💐30శ్రీ లింగ మహాపురాణం💐
🌼దారుకావన మునులకు బ్రహ్మోపదేశం🌼
#ముప్పైయ్యవ భాగం#
సనత్కుమారుడు తన తండ్రి బ్రహ్మ వద్దకు వెళ్లి "పితామహా! దారుకావన మునులు తిరిగి పరమశివుని అనుగ్రహం
ఏ విధంగాపొందగలిగారుఇందు కోసం వారికి మీరు చేసిన ఉప దేశం ఏమిటి?" అని అడిగాడు.
బ్రహ్మ సరేనని "సనత్కుమారా! నేను వారికిశివునిగొప్ఫదనాన్ని చెప్పి, అనుగ్రహం పొందడానికి పూజించేశివలింగంఎలాఉండాలో, శివ పూజ భక్తితో ఎలా చేయాలో చెప్పాను. అదే నీకు వివరిస్తాను.
మహేశ్వరుడు, మహాదేవుడు, దేవాధిదేవుడు అనిశివునితప్ప వేరేఎవ్వరినిపిలువలేము.దేవతలు,పితృదేవతలు,మునులు, మానవులు,రాక్షసులు,గంధర్వాది సకల జనానికిశివుడుఒక్కడే మహా ప్రభువు. వేయి మహా యుగాల తరువాతవచ్చేసమస్త సృష్టిని లయం చేసుకుని తాను ఒక్కడే అవ్యక్తుడుగాఉంటాడు.
తిరిగి సృష్టిసంకల్పించినప్పుడు తానే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రుడుగామారిసకలలోకాలను,చరాచరజీవులనుసృష్టిస్తాడు, పరిపాలిస్తాడు, రక్షిస్తాడు. ఆయన కృతయుగంలో యోగి అని, త్రేతాయుగంలో క్రతువు అని, ద్వాపరంలో కాలాగ్నిఅని, కలియుగంలో ధర్మకేతువు అని పేర్లు కలిగి ఉంటాడు.
జ్ఞానులుశివునియొక్కఈనాలుగురుద్రరూపాలనేధ్యానిస్తుంటారు. మునులు, బ్రాహ్మణులు, నరులు సర్వలక్షణోపేతమైన లింగరూపంలోశివునిపూజిస్తారు. శివలింగము ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మీకు వివరిస్తాను.
లోపలయందున్న లింగము బహిర్భాగమున చతురస్ర రూపములో ఉండాలి. పిండికా ఆశ్రమ స్థానములో ఎనిమిది పార్శ్వములు ఉండాలి. ఇతర స్థానాల్లో వృత్తాకారంలో ఉండాలి.
బ్రహ్మ విష్ణువులు రుద్రునితో పాటు శివలింగము లోనే ఉంటారు. కావున లింగము సువృత్తముగా శుభకరమైన ఆకారంలో ఎనిమిది అంగుళాలు పరిమాణము కలిగి ఉండాలి. సమకేంద్రముగా ఎనిమిది లేక పదహారు కోణాలు కలిగి ఉండాలి. ఈ విధంగా తయారు చేయబడిన లింగము అభీష్టాలన్నింటిని తీరుస్తుంది.
వేదిక రెట్టింపుగా లేక సరిసమానంగా ఉండాలి. గోముఖ వేదిక అయితే సర్వలక్షణములతో ఆకారంలో మూడవ వంతు ఉండాలి. వేదిక యొక్క అంచు చివరలు అనగా పట్టిక నాలుగు వైపులలో ఒక యవ మాత్రమే వెడల్పు కలిగి ఉండాలి. లింగము బంగారం, వెండి లేక రాగితో చేయవచ్చును. వేదిక విస్తీర్ణం నాలుగు వైపులా మూడు రెట్లు పరిమాణం కలిగి ఉండాలి.
ఆకారంలో వేదిక వృత్తముగా లేదా త్రిభుజముగా లేదా చతుర్భుజంగా లేదా షడ్భుజంగా కోణములు కలిగి ఉండవచ్చును. కానీ ఎక్కడా పగుళ్లు వుండరాదు. వేదిక మధ్యభాగంలో కలశం స్థాపించి, పంచాక్షరి మంత్ర సహితంగా బంగారు ముక్కలను కలశంలో ఉంచాలి. సద్యోజాత మంత్రంతో లింగమును అభిమంత్రించాలి. పంచాక్షరి మంత్రంతో శివలింగాన్ని జలంతో అభిషేకించాలి.
ఈ విధంగా పూజ సామాగ్రితో లింగపూజ ఏకాగ్ర చిత్తంతో తన పుత్రులు, బంధుమిత్రులతో కలసి చేయాలి. అంజలి ఘటిస్తూ త్రినేత్రుడు, త్రిశూలధారి యైన మహేశ్వరుని మనస్సులో స్థిరపరచుకుని స్మరించాలి. భక్తి శ్రద్థలతో తనను ఆరాధించేవారిని, పూజించేవారిని పరమశివుడు తప్పక అనుగ్రహిస్తాడు" అన్న నా ఉపదేశం విన్న దారుకావన మునులు అలాగే చేసి శివానుగ్రహం పొందుతామని నమస్కరించి దారుకావనానికి తిరిగి వెళ్లారు" అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
దారుకావనానికి తిరిగి వెళ్లిన మునులు తమ భార్యాపుత్రులతో కలసి బ్రహ్మదేవుడు చెప్పిన విధానంలో శివుని ఆరాధించ సాగారు. కొందరు ఎండలలో పర్వత శిఖరాలపై, కొందరు శీతల కొండగుహలలో, కొందరు నది తీరాలలో శివపూజ చేయసాగారు. కొందరు నిలబడి, కొందరు ఒంటి కాలిపై, కొందరు నీరు మాత్రమే ఆహారంగా, కొందరు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుని శివపూజ చేశారు.
భక్తి శ్రద్థలతో మునులు చేసిన పూజలకు ప్రసన్నుడై శివుడు సంవత్సరం తరువాత అదే దింగబర అనాకారి రూపంలో దారుకావనంలో ప్రత్యక్షమైనాడు. శరీరమంతా భస్మం పూసుకుని ఉన్నాడు. కన్నులు ఎర్రగాను, పసుపు వర్ణంలోను ఉన్నాయి. కాగడా చేతిలో పట్టుకుని అటు ఇటూ తిప్పుతూ, భయంకరంగా నవ్వుతూ, పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ వారి ఆశ్రమాల చూట్టూ తిరగసాగాడు.
భిక్ష అర్థిస్తూ ప్రతి ఆశ్రమం ముందు నుంచి వివిధ రూపాలలో వివిధ భావాలను ప్రదర్శిస్తూ వెళుతూ శివుడు వారికి కనిపించాడు. ఇప్పుడు దారుకావన మునులలో శివుని పై భక్తి శ్రద్థలు ఉండటంతో శివుని గుర్తించి భార్యాపుత్రులు, శిష్యులు, అనుచరులతో సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు. రుద్ర భగవానునికి పళ్ళు, పూలు, పవిత్ర జలం, ధూప గంధములతో స్వాగతం పలికారు.
చేతులు జోడించి "పరమేశ్వరా! అజ్ఞానంతో, అవివేకంతో, అహంకారంతో మేము మొదట నిన్ను గుర్తించలేక తప్పు చేసాము. మా తప్పులు మన్నించి మమ్మలి క్షమించుము. చరాచర ప్రపంచం నీ నుంచే వెలువడింది. విశ్వమంతా నీవే వ్యాపించి ఉన్నావు. అందరిని సృష్టించేవాడవు, రక్షించేవాడవు, లయము చేసుకునేవాడవు నీవే! మా తప్పులను మన్నించి ప్రసన్నుడవు కమ్ము! " అని ప్రార్ధించారు.
పరమేశ్వరుడు ప్రసన్నుడై తన దిగంబర రుద్ర రూపం వదలి వేలాది సూర్యుల తేజస్సుతో త్రినేత్ర, త్రిశూలధారిగా దారుకావన మునులకు దర్శనమిచ్చాడు. ఆ రూపము చూడటానికి మునులకు దివ్య దృష్టి ప్రసాదించాడు. దివ్య దృష్టి పొందిన మునులు పరమశివుని నిజరూపం చూసి పులకితులై శివస్తుతి చేశారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment