🚫పట్ట పగలే జరుగుతున్న దోపిడీ అంటే ఇదే | Anukula Vedam || Telugu Podcast
https://youtu.be/h4EFMhX5-5I?si=nz3bylcVzrgLe7yV
https://www.youtube.com/watch?v=h4EFMhX5-5I
Transcript:
(00:02) మనమంతా అనుకుంటూంటాం మనం చరిత్రలోనే బెస్ట్ టైం లో బ్రతుకుతున్నామని ఇన్ని సౌకర్యాలు అవకాశాలు మన చరిత్రలోనే ఎప్పుడు లేవని మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా లోపల మాత్రం ఏదో ఖాళీగా వెలితిగా ఎందుకు అనిపిస్తుందని మాత్రం ఎవరికి వారు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఒకసారి మీ ఫోన్ తీసి ఏ స్విగ్గినో జొమాటో ఓపెన్ చేసి చూడండి. బిర్యానీ కావాలా, వెజ్ కావాలా, చైనీస్ కావాలా, పులావ్ కావాలా 100 రకాల రెస్టారెంట్లు వెయ్యే రకాల వంటకాలు.
(00:27) వామ్మో నాకు ఇన్ని ఆప్షన్స్ ఇందులో నేను ఏదైనా ఎంచుకోవచ్చా అని మీకు బోల్డ్ అంత ఫ్రీడమ్ ఉన్నట్లు ఫీల్ అవుతారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి అసలు ఈ యప్స్ లో ఉన్న రెస్టారెంట్స్ లో నుంచే మీరు ఎంచుకోవాలని ఎవరు డిసైడ్ చేశారు? వాడు చూపించే ఆ మెనుూ లో నుంచే సెలెక్ట్ చేసుకోవాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు అసలు ఇంట్లో వండుకొని తినే బదులు ఇలా ఆర్డర్ చేసుకోవడమే బెస్ట్ అనే ఆలోచన మనలో ఇన్స్టాల్ చేసి కంట్రోల్ చేస్తున్నది ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా లేదు ఎవరో మనకోసం ముందే ఒక లిస్ట్ తయారు చేసి ఉంచారు.
(00:54) ఇప్పుడు ఆ ముందే సెలెక్ట్ చేసి పెట్టిన లిస్ట్ లో నుంచి మాత్రమే మనం ఒకటి ఎంచుకోవాలి అనేలా చేస్తున్నారు. దీన్ని మనం ఫ్రీడమ్ అనుకుంటున్నాం. ఆధునిక స్వేచ్ఛ అంటే ఇది. మోడరన్ ఫ్రీడమ్. ఈ మోడర్న్ ఫ్రీడమ్ అనే మత్తులో మనల్ని ముంచి ఈ భ్రమల్నే మనకి అమ్మేస్తున్నారు. ఇదొక పిల్లల మెనుూ లాంటిది కలర్ఫుల్ గా చూడడానికి చాలా బాగుంటది.
(01:13) కానీ ఆప్షన్లు చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఏవి అమ్మాలని వాళ్ళు డిసైడ్ అయ్యారో అందులోనుంచి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకునే విధంగా ముందుగానే అన్ని సిద్ధం చేసి ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కెరీర్ ని తీసుకోండి. ఇంజనీరింగే బెస్ట్ డాక్టర్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. గవర్నమెంట్ జాబ్ కొట్టేవంటే ఇంకా తిరుగు ఉండదు. ఇలా మన చుట్టూ అల్లేసిున్న ఒక సిస్టం మన పేరెంట్స్ కి దేని వల్ల డబ్బు బాగా వస్తదో ఏదైతే ఎక్కువ లాభదాయకంగా ఉంటదో ఆ దారిలో వాళ్లే కొన్ని ఆప్షన్స్ పెట్టి చూపిస్తారు.
(01:38) చచ్చినట్టు మీరు వాటిలో చేయించుకునే ఇలా చేస్తారు. సపోజ్ నాకు ఒక ఫిలిం రైటర్ అవ్వాలని ఉంది, ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, వ్లాగర్ అవ్వాలని ఉంది అని అన్నావ అనుకో అవ్వచ్చమ్మా పర్లేదు మనిషి అన్నాక ఏదైనా అవ్వచ్చు బట్ నువ్వు ఆర్టిస్ట్ అయితే దాని వల్ల నీకు ఖచ్చితంగా బోల్డ్ అంత డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఉందా కాబట్టి దేని వల్ల అయితే కచ్చితంగా ఇమ్మీడియట్ గా డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఉంటదో ఏది చేస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తమ పనులు మానుకొని మరి తల ఎత్తి నేను చూస్తారో అదే నువ్వు చేయాలి అని మెల్లగా ప్రతి క్షణం ఏదో ఒకలా మన బుర్రలో నాటుకుపోయేలా చేస్తారు. న్యూస్
(02:06) పేపర్స్ లో టీవీలో ఇంటర్నెట్ లో రోడ్డు మీద కనబడే హోల్డింగ్స్ లో ఇంకా ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా నువ్వు కళ్ళు మూసినా తెరిచినా పడుకున్నా నీ కలలో కూడా అవే రావాలి అనేలా ప్రోగ్రాం చేస్తారు. ఇదంతా కూడా ప్రాణం ఉన్న ఒక మనిషిని వాళ్ళకు ఉపయోగపడే వినియోగ వస్తువుగా మార్చేయడానికి జరుగుతున్న ఒక పెద్ద దంద.
(02:24) ఇంత పెద్ద ప్రపంచంలో ఎన్నో కోట్ల అవకాశాలు ఉన్నా సమాజం యాక్సెప్ట్ చేసే ఐడియాస్ మాత్రం గట్టిగా తింటే 10 15 కంటే ఉండవు. ఉండవు అని మనకు అనిపించేలా చేస్తారు. ఈ వాళ్ళు డిసైడ్ చేసిన 10 15 అవకాశాల్ని ఎంత బాగా డెకరేట్ చేసి అమ్ముతారంటే మీ జీవితం మొత్తం ఒక చిన్న జైల్లో ఇరుక్కిపోతుందని మీకు ఎప్పటికీ తెలియదు. నాకు ఎంచుకోవడానికి ఏకంగా 10 15 వెరైటీలు ఉన్నాయా అని ఒక మాయలో పడిపోయి దాన్నే మీరు ఫ్రీడమ్ అనేసుకుంటారు.
(02:48) ఫ్రీడమ అంటే మీరు ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ కనబడే 50 రకాల టూత్ పేస్ట్ ని చూసి అబ్బా నాకు ఎంచుకోవడానికి ఎన్ని వెరైటీలు ఉన్నాయో అని మురిసిపోవడం కాదు అసలు ఈ టూత్ పేస్ట్ అనే ఇండస్ట్రీ ఇంత బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా ఎలా ఎదిగిపోయిందని ప్రశ్నించగలగటం. అసలు ఇన్ని రకాల టూత్ పేస్ట్లు నా ముందు పెట్టడానికి కారణం నా బ్రెయిన్ లో కావాలనుకుంటున్న జాయిస్ కోసమా డిసైడే చేసుకోలేని నాయిస్ కోసమా అని ఆలోచించగలగడం అంతెందుకు అసలు ఈ సోషల్ మీడియాని చూడండి మన భావాల్ని స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేయడానికి మనకోసం డిజిటల్ గా ఒక ప్లాట్ఫామ్ ఉందనే భావన
(03:19) కలిగిస్తది. కానీ మన భావనలు నిజంగానే ప్రపంచం నలమూలకి వెళ్తున్నాయా వెళ్ళవు ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసే అల్గరిథం అనేది ఒకటి ఉంటది. అది ఎలాంటి కంటెంట్ ని ఎక్కువ మంది చూసేలా చేయాలో ఎలాంటి కంటెంట్ లో మేటర్ లేకపోయినా ఏదో హడావిడి చేసేసి మనల్ని ఆ స్క్రీన్ ల కొద్దుకుపోయేలా చేయగలదో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికే ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేస్తది.
(03:41) బికాజ్ అప్పుడేగా యడ్ రివ్యూ ఎక్కువ జనరేట్ అవుద్ది. సో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది కూడా ఎవరో డిసైడ్ చేస్తారు. అలా కాకుండా మీ మనసులో ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడాలి అనుకుంటే మాత్రం అది ఎవ్వడికీ రీచ్ అవ్వదు. 1000 వ్యూస్ కూడా రావు. ఇంకా పచ్చి నిజాలు మాట్లాడితే ఏకంగా ఛానల్ ని లేపేస్తారు. ఏదైనా ట్రెండీగా ఉండేది అప్పటికప్పుడు వైరల్ అయ్యేది పెడితే మాత్రం క్షణాల్లో మిలియన్స్ లో రీచ్ వస్తది.
(04:03) దీన్ని మనల్ని మనం వ్యక్తీకరించుకోవడం అనరు. జస్ట్ ఎవరి కోసమో స్టేజ్ కి పెర్ఫార్మెన్స్ చేయడం అంటారు. అంటే మీరు లైక్స్ వ్యూస్ కోసం ఎవరి కోసమో నాటకాలు ఆడుతున్నారు అన్నమాట. అంతే ఇక్కడే ఉంది అసలైన డేంజర్. అదేంటంటే లైఫ్ లో ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు కంట్రోల్ నా చేతిలోనే ఉంది అనుకుంటూ హ్యాపీగా గడిపిస్తుంటారు కొంతమంది అలా మీకు ఎందుకు అనిపిస్తుందంటే మీరు ఏ రోడ్ల మీద అయితే స్వేచ్ఛగా డ్రైవ్ చేసేస్తున్నాను అని అనుకుంటున్నారో ఆ రోడ్లు మీరు రాకముందే ఎవరో వేశారు.
(04:30) మనం ఏ ఇంజనీరింగ్ కాలేజీ కి వెళ్ళామో ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నామో ఏ బ్రాండ్ బట్టలు వేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఆ ముందే వేసిన రోడ్లు. ఈ భ్రమ అసలు ఏ మాత్రం భ్రమలో అనిపించకుండా ఎందుకు ఇంత బాగా పనిచేస్తుందంటే అది మనకు సరిపడేటన్ని రివార్డ్స్ ని ఇమ్మీడియట్ కి ఇచ్చేస్తుంటది. ఒక రీల్ వైరల్ అయితే వచ్చే కిక్ ఇమ్మీడియట్ గా కొంత డోపమైన్ రిలీజ్ చేస్తది.
(04:51) జాబ్ లో చిన్న ప్రమోషన్ వచ్చేసరికి సక్సెస్ అయిపోయినని ఫీల్ అయిపోయి మళ్ళీ కొంత డోపమైన్ రిలీజ్ చేస్తది. సోషల్ మీడియాలో లైక్స్ కామెంట్స్ అప్రిసియేషన్ వచ్చేసరికి దానికి కూడా కొంచెం డోపమైన్ రిలీజ్ చేస్తది. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే ఇదేనా అసలైన స్వేచ్ఛ అంటే నేను అసలు నిజంగా హ్యాపీగా ఉన్నానా అని మనకి మనం ఏ మాత్రం ఆలోచించనీయకుండా చేస్తాయి.
(05:10) నిజమైన స్వేచ్ఛ అంటే ఒక లిమిటెడ్ బాక్స్ లో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉండడం కాదు. అసలు ఆ బాక్స్ అక్కడ ఎందుకు ఉందో తెలుసుకోవడం. నాకు ఇది ఇష్టమైనదే అని నేను దేని గురించి అయితే అనుకుంటున్నానో ఇది నాకు ఇష్టంగా ఎందుకు మారింది ఎలా మారింది? ఇది నా సొంత ఆలోచన లేదా పక్కోడిని చూసి నేర్చుకున్నానా నా డెసిషన్స్ వల్ల ఎవరికి లాభం వస్తుంది అని ప్రశ్నించడం.
(05:27) ఎప్పుడైతే మీరు ఇలా నిజంగా ప్రశ్నించడం మొదలెడతారో అప్పుడే ఆ మాయ తొలగిపోవడం మొదలవుద్ది. ఈ ఆధునిక సమాజం మనల్ని కంట్రోల్ చేయడానికి బలాన్ని వాడట్లేదు ప్రేమను వాడుతుంది. నువ్వు ఆల్రెడీ ఫ్రీగానే ఉన్నావు అని చెప్పి మనల్ని ఒక కంఫర్ట్ జోన్ లో పెట్టి కంట్రోల్ చేస్తుంది. కానీ రియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు రెస్టారెంట్ లో ఉన్న మెనుూను చూసి అందులో ఉన్నవి మాత్రమే ఆహారం అని అనుకోవడం మానేసినప్పుడు.
(05:49) మీరు ఈరోజు ఉదయం ప్రశాంతంగా నిద్రలేచారు. ఇలా ఫోన్ ఓపెన్ చేశరో లేదో ఎలాన్ మస్క్ కి కూడా రోజుకి 24 గంటలే అనే కోడ్ కనబడింది. అంతే సడన్ గా మీ మైండ్ లో ఒక రేస్ మొదలవుద్ది. ఒక అలారం మోగుద్ది. ఈమెయిల్స్వాట్ మెసేజ్లు ఆఫీస్ పనులు, ఇంటి పనులు, పిల్లల స్కూల్, ఫంక్షన్స్ బోల్డ్ అంత లిస్ట్ గుర్తొస్తది. ఈమెయిల్స్ కి రిప్లై ఇవ్వాలి ఆ పని చెక్ చేయాలి ఈ గోల్ రీచ్ అవ్వాలి.
(06:10) అసలు పళ్ళు తోమకముందే మనం ఎక్కడో వెనక్కి పడిపోయినట్టు ఫీలింగ్. వెల్కమ్ టు ద ప్రొడక్టివిటీ ట్రాప్. దీన్ని ట్రాప్ అని ఎందుకన్నానంటే ఇక్కడ బిజీగా తిరగడమే గొప్ప అన్నట్టు బిల్ అప్ ఇస్తారు. నువ్వు ఎవరో అన్నదానికంటే నువ్వు ఎంత పని చేశవు అన్నదానికే ఇక్కడ వాల్యూ కాలేజీలో మంచి మార్కులు ఐఐటి లో సీటు మంచి కంపెనీలో జాబు హై శాలరీ ప్యాకేజీ ఇల్లు కారు ఇవన్నీ సాధిస్తూ ఉంటేనే నువ్వు గొప్ప కష్టపడే వాళ్ళని అసలు నిద్రే లేకుండా హడావిడి చేసే వాళ్ళని మాత్రమే సమాజం నెత్తిని పెట్టుకుంటది.
(06:36) బర్న్ట్ అయిపోవడని ఒక ఫ్యాషన్ లో చూపిస్తారు. సరిపడా నిద్రపోకపోతే అదేదో గొప్పతనం అన్నట్టు ఫీల్ అవుతారు. మనం మైల్స్టోన్స్ ని రీచ్ అవ్వాలని పరిగెడతాం. అవి మనకి నిజంగా సంతోషాన్ని ఇస్తాయని కాదు పక్కోడి కంటే ఫ్రెండ్స్ కంటే వెనక పడిపోతామ అనే భయంతో నువ్వు ఎంత అవుట్పుట్ ఇస్తే నీకు అంత విలువ ఇదే ఈ ట్రాప్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ మనం ఈ ట్రాప్ లో పడేటట్టు ఎలా చేస్తారు చిన్నప్పటి నుంచే మనల్ని కండిషన్ చేశారు.
(06:57) ఎగ్జామ్స్ లో మంచి మార్కులు, కాలేజీలో ర్యాంకు, జాబ్ లో ప్రమోషన్లు, సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ వీటి వెంటే పడాలి అని ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ వాల్యూ అని ఒక ప్రమాదకరమైన ఈక్వేషన్ ని మన మైండ్ లో ఫిక్స్ చేశారు. కాలక్రమేనా అదే మన రియాలిటీగా అయిపోయింది. అది నిజం కాబట్టి కాదు పదే పదే అదే వింటున్నాం కాబట్టి ప్రశ్నించడం మానేసాం.
(07:15) ఇక్కడే ఉంది అసలు పాయింట్ సొసైటీ దీన్ని కావాలని ఇలా డిజైన్ చేసింది. నువ్వు ఎంత అభద్రత భావంతో ఉంటే అంత ఎక్కువ పని చేయడానికి ట్రై చేస్తావ్. ప్లానర్లు కొంటావ్ యప్స్ డౌన్లోడ్ చేస్తావ్ ఆన్లైన్ కోర్సులు చేస్తావ్ ఇంకొంచెం కష్టపడితే ఏదో ఒక రోజు శాంతి దొరుకుతుంది అనుకుంటాం. కానీ అది దొరకదు ఎందుకో తెలుసా టార్గెట్ ఎప్పుడూ మారుతూనే ఉంటది.
(07:34) ఇదొక ట్రెడ్మిన్ దానికి ఆఫ్ స్విచ్ లేదు. ఆఖరికి ఫ్రీ టైం ని కూడా లాగేసుకున్నారు. సినిమాలు చూస్తున్నావా ఏ పర్పస్ లేకుండా చూడకూడదు వెబ్ సిరీస్ చూస్తున్నావా ఏదైనా నేర్చుకునేది అయి ఉండాలి పుస్తకం చదువుతున్నావా అది సెల్ఫ్ హెల్ప్ బుక్ అయితేనే మంచిది నడవడానికి వెళ్తున్నావా అడుగులని ట్రాక్ చేయాలి. ఏమి చేయకుండా ఉన్నావా అదేంటి సోమర్తనం దానికి కూడా మైండ్ ఫుల్ రికవరీ అని ఏదో ఒక పేరు పెట్టి దానికి కూడా టైం టేబుల్ వేయాలి.
(07:55) ఉద్దేశం లేకుండా ఏ పర్పస్ లేకుండా ఏ ఎజెండా లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలో మర్చిపోయాం. మనిషిని మనిషిలా కాకుండా ఒక మెషిన్ లా ఉండేలా చేస్తున్నారు. ప్రతి గంట ఫుల్ కెపాసిటీతో పని చేయడానికి నువ్వు పుట్టలేదు ప్రకృతి ఏడాది పొడవున పూలు పూయిస్తుందా లేదు కదా మరి నువ్వెందుకు ప్రతి క్షణం హై ఎనర్జీతో ఉండాలి. మనకు అర్థం కానీ భయంకర నిజం ఏంటంటే ప్రొడక్టివిటీ కల్చర్ అనేది ఒక నిశశబ్ద బానిసత్వం.
(08:19) నీకు నువ్వే ఇష్టపడి ఆ పనులు గొలుసులు వేసి కొట్టుకొని నేను నా లైఫ్ లో చాలా ఫ్రీగా ఉన్నాను అని నమ్ముతున్నావ్. రెస్ట్ తీసుకోవాలంటే నేరం చేసినట్టు అనిపిస్తుంది. ఏమి చేయకుండా ప్రశాంతంగా ఉంటే అదేదో ఫెయిల్యూర్ అన్నట్టు ఫీలింగ్. ఇదొక సైకలాజికల్ ఐడెంటిటీ క్రైసిస్ మనం పనికి బానిసలం కాదు పనికి వస్తాము అని ఒకరితో అనిపించుకునే ఆ అనిపించుకోవడానికి బానిసలం అంటే నువ్వు పనికివస్తావో లేదో అన్నది ఇంకొకరు చెప్తేనే గాని నమ్మలేని స్థితిలో ఉండడం కంటే బానిసత్వం ఇంకోటి ఉంటదా నువ్వు ఎప్పుడు ప్రొడక్టివ్ గా ఉంటేనే నీకు వాల్యూ అని నమ్ముతున్నావ్.
(08:45) మరి ఒకవేళ ప్రొడక్టివిటీ ఆపితే అప్పుడు నువ్వు ఎవరు పని చేయనప్పుడు నీ ఐడెంటిటీ ఏంటి ఏ ఐడెంటిటీ లేకుండా కొన్నిసార్లునా ఉండటం నేరమా ఒక రాడికల్ ఆలోచన చెప్తాను వినండి. మీరు ఈ సొసైటీకి నచ్చినట్టు లేకపోయినా సరే ఏమి చేయకుండా నిస్సలంగా ఉన్నా సరే నీకు రెస్ట్ తీసుకోవడానికి ఎవ్వడి పెర్మిషన్ అక్కర్లేదు. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీకున్న బేసిక్ నీడ్స్ అంటే కూడు గుడ్డ నిద్ర సమకూర్చుకోగలిగినప్పుడు నీకు అలా ఉండడంలో ఆనందం కలుగుతున్నప్పుడు దట్స్ ఫైన్ అలానే ఉండు ఇది నీ జీవితం నీకు ఎలా ఉండాలందో అలా ఉండే పూర్తి అర్హత నీ లైఫ్ మీద నీకు
(09:15) మాత్రమే ఉంది. బికాజ్ నీ జీవితం ఎవడికో చూపించే పెర్ఫార్మెన్స్ కాదు. అలా ఇంకొకరికి చూపించాలి అనే మైండ్సెట్ తో బ్రతికటోళ్ళకి కోట్ల కొద్ది డబ్బు ఉండొచ్చు బట్ మనస్సంతి మాత్రం ఎప్పటికీ ఉండదు. బట్ అది ఎవడు బయటికి ఉండవు. బికాజ్ మనస్సంతి కలగనప్పుడు ఆ డబ్బు ఉన్నా ఓడిపోయినట్టే అలా ఓడిపోయాను అని బహిరంగంగా ఒప్పుకోవడానికి ఎవడైనా ఎందుకు ఒప్పుకుంటాడు అలా ఒప్పుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే చాలా పెద్ద సామ్రాజ్యానికి రాజుయండి కూడా బుద్ధుడిగా మారిపోయిన గౌతముడు ఒక్కడే.
(09:42) బుద్ధుడు ఏమంటాడంటే హడావిడికి బానిస అయిపోయిన ఈ ప్రపంచంలో అత్యంత విప్లవాత్మకమైన పని ఏదైనా ఉందంటే అది కావాలని ఏమి చేయకుండా ఉండగలగటం. ఇక్కడ ఏమి చేయకుండా ఉండటం అంటే అర్థం ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకమని చెప్పడం కాదు నీకున్న దాన్ని సంతృప్తిగా స్వీకరించడం. సో నెక్స్ట్ టైం నీ మనసు నువ్వు సరిపడా చేయట్లేదు అని కుసలాడినప్పుడు దానికి మెల్లగా జవాబు ఇప్పు.
(10:03) మేబీ ఒక మనిషిలా జీవించడం అంటే ఎలానో నాకు అర్థమయింది అని. ఎందుకంటే ప్రపంచం అంతటికీ వినపడేటట్టు అరిస్తేనో చూపిస్తునో మాత్రమే ఫ్రీడం వచ్చినట్టు కాదు కొన్నిసార్లు ఈ ప్రపంచం పరిగెత్తించే ట్రెడ్మిల్ నుండి కిందకి దిగి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రపంచం ఏమి అంతమైపోలేదు అని తెలుసుకున్న ఆ నిశశబ్ద క్షణంలో ప్రపంచానికి వినబడని నువ్వు మాత్రమే ఫీల్ అయ్యే ఆ నిశశబ్దంలో దాగుంటుంది ఆ అసలైన స్వేచ్ఛ నెక్స్ట్ పాడ్కాస్ట్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలసిస్ తో మళ్ళీ కలుద్దాం
No comments:
Post a Comment