Thursday, January 15, 2026

 [1/14, 23:21] +91 98852 16452: *సంక్రాంతి పండుగ:*
         ➖➖➖
ప్రాణికోటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ, వెలుగును అనుగ్రహించే దైవం సూర్యుడు. ఈ సృష్టి మనుగడకు ఆయనే మూల కారకుడు. దివాకరుడికి స్వాగతం పలుకుతూ చేసుకునేదే సంక్రాంతి పండుగ. 

సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ పుణ్య ఘడియల విలువలు పెరుగుతుంటాయని మన శాస్త్ర వచనం. రెండు ఆయనాలుగా సాగే సూర్యుడి ప్రయాణంలో ధనుర్మాసంతో దక్షిణాయనం పూర్తవుతుంది.

మకర సంక్రాంతితో ఉత్తరాయనం మొదలవుతుంది. 
ఈ పుణ్యకాలానికి ఆరంభ సూచకంగా, ప్రత్యక్ష నారాయణుడికి ఆహ్వానం పలుకుతూ ముంగిళ్లను ముగ్గులతో అలంకరించే సంప్రదాయం ఏర్పడింది.

సంక్రాంతి పండుగ ప్రారంభం అయిందంటే చాలు తెలుగు వారి ప్రతీ ఇంటి ముందు రంగవల్లులు  కనిపిస్తాయి.  
ఈ రంగురంగుల  ముగ్గుల వెనుక  బలమైన శాస్త్రీయ సాంప్రదాయ కోణాలు ఉన్నాయి. ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటిలోని సంతోషాలకు అద్దం పడుతుంది. అందమైన ముగ్గలు వేస్తే ఆ ఇంటిలో లక్ష్మి ఆవాసం ఉంటుందంటారు. అదృష్టం ఆ ఇంటిని వరిస్తుందంటారు. ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గు ఇంటిలోకి దేవతలను ఆహ్వానించటానికి   గుర్తు అని కుడా పెద్దలు చెపుతూ ఉంటారు.

తొలి సంధ్య వేళలో లేలేత సూర్యకిరణాలు వాకిట్లో విస్తృతంగా ప్రసరిస్తాయి. ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే సూర్యశక్తి లభిస్తుంది. అంతేకాదు, నడుం వంచుతూ, కూర్చుంటూ, లేస్తూ, చేతులు ఆడిస్తూ ముగ్గు పెట్టేక్రమంలో శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చలి అధికంగా ఉండే ధనుర్మాసంలో సూర్యకాంతి చాలా అవసరం. ఈ మేరకు సంక్రాంతి వేళ ముగ్గులు పెట్టే సంప్రదాయం తప్పనిసరి చేశారు మన పెద్దలు.

ముంగిలిని నిర్మల ఆకాశానికి ప్రతీకగా భావిస్తారు. ముగ్గుకోసం వేసే చుక్కలను నక్షత్రాలుగా, వాటిని కలుపుతూ వేసే గీతలు ఖగోళంలో మార్పులుగా భావిస్తారు. ముగ్గు కేంద్రకాన్ని సూర్యుడికి సంకేతంగా చెబుతారు.

సంక్రాంతి నాడు సూర్యభగవానుణ్ని ఆహ్వానిస్తూ రథం ముగ్గును విధిగా వేస్తారు. ఇలా ముగ్గుల వెనుక ప్రాధాన్యాన్ని తెలియజేశారు మన పెద్దలు. అంతేకాదు, వాకిట్లో పేడనీళ్లతో చల్లే కళ్లాపి క్రిమికీటకాలకు విరుగుడుగా పని చేస్తుంది. ముగ్గుపిండి కూడా అందుకు తోడ్పడుతుంది.

పురాణకథల ప్రకారం ఒకానొకప్పుడు ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. కాబట్టి ఆరాజు బ్రహ్మదేవుడిని తన కుమారుడిని బ్రతికించమని ప్రార్ధించాడు. దీర్ఘ తపస్సు తరువాత బ్రహ్మదేవుడు బాలుడిని బ్రతికించటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో రాకుమారుడు యొక్క బొమ్మను గీయమని రాజుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి రాకుమారుడికి జీవం పోస్తానని చెప్పాడు. ఆ సమయం నుండి రంగోలీ అన్నది జీవితం, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా మారి మన జీవితాలలో ఒక ఆచారంగా మారింది అని కూడ అంటారు.

సంక్రాంతి మాసంలో వేసే ముగ్గుల వెనుక  ఆధ్యాత్మిక సాంస్కృతిక శాస్త్రీయ ధృక్పధాలు ఉన్నాయి అని అంటారు. ఒక పద్ధతి ప్రకారం పెట్టబడే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్య స్థానానికి సంకేతం అని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. 

ఇక ఈ పండుగ మాసంలో వివిధ ఆకారాలతో వేసే ముగ్గుల వివరాల్లోకి వెళితే విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ, పాము ఆకారము ఆశ్లేష నక్షత్రానికి, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకూ సంకేతాలుగా కూడా జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

ఇక పండుగల చివరిరోజు వేసే రధం ముగ్గు సామాజిక ఐక్యతను చాటి చెబుతుంది. మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు.
https://aratt.ai/@teluguastrology

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj

https://www.facebook.com/teluguastrology

 TeluguAstrology channel  https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12
అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోయే సాంప్రదాయం  అందరు ఒకటే అనే సంకీతాలు ఇస్తుంది.

పండుగ రోజుల్లో పెట్టే ముగ్గులు, గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరం. ఇలా ఎన్నో విషయాలు జీవితానికి ముడిపడినవి ఈముగ్గులలో నిక్షిప్తమై ఉన్నాయి.
[1/14, 23:21] +91 98852 16452: *🙏🕉️సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఎందుకు ఆనవాయితీ అయ్యింది..!!*
                                                                    
*సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము. అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయాని విశ్వసిస్తారు.*

*సంక్రాంతి పండుగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది. దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్ళలో కళ్లాపి చల్లుతారు. ఆ తర్వాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులు నింపి.. వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఇక శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షరూపం సూర్యభగవానుడు. సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి.. సూర్యభగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్యహృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ వ్రతం, సూర్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతుంటారు.*

*సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈరోజున సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దేవతలు, పితృదేవతలకు దానాలు చేయాలి. సంక్రాంతి పర్వదినంనాడు భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరోజున పితృదేవతలకు ఆరాధించడం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది.*

*సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికి పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలిస్తే సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టేనని మన పూర్వీకులు చెబుతుంటారు. అలాగే ఈ పండుగ రోజున గడపకు పసుపు పెట్టి.. కుంకుమ పెట్టడం, వాకిట్లో ముగ్గులు వేసి.. వాటిలో ఆవు పేడ గొబ్బెమ్మలు పెట్టడం.. ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేసి శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.*

*సంక్రాంతి చరిత్ర*
*పురాణాల ప్రకారం, సూర్య భగవానుడు అదే రోజున తన కొడుకు శని ఇంటికి వస్తాడని చెబుతారు. దీన్ని 'తండ్రీ కొడుకుల' కలయికగా ఈ పండుగను పేర్కొంటారు. అదే రోజున అసురులపై మహావిష్ణువు విజయం సాధించిన గుర్తుగా ఈ పండుగ చేసుకోంటారని మరికొంతమంది చెబుతున్నారు. ప్రతి మాసంలో ఒక సంక్రాంతి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం చేసుకునేది మకర సంక్రాంతి.*
https://aratt.ai/@teluguastrology

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj

https://www.facebook.com/teluguastrology

 TeluguAstrology channel  https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12
*సంక్రాంతి సంబురాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. ముచ్చటగా మూడు రోజుల పాటు చేసుకుంటారు ఈ పండుగను. భోగితో మొదలయ్యే పండుగ కనుమతో ముగుస్తుంది. కొందరు ముక్కనుమ కూడా చేసుకుంటారు. పండుగరోజుల్లో ప్రతి పల్లెలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతుంది.*

*నెల రోజుల ముందు నుండే ఈ పండగ హడావుడి మెుదలవుతోంది. సంక్రాంతి రోజున తెలుగు లోగిళ్లు...కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. హరిదాసు సంకీర్తనలు ఆకట్టుకుంటాయి. ఈ పండుగకు ఎన్నో పిండి వంటలు చేస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, గంగిరెద్దులు ఎన్నో ఈ రోజున చూడవచ్చు. ఈ పండుగ సమయంలోనే పంట మెుత్తం రైతులకు చేతికొస్తుంది. అందుకే ఎంత ఖర్చు చేయడానికైనా వారు వెనుకాడరు. తెలుగు వారు ఎక్కడున్నా సంక్రాంతికి తమ ఇంట్లో వాలిపోతారు. ఈ పండుగ నాలుగు రోజులు తెలుగు లోగిళ్లు సరికొత్త శోభను సంతరించుకుంటాయి.*

No comments:

Post a Comment