Wednesday, January 14, 2026

 💐31శ్రీ లింగ మహాపురాణం💐 

       🌼శివస్తుతి🌼

#ముప్పై ఒకటవ భాగం#

దివ్య దృష్టి పొందిన మహర్షులు పరమేశ్వరుని నిజరూప దర్శనం పొంది తన్మయులై ఈవిధంగా శివస్తుతి చేశారు.

నమో దిగ్వాససే నిత్య కృతాంతాయ త్రిశూలినే |
వికటాయ కరాలాయ కరాళ వదనాయ చ ||

దిక్కులే వస్త్రములుగా గల దిగంబర శివునికి నమస్కారం! త్రిశూలధారికి నమస్కారం! విశ్వవినాశునకు నమస్కారం! కరాల కరాళ వదనునికి నమస్కారం! 

అరూపాయ సురూపాయ విశ్వరూపాయ తే నమః |
కటంకటాయ రుద్రాయ స్వాహాకారాయ వై నమః ||

రూపము లేనివానికి నమస్కారం! సుందరరూపునికి నమస్కారం! విశ్వరూపునికి నమస్కారం! రుద్రునికి నమస్కారం! స్వరాధిపతికి నమస్కారం! 

సర్వప్రణతదేహాయ స్వయం చ ప్రణతాత్మనే |
నిత్యం నీలశిఖండాయ శ్రీకంఠాయ నమో నమః ||

సర్వాత్మల చేత నమస్కరించబడు వానికి నమస్కారం! నిత్యం నీలవర్ణములో ఉండే శివునకు నమస్కారం! శ్రీకంఠునకు నమస్కారం! 

నీలకంఠాయ దేవాయ చితభస్మాంగధారిణే |
త్వం బ్రహ్మా సర్వదేవానాం రుద్రాణాం నీలలోహిత ||

నీలకంఠ దేవునికి నమస్కారం! చితాభస్మం దేహమంతా ధరించినవాడికి నమస్కారం! సర్వదేవతలలో పరబ్రహ్మకు నమస్కారం! రుద్రులలో నీలలోహితునకు నమస్కారం! 

ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యెః పురుష ఉచ్యతే |
పర్వతానాం మహామేరుర్నక్షత్రాణం చ చంద్రమాః ||

సమస్త ప్రాణులకు ఆత్మవు నీవే! నీవే సాంఖ్యుల చేత పరమపురుషుడని పిలవబడుతున్నావు! పర్వతాలలో మహామేరు పర్వతం నీవే! నక్షత్రాలలో చంద్రుడివి నీవే! 

ఋషీణాం చ వసిష్ఠస్త్వం దేవానాం వాసవ స్తథా |
ఓంకారః సర్వవేదానాం శ్రేష్టం సామ చ సామసు ||

ఋషులలో వసిష్ఠుడివి నీవే! దేవతలలో రుద్రుడివి నీవే! వేదాలలో ఓంకారం నీవే! సామములలో సామవేదం నీవే! 

ఆరణ్యానాం పశూనాం చ సింహస్త్వం పరమేశ్వరః |
గ్రామ్యాణామృషభశ్చాసి భగవాంల్లోక పూజిస్తూ ||

అరణ్యమృగాలలో సింహము నీవే! గ్రామజంతువులలో వృషభం నీవే! లోకాలలో భగవంతుడిగా పూజించబడే పరమేశ్వరుడు నీవే! 

సర్వథా వర్తమానోపి యోయో భావో భవిష్యతి |
త్వామేవ తత్ర పశ్యామో బ్రహ్మణా కథితమ్ తథా ||

వర్తమానంలో ఉన్న మేము బ్రహ్మ చెప్పిన విధి విధానం ద్వారా  భూత భవిష్యత్తు వర్తమానాలలో కనపడని ఉన్న  నిన్ను సందర్శించుకోగలుగుతున్నాము! 

కామః క్రోధశ్చ లోభశ్చ విషాదో మద ఏవ చ |
యేతదీచ్ఛామహే బోద్ధుం ప్రసీద పరమేశ్వర ||

మాలోని కామ క్రోధ లోభ విషాద  మద అహంకారాలన్ని తెలుసుకుని వదిలేద్దాం అనుకుంటున్నాము. పరమేశ్వరా! మమ్మల్ని అనుగ్రహించి ప్రసన్నుడవు అవ్వుము. 

మహాసంహరణే పాప్తే త్వయా దేవ కృతాత్మనా |
కరం లలాటే సంవిధ్య వహ్నిరుత్పాదిత స్త్వయా ||

ప్రళయ సమయంలో నీవే స్వయంగా మమ్మల్ని సంహరించి మూడో కన్ను నుంచి అగ్నిజ్వాలలు లోకాలను దహించటానికి పుట్టించావు 

తేనాగ్నినా తథాలోక అర్చర్బిః సర్వతో వృతాః |
తస్మాదగ్నిసమా హ్వోతే భవావో వకృతాగ్నయః ||

అలా పుట్టిన అగ్ని అన్నిలోకాలను చుట్టుముట్టి దహించివేసాయి.  ప్రళయాగ్ని సమాన రుద్రుడవు నీవే! 

కామం క్రోధశ్చ లోభశ్చ మోహో దంభ ఉపద్రవం |
యాని చ్చాన్యాని భూతాని స్థావరాణి చరాణి చ ||

కామ క్రోధ లోభ మోహ దంభాది ఉపద్రవాలు, సర్వ చరాచర ప్రాణులు నీ చేత సృష్టించబడిన అగ్నిలో దహించబడుతున్నాయి. 

దహ్యంతే ప్రాణినస్తే తు త్వత్సముతేన వహ్నినా |
ఆస్తమాకు దహ్యమానానాం త్రతా భవ సురేశ్వర ||
త్వంచ లోకహితార్థాయ భూతాని పరిషించసి |
మహేశ్వరా మహాభాగ ప్రభో శుభనిరీక్షక ||
ఆజ్ఞాపయ వయం నాథ కర్తారో వచనం తవ |
భూతకోటి సహస్రేషు రూపకోటి శతేషు చ |
అంతం గంతుం న శక్తాః‌ స్మ దేవదేవ నమోస్తుతే ||

దేవదేవా! మహేశ్వరా! నీ చేత సృష్టించిబడిన కామక్రోధాది అగ్నులలో దహించబడుతున్న మమ్మల్ని రక్షింపుము! లోకహితము కోసం నీవే సకల ప్రాణులను పరిరక్షిస్తున్నావు! మహాభాగా! మేమందరం నీ ఆజ్ఞలను పాటించేవారం! కోట్లాది ప్రాణులలో కోట్లాది రూపములలో ఉన్న మేము నీ ఆది అంతము చూడలేని అసమర్థులం! కావున నీవే మమ్మల్ని క్షమించి కాపాడాలి. నీ పై భక్తి సదా కలిగి ఉండేటట్టు చేయాలి!" అని మునులు చేసిన శివస్తుతికి మహేశ్వరుడు ప్రసన్నుడై

"మునులారా! ప్రసన్నుడనై మీకు హితోపదేశం చేస్తున్నాను.  నేను నన్ను ప్రకృతి పురుషునిగా విభజించుకుని సృష్టిని ఆరంభించాను. కనుక స్త్రీ లింగ రూపములో ఉత్పన్నమైన ప్రతి జీవి ప్రకృతి నుంచి వచ్చినదే. అలాగే పురుష రూపంలో ఉండే జీవులన్ని నా నుంచి ఏర్పడిన పురుషుడి నుంచి వచ్చినదే. కాబట్టి సృష్టి అంతా ప్రకృతి పురుషుల నుంచి ఏర్పడింది.

కనుక నా భక్తులైనవారు దిగంబర రూపంలోని యతులను, వారి చేష్టలు బాలుని వలె లేదా పిచ్చివాని వలె ఉన్నా నిందించరాదు, గేళి చేయరాదు. శివభక్తులు భస్మధారణ చేయడానికి ఇష్టపడతారు. భస్మధారణ ద్వారా పాపాలు తొలగిపోతాయి. వీరు రుద్రలోకము చేరుకుంటారు. ఇటువంటి వారిని నిందించడం నన్ను (శివుని) నిందించటమే అవుతుంది. వీరిని పూజించితే నన్ను పూజించినట్టు అవుతుంది.

లోక కల్యాణం కోసం  రుద్రుడు ప్రతియుగంలో భస్మము పూసుకుని మహాయోగి వలె లీలలు చూపిస్తుంటాడు. మీరు గుర్తించి వారిని గౌరవించి పూజించండి" అని అనుగ్రహ భాషణం చేశాడు.

మునులు పరమేశ్వరునికి నమస్కరించి శివలింగ ప్రతిష్టించి సుగంధ కుశములు, పుష్పాలు, ఫలాలతో కూడిన జలమును మహాకుంభాలతో తెచ్చి అభిషేకం చేసారు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment