🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
01/12/2025
1) శివాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు అన్నాక' నీకెందుకు బెంగ? అంతా ఈశ్వరేచ్చకు వదిలేయ్.
2) మన శరీరంలో ఘనాహారాన్ని శక్తిగా మార్చుకునే సిస్టంనే మనం వాడుకుంటున్నాము. నీటిని.. గాలిని శక్తిగా మార్చుకునే సిస్టంలు కూడా మన శరీరంలో ఉన్నాయి.
3)మహా మౌనంలో నుండి 'నేను' పుట్టింది. 'నేను'లో నుండి 'నాది' పుట్టింది. స్వస్థితిని తిరిగి పొందాలంటే నాది లేని నేనుగా తరువాత నేను లేని నేనుగా మారుకోవాలి.
4) సంవత్సరాన్ని యూనిట్ గా తీసుకుంటే జనవరి ఒకటిన మాత్రమే ఉత్సవం.
క్షణాన్ని యూనిట్ గా తీసుకుంటే ప్రతి క్షణమూ ఉత్సవమే.
5) అనుభవంలో నుంచి శాస్త్రాలు వచ్చాయేగాని శాస్త్రాల వలన అనుభవం కలుగదు.
6)నిద్రలో ఒకడిగానే ఉన్నాడు మెలకువలో అనేకం అయినాడు. ఈ విషయం మెలకువలో జ్ఞప్తి ఉంటే అదే ఆత్మానుభవం.
No comments:
Post a Comment