బిల్ గేట్స్ చీకటి సామ్రాజ్యం | Dark Side Of Bill Gates | Unknown Facts Of Billionaire | @SakshiTV
Author Name:Sakshi TV
Youtube Channel Url:https://www.youtube.com/@SakshiTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=p7LD_-HyDeg
Transcript:
(00:00) ప్రపంచ కుబేరుడు సాంకేతిక విప్లవకారుడు అంతకుమించి కోట్లాది మంది పాలిట ఆపద్ బాంధవుడు ఇది దశాబ్దాలుగా ప్రపంచం చూసిన బిల్ గేట్స్ రూపం మైక్రోసాఫ్ట్ సామ్రాజ్యాన్ని సృష్టించిన ఈ టెక్ దిగ్గజం వ్యాపారం నుంచి తప్పుకున్నాక గేట్స్ ఫౌండేషన్ ద్వారా తన ఇమేజ్ ను ఒక దేవదూతలా మార్చుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
(00:24) దశాబ్దాల పాటు ఆచి తూచి అల్లుకున్న ఆ ఇమేజ్ ఇప్పుడు ఒక్కసారిగా బీటలు వాడుతుంది. ఎస్ బిల్ గేట్స్ సామ్రాజ్యంలో ఇప్పుడు సంక్షోభం మొదలైంది. దీనిపైన సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్ ఒకప్పుడు బిల్ గేట్స్ అంటే కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు ప్రపంచాన్ని మార్చే ఒక విజనరీ పోలియో నిర్మూలన ఆకలి కేకల నివారణ వ్యాక్సిన్ల పంపిణీ ఇలా ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు.
(00:48) ఇందుకోసం పిఆర్ ఏజెన్సీలు రాత్రింబవళ్ళు శ్రమించాయి. గేట్స్ ను ఒక సెయింట్ లా ప్రొజెక్ట్ చేశయి. కానీ ఎప్పుడైతే మెలిండా గేట్స్ తో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిందో అప్పటి నుంచి గేట్స్ అసలు రంగు బయట పడుతూ వస్తోంది. బీటలు వారుతున్న ఇమేజ్ తో పాటు తెరపైకి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫ్రికాలో గేట్స్ ఫౌండేషన్ చేసిన వ్యవసాయ ప్రయోగాలు స్థానిక రైతులను కోలుకోలేని దెబ్బతీసాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
(01:15) కార్పొరేట్ ప్రయోజనాల కోసమే గేట్స్ పని చేశారనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఫార్ములాలను పేద దేశాలకు ఉచితంగా ఇవ్వకుండా మేధో సంపత్తి హక్కుల పేరిట ఫార్మా కంపెనీల గుత్తాధిపత్యాన్ని గేట్స్ సమర్ధించారనే అపవాదు మూటకట్టుకున్నారు. దాతృత్వం పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థల విధానాలను గేట్స్ శాసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువలా మారాయి.
(01:40) కేవలం సేవా గుణంతోనే బిల్ గేట్స్ ఇదంతా చేస్తున్నారా లేక తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి దాతృత్వాన్ని ఒక కవచంలా వాడుకుంటున్నారా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. గేట్స్ నిర్మించిన ఇమేజ్ వెనుక ఉన్న డార్క్ సైడ్ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. పిఆర్ ఏజెన్సీలు ఎంతగా కప్పి పుచ్చాలని చూసినా సోషల్ మీడియా యుగంలో నిజాన్ని దాచడం ఎవరికీ సాధ్యం కాదు.
(02:04) నిన్నటివరకు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన బిల్ గేట్స్ నేడు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. దశాబ్దాల పాటు కష్టపడి క్రాఫ్ట్ చేసిన ఇమేజ్ ఇప్పుడు కళ్ళ ముందే ముక్కలవుతోంది. మరి ఈ సంక్షోభం నుంచి గేట్స్ తన ఇమేజ్ ను మళ్ళీ కాపాడుకోగలరా?
No comments:
Post a Comment