Sunday, January 18, 2026

Krishnamurti philosophy on Desire: Why the Mind Seeks Pleasure

 Krishnamurti philosophy on Desire: Why the Mind Seeks Pleasure

https://youtu.be/yTSwI9dQrbU?si=0UBGkGeca3G96V2P


https://www.youtube.com/watch?v=yTSwI9dQrbU

Transcript:
(00:05) నువ్వు సెక్స్ ని ఇగ్నోర్ చేయాలని ట్రై చేస్తే నువ్వు ఇప్పటికే సెక్స్ చేత ఓడిపోయావు. ఈ మాట ఎవరన్నారో తెలుసా జిడ్డు కృష్ణమూర్తి ఎందుకంటే మన సొసైటీ సెక్స్ ని రెండు విధాలుగా చూసింది. ఒకటి పాపం రెండవది సుఖం కానీ కృష్ణమూర్తి సెక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ద ప్రాబ్లం అన్నాడు. సో అదేంటో చూద్దాం. జేకే సెక్స్ గురించి సిద్ధాంతం తయారు చేయలేదు.
(00:30) ఆయన సెక్స్ ని ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని ఒక కొత్త థియరీ కనిపెట్టలేదు. ఆయన చేసిన పని చాలా ప్రమాదకరం. మనిషి మనసు ఎలా పని చేస్తుందో ఎక్కడ పని చేస్తుందో అక్కడి నుంచే సెక్స్ ని చూశాడు. అందుకే ఆయన మాటలు చాలా మందికి అసహ్యంగా అసౌకర్యంగా అసహనంగా అనిపిస్తాయి. సో జేకే పుట్టిన కాలంలో ముఖ్యంగా మన దేశంలో సెక్స్ అనేది రెండు అతి అంచుల మీద ఇరుక్కుపోయి ఉంది.
(00:57) ఒకవైపు పాపం అన్న ముద్ర మరోవైపు పూర్తిగా దాచిపెట్టే భయం వీటితో పాటు బ్రిటిష్ ప్రభావం విక్టోరియన్ మొరాలిటీ అండ్ మతాలు ఇలా అన్నీ కలిసి సెక్స్ ని ఒక షేమ్ ఫుల్ థింగ్ గా మార్చేసాయి. అలాగే ఇంట్లో పెద్దలు సెక్స్ గురించి మాట్లాడరు. పిల్లల్ని చిన్నప్పటి నుంచే సెక్స్ పట్ల నోరు మూయిస్తారు. కానీ అదే సొసైటీలో మ్యారేజ్ కంపల్సరీ పిల్లలు పుట్టడం కంపల్సరీ వంశం కొనసాగించడం కంపల్సరీ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది.
(01:28) మనకి సెక్స్ కావాలి కానీ సెక్స్ గురించి మాట్లాడడం తప్పు ఇది పెద్ద మెంటల్ యాంటగానిజం అంటే మాయరోగం ఇక్కడే మొదలవుతుంది జేకే ఫిలాసఫీ ఆయన అంటాడు మీరు సెక్స్ ని తప్పుఅంటారు కానీ దాని గురించి రోజంతా ఆలోచిస్తారు. ఇదే మీ హిపోక్రసీ అన్నాడు. అండ్ ఆయన కాలానికి ముందు సెక్స్ ఫిలాసఫీ టూ మెయిన్ స్ట్రీమ్స్ గా కనిపిస్తుంది. ఒకటి మతపరమైనది హిందూ ముస్లిం క్రైస్తవంలో సెక్స్ ని కంట్రోల్ చేయాల్సిన శక్తిగా చూశారు.
(01:58) బ్రహ్మచర్యం, నియమాలు, నియంత్రణ, త్యాగం ఇవన్నీ గొప్పవిగా చెప్పబడ్డాయి. అలాగే మాంక్ సాధు ప్రీస్ట్ వీళ్ళందరూ సెక్స్ ని వదిలేసిన వాళ్లే గొప్పవాళ్ళని భావించారు. సెక్స్ అనేది ఒక అనిమల్ ఇన్స్టింట్ సో దాన్ని జయించాలి అనిచివేయాలి అన్నారు. ఇక రెండవది చాలా లోతుగా చాలా తక్కువ మంది అర్థం చేసుకున్న ఒక మార్గం ఆ మార్గం తంత్రం కామశాస్త్రం.
(02:24) ఇవి సెక్స్ ని పవిత్రంగా చూశయి. కానీ ఇవి కూడా చివరికి ఒక మార్గం ఒక పద్ధతి ఒక సాధనంగా మారిపోయాయి. అంటే సెక్స్ ని కూడా అచీవ్మెంట్ గా మార్చేసాయి. సో ఇప్పుడు జేకే ఈ రెండు మెయిన్ స్ట్రీమ్స్ ని కొట్టిపడేసాడు. ఎందుకంటే ఆయన సెక్స్ గురించి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే సెక్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ద ప్రాబ్లం థాట్ ఇస్ ద ప్రాబ్లం అన్నాడు. ఇది అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
(02:51) నువ్వు సెక్స్ చేశవు అనుకుందాం. ఫిజికల్ ఇంటిమసీ జరిగింది. అదిఒక అనుభవం అది అక్కడితో అయిపోవాలి కానీ నీ మనసు ఏం చేస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ని తిరిగి తిరిగి గుర్తు చేస్తుంది. కంపేర్ చేస్తుంది ఫ్యాంటసైజ్ చేస్తుంది డిజైర్ పెంచుతుంది. సో అప్పుడే సెక్స్ ఒక అబ్సెషన్ గా మారుతుంది. జేకే ఇక్కడే ఒక లోతైన మాట చెప్పాడు. మనిషికి సెక్స్ మీద అడిక్షన్ లేదు.
(03:15) మనిషికి ప్లెజర్ మీద అడిక్షన్ ఉంది. ఎందుకంటే సెక్స్ ఒక స్ట్రాంగ్ సోర్స్ ఆఫ్ సుఖం కాబట్టి మనిషి దానికే ఎక్కువగా అతుక్కుంటాడు. ఇదే ఈయన చెప్పిన కొత్త కోణం. అప్పటివరకు మిగతా ఫిలాసఫర్స్ అందరూ సెక్స్ తగ్గించు సెక్స్ వదిలేయ్ సెక్స్ ని కంట్రోల్ చెయ్ అన్నారు. ఇంకొంతమంది సెక్స్ ని విచ్చలవిడతనం చేశారు. కానీ ఇక్కడే జేకే ఇంకొక గొప్ప పాయింట్ రైస్ చేశాడు.
(03:40) నువ్వు సెక్స్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావ్. ఓకే బట్ నువ్వు ఎవరిని కంట్రోల్ చేస్తున్నావ్ కంట్రోల్ చేస్తున్న నేను కూడా అదే కోరికలో భాగమే అన్నాడు. అంటే హూ ఆర్ యు కంట్రోలింగ్ ద ఐ దట్ కంట్రోల్స్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ డిజైర్ అన్నాడు. ఇప్పుడు దీన్ని పార్ట్లు పార్ట్లుగా విడదీసి వివరించాలి లేకుంటే అర్థం కాదు. ఒక సాధారణ మనిషి కోరికని కంట్రోల్ చేసే క్రమంలో ఎలా ఆలోచిస్తాడు నీ లోపల ఒక డిజైర్ ఉందనుకుందాం.
(04:10) ఆ డిజైర్ సెక్స్ సో అప్పుడు నువ్వు ఏమంటావ్ ఈ కోరిక తప్పు దీన్ని కంట్రోల్ చేయాలి. నేను స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటావ్. దాంతో నీ మనసులో రెండు భాగాలు తయారవుతున్నాయి. ఒకటి కోరిక ఇంకొకటి ఆ కోరికని కంట్రోల్ చేసేవాడు అంటే కంట్రోలర్ సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం నేను వేరే ఆ కోరిక వేరే సో అర్జెంట్ గా డిజైర్ ని కంట్రోల్ లో పెట్టాలి. ఇక్కడే జేకే నిన్ను ఒక ప్రశ్న అడుగుతాడు.
(04:36) మరి ఆ నేను ఎవరు? ఇప్పుడు ఇంకాస్త నిజాయితిగా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను అంటే ఎవరు నీ తండ్రి కాదు నీ గురువు కాదు నీ దేవుడు కూడా కాదు నేను అంటే అది కూడా నీ మనసులో పుట్టిన ఒక ఆలోచనే అంటే నువ్వు చిన్నప్పటి నుంచి విన్న మాటలు భయాలు మోరల్ ఐడియాస్ సొసైటీ ప్రెజర్ ఇవన్నీ కలిసి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశయి ఆ ఇమేజ్ ఎప్పుడు ఏం చెబుతుంది అంటే నేను మంచి మనిషిని నేను కంట్రోల్ లో ఉండాలి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటుంది.
(05:08) సో ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచే నేను నా డిజైర్ ని కంట్రోల్ చేస్తాను అనే ఒక ఫీలింగ్ పుట్టింది. సో ఇప్పుడు అసలు పాయింట్ డిజైర్ థాట్ నుంచి పుడుతుంది. డిజైర్ ని కంట్రోల్ చేసే నేను కూడా థాట్ నుంచే పుట్టాను. అంటే ఇద్దరు ఒకే మూలం నుంచి పుట్టారు. ఇప్పుడు మరొక టైనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీకు కోపం వచ్చిందనుకో అప్పుడు నువ్వు అంటావు నాకు కోపం వచ్చింది కానీ నేను కోపాన్ని కంట్రోల్ చేస్తాను.
(05:34) ఇప్పుడు నిజంగా నిన్ను నువ్వు అడుగు కోపాన్ని కంట్రోల్ చేసే నేను కోపం లేనివాడా లేదే సో అతను కూడా కోపం వచ్చిన మనసే కానీ నేను కంట్రోల్ చేస్తున్నాను అనే ఒక మాస్క్ వేసుకున్నాడు. ఇది ఎలా ఉందంటే రెండు చేతులు కలిసి క్లాప్స్ కొడుతున్నాయి. కానీ ఒక చెయ్యి మరొక చెయ్యిని నువ్వు తప్పు చేస్తున్నావ్ అని మోరల్ క్లాస్ పీకినట్టు ఉంటుంది. ఇది నిజంగా కంట్రోల్ కాదు అంతర్గత పోరాటం.
(06:00) సో గుర్తుపెట్టుకో నువ్వు కోరికతో ఫైట్ చేస్తున్నంత కాలం నువ్వు కోరిక నుంచి విడిపోయిన వాడివి కాదు. మరి అయితే ఇప్పుడు ఏం చేయాలి జేకే ఏం చేయొద్దు కేవలం చూడమన్నాడు అంటే నీకు డిజైర్ పుట్టినప్పుడు దాన్ని పాపం అనొద్దు గొప్పది అనొద్దు అనచొద్దు పెంచొద్దు కేవలం దాన్ని గమనించండి నిజంగా చూడండి. నువ్వు సెక్స్ ని అనిచి వేస్తే అది అండర్ గ్రౌండ్ కి వెళ్తుంది.
(06:25) నువ్వు సెక్స్ ని గ్లోరిఫై చేస్తే అది అడిక్షన్ అవుతుంది. రెండు తప్పే మరి రైట్ ఏంటి అవేర్నెస్ వితౌట్ ఛాయిస్ నువ్వు సెక్స్ చేశవు దాన్ని మంచి చెడు అని లేబుల్ పెట్టకో గిల్ట్ తో చావకో ఫ్యాంటసీగా మార్చుకో అండ్ ఫ్యూచర్ లో మళ్ళీ మళ్ళీ కావాలని ఆశ పెట్టుకోకు అది జరిగిపోయిన నిజం అంతే జస్ట్ అంతే ఇంకేం కాదు. అలాగే జేకే సెక్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఫోకస్ శరీరంపై ఉండదు.
(06:52) ఆయన ఫోకస్ మొత్తం మనసు ఎలా సెక్స్ ని యూస్ చేసుకుంటుందో అన్న దానిపై ఉంటుంది. దాంతో అతను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే సెక్స్ ఎందుకు మనిషి జీవితంలో అంత స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అయింది. దీనికి చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే సెక్స్ నాచురల్ కాబట్టి కానీ జేకే ఆ మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే సెక్స్ నాచురల్ మాత్రమే అయితే అది అబ్సాన్ అయ్యేది కాదు అందుకే అతను గమనించిన విషయాలు ఏంటంటే మనిషి జీవితంలో చాలా విషయాలు డెడ్ అయిపోయాయి పని మెకానికల్ అయింది మనిషి రోబోట్ అయ్యాడు రిలేషన్ రొటీన్ అయింది మతం బిలీఫ్ అయింది సంస్కృతి ఇమిటేషన్ అయింది. సో ఇంత డెడ్
(07:32) లైఫ్ లో కేవలం సెక్స్ మాత్రమే ఇంటెన్స్ గా మిగిలింది. అందుకే సెక్స్ కి అంత పవర్ వచ్చింది. ఇది సెక్స్ గొప్పదని చెప్పదు. మిగతా లైఫ్ ఖాళీగా ఉండడమే కారణం అని చెబుతుంది. ఇది చాలా బెటర్ ట్రూత్ అండ్ జేకే సెక్స్ ని ప్లెజర్ పెయిన్ సైకిల్ లో పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి సెక్స్ అనుభవం తర్వాత ఏం చేస్తాడు సింపుల్ ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకుంటాడు.
(07:56) దాన్ని మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాడు. అది మళ్ళీ దొరకపోతే ఫ్రస్ట్రేషన్ పుడుతుంది. ఫ్రస్ట్రేషన్ నుంచి గిల్ట్ అండ్ యాంగర్ పుడుతుంది. అంటే సెక్స్ ఎక్స్పీరియన్స్ ఒక క్షణం మాత్రమే కానీ దాని వల్ల వచ్చే సైకలాజికల్ మెస్ సంవత్సరాల పాటు ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ద ప్రాబ్లం ద మెమరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద ప్రాబ్లం.
(08:21) సో ఫైనల్ గా జేకే ఏం చెప్పారు జేకే ఎప్పుడూ ఎక్కడ ఇది చెయ్ అది చెయ్ అని చెప్పడు. నీ చేతిలో ఒక అద్దం పెడతాడు ఆ అద్దంలో చూసి మొహం కడుక్కోవాలా లేదా ఆల్రెడీ ఉన్న మాస్క్ కి మళ్ళీ మేకప్ వేసుకోవాలా అద్దం పగలగొట్టాలా లేదా అద్దంలో చూసి మర్చిపోవాలా అనేది నీ ఇష్టం ఎందుకంటే జేకే ఎప్పుడు ఫాలోవర్స్ ని తయారు చేయడం కంఫర్ట్ ఇవ్వడు అతను నీ సెల్ఫ్ ఇమేజ్ ని డిస్టర్బ్ చేస్తాడు

No comments:

Post a Comment