Tuesday, June 2, 2026

 పూలు అమ్మినా చోటే కట్టెలు అమ్మకుడదు అంటారు ధాని అర్దామ్ యేమిటి?
ఇది చోటు సంబంధించిన విషయం. పూలకు కట్టెలకు సంబంధించినది కాదు.

ఒక చోట అందరూ మెచ్చేవిధంగా బతికి, కాలం కలిసి రాక దీనత ఏర్పడినపుడు అక్కడే ఏదో పొట్టకూటికి సరిపడే పనిలో దిగడం బాగుండదు అని.

తన కష్టకాలంలో " అయ్యో అంత బాగా బతికి ఇట్లా అయిపోయినారే"— అని చూచేవాళ్ళు జాలిపడే విధంగా బతకగూడదు . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని ధైర్యంగా మరోచోట ఏదో ఒక వృత్తితో బతికేయాలి.

గౌరవంగాబతికిన వాళ్ళు తమ మర్యాదకు తగని ఉద్యోగం ఎపుడూ చేయగూడదు. వంశానికి అగౌరవం తేగూడదు.

నలుడికి కష్టకాలం వచ్చింది .

దమయంతి మా అమ్మగారింట ఉందాము. మనకక్కడ ఏలాటి అగౌరవమూ ఉండదు అని చెప్పింది. ఐనా , రాజుగా వెలిగి ఒకరి పెట్టుపోతలకు దిగజారగూడదు అని నలుడు దూరంగా వెళ్లిపోవడానికే ఇష్టపడ్డాడు. .

నలుడుగా ఆ రూపంలో ఉంటే అగౌరవం. ఆకృతికి తగిన స్థితి అక్కడ దొరకదు. అందుచేత కర్కోటకుడు అనుగ్రహించిన వికృతరూపం ఎపుడైనా వదిలేసే (వరం) అవకాశం ఉన్నా ఆ శనిదశ పోయి మంచిరోజులు వచ్చేవరకూ బాహుకుడుగానే వంటలవాడుగానే ఉండిపోయాడు. పరదేశంలో తన పూర్వ రూపం ఎరిగినవారుండరు. కాబట్టి అక్కడ ఏదో ఒక న్యాయమైన వృత్తిలో కాలం గడిపేసుకొన్నాడు. ఉత్తములు ఇలా జీవిస్తారు అని మార్గదర్శకుడైనాడు.

పాండవులూ అలాగే అజ్ఞాతవాసకాలం మారురూపాలతో గడిపేస్తూ వచ్చారు.

ఐన్నా * ఉన్నభూమీ కన్నతల్లీ ఒక్కటే * అనే శాస్త్రమర్యాద పాటించి ఆ మత్స్యరాజ్యానికి ఏర్పడిన కష్టం సమర్థవంతంగా తొలగించి మన్ననలు పొందారు.

రూపు మారినా నైజం మార్చుకోగూడదు. కర్తవ్యం విస్మరించగూడదు —అని చెప్పక చెప్పారు .

No comments:

Post a Comment