Friday, January 23, 2026

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మీద ద్వేషం ఎందుకు పెరుగుతోంది? | Why the World Hates Indian Tourists?

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మీద ద్వేషం ఎందుకు పెరుగుతోంది? | Why the World Hates Indian Tourists?

 https://youtu.be/IV0_9dH0zyk?si=UErDlokqNf-egTin


https://www.youtube.com/watch?v=IV0_9dH0zyk

Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మీద ద్వేషం అమాంతం పెరిగిపోయింది. ఇది కేవలం ఆన్లైన్ ట్రోలింగ్ వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు అది ఫిజికల్ అటాక్స్ వరకు వెళ్ళింది. జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి మీరు ఎంతో కష్టపడి ఇంటర్న్షిప్ కోసం ఉత్తర దేశానికి వెళితే కేవలం కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని జాబ్ లో నుంచి పీకేస్తే ఎలా ఉంటుంది? కొంతమందికైతే కేవలం ఇండియన్ అనే కారణంతోనే వీసాలు కూడా బ్యాన్ చేస్తున్నారు.
(00:25) దీని వెనుక ప్రశ్నించడానికి భయపడే ఒక బలమైన కారణం ఉంది. ఈ పోలాండ్ వీడియోనే చూడండి. ఒక ఇండియన్ అబ్బాయి తన ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి సిగ్గు లేదా ప్రపంచంలోనే తెల్ల జాతీయులు ఉండే దేశంలో ఉంటూ మా జీన్స్ ఎందుకు పాడు చేస్తున్నావ్ అని బహిరంగంగానే అవమానించాడు. అది అక్కడితో ఆగలేదు. కజికిస్తాన్ మలేషియా వంటి చిన్న దేశాల్లోని కొన్ని హోటల్స్ రూల్స్ చూస్తే షాక్ అవుతారు.
(00:49) అక్కడ క్లియర్ గా ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి ఉంటుంది. ఒకవేళ రూమ్ ఇచ్చినా భారతీయులు ఎక్స్ట్రా డిపాజిట్ కట్టాలి. వెళ్లేటప్పుడు రూమ్ మొత్తం చెక్ చేశకే ఆ డబ్బులు వెనక్కి ఇస్తారు. ఈ వివక్ష కేవలం చిన్న దేశాల్లోనే కాదు దుబాయ్ లాంటి పెద్ద సిటీలో కూడా జరుగుతుంది. ఒక ఇండియన్ టూరిస్ట్ దుబాయ్ ఫైవ్ స్టార్ హోటల్ లో తన అనుభవాన్ని ఇలా రాసుకొచ్చాడు.
(01:10) ఇది రిచ్ హోటల్ అయినా ఇండియన్స్ ఇక్కడికి రాకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఇండియన్ గెస్ట్లకు పాత టవల్స్ ఇవ్వడం ఎండలో కూర్చోబెట్టడం లాంటివి చేశారు. మనం ముందే బుక్ చేసుకున్న రైట్ కూడా ఫారినర్స్ కి ఇచ్చేస్తారు. ఫారినర్స్ డిస్టర్బ్ అవ్వకూడదని మన పిల్లల్ని రెస్టారెంట్ మోల్న కూర్చోబెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో చూస్తే ఇలాంటివి వందల కొద్ది కనిపిస్తాయి.
(01:30) మనల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా చూస్తున్నారు. రోడ్ల మీద గో బ్యాక్ హోమ్ 30 ఇండియన్స్ అంటూ అరుస్తూ దాడ్లు చేస్తున్నారు. ఈ వివక్ష కేవలం హోటల్స్ లోనే కాదు షాపింగ్ మాల్స్ లో కూడా జరుగుతుంది. ఒక ఇండియన్ అమ్మాయి ఐదు నుంచి ఆరు షాపులకు వెళితే అక్కడ ప్రతి ఒక్కరు ఆమెను తిట్టడం మొదలు పెడతారు. మీరు ఇండియన్స్ ఎలాగో ఏం కొనలేరు కదా అంటూ అవమానిస్తారు.
(01:52) చివరకు మనకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం అని చెప్పుకునే ఇజ్రయిల్ లో కూడా యాంటీ ఇండియన్ దాళ్లు జరుగుతున్నాయి. అక్కడ ఒక వీడియోలో ఒక వ్యక్తి ఇండియన్ ని నువ్వు బీఫ్ తింటావా అని అడిగి నేను తినను అని చెప్పిన నువ్వు తినాల్సిందే మాకు అది ఇష్టం అంటూ ఫోర్స్ చేయడం మనం చూసాం. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే అక్కడ ఇండియన్ ఎమిగ్రేట్స్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు జరిగే స్థాయికి చేరుకుంది పరిస్థితి.
(02:13) వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి ఇండియన్స్ స్ట్రింక్ అని నినాదాలు చేస్తున్నారు. గో బ్యాక్ హోమ్ అంటూ అరుస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే జీట్ అంటే ఈ పదాన్ని ఇప్పుడు ఒక బూతు లాగా వాడుతున్నారు. ముఖ్యంగా సిక్కులను భారతీయులను టార్గెట్ చేస్తూట్wిitటter లో ఈ పదం బాగా ఫేమస్ అయిపోయింది. ఇది వెస్టర్న్ కంట్రీస్ లోనే కాదు 2025లో జపాన్ లోని ఒసాకాలో కూడా భారతీయ జనాభా మన కల్చర్ పెరుగుతుందంటూ నిరసనలు జరిగాయి.
(02:39) అటు ఐర్లాండ్ పోలాండ్ ఇంగ్లాండ్ లో అయితే మనల్ని చొరబాటుదారులు అని పిలుస్తూ దేశం విడిచి వెళ్ళిపోమని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ద్వేషం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. లో ఇండియా అని సెర్చ్ చేస్తే చాలు మన జెండా మీద దేవుళ్ళ మీద టాయిలెట్ జోక్స్ వేస్తూ అసహ్యకరమైన పోస్ట్లు పెడుతున్నారు. ఇది చూస్తుంటే గత నెల రోజులుగా కావాలని ఎవరో ఒక టూల్ కిట్ వదిలినట్టు అనిపిస్తుంది.
(03:02) ఉదాహరణకు బారి స్టేషన్ అనే పిజ్జా డెలివరీ బాయ్ యుకే పేట్రియాట్ లా బిల్డప్ ఇస్తూ కేవలం పాపులారిటీ కోసం ఇండియన్స్ ని బూతులు తిడుతున్నాడు. మన జనాభా ఎక్కువ కాబట్టి మన మీద నెగిటివ్ వీడియోలు చేస్తే అవి ఈజీగా వైరల్ అవుతాయని వీళ్ళ ప్లాన్. యూట్యూబర్స్ కూడా ఈ పరిస్థితిని వాడుకుంటున్నారు. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ చాలా అన్హైజినిక్ అని పాకిస్తాన్ స్ట్రీట్ ఫుడ్ దేనికంటే చాలా క్లీన్ గా ఉంటుందని కంప్లైంట్ చేస్తున్నారు.
(03:25) మన స్వీట్స్ ఫుడ్ అంతా ఈగలతో నిండిపోయి ఉంటుందని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. కొంతమంది ఇండియన్స్ పడేసిన చెత్తను క్లీన్ చేస్తూ వైరల్ వీడియోలు చేస్తున్నారు. మరికొందరు మనల్ని కల్చరల్ అన్వేడర్స్ అని మనం వాళ్ళ మిలిటరీ పాలిటిక్స్ ని ఆక్రమిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇక ఇండియన్ స్కామర్స్ మీద వచ్చే వీడియోలకైతే 30 40 మిలియన్ల వ్యూస్ ఉంటున్నాయి.
(03:45) హ్యాకర్స్ మన స్కామర్స్ కంప్యూటర్లను హ్యాక్ చేసి వాళ్ళే కెమెరాలను ఆన్ చేసి నేను మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నా అనే స్కామర్ల బండారం బయటపడుతున్నాయి. ఆన్లైన్ పరువు నష్టం ప్రభావం నేరుగా మన వీసాల మీద పడింది. కేవలం 2024 లోని 1.65 లక్షల ఇండియన్ షన్జెట్ వీసా అప్లికేషన్లు రిజెక్ట్ చేయబడ్డాయి. యూరోపియన్ యూనియన్ లోని 28 దేశాలు కలిసి ఇంతమందిని రిజెక్ట్ చేశయి.
(04:09) ప్రతి ఆరుగురిలో ఒకరి వీసా రిజెక్ట్ అవుతుంది. దీనివల్ల నాన్ రిఫండబుల్ ఫీస్ రూపంలో మనం 136 కోట్ల రూపాయలు నష్టపోయాం. ప్రపంచంలోనే అత్యధిక వీసా రిజెక్షన్ ఉన్న దేశాల్లో మనం మూడవ స్థానంలో ఉన్నాం. మన పాస్పోర్ట్ ర్యాంక్ కూడా 80 నుంచి 85 కు పడిపోయింది. దీనంతటికీ కారణం ఇండియన్స్ డర్టీగా ఉంటారు. స్కామర్స్ మనకు సివిక్ సెన్స్ జీరో అనే గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ అవ్వడమే.
(04:31) అందుకే మనల్ని వరుస్ టూరిస్ట్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఫారెనర్స్ ఐ లవ్ ఇండియా ఇండియాస్ చాలా ఫ్రెండ్లీ అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు సడన్ గా సిచువేషన్ ఎందుకు మారింది అసలు మనం నిజంగానే ద్వేషించదగ్గ పనులు చేస్తున్నామా లేక ఇది వెస్టర్న్ మీడియా ప్రచారమా లండన్ లోని ఈ బోర్డ్ చూడండి. ఇందులో గుజరాతీలో క్లియర్ గా ఇక్కడ ఉమ్మడం నిషేధం అని రాసిఉంది.
(04:54) విచిత్రం ఏంటంటే సరిగ్గా ఆ బోర్డ్ కింద చుట్టుపక్కల ఇండియన్స్ పాన్ ఉమ్మి పారేశారు. సేమ్ ఇండియాలో చేసినట్టే పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే లండన్ లోని బ్రెంట్ ఏరియాలో కేవలం ఇండియన్స్ ఉమ్మిన పాన్ మరకలు వాటిని కడగడానికి అక్కడ గవర్నమెంట్ ఏట 30వే పౌండ్లు ఖర్చు చేస్తుంది. అందుకే వాళ్ళు పాన్ ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పడానికి సిగ్గుగా ఉన్న ఇండియన్స్ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తున్న వీడియోలు కూడా బయటపడ్డాయి.
(05:19) మీరు ఎగ్స్ లో రెడట్ లో చూస్తే ఇలాంటి వీడియోలు కనిపిస్తాయి. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయడం, చెత్త పరాయడం చేస్తూ ఉంటారు. ఇక ఇండియన్ అమ్మాయిలు లండన్ మెట్రోలో చేత్తో దాల్ చావలు తింటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ లోని పటాయ బీచ్ లో ఇండియన్ టూరిస్టులు తాగేసి పడిపోవడం చుట్టూ చెత్త వేయడం లాంటివి చూసి లోకల్స్ అసహించుకుంటున్నారు.
(05:39) మన దేశంలో రోడ్డు మీద డాన్స్ చేయడం గార్బా ఆడడం కామన్ కావచ్చు. కానీ ఫారనర్స్ కి అది న్యూసెన్స్ లో అనిపిస్తుంది. థాయిలాండ్ టూరిస్ట్ ప్లేస్లలో ఇండియన్స్ డాన్స్ చేస్తున్న వీడియోస్ కి వీళ్ళకు బుద్ధి లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. మన వాళ్ళు చేసే పనులు కొన్నిసార్లు హద్దులు దాడుతుంటాయి. టొరంటో వీధుల్లో లౌడ్ మ్యూజిక్ పెట్టి డాన్స్ చేయడం దుబాయ్ బుర్జ్ ఖలీఫా దగ్గర గార్బా ఆడడం లాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.
(06:02) ఇది చూసిన మిగతా భారతీయులే దయచేసి మమ్మల్ని అలా సిగ్గుపడేలా చేయకండి అని కామెంట్ చేస్తున్నారు. కేవలం డాన్స్ మాత్రమే కాదు తాగేసి పబ్లిక్ లో గొడవలు పడడం మాల్స్ లో దొంగతనాలు చేయడం దొరికిపోవడం ఇవి షరా మామూలుగా మారాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాలిక్ అనే ఒక ఇండియన్ యూట్యూబర్ న్యూస్ అతను టర్కీలో ఒక మహిళ పక్కన నిలబడి ఆమెకు హిందీ రాదు కదా అని చాలా అసభ్యంగా కామెంట్స్ చేశాడు.
(06:25) ఆమెను టచ్ చేయాలని ఉంది అంటూ తన వ్లాగ్ లో రికార్డ్ చేసి ఫుల్ కాన్ఫిడెన్స్ తో అప్లోడ్ చేశాడు. ఇలాంటి కంటెంట్ చూసి ఆనందించే ఆడియన్స్ ఉన్నారని అతనికి తెలుసు. కానీ టర్కీ పోలీసులు ఊరుకోలేదు. అతన్ని మే 31, 2025 న అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియాలో దీని గురించి చర్చ జరిగింది. మన పరువు పోయింది. ఒక మనిషి చేసిన పనికి దేశం మొత్తం తలదించుకోవాల్సి వచ్చింది.
(06:46) రీల్స్ లో వచ్చే వ్యూస్ లైక్స్ కోసం చేసే ఈ మసాలా కంటెంట్ నిజాయితీగా వెళ్ళే భారతీయులకు పెద్ద తలనొప్పికే మారింది. అతిథి దేవోభవ అంటాం. కానీ ఇక్కడికి వచ్చే ఫారెన్ టూరిస్టుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. హోలీ పండుగ పేరుతో అమ్మాయిలను ఫిజికల్ గా అసాల్ట్ చేయడం వైట్ పీపుల్ కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడడం ఇది కాదు కదా మన సాంప్రదాయం కానీ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు.
(07:08) మనం ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంటే కొన్ని సంవత్సరాల్లోనే మన ఇమేజ్ మార్చుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా అవును 2015 కి ముందు చైనీస్ టూరిస్టుల పరిస్థితి కూడా సేమ్ మనలాగే ఉండేది. వాళ్ళని కూడా అప్పట్లో అన్సివిలైజ్డ్ అని అన్హైజినిక్ అని పిలిచేవాళ్ళు. పాత వీడియోలు చూస్తే బఫేలో తిండి కోసం ఒకరి మీద ఒకరు పడిపోవడం, పబ్లిక్ లో గొడవలు పడడం, ఫ్లైట్స్ ఇబ్బందిని బూతులు తిట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు.
(07:33) మనలాగే వాళ్ళు కూడా మూఢ నమ్మకాలను బాగా నమ్ముతారు. ఎంతలా అంటే గుడ్ లక్ కోసం కొంతమంది చైనీస్ టూరిస్టులు ఏకంగా విమానం ఇంజన్లు కాయిన్స్ విసిరేవాళ్ళు. ఇది ఎంత పెద్ద గ్లోబల్ న్యూస్ అయిందో ఊహించండి. ఇలా కొందరి వల్ల 2015 నాటికి చైనా వరల్డ్స్ వర్స్ట్ టూరిస్ట్ లిస్ట్ లో టాప్ కి చేరింది. ఇప్పుడు చైనా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంది.
(07:52) వాళ్ళు నేషనల్ బ్లాక్ లిస్ట్ అనే ఒక సిస్టం తెచ్చారు. ఎవరైనా టూరిస్ట్ మిస్ బిహేవ్ చేస్తే వాళ్ళ పేరు ఈ లిస్ట్ లోకి వెళ్తుంది. ఈ లిస్ట్ అన్ని ఎయిర్లైన్స్ హోటల్స్ కి పంపిస్తారు. ఒక్కసారి ఈ బ్లాక్ లిస్ట్ లో పేరు వస్తే రెండు నుంచి ఐదేళ్ల పాటు ట్రావెల్ బ్యాన్ ఉంటుంది. కేవలం విదేశాలే కాదు చైనా లోపల కూడా హై స్పీడ్ ట్రైన్స్ ఎక్కడానికి వీలు లేదు. మంచి హోటల్స్ లో రూమ్స్ దొరకవు.
(08:12) అంతేకాకుండా ప్రతి ఫ్లైట్ లో ఎలా ప్రవర్తించాలి అనే రూల్స్ బుక్ చదవడం కంపల్సరీ. ఎవరైనా గొడవ చేస్తే వెంటనే రిపోర్ట్ చేయమని ఎయిర్లైన్స్ కి పవర్స్ ఇచ్చారు. అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేర్లను ఆన్లైన్ లో పబ్లిక్ గా పెట్టేస్తారు. దేశం మొత్తం ముందు వాళ్ళ పరుగు పోతుందన్నమాట. చైనా తీసుకున్న ఈ కఠినమైన చర్యలు కేవలం ఐదేళ్లలో ఫలితాన్ని ఇచ్చాయి.
(08:33) యుఎస్, యూకే, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల్లో 3650 మందిని సర్వే చేస్తే అందులో 50% మంది చైనీస్ టూరిస్టుల ప్రవర్తన చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇది నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ కానీ దీనికి విరుద్ధంగా మన పరిస్థితి మాత్రం దిగజారుతుంది. పోయిన సంవత్సరం ఒక వీడియో వైరల్ అయింది. ఒక వ్యక్తి ఫారెన్ లేడీస్ ని చూపిస్తూ ఇది 150 ఇది 200 ఇది 500 అంటూ వాళ్ళ మీద ప్రైస్ టాక్స్ వేస్తున్నారు.
(08:58) అసలే ఉమెన్ సేఫ్టీ విషయంలో ఇండియా ర్యాంక్ బాలేదు. ఇలాంటి సమయంలో ఇలాంటి వీడియోలు మంచిదా? రీసెంట్ గా వరల్డ్ కప్ కోసం వచ్చిన ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్లను అసభ్యంగా టచ్ చేసినందుకు ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో చూసాక చాలా మంది హర్ట్ అవ్వచ్చు. అందుకు ఇండియన్స్ అందరూ ఇండియన్స్ ఇలా ఉండరు అని గింజుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ కమ్యూనిటీ మనదే.
(09:18) మన దగ్గర గొప్ప డాక్టర్స్, సైంటిస్ట్లు సఈఓ లో ఉన్నారు. కానీ మన దగ్గర సత్ప్రవర్తన లోపిస్తుంది. మన భారతదేశంలో ఉన్నట్టుగా ప్రతి దేశంలో ఉంటామంటే కుదరదు. అందుకే మనల్ని అందరూ చెత్త బుట్ట అంటున్నారు. కానీ మనం అది కాదు కదా మన చెత్తని డస్ట్ బిన్ లో వేద్దాం. ఉమ్ము వస్తే తగిన ప్రదేశంలోనే ఉమ్మేయండి. టాయిలెట్ వస్తే టాయిలెట్ ని ఉపయోగించండి.
(09:40) ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్స్ టాయిలెట్ ఎక్కడ అందుబాటులో పెడుతున్నాయి అని అరిచేకంటే ముందు ఇది నా దేశం నా రాజకీయ నాయకుల పరిస్థితి బాలేదు కనుక నేనే సర్దుకొని బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు అని గుర్తుపెట్టుకొని మన దేశ పరువు నీ చేతుల్లో ఉందని గుర్తుపెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇంకా ఇంకా దిగజారిపోకుండా ఉంటాం.
(10:02) ఎందుకంటే ఈరోజు అది నీతోనూ నాతోన పోదు. మన పిల్లలు వేరే దేశానికి వెళ్ళాలన్నా మన పిల్లలు ఒక గొప్ప హోదాలో ఉండాలన్నా వాళ్ళకంటూ చిన్న మర్యాద దొరకాలి కదా బయట దేశాల ముందు ప్రపంచం ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
(10:21) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment