Friday, June 5, 2026

 ప్రశ్న:-" మనకు వచ్చే ఏ అనుభవాన్ని అయినా ఎలాంటి ఘర్షణలు మరి విరోధాలు లేకుండా స్వీకరించడం ఎలా?".

పత్రీజీ :-" మనం ఈత నేర్చుకోవాలంటే ముందు. నీళ్ళల్లోకి దూకాలి! నీళ్ళను చూసి భయపడుతూ మనల్ని మనం నిరోధించుకుని కూర్చుంటే ఈతరాదు.

“ధైర్యం తెచ్చుకుని నీళ్ళల్లోకి దూకగానే కాస్సేపు ఊపిరి ఆడనట్లు అవుతుంది కానీ.. మెల్లమెల్లగా కాళ్ళూ చేతులూ ఆడిస్తూ ఉంటే అంతా మామూలుగానే అయిపోతుంది!

" ఇలా ఓపెన్ మైండెడ్గా ఉంటూ .. వచ్చే ప్రతి అనుభవాన్ని అంగీకరిస్తే జీవితంలో ఏదైనా సరే హాయిగా స్వీకరించగలుగుతాము. ఓపెన్ మైండెడ్ గా ఉండడమే. దివ్యజ్ఞాన ప్రకాశంతో జీవించడం!"

No comments:

Post a Comment