా, అవిరామకృషి మాత్రమే చేర్పగలవా !?_*
*_🦚 మహర్షి : ఆత్మప్రాప్తికి ఈశ్వరానుగ్రహం అవసరము. దానివల్లనే ఈశ్వర సాక్షాత్కారము. ముక్తి మార్గాన శ్రమ అని అనుకోక నిర్విరామంగా యత్నించే శ్రద్ధ ఉన్న భక్తునికీ, సత్యయోగికి మాత్రమే అట్టి అనుగ్రహము ప్రసాదింపడుతుంది._*
************************
*_🦚 శరణాగతి అంటే ఏదో గురువుకు ఎంతో కొంత పైకం ఇచ్చి నేను శరణుజొచ్చాను అని చెప్పడం కాదు. శరణు చెందే ప్రతిసారీ అహం తలెత్తుతూ ఉంటుంది. దాన్ని అణచి వేయాలి. శరణాగతి అంత తేలికయినదికాదు. అహంకారాన్ని చంపడం అంత సులభంకాదు. భగవంతుడు తానుగా అనుగ్రహం చూపి మనస్సును లోనికి మళ్ళిస్తే తప్ప._*
************************
*_🧘🏼♂️భక్తుడు : భగవాన్ ! ఈ ప్రాపంచిక సుఖాలు పనికిమాలినవనీ, బాధాకరమనీ కూడా మాకు తెలుసును. కాని వాటిని వదలలేము. వాటియందలి మా కోరికలను పోగొట్టుకొనటం ఎట్లా ?_*
*_🦚 మహర్షి : భగవంతుని గూర్చి తలచుకోండి. బంధాలు క్రమంగా వాటీయంతట అవే విడిపోతాయి. కోరికలన్నీ తీరేవరకూ భక్తి-ప్రార్థనలను ప్రక్కన పెడితే, దైవం కోసం మీరు చాలాకాలం వేచి ఉండవలసి వస్తుంది !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 🙏
*_🧘🏻 ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
No comments:
Post a Comment