Wednesday, June 3, 2026

 ఈ రోజు రాత్రి 
నిద్రలోకి జారుకునే 
ముందు ఏ ఎమోషన్
అయితే మన మస్తిష్కాన్ని 
ఎక్కువగా ప్రభావితం చేసిందో ,,
ఆ ఎమోషన్ ఏదైనా కావచ్చు,,
మరుసటి రోజు మెలకువ 
కలగగానే ఆ ఎమోషన్ కి 
సంబంధించిందే మీ మొదటి 
ఆలోచన అయి ఉంటుంది..

దేనితో నిద్రిస్తారో 
దాంతోనే లేస్తారు..

ఇది ఒక రోజుకి సంబంధించి,,,
మాట్లాడాను..

అదే విధంగా ,,ఈ జన్మకు 
రేపటి జన్మకి నేను ఒక రోజు 
అంటాను...

ఈ రోజు ( ఈ జన్మ ) దేనితో 
నిద్రిస్తావో ( శరీరాన్ని వదులుతావో ) 
రేపటి జన్మ లో దానితోనే 
మేల్కొంటావు...

మృత్యువు నిద్ర రెండూ 
ఒక్కటే...ఏం తేడా లేదు..
కాక పోతే మృత్యువులో కొద్దిగా
ఎక్కువ సమయం తీసుకుంటావు
నిద్ర పోవడానికి ...అంతే 

దేవుడూ...❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️

No comments:

Post a Comment