🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(288వ రోజు):--
ప్రశ్న :- సమాధి ఎలా ఉంటుంది?
స్వామీజీ :- సమ -ధి. ధి - బుద్ధి, సమ - నిశ్చలమౌతుంది. ఆ సమ యంలో 'కర్మ'నీ నుండి రాలిపోతుం ది. అనుభవాల నిచ్చే ప్రపంచం ఉండదాస్థితిలో. అందువల్ల అనుభ వాలను అనుభవించే వాడు కూడా ఉండడు.
అది విశ్వంలో లేదు ; ప్రపంచం లో ఎక్కడా లేదు. దాని రంగమే వేరు
.. దానికి స్థలమూ లేదు, కాలమూ లేదు.
ప్రశ్న :- మనసు సమాధిలో ఎందుకు నిలువదు ?
స్వామీజీ :- మనసు సమాధిలో ఎన్నడూ ఉండలేదు ; అదొక ఆలో చనా ప్రవాహం. అందుచేత మీప్రశ్న లో ఒకదాని కొకటి పొసగని విషయా లున్నాయని చెప్పాలి. జీవిస్తున్న శరీరం ఎందుకు చనిపోయి లేదో అడగటం వంటిదే ఈ ప్రశ్న. అంతా బ్రహ్మమే (దేవుడే) అనే జ్ఞానం మీకు కలిగినపుడు సమాధిస్థితి అవసరం లేదు. దైవ సాక్షాత్కారం కలిగిన వాని కి సమాధిలో ఉండడం, ఉండక పోవడం వంటివేవీ ఉండవు.
ఈశ్వర దర్శనంతో, ఉన్నది 'అతడొక్కడే' ననీ, 'నేను' అనే ఊహ అసత్యమనీ గ్రహించే నిజమైన జ్ఞానం లభిస్తుంది. భక్తునిలో ఒక్క మెరుపులా మెరుస్తుంది శబ్ద, స్పర్శ, రస, రూప, గంథాల అనుభవం కూడా భగవంతుని సాక్షాత్కారమే ననే, ఇంకేదీ కాదనే గ్రహింపు. అహం నశించినపుడు అనంత మైన, స్థిరమైన ఆనందాను భవం తప్ప ఇంకేదీ మిగలదు. అదే బ్రహ్మం
ప్రశ్న :- ఐతే సాక్షాత్కారాను భవం అందరికీ ఒకేవిధంగా ఉంటుందన్నమాట.
స్వామీజీ :- ఔను, పూర్తిగా ఒకేలా ఉంటుంది. మీ వ్రేలితో విద్యుత్తీగను ముట్టితే ఎలా ఉంటుంది ? మీకొకలా, మరొకరికి ఇంకొకలా ఉంటుందా? ఉండదు. అందరి వ్రేళ్ళకూ ఒకేవిధమైన అను భవం కలుగుతుంది. మీ అంతట మీరే చేసి కనుక్కోవాలి దీన్ని !
గురువుకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది ; ఐనా, అతడి అనుభవం వల్ల మీకు అణుమాత్ర మైనా ప్రయో జనం ఉండదు. అందరిలోనూ ఉన్న దివ్యత్వాన్ని మీరే స్వయంగా స్పృశిం చి కనుగొనాలి.
గుర్తుంచుకోండి, వ్రేలు తీగను తాకాల్సిందే (అభినయంతో చూపి స్తారు). కాని, మీరు మాత్రం ఇక్కడ కూర్చొని నేను చెప్పేదంతా మీ పుస్త కంలో వ్రాసుకోడానికే శ్రద్ధ చూపుతారు. "మళ్ళీ చెప్పండి, తీగ లో ఎన్ని వోల్టుల విద్యుత్తుందో", "మరో దేశంలో విద్యుత్తీగ ముట్టు కుంటే, నా అనుభవం వేరేలా ఉంటుందా?" నేను చెప్తున్నాను వినండి - ఇక్కడైనా, ఇంగ్లండులో నైనా, ఆఫ్రికాలోనైనా - విద్యుత్తు ఎక్కడైనా ఒక్కటే. అమెరికాలో విద్యుత్ఘాతం తింటే, భారతదేశాని కొచ్చి అది ఎలా ఉంటుందో మళ్ళీ చూడనక్కరలేదు. ఒకచోట అనుభవ మైతే, అన్ని చోట్లా అయినట్లే.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment