Wednesday, June 3, 2026

గుడి లో చేసే పూజ కంటే గొప్ప పూజ ఏమిటి ? THE BEST WAY TO WORSHIP GODDESS

గుడి లో చేసే పూజ కంటే గొప్ప పూజ ఏమిటి ? THE BEST WAY TO WORSHIP GODDESS

Author Name:Vastavam Channel

Youtube Channel Url:https://www.youtube.com/@vastavam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QfOXDx0oINI



Transcript:
(00:00) శ్రీమాత్రే నమః ఈరోజు నేను మీకు ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఇది మనం గుడిలో గాని ఇంట్లో గాని చేసే ఎన్నో రకాల పూజలు ఎన్నో రకాల క్రతువులు అన్నిటికన్నా కూడా ఎంతో అధిక ఫలాన్ని ఇచ్చేటువంటి ఒక సత్కర్మ నా వీడియోలు మొదటి నుంచి ఫాలో అవుతున్న మీ అందరికీ ఆ తెలుసు ఒక ఐదు సంవత్సరాల క్రితం మాతంగి దేవత ఉపాసన ప్రారంభించడం నేను అనుూహ్యంగా ఈ ఒక ప్రదేశానికి ఇక్కడ ఇండియాలో ఒక ప్రదేశానికి రావడం అక్కడ అంకమ్మ తల్లి గ్రామ దేవత విగ్రహం బయట పడ్డం ఆ విగ్రహానికి నేను కొంచెం చిన్న గుడిలాగా కట్టి ఆ ప్రాంతాన్ని ఒక మంచి తప్పవనంలా తీర్చి దిద్దడానికి
(00:45) నేను ప్రయత్నం చేయడం ఆ తర్వాత జరిగిన చాలా పరిణామాలన్నీ నేను మీతో పంచుకుంటూ వస్తూనే ఉన్నాను. అదే అంకమ్మ తల్లి తప్పవనంలో ఒక వ్యవసాయ క్షేత్రం అంటే ఒక ఫామ్ అనేది నిర్మించాలి అని నాకు అప్పుడు అనిపించింది. ఆ దాని ప్రకారం ఆ ఆలోచన ప్రకారమే అక్కడ కొన్ని చెట్లు నాటే ఒక తోటని ఏర్పా ఏర్పరచడం దాన్ని అభివృద్ధి చేయడం నాకు నచ్చిన విధంగా ఆ ఒక పర్ణశాల లాగా ఒక చిన్న ఫార్మ్ హౌస్ అట్లా ఒక పర్ణశాల లాగా అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని నేను అక్కడే ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను.
(01:20) ఈ నాలుగైదు సంవత్సరాల ఈ ప్రయాణంలో దాన్ని మీరు వ్యవసాయం అనండి ఫార్మింగ్ అనండి నేనైతే ప్రకృతి సేవ అంట ఈ ప్రకృతి సేవలో నేను తెలుసుకున్న ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే దీనికి మించిన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పూజ అనేదే లేదు ప్రపంచంలో ఆదిపరాశక్తి సృష్టించిన సృష్టిని ప్రేమించడం అంటే ఆదిపరాశక్తిని ప్రేమించడమే ఒక ఆవు దూడకి పాలును ఇవ్వడంలో గాని మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి మొక్కగా పెద్ద చెట్టుగా అభివృద్ధి చెందడంలో గాని ఒక పక్షి చిన్న చిన్న పుల్లల్ని గిడ్డి పరకల్ని ఏరుకొచ్చి ఒక గూడు కడుతూ ఉంటుంది చూడండి వీటన్నిటిలో
(02:00) కూడా ఆది పరాశక్తి అనేది ప్రదర్శితం అవుతూనే ఉంటుంది. కానీ మనం దాన్ని విస్మరిస్తాం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. ఒక ఆకలితో ఉన్న జంతువుకి ఏ జంతువైనా సరే కొంచెం ఆహారం పెట్టి దాని ఆకలి తీర్చడం గానీ ఎండిపోతున్న ఒక మొక్క గాని ఒక చెట్టుక గాని నీరు పోసి మరలా దాన్ని బ్రతికించడం అతి గొప్ప పూజ ప్రకృతిని ప్రేమిస్తూ ప్రేమతోటి ప్రకృతిలోనే మమైక్యమై జీవించే వాడికి ఉన్న మానసిక ప్రశాంతత ఏ వృత్తిలో ఉన్నవాడికి ఏ పని చేసేవాడికి కూడా ఉండదు అనడంలో ఎలాంటి అతిశయ వ్యక్తి లేదు ప్రేమతో వ్యవసాయం చేసే ఒక రైతుకు మించిన ఆధ్యాత్మిక వేత్త
(02:45) మరొకరు లేరు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. చివరగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు ఆదిపరాశక్తి ఈ విశ్వానికి ఈ సృష్టికి తల్లి అయితే ఈ విశ్వంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి చెట్టు ప్రతి జంతువు అన్నీ కూడా ఆ ఆదిపరాశక్తి ఆ మహాతల్లి యొక్క బిడ్డలే ఆ ఆదిశక్తి బిడ్డలకి మనం సేవ చేయడం అంటే అది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఇప్పుడు నేను చెప్తున్న రహస్యం ఏమిటి ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది.
(03:24) మీరు చేసే పూజలు నోములు గాని వ్రతాలు కానీ మంత్ర సాధనలు కానీ దేవతా ఉపాసనలు కానీ ఏవైనా సరే నెరవేరాలి అంటే మీకు అనుకున్న సిద్ధి కలగాలి అంటే మీరు తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటి అంటే ప్రకృతి ఆరాధన జగన్మాత రూపమైన ఈ ప్రకృతిలో ఉన్న ఈ ప్రాణులు వీటికి మీ శక్తి కొద్ది సేవ చేస్తూ ప్రేమతో వాటిని ఆదరిస్తూ మీరు చేసే పనులు మీ ఆధ్యాత్మిక ప్రయత్నం నాలు చేయండి అప్పుడే అవన్నీ కూడా నెరవేరుతాయి మీ కోరికలు తీరుతాయి.

No comments:

Post a Comment