🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(289వ రోజు):--
విద్యుత్ యోగం! ఔను, మీరు స్వయంగా స్పృశించాలి ; కాని, మీ రక్కడ కూర్చొని ఎవరో ఒక సాహస వంతుడు చేస్తుంటే చూడాలను కొంటారు. తీగ వద్దకు వెళ్లి, నెమ్మది గా ... జాగ్రత్తగా ..వ్రేలును తగిలిస్తా డతను. "ఓ! ఓ! ఆఆహ్!" అని అరు స్తాడు విద్యుచ్ఛక్తి అతన్ని బలంగా త్రోయగానే. అక్కడ కూర్చొని చూస్తు న్న మీరనుకుంటారు, "ఇదన్నమాట రహస్యం. ఇదే ఆ అనుభవం : ఓ!ఓ! ఆఆహ్!". మూర్ఖుల్లా అక్కడ కూర్చొని "ఓ!ఓ! ఆఆహ్" అనే జపం మొదలుపెడ్తారు, ఆ లాభం మీకూ వస్తుందని. రాదు, నేను చెప్పేది వినండి - అలా ఎన్నటికీ జరుగదు. మీరు తీగ వద్దకు వెళ్లాల్సిందే, వ్రేలు సాచి దానిని ముట్టాల్సిందే. అప్పుడే మీకు విద్యుత్ యోగమంటే ఏమిటో బోధ పడుతుంది. అలా చేస్తేనే మీకు ప్రయోజన ముంటుంది.
ప్రశ్న :- ప్రయోజనం తప్పకుండా ఉంటుందని నాకెలా తెలుస్తుంది? ఆ జ్ఞానం పొందిన తర్వాత వేధించే భర్త, పెత్తనం చేసే అత్తగారు, ఏడుపు గొట్టు పిల్లలు ఉండరా ?
స్వామీజీ :- వాళ్లంతా అలాగే ఉంటారు ; కాని, మీరు వాళ్ళను చూచే తీరు మాత్రం వేరే విధంగా ఉంటుంది. మీలోనే అంతర్గతంగా ఉన్న సత్యాన్ని మీరు గ్రహించి నపు డు, మీరు చూచే ద్వంద్వాలూ, సృష్టి లోని వైవిధ్యం - ఇవన్నీ ఆ ఒక్కగా నొక్క సత్యం నుంచే ఉద్భవించా యని గ్రహిస్తారు. అటువంటి గ్రహింపు తర్వాత, ఏదీ నిజంగా మిమ్మల్ని కలవర పరచలేదు.
ప్రశ్న :- ఆ శ్రేష్ఠమైన స్థితికి నేను చేరానో లేదో నాకెలా తెలుస్తుంది? ఏదైనా సరిగా చెయ్యలేదేమో ?
స్వామీజీ :- దేముడున్నచోట 'నేను' అనే భావం ఉండజాలదు. 'నేను' ఉన్న చోటికి భగవంతుడు చాలా దూరంగా ఉంటాడు.
నిజానికి 'మీరు' ఆ అత్యున్నత స్థితికి చేరరు. ఆ స్థితిని అనుభవించ డానికి 'మీరు'ఉండక పోవడమే దీనికి కారణం. భగవంతుడే భగవంతుని కలుస్తాడు.
ప్రశ్న :- మాక్కూడా అటువంటి నిజమైన అనుభవం కలిగిందో లేదో తెలుసుకోడానికి ఉపకరించేలా, మీకు కలిగిన అనుభవాన్ని వర్ణిస్తారా? చాలామంది మహాత్ములు వారికి కలిగిన కొన్ని అనుభవాలను వివరించినట్లు నాకు గుర్తుంది.
స్వామీజీ :- నా స్వంత అనుభవం గురించి చెప్పాల్సిన దేమీ లేదు. అలా చెప్పడం హాస్యాస్పదం. యోగులు మాత్రమే మార్గంలో వారికి వివిధ అనుభవా లెదురయ్యా యంటారు - నిర్వికల్ప సమాధిలో అటువంటి దేమీ ఉండదు. ఆ నిర్మలమైన స్థితిలో అనుభవం అనేది లేదు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment