161f8;
🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.162
*మన ఆరోగ్యం…!
*ప్రశ్న:-* *గాయాలు, పుండ్లు అయిన వారు పప్పు తినవచ్చా... తింటే చీము పడుతుందా ? నిజమెంత ?*
➖➖➖✍️
*సమాధానం:-*
*గాయాలు, పుండ్లు అయినప్పుడు భేషుగ్గా పప్పు తినవచ్చ*
గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పు తింటే చీము పడుతుందని అనడంలో ఎంతమాత్రం నిజం లేదు.
అదంతా తప్పు.
నిజానికి అలాంటి స్థితిలో పప్పు తింటేనే మంచిది.
ఎందుకంటే పప్పులలో ప్రోటీన్లు ఎక్కవగా ఉంటాయి. అవి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి. అందువల్ల గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పును నిరభ్యంతరంగా తినవచ్చు.
అంతేకానీ ఆ స్థితిలో పప్పును తింటే చీము పడుతుందని అస్సలు అనుకోరాదు. భేషుగ్గా పప్పును తినవచ్చు.
*అయితే చీము ఎందుకు పడుతుంది ?*
అందుకు పలు కారణాలు ఉన్నాయి.
అవేమిటంటే.. గాయాలు లేదా పుండ్లు అయినప్పుడు వాటిని రోజూ శుభ్రం చేయాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్ అయి చీము పడుతుంది.
ఇక వాటి స్థానంలో సూక్ష్మ క్రిములతో తెల్ల రక్త కణాలు పోరాటం చేస్తాయి. దీంతో అవి చనిపోతాయి. ఈ క్రమంలో అవి చీముగా మనకు కనిపిస్తాయి.
ఆలస్యమైతే అవి ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి చీము పడుతుంది.
దీంతోపాటు దుమ్ము, ధూళి ఎక్కువగా పడడం, పలు రకాల ఆహారాలను తినడం వల్ల అవి మానడం ఆలస్యం అవుతుంది.
ఈ క్రమంలో చీము ఎక్కువగా చేరుతుంది. చీములో చనిపోయిన కణాలు, ఇతర కణజాలం, తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే చీముకు, పప్పుకు ఎంతమాత్రం సంబంధం లేదు. గాయాలు, పుండ్లు అయినవారు నిరభ్యంతరంగా పప్పును తినవచ్చు. దాంతో చీము ఏమీ పట్టదు.
కావున, ఈ సమాచారాన్ని అపోహలు ప్రభావితం కాకుండా ఉండేందుకు మీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో షేర్ చేయండి.✍️-సేకరణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
No comments:
Post a Comment