Wednesday, January 14, 2026

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(287వ రోజు):--
              30. ఆత్మ జ్ఞానం 
  ప్రశ్న :- మనమందరమూ అంతిమ గమ్యంగా భావించి, పొందటానికి ప్రయత్నించే ఆత్మ జ్ఞానానికి ఖచ్చిత మైన నిర్వచన మేమిటి ?
       స్వామీజీ :- ఆత్మజ్ఞానం అంటే విముక్తి ;? మనిషికి వస్తు ప్రపంచం నుండి విముక్తి. 'నేను' అనే తలపు ను విడనాడాలి. మేల్కొనడానికి అదొక్కటే పద్ధతి. మనమే నారాయణు డనే బంగారమంత విలువైన సత్యం ఇంద్రియ ప్రపం చంలో చాలా కాలంగా మురిగి, ఇనుములా కనిపిస్తోంది. ఇంద్రియ లాలసత్వం తో మలినమైన ఈ బంగారాన్ని శుభ్రపడి మెరిసేవరకూ తోమాలి. అంతే. 
     ప్రశ్న :- గతంలో కలిగిన కొద్దిపాటి ఆనందాను భవానికి ఆకర్షితులమై, మనం మళ్లీమళ్లీ అవే కోరికల వెంట పడుతున్నా మన్నారు. కాని, మోక్షం కావాలనే కోరిక మాటేమిటీ ?అదెక్కడి నుంచి వస్తుంది ?
         స్వామీజీ :- అది వస్తుందంతే ! ప్రాపంచిక సుఖ దుఃఖాలను రుచి చూసిన తర్వాత కాంక్షలన్నింటినీ పరిత్యజిస్తే, మిగిలేది దివ్యానందమే; అదే మీ సహజ గుణం. 
        ప్రశ్న :- ఐతే మోక్ష కాంక్ష 'ఉండ దగిన' కాంక్షయేనా ?
         స్వామీజీ :- నిజమే, మోక్షకాంక్ష కూడా అన్ని కాంక్షల్లాగే, 'అహం'కు సంబంధించినదే. కాని, ఇది ఉన్నత స్థాయికి చెందిన కోరిక కనుక, ఉండ దగ్గదే. కోరికలన్నీ పరిత్యజించబడి నప్పుడు, ఇది కూడా తనంతతానే మాయ మౌతుంది. అర్థమైందా ? జాగ్రత్తగా ఆలోచించండి. కోరికలన్నీ పొతే, కోరికలన్నీ పోవాలనే కోరిక మాత్రం ఎలా ఉంటుంది ? కోరిక లన్నీ మాయమైతే గమ్యాన్ని చేరి నట్లే. ఇది కూడా నిద్ర వంటిదే. నిద్రిం చాలనే కోరిక నిద్ర రావటంతో కరిగిపోతుంది. 
        మహాత్ములైన రామకృష్ణ పరమ హంసకు నిజజీవితపు కథలతో ఆధ్యాత్మిక సత్యాలను బోధించే నేర్పు ఉంది. ఆయన ఈ ఉదాహరణ చెప్పారు : నువ్వొక అడవిలో ఉన్నావు ; నీ చేతికి ఒక చిన్న ముల్లు గుచ్చుకుంది. చుట్టూ వెతికి, ఒక పెద్ద ముల్లును చూస్తావు. చెట్టు కొమ్మ నుంచి దానిని పెరికి, దాని సాయంతో నీలో గుచ్చుకున్న చిన్న ముల్లును పెరికి వేస్తావు. ఆ తర్వాత కూడా పెద్ద ముల్లును నీ వద్ద నే ఉంచుకుంటావా ? ఉంచుకోవు ; రెండు ముళ్ళనీ పారేస్తావు. అదే విధంగా, ఉన్నతమైన కాంక్షను గమ్యం చేరటానికి పనిముట్టుగా వాడు కుంటావంతే. కాని గమ్యం చేరిన తర్వాత దాన్ని నీతో ఉంచు కోవు. 
         🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣 శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment