Wednesday, January 14, 2026

 *గురువాక్కు......*

*సార్వజనీనము, సార్వకాలికము అయిన విజ్ఞానము, ప్రబోధము, ప్రకృతి ఒక పరిమితిని నియమించదు.*

*ఎవరు తింటారులే అని చెట్టు పళ్ళను కాయటం మానదు... అలాగే నీరు ఎవరు తాగుతారులే అని నదులు ప్రవహించడం మానవు.*

*అదేవిధంగా ఇన్ని శాస్త్రాలు, విద్యలు ఇంత విజ్ఞానం ఎవరు తెలుసుకుంటారని, శ్రమ ఎందుకని ఋషులు భావించి ఉంటే వ్యాసభగవానుడు, వాల్మీకి మహర్షి ఇన్ని శ్లోకాలు అందించేవారు కాదు. గురువు ధర్మం సమగ్రమైన విషయాన్ని, విజ్ఞానాన్ని సిద్ధం చేసి ఉంచడానికి కారణం చదువరిలో జిజ్ఞాస పెంచడానికే. ఇదే ప్రబోధానికి ప్రథమ లక్ష్యం. ఇటువంటి మన ఆర్ష విజ్ఞానాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందులో భాగమే భూమండలం వివరణ*

*ప్రపంచం భూమండలం, అంతరిక్షమండలం అని రెండుగా విభాగం చేయబడింది. భూలోకము మొదలుకొని కింద వున్న అతలాది లోకాలు ఏడు కలిపి భూమండలం అని అంటారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. భగవంతుని సూక్ష్మరూపం అనగా ఆత్మజ్యోతి స్వరూపంలో పరబ్రహ్మలో మనసుని నిలుపుట కష్టసాధ్యం అందువల్ల అందరికీ చక్షుర్గ్రాహ్యమైన (కళ్ళకు కనబడేటట్లు) స్థూలరూపంలో మనస్సుని సులభంగా నిలుపవచ్చును కనుక భగవంతుని స్థూలరూపమైన విశ్వ రూపాన్ని తెలుసుకుంటే భగవంతుని రూపాన్ని, గుణాలను ధ్యానం చేసిన వాళ్ళం అవుతాము. అందువల్ల ప్రపంచస్వరూపాన్ని భగవత్ రూపంగానే భావించి దర్శించడానికి వీలుగా తెలుసుకోవడం అవసరం.*

*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*

No comments:

Post a Comment