[11/29/2025, 17:04] +91 85198 60693: *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 ఒకనాడు శ్రీరమణమహర్షి ఇలా సెలవిచ్చారు ...._*
*_పార్వతి, ఈశ్వరుడి శరీరంలో అర్థ భాగాన్ని కోరి అరుణాచలంపైన తపస్సు చేస్తున్నది._*
*_మహిషాసురుడు గొప్ప శివభక్తులు. శివలింగం అతని కంఠంలో ఉంటుంది. దాన్ని సదా ఆరాధిస్తాడు. అతను పార్వతిని మోహించాడు. పార్వతి అతన్ని సంహరించింది. ఆ సందర్భంలో ఆ అసురుడి కంఠంలోని శివలింగం పార్వతి చేతిలోకి వచ్చింది. కాని అది చేతి నుంచి వూడిరాలేదు._*
*_అప్పుడు పార్వతి ఈశ్వరుణ్ణి ప్రార్థించింది. పార్వతిని ఆమె చేతిలోని ఖడ్గంతో అక్కడవున్న రాతిపైన కొట్టమన్నారు ఈశ్వరుడు. కొట్టగానే తీర్థమయింది. దాని పేరే ఖడ్గతీర్థం. అందులో స్నానం చేసేటప్పటికి శివలింగం వూడి ఒడ్డున పడ్డది. శివలింగాన్ని అక్కడే ప్రతిష్టించమన్నారు ఈశ్వరుడు._*
*_అది ఈ ఊరి (అరుణాచలం) దుర్గ గుడి. ఆ గుడి శిథిలమైతే దానిని ధర్మకర్త బాగు చేయిస్తున్నారు._*
*_🦚 ఆ కాలంలో ఒక రాత్రి మహర్షి అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఆ దుర్గాలయం దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్న శ్రీచక్రాన్ని చూశారు. రాత్రి రెండు గంటలు. అక్కడి కాపాలాదారు వెళ్ళి ధర్మకర్తతో చెప్పాడు; ధర్మకర్త వచ్చాడు. మహర్షి అతనికి ఆ శ్రీచక్రాన్ని చూపి దాంట్లో లోపం ఉందన్నారు. వారు శిల్పిని అప్పటికప్పుడు పిలిపించారు. మహర్షి అక్కడే కూర్చుని శ్రీచక్రాన్ని సవరింపజేశారు. సూర్యోదయం లోపల పని పూర్తయింది. మహర్షి తన చేత్తో ఆ శ్రీచక్రాన్ని స్పృశించారు !_*
*_🧘🏻 ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
[11/29/2025, 17:07] +91 85198 60693: 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
29/11/2025
1) దైవసంకల్పం అనేది స్వప్రయత్నం యొక్క ఫలితమే అన్నట్లు అనిపిస్తుందే గాని నిజానికి దైవసంకల్పాను సారంగానే స్వప్రయత్నం జరుగుతుంది.
2) స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న
3) ఎట్లా కనిపించినా సరే ఎట్లా అనిపించినా సరే ఉన్నది సద్వస్తువు ఒక్కటే.
4) బహు ఆశ్చర్యములతో నిండిన
ఈ విశ్వము వాస్తవముగా
కొంచెము కూడా లేదు అని నిశ్చయమైతే కోరికలు ఉండవు.
పరమాత్మ తెలియబడగా ఇచ్ఛ నశించి ముక్తి కలుగుతుంది.
5) నేను నాలోపల మాత్రమే నిండి ఉన్నాను అని ఉండడం జీవానుభవం. నేను నాలోపలా బయటా నిండి ఉన్నాను అని ఉండడం దైవానుభవం.
No comments:
Post a Comment