Wednesday, January 14, 2026

 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
 02/12/2025

1) భగవంతుణ్ణి పొందాలన్నది వదలి భగవంతుణ్ణి పొందాలని అనుకుంటున్నది ఎవరో చూడు.

2) తన మూలంతో తాను కనెక్ట్ అవడమే నిజమైన సత్సంగం. అంతేగాని, ఓ పదిమంది ఒకచోట చేరి తత్త్వ విచారణ చేయడంకాదు!

3) గ్రహమైనా పట్టివిడుస్తుందేగాని గురువు "అను గ్రహం", దైవము "అను గ్రహం' పడితే వదలవు!

4) జగత్తును కలగా భావించి జీవించడమే కళ.

5) ఏ మార్గంలో వెళితే తిరిగి ఈ సంసారబంధంలో చిగులుకోవో అది శ్రేయోమార్గము. ఏ మార్గంలో వెళితే తిరిగి మళ్ళీ సంసారబంధంలో ఇరుక్కుంటావో అది ప్రేయోమార్గము. ఇంద్రియాలు నెట్టేది ప్రేయోమార్గంలోకి సద్గురువు త్రోసేది శ్రేయోమార్గంలోకి

6) నేను దేహాన్ని" అనుకోవడం కంటే మూఢ విశ్వాసం మరొకటి ఉండదు.

No comments:

Post a Comment