*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
> *_“🦚 భగవాన్ శ్రీరమణమహర్షి రోజూ క్రమం తప్పకుండా వచ్చిన ఉత్తరాలను చూసి ఏ రోజు ఉత్తరానికి ఆ రోజే జవాబు వెళ్ళేటట్లు గమనించేవారు. ఎవరైనా భక్తుడు ఫలానా రోజు వస్తున్నానని వ్రాస్తే, ఆ విషయం ఆశ్రమంలో ఉన్న సేవకులకు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండేవారు. ఒకసారి శ్రీలంక నుంచి ఒక భక్తుడు ఫలానా రోజుకు వస్తున్నానని ఉత్తరం వ్రాసాడు. అయితే తిరువణ్ణామలై (అరుణాచలం) వచ్చే సమయం మాత్రం తెలుపలేదు. మహర్షి ఒక ఆశ్రమ సేవకుడను పిలిచి “శ్రీలంక కొలంబోలో స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో కనుక్కుని, ఎప్పుడు ధనుష్కోటి (రామేశ్వరం) చేరుతుందో చూసి, అతను అక్కడ నుంచి తిరువణ్ణామలై ఎప్పుడు వస్తాడో” తెలుసుకోమన్నారు. ఆ విషయాలను తెలుసుకున్న తరువాతే మహర్షి సంతృప్తి పడ్డారు. శ్రీలంక భక్తుని పట్ల చూపిన అపారమైన కరుణకు భక్తులకు కన్నీరే వచ్చింది.!!"_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_*
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
No comments:
Post a Comment