Wednesday, January 14, 2026

 💐29శ్రీ లింగ మహాపురాణం💐

🌼 శ్వేత ముని వృత్తాంతం🌼

#ఇరవై తొమ్మిదవ భాగం#

బ్రహ్మదేవుడు దారుకావన మునుల కోరిక పై శ్వేత ముని వృత్తాంతం చెబుతున్నారు 
పూర్వం హిమాలయాలలో గల ఒక పర్వత గుహలో శ్వేతుడు అనే ముని శివుని పూజిస్తూ నివసించే వాడు. నిత్యము రుద్రాధ్యాయములోగలమంత్రాలు అన్ని జపిస్తూ పూజ అర్చన అభిషేకాలు భక్తి శ్రద్థలతో శివ లింగానికి చేసేవాడు.

శ్వేతుడి జీవన సమయం గడచి మృత్యుసమయంఆసన్నమయ్యింది. ఇది తెలియని శ్వేతుడు రోజు చేస్తున్నట్టే శివ లింగపూజార్చనలోనిమగ్న
మయ్యాడు. మృత్యుదేవత అయినయమధర్మరాజుశ్వేతుడి మరణసమయంవచ్చిందనిప్రాణాలుతీసుకుపోవడానికిగుహవద్దకువచ్చాడు.

యమధర్మరాజు ధేనువు పై పాశములతో కన్పించడంతో శ్వేతుడుతనమృత్యుసమయం వచ్చింది అనితెలుసుకున్నాడు. యముని చూసి"మహాకాలుడా! నేనుశివలింగపూజలోఉన్నాను. నా పూజ సమాప్తి అయ్యేవరకు వేచి ఉండుము" అనిపలికాడు.

శ్వేతుడి మాటలకు యముడు నవ్వి "మునీ! మృత్యువుఅనేది ఎనరికోసముఆగదుఅన్నసంగతి నీకు తెలియదా! శివపూజ నిత్యం చేస్తున్నావు కదా! ఏమి పుణ్యఫలంలభించిందినీజీవితకాలం పూర్తి అయ్యినందుకు నీ ప్రాణాలను ఇప్పుడే ఈ క్షణమే తీసుకువెళతాను.బ్రహ్మవిష్ణువులు కానీ, నీవుపూజించేరుద్రుడు కానినన్నుఆపలేరు,నిన్నుకాపాడలేరు" అని భయంకరంగా నవ్వి ధేనువు దిగి పాశముతో దగ్గరకు రాసాగాడు.

శ్వేతుడుభయపడకుండాగట్టిగా  "యమధర్మరాజా! నీవంటిసకల దేవతలఉత్పత్తికారకుడు,దేవా ధిదేవుడు పరమేశ్వరుడు ఈ లింగంలో నిలచి ఉన్నాడు. నాలాంటి శివభక్తులను పూజ ముగించకుండా తీసుకు వెళితే నీకు ఏ లాభము వస్తుంది. పైగా శివాగ్రహానికి గురి అవ్వవలసి వస్తుంది. నా మాట వినివెనక్కు వెళ్ళుము" అనిప్రణవపంచాక్షరి జపము చేస్తూ శివలింగము దగ్గర కూర్చున్నాడు.

యమధర్మరాజుపట్టించుకోకుండాపాశమువిసిరిశ్వేతుడిశరీరము నుండి అతని ప్రాణాలను పట్టి బంధించి గట్టిగా నవ్వి "శ్వేతమునీ! నీ ప్రాణాలను బంధించితీసుకువెళుతున్నానుఎక్కడ నీ శివుడు? ఎక్కడ నీ పూజ? ఎక్కడ నీ భక్తి?నీపూజా ఫలము ఎటు పోయింది? కైలా సంలో ఉండే శివుడు ఈ లింగ ములో ఎందుకు ఉంటాడు? ఈ లింగ పూజ వ్యర్థం అని తెలిసిందా!" అని శ్వేతుని పట్టుకుని పోసాగాడు.

అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద మెరుపుమెరిసినది.శివలింగము నుండి మహేశ్వరుడు ప్రత్యక్షమై బయటకు వచ్చాడు. కైలాసం నుండి పార్వతి,గణేశుడు,నంది మొదలైన ప్రమథ గణాల శివుని వెంటప్రత్యక్షమైనారు.సదాశివుడుతనత్రిశూలాన్నిప్రయోగించాడు. యముడు భయకంపితుడై శ్వేతునిప్రాణాలువదలివేశాడు. శ్వేతుడుజీవితుడైపరమేశ్వరునికి నమస్కరించి శివస్తుతి చేయసాగాడు. త్రిశూలం తగిలి యముడు మరణించి భూమి పై పడిపోయాడు.

ఆకాశం నుండి దేవతాగణాలు, మునిగణాలు శ్వేతునితో చేరి రుద్రునికీర్తిస్తూపుష్పవర్షంకురిపించారు.  మృతుడైనయముని చూసిబ్రహ్మాదిదేవతలు,వినాయకుడు, నంది మొదలైన రుద్ర గణాల శివుని "మహాదేవా! యముడు మూఢుడై తనను సృష్టించిన పరమేశ్వరుని ధిక్క రించాడు.శివభక్తులభక్తిని,శివలింగగొప్పతనాన్ని,మహత్మ్యాన్ని విస్మరించాడు. కానీ యమ ధర్మరాజు మృత్యువుకిదేవుడు, నరకాధిపతి, కాలుడు. అతని తప్పుక్షమించిఅనుగ్రహించండి" అని ప్రార్ధించారు.

పరమేశ్వరుడు దయాళుడై  యముని బ్రతికించాడు. ప్రాణం వచ్చి లేచిన యమధర్మరాజు తనచేసినతప్పుక్షమించమని ప్రార్ధించాడు.శివలింగమహత్మ్యం తెలిసిందని, శివలింగ పూజలుచేస్తున్నవారిపైమృత్యుపాశం ప్రయోగించనని ప్రమాణ చేసాడు. శివుడు ప్రసన్నుడై అంతర్ధానమయ్యాడు.మృత్యుదేవుడైన యముని జయించిన శివుడు మృత్యుంజయుడు అయ్యాడు.

కనుక మునులారా! మీరు శివునిభక్తితోపూజించిశివసాన్నిధ్యంపొందండి.ఒకటిగుర్తుంచుకోండి. శివానుగ్రహం తపము చేత,విద్యచేత,యజ్ఞయాగాదుల చేత, హోమముల చేత, వ్రతముల చేత, వేదముల చేత, యోగ శాస్త్రములు చేత, చిత్త వృత్తి నిరోధకముల చేత లభించదు. పరమేశ్వరుడు కేవలం భక్తి చేత మాత్రమే ప్రసన్నుడవతాడు" అని బ్రహ్మదేవుడు చెప్పగానే దారుకావన మునులందరు బ్రహ్మకు సాష్టాంగ ప్రణామం చేసి శివానుగ్రహం పొందడానికి భక్తి మార్గము ఒకటేసాధనమని తెలుసుకున్నారు.

శౌనకాది మునులారా! శివుని పై గల భక్తి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది. పూర్వము దధీచి మహర్షి శివభక్తి ద్వారానే విష్ణువుని, దేవతలను జయించాడు. శ్వేతుడు, మార్కండేయుడు మొదలైనవారు కూడా రుద్రుని పై భక్తితోనే మృత్యువునే జయించారు" అనిసూతమహర్షి ఆ రోజుకి లింగ పురాణ ప్రవచనం ముగించాడు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment