Wednesday, January 14, 2026

 💐28శ్రీ లింగ మహాపురాణం💐

🌼దారుకావనంలో 
రుద్రుని లీల 🌼  

#ఇరవై ఎనిమిదవ భాగం#

నందిసనత్కుమారునికిదారుకా  వనంలోజరిగినదిచెబుతున్నారు.  "మహర్షీ! మునులు భార్యా పుత్రులు, యజ్ఞహోమాగ్నులను తీసుకుని దారుకావనం చేరి శివానుగ్రహం కోసం యజ్ఞ యాగాదులు చేయసాగారు. రుద్రుడైన శివుడు వారి పై ప్రసన్నత నొంది అనుగ్రహించ దలచాడు.వారికియజ్ఞయాగాదులలో,తపస్సులలో,పూజలలోభక్తిశ్రద్థలకన్నావిధివిధానాలు, పద్దతుల పైఎక్కువధ్యానం కేంద్రీకరించడం గమనించాడు.

మునుల మనస్సులను యజ్ఞ కార్యకలపాలపైనుంచిమరలించినివృత్తులనుచేయదలిచాడు. శివుడు మూడు కన్నులు,రెండు భుజములతో నల్లని రంగుతో స్త్రీలను ఆకర్షించే దివ్య సుందర రూపము వస్త్రములు లేకుండా దిగంబర రూపం ధరించిదారుకా వనం వెళ్లాడు.
అతి సుందరమైన శివుని చూసిన మునుల  భార్యలు, ఇతర స్త్రీలు ఆకర్షతులై తమ దైనందిక పనులనువదలిశివుని వెంట వెళ్ళసాగారు. వారికి శివుని దిగంబర రూపం అసభ్యంగా కనపడలేదు. వారికి పరమేశ్వరుని దివ్య తేజస్సు మాత్రమే కనపడింది.   అరుదైన భగవంతుని దివ్య స్వరూపం చూసి భక్తులైన వారు తమ ప్రాపంచిక బంధాలు,అను బంధాలు మరిచిపోతారు. తమ జీవాత్మలను పరమాత్మతో విలీనం చేయాలనే  భావనతో మాత్రమే ఉంటారు. 

కానీయజ్ఞయాగాదులుచేసేమునులు, బ్రాహ్మణులు రుద్రునిగా గుర్తించలేక సామాన్య దిగంబర పురుషుడు తన రూపంతోతమ స్త్రీల మనస్సులను కలుషితం చేయడానికి వచ్చాడు అని భావించారు. రుద్రుని వెంట వెళుతున్న  స్త్రీలను ఆపిరుద్రుని కఠినమాటలతోదూషిస్తూశాపాలుఇవ్వసాగారు. రుద్రునిపైవారి దూషణల శాపాల ప్రభావంఏమీ పడలేదు. ఏదీపట్టించుకోకుండా తనదోవనతనునడుచుకుంటూ శివుడు హిమాలయాలలోకివెళ్లి అదృశ్యమయ్యాడు.

మునులు జరిగినది అర్థం కాక అదృశ్యులై బ్రహ్మ దగ్గరకు వెళ్లి జరిగిన వృత్తాంతమంతా చెప్పి తమ స్త్రీలు ఆ దిగంబర వికృత పురుషునికి ఆకర్షితులై అతని వెనక వెళ్లడంతో ఆగ్రహం చెంది శపించామని చెప్పారు. తమ శాపాలు పని చేయలేదని, ఆ దిగంబరవ్యక్తిఅదృశ్యమవ్వటంతోతమస్త్రీలందరుచింతితులయ్యారని నివేదించారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని బ్రహ్మ వద్దకు వచ్చామని విన్నవించారు.

బ్రహ్మ కన్నులు మూసుకుని దివ్యదృష్టితోజరిగిందిగ్రహించాడు.మునులనిచూసిమునులారా! మీరు యజ్ఞయాగాదుల విధి విధానాలలో అతిగా నిమగ్నమై పరమేశ్వరుని పై భక్తి శ్రద్థలు వదలి వేశారు. అందుకే దిగంబర పురుష రూపంలో వచ్చిన పరమేశ్వరుని గుర్తించ లేకపోయారు. మీ భార్యలు, ఇతరస్త్రీలుపరమేశ్వరస్వరూపాన్ని గుర్తించి ఆయనను భక్తితో సేవించాలని వెళ్ళారు.

మునులారా! వచ్చిన అతిథి కురూపుడైన, సురూపుడైన, మలినుడైన,మూర్ఖుడైనానిందిం చుట ధర్మం కాదు. పూర్వము భూమి పై మృత్యుదేవతయైన యమధర్మరాజుమారురూపంలో  సుదర్శనుడనేబ్రాహ్మణుడిఇంటికివస్తే,అతనుఅతిథిగాపూజించి మృత్యువునే జయించాడు. ఆ కథ చెబుతాను. వినండి.
         పూర్వము సుదర్శనుడనే బ్రాహ్మణగృహస్థుడుఉండేవాడు. భార్యతో కూడి అతిథి అభాగ్యతులను ఆదరించి సేవ చేసేవాడు. ఒకరోజు పని మీద బయటకు వెళుతూ పతివ్రత అయినతనభార్యతో"సతీమణీ! నేనుచెప్పేదిశ్రద్ధతోవినిఆచరించుము.నేనుపనిమీదబయటకు వెళుతున్నాను. రావడంఆలస్య మైతేవచ్చినఅతిథినిగౌరవంతో ఆహ్వానించి,ఆఅతిథిభగవంతుడైన శివునిగా భావించి అతిథి సత్కారాలు చేసిపూజించుము. అతిథి కోరినది ఇచ్చినేనులేననేభావన కలిగించ వద్దు" అని చెప్ప వెళ్లి పోయాడు.

సుదర్శనుడి అతిథి సత్కరాల ప్రఖ్యాతి గురించి విన్న యమ ధర్మరాజుపరీక్షించాలనిఅందమైన బ్రాహ్మణ అతిథి రూపంలో వచ్చాడు. సుదర్శనుడి భార్య భర్త మాటలను గుర్తు పెట్టుకుని వచ్చినఅతిథినిఆదరించిఅతిథి సత్కారాలు చేసింది. చక్కటి భోజనం వడ్డించింది. సుష్టుగా తృప్తిగాతిన్నఅతిథిసుదర్శనుడి భార్యను చూసి "చాలాకాలం తర్వాత రుచికరమైన చక్కటి భోజనం తిని భుక్తాయాసంతో అలసి నిద్రపోదలచాను.చక్కటి పడక ఏర్పాటు చేసిపాదములు ఒత్తుము" అని పలికాడు.

అతిథికి చక్కని పడక ఏర్పాటు చేసిఆమెఅతిథిపాదాలుఒత్తుతూ సేవించసాగింది. అతిథిగా వచ్చిన యమధర్మరాజు మంచి నిద్రలోకి వెళ్లి గుర్రు పెట్టి నిద్ర పోతున్నాడు. అదేసమయంలో సుదర్శనుడువచ్చికాళ్ళుచేతులు కడుక్కోవడానికి నీళ్ళు, వస్త్రం ఏర్పాటు చేయమని భార్యను పిలిచాడు.

లేచి వెళ్లితే అతిథికి నిద్రాభంగం అవ్వుతుందని సుదర్శన భార్య వెళ్లలేదు. భార్యరాకపోవడంతో సుదర్శనుడు లోనికి వచ్చి అతిథికి సేవలు చేస్తున్న భార్యనుచూసికొనసాగించమని చెప్పి బయటకు వెళ్లబోయాడు. అతిథి రూపంలో ఉన్న యమ ధర్మరాజు చటుక్కున లేచి వారికి నిజరూపంతో దర్శన మిచ్చాడు.

వారిని చూసి "సుదర్శనా! మీ దంపతుల అతిథి సేవల పేరు ప్రఖ్యాతులు విని పరీక్షించాలని అతిథి రూపంలో వచ్చాను. నా సుందర రూపం చూసి అను మానించకుండా భార్యను సేవ కొనసాగించమనిచెప్పివెళ్లిపోతున్నావు.  నీ అతిథి సేవలు మెచ్చాను.అతిథిసేవాధర్మముతో  మృత్యువుని జయించావు" అనివరములిచ్చిఅదృశ్య
మయ్యాడు.
     కానీ మునులారా! మీరు ఏం చేశారు. దిగంబరంగా వచ్చి మీ స్త్రీల మనస్సులను కలుషితం చేశాడనిఅతిథిగావచ్చినపరమ శివునే పరుషపు మాటలతో అవమానించి శపించారు. మీరు శివుని క్షమించమని శరణు వేడండి" అని ఉపదేశం చేశాడు.

మునులు తమ తప్పిదానికి చింతించి బ్రహ్మతో"పితామహా! మమ్మల్ని క్షమించి తిరిగి మహా దేవుని అనుగ్రహం పొందిచూడ గలిగే జీవిత ప్రక్రియ చెప్పండి" అని ప్రార్ధించారు.  బ్రహ్మ సరేనని "ద్విజోత్తములారా! శివభక్తుడు కాదలచినవాడు బ్రహ్మచర్యఆశ్రమంలోగురువుని భక్తిశ్రద్థలతోసేవించివిద్యాభ్యాసంచేయాలి.శాస్త్రములఅర్థములు, భేదములు తెలుసుకుని ధర్మం అంటేఏమిటోగ్రహించాలి. గురువు వద్ద అధ్యయనం పూర్తైయ్యేవరకు లేదా పన్నెండు సంవత్సరములవరకుఅనుశాసనం జీవితం గడపాలి.

స్నాతక ఉత్సవం జరుపుకుని గురువు అనుమతి పొంది ఆశ్రమంవదలిసుగుణవతియైన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలి. అతిథి అభ్యాగతులనుసేవిస్తూ తగిన సంతానం కనాలి. వారిని పెద్దచేసివిద్యాబుద్దులునేర్పించి జీవనోపాధికైతగినసాధనములు ఇవ్వాలి లేదాతగినవృత్తిలో ఉంచాలి. గృహస్థుగా నిత్యం అగ్నికార్యాదిహోమాలు,యజ్ఞాలుచేయాలి.తరువాతవాన
ప్రస్థం స్వీకరించి అరణ్యానికి వెళ్లాలి. పాలను మాత్రమే స్వీకరిస్తూ ఇంద్రియాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలి. పన్నెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం లేదా ఒక మాసము లేదా పన్నెండు దినాలు పాలు మాత్రమే ఆహారంగా తీసుకుని దేవతా పూజలు చేయాలి. తనకు గల ధనసంపదలన్ని దానము ఇచ్చి యతి (సన్యాస) ఆశ్రమం స్వీకరించాలి.

శిఖాసహితశిరస్సుపైగలజుట్టుని, గడ్డమును, మీసములు తీసివేసియజ్ఞోపవీతంత్యజించి వేయాలి. అగ్నికి ఐదు ఆహూ తులు అర్పించి తృప్తిపరచాలి. పూర్ణముక్తి కోసం  పర్యటన చేయాలి.వ్రతముగాఆహారమును కొద్ది కొద్దిగా తగ్గించి తీసు కుంటూ మాని వేయాలి.  కొంత కాలంఫలములను,కందమూలాలను భక్షించాలి. తరువాత ఆహారం పూర్తిగా వదలి పాలు, జలము తీసుకుంటూ జీవితం గడపాలి.
జీవన్మృతుడిగా యతి జీవితం గడుపుతూ ఒక సంవత్సర కాలంలోదేహాన్నివదలివేయాలి. ఈవిధంగా చేసిన వ్యక్తికి శివ సాయిజ్యం లభిస్తుంది.  కేవలం ధార్మిక విధుల వలన గాని, యజ్ఞయాగాదులు చేయడం వలన గాని, దానదక్షిణలతో గాని, శాస్త్ర వేద విజ్ఞానము  వలనగానిమోక్షము,భగవదనుగ్రహం లభించదు. శ్వేతుడు కేవలం శివభక్తి వలన మృత్యువుని జయించాడు" అని చెప్పగానే మునులు బ్రహ్మను శ్వేతుడి కథ చెప్పమని కోరారు.

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment