Thursday, June 4, 2026

ప్రేమ పేరు తో control చేస్తున్నారా? || @sridevi_vlogs515

ప్రేమ పేరు తో control చేస్తున్నారా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RtFHHI2lGUc



Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని అతిగా ప్రేమించడం అన్నది చాలా ఎక్కువగా ఉందండి అది అతిగా ప్రేమించడం వలన మన లైఫ్ లో ఎటువంటి కష్ట నష్టాలు వస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రేమ చాలా గొప్పదండి అందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట నో డౌట్ అసలు ఎందుకంటే ఒక మనిషిని ప్రేమించే విధానంలో ఎదుగుదల ఉంటుంది అదే మనిషి నాశనం ఉంటుందన్నమాట కేవలం అతి కేరింగ్ అతి ప్రేమలో అతి జాగ్రత్తలు భయం దీనితో కూడిందే ప్రేమ అనుకొని కొంతమంది మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు భార్య భర్తలు ఈ కోవకి చెందిన వాళ్ళలో
(00:46) ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు అది భర్త మీద భార్య అతి ప్రేమలు చూపిస్తూ ఉంటుంది. బాగా కేర్ చేస్తూ ఉంటుంది. మీరు ఇచ్చే ప్రేమలో లిమిట్స్ ఉండాలి గానీ అతి ప్రేమలు ఉండకూడదు అవి లిమిట్స్ క్రాస్ చేయకూడదు అన్నమాట. దీనివలన అవతల వాళ్ళు ఫ్రీడం కోల్పోతారు. దానివలనే వాళ్ళు ఊపిరాడక గిలగిలలా కొట్టుకుంటారు. ఉదాహరణకి ఒక మొక్కకి రోజు నీళ్లు పోస్తూ ఉంటాం.
(01:14) సరేనా ఫుడ్ ఇస్తూ ఉంటాం. అలాగే ఎండ తగిలేటట్టు చూసుకుంటాం సూర్య కిరణాలు అప్పుడు ఆ మొక్క ఆరోగ్యంగా పెద్ద వృక్షంగా మారుతుందన్నమాట రోజు పొద్దున్నే లేచి నీళ్లు పోస్తూ ఉంటాము అలాగే ఉదయం నీళ్లు పోయగానే మన డ్యూటీ అయిపోయింది మరనాడు మళ్ళీ నీళ్లు పోస్తాం అది కొంతమందే చేస్తారు లిమిట్స్ తెలిసినోళ్ళు అదే అతి ప్రేమలు చూపించే వాళ్ళు ఎలా ఉంటారంటే ఉదయాన్నే నీళ్లు పోస్తారు అలారం పెట్టుకున్నట్టు టైం పెట్టుకుంటారు ఇంకా మర్చిపోరుఅన్నమాట మళ్ళీ ఒక అరగంట అయిందా నీళ్లు పోస్తారు ఆ గంట అయిందా నీళ్లు పోస్తారు మళ్ళీ గంట అయిందా నీళ్లు పోస్తారు. అలాగా నీళ్లు పోసి పోసి పోసి ఆ
(01:56) మొక్కని చంపేస్తారన్నమాట. ఇక్కడ మొక్క అంటే మనిషే అని మీరు తెలుసుకోవాలి. ఇది అతి ప్రేమ కాదా దీని వల్ల ఆ మొక్కకి ఊపిరి రాడక ఆ వేర్లు కుళ్ళపోయి అది చస్తుందన్నమాట. ఇది మనిషి జీవితంలో కూడా అంతే ఇదే ప్రక్రియ మనిషి కూడా అంతే మీరు ఇచ్చే ప్రేమని తీసుకోలేక అది వాళ్ళకి కంఫర్ట్ లేక ఫ్రీడం లేక గెలిగెలా కొట్టుకుంటూ ఉంటారు.
(02:24) మన రోజువారీలు లైఫ్ లో చూసుకుంటేనండి దేని మీద మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోన అవసరంలే మనం తినే ఫుడ్ మితంగా ఉంటే శరీరానికి అది బలంగా మారుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం. అది అతిగా తీసుకుంటే చచ్చ ఊరుకుంటాము మరి వాటర్ కూడా అంతేనండి రోజు మంచి నీళ్లు ఎంతవరకు తీసుకోవాలో అంతే మన శరీరానికి మంచి హెల్త్ ని గాని స్కిన్ టోన్ గాని ఇంకా మనం రోజు యాక్టివ్ గా ఉండటానికి గాని డీహైడ్రేషన్ నుంచి కాపాడటానికి రాని సహకరిస్తాయి.
(02:57) అతిగా నీరు తీసుకోవడం వల్ల సోడియం లెవెల్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. దాని వల్ల పిచ్చి పిచ్చిగా తయారవుతాం. మానసిక రోగులుగా మారిపోతాం అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా సరే మన లైఫ్ లో ఇంపార్టెంట్ వస్తువు గాని అదే ఆ థింగ్ గాని మనం తీసుకునే ఆహారం గాని ఒక మనిషి గాని అతి కేరింగ్ వలన వాళ్ళ చేయి జారిపోయే పరిస్థితి వస్తది అన్నమాట అసలు ఇది ప్రేమ అంటారా ప్రేమే కాదు ఒక ముక్కలో చెప్పాలంటే ప్రేమే కాదండి భయం ఎందుకంటే నా పార్ట్నర్ నన్ను వదిలి వెళ్ళిపోతాడు.
(03:30) పార్ట్నర్ ఎందుకు మా ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో నేను నచ్చనేమో లేదా ఇంకెవరితోనో ఉంటాడేమో నన్ను పట్టించుకోడేమో ఇవే మాట అతి భయాలు దీన్నే వాళ్ళ ప్రేమ అనుకొని ఎక్కువ కేరింగ్ తీసుకుంటూ ఉంటారున్నమాట కొంతమంది అయితే జాగ్రత్తలు ఆయనకి హెల్త్ బాగోదు ఇది చేయాలి అది చేయాలి ఆయన తిన్నాడా ఉన్నాడా లేదా ఇవే చూస్తూ ఉంటారు.
(03:55) ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువ శాతం మంది ఇలాగే ఉన్నారు. భర్తని ఇలా కూడా కదలనివ్వరు కూడా వీళ్ళు తిరుగుతూనే ఉంటారు కుక్క పిల్లలాగా భర్త అనతల భార్య కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటుందన్నమాట చాలా ఫ్యామిలీస్ లో నేను చూశాను ఇదివరకు దాంపత్యాలు వేరు ఇప్పుడు ఫ్యామిలీస్ లో ఆడవాళ్ళు వేరన్నమాట టోటల్ డిఫరెంట్ పూర్తి చేంజ్ అయిపోయింది అసలు సొసైటీ దీని వలన భర్తకి ఇంత కూడా ఫ్రీడమ్ లేదు కనీసం ప్రశాంతంగా తనని తాను గుర్తుంచుకునే పరిస్థితి కూడా లేకుండా తనని తాను తను మర్చిపోతున్నాడు ఊపి రాడక గెలిగిలా కొట్టుకుంటున్నాడు అన్నమాట బయటికి కదలనివ్వరు ఒకవేళ బయటికి వెళ్తే
(04:35) 100 ఫోన్లు ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ ఎప్పుడు వస్తావ్ ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఎంగేజ్ వస్తుందేమో అని పదే పదే ఫోన్లు చేసి చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎంగేజ్ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావ్ ఏంటి అన్ని చెప్పాలి చెప్పకపోతే వీడికి నస ఎక్కువ అయిపోద్దని ముందు వీడే చెప్పేస్తా ఉంటాడు. ప్రతిది వీళ్ళకి చెప్పి చేయాలి చెప్పులు వేసుకోవాలి అన్నట్టు వీళ్ళ లైఫ్ మారిపోద్దమాటవాట్ప్ మెసేజ్ టింగ్ మని సౌండ్ అయిందంటే చాలు ముందు వీళ్లే చూస్తారు ఎవరు ఏంటి ఎందుకు మెసేజ్ చేశారువాట్సాప్ లింక్ చేసుకోవటం కొన్ని యాప్స్ లింక్ చేసుకోవటం వీడియో కాల్స్ అతిగా మాట్లాడటం
(05:14) ఎక్కడున్నావు అని అంటే అబద్ధం చెప్తున్నాడేమో అని చూపించు లొకేషన్ పెట్టు ఇవన్నీ అడగటం జనాలు ఎలాగ అతి తెలివితేటలతో ఉన్నారో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ముఖ్యంగా చదువుకున్న భార్యల్లో ఎన్ని తెలివితేటలు పెరిగిపోయినాయండి దీన్ని తట్టుకోవడం మగవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అంతే కాదండి ప్రతి అరగంటకు ఒకసారి తిన్నావా ఆఫీస్ లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి తిన్నావా తిన్నావా కనీసం ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడనివ్వరో ఎక్కడికి వెళ్ళనివ్వరో టైం టు టైం ఇంటికి రావాలి లేదా వాళ్ళ ముందే కూర్చోవాలి తల్లిదండ్రులకి టైం పెట్టనివ్వరో తల్లిదండ్రులతో
(05:51) మాట్లాడనివ్వరో బంధువులతో తో కూడా మాట్లాడనివ్వరు ఎవరితో మాట్లాడితే ఈయన తన మీద చాడీలు చెప్పేస్తారా వీళ్ళిద్దరిని దూరం చేసేస్తారా అని చెప్పి చాలా అయోమయ పరిస్థితిలో భయాన్ని ప్రేమగా మార్చుకుంటున్నారు అన్నమాట మరి అవతల వ్యక్తికి ఇదంతా ఎంత నరకంగా ఉంటుంది తన ఆ పర్సనల్ లైఫ్ గాని తనతో ఉండే విధానాన్ని గాని అతి ప్రేమలతో భార్య నుంచి ఎప్పుడు పారిపోదామా ఎప్పుడు నాకు స్వే చేర్చి దొరుకుతుందా దీని గోల ఏంటి అని చెప్పి అసహ్యంతో భర్తలు భార్యల్ని వదిలేసే పరిస్థితి వస్తుంది.
(06:31) దీనివల్లే చిన్న చిన్న గొడవలు అవి పెద్దవ అవటం నరకం చూస్తున్నారన్నమాట. పంచాయతీలు, కోర్టులు, విడాకులు ఇవి కూడా ఎన్నో కేసుల్లో చూసామన్నమాట. భార్యలు భర్తలని కంట్రోల్ చేయడం వలన అతి ప్రేమలు చూపించడం వలన, కేరింగ్ చూపించడం వలన భర్తలు పారిపోతున్నారు అన్నమాట. ఇందులో భర్తలు కూడా ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు కానీ రేరు గా ఉంటారు అతి బ్రేమలు చూపించేది కేవలం భార్యలే ఎక్కువైపోయారు మరి బంధం అంటే ఎలా ఉండాలి నూరేళ్ల ప్రయాణాన్ని సాఫీగా తీసుకెళ్లాలన్నమాట అలసట లేకుండా బంధం అంటే బందీని చేయకూడదు అని మనం ఒకటి తెలుసుకోవాలి.
(07:15) ప్రతిదీ వాళ్ళని కంట్రోల్ చేద్దామని వాళ్ళు నన్నే ప్రేమించాలని నా భర్త నాతోనే మాట్లాడాలని నా చుట్టూనే తిరగాలని ఇటువంటి ఆలోచనలతో మీరు ఫ్రీడమ ఇవ్వకుండా భర్తని నలిపేస్తున్నారు అన్నమాట ఇలా చేయడం వలన మీ భర్త మీకు దూరమైపోవడమే కాదు పారిపోతూ ఉంటాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కానీ మీరు అనుకుంటారు నా నుంచి ఎందుకు పారిపోతున్నాడు అని మీకు చాలా బాధగా ఇంకా కాలుతూ ఉంటుంది.
(07:44) నేను ఇంత ప్రేమిస్తుంటే నా నుంచి ఎందుకు దూరం జరుగుతున్నాడు దూరం అయపోతున్నాడు ఎందుకు నన్ను వదిలేస్తున్నాడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా అని చెప్పి మీరు ఇంకా ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట దానికి ఊపిరాడక చచ్చు ఊరుకుంటాడు ప్రేమలో నాలుగైదు డిఫరెన్స్లు ఉన్నాయండి అవి ఏమిటంటే ప్రేమలో ఫ్రీడమ్ ఉంటుంది అతి ప్రేమలో కంట్రోలింగ్ ఉంటుంది.
(08:09) దీనికి చాలా తారతమ్యం ఉంటుందన్నమాట. ప్రేమలో నమ్మకం ఉంటుందండి ట్రస్ట్ అదే నమ్మకం ద్వారా మనం ఈజీగా మన జీవితాన్ని సాఫీగా సాగించుకోగలం అన్నమాట అంతేకాదు చిన్న చిన్న పొరపాట్లని సర్దుకుంటే ప్రేమించే వాళ్ళకి ప్రేమించబడే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. దీనివల్ల మన ఫ్యామిలీ హ్యాపీగా ముందుకు సాగుతుందన్నమాట. ప్రేమ వల్ల ప్రశాంతత ఉండాలి కానీ టార్చర్ ఉండకూడదు అదే టార్చర్ తో ఒకరికొకరు గొడవలు పడటం విభేదాలు రావటం ఫ్యామిలీస్ నుంచి దూరం చేయటం అదే ఎక్కువ కేరింగే వాళ్ళకి నరకంగా మారటం ఫ్రీడం లేక వాళ్ళు ఇళ్లల్లో నుంచి వెళ్ళిపోవటం భార్యని అసహించుకోవడం జరుగుతుంది. ప్రేమ ఒక
(08:56) మనిషికి ఔషదంలా మారాలి కానీ అదే మనిషికి విషం అవ్వకూడదని నా అభిప్రాయం. అవసరానికి మించిన ప్రేమ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికి పార్ట్నర్ పైనే ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. ప్రతిదానికి పార్ట్నర్ వచ్చాకే నిద్రపోతాను నువ్వు రా నేను పడుకుంటాను. అలాగే ప్రతిదానికి నువ్వు వస్తేనే నేను తింటాను. మనం కలిసి వెళ్దాం.
(09:21) నువ్వు చెప్పు ఇది నచ్చిందా లేదా అని ప్రతిదీ వాళ్ళ మీదే డిపెండ్ అయిపోతూ ఉంటారన్నమాట దీని వలన ఇవతల పార్ట్నర్ కి నరకమే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు వీళ్ళకి కూడా ఎవరైతే అధిక ప్రేమిస్తున్నారో వాళ్ళకు కూడా ఒక గోల్ ఉండదు లైఫ్ లో ఏం సాధించాలో తెలియదు భర్తే ప్రపంచం అని బ్రతుకుతూ ఉంటారన్నమాట మరి ఇటువంటి చిన్న పొరపాట్లు తగ్గించుకుంటూ ఉంటే మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మీ దాంపత్యం ఎప్పుడూ గట్టిగా ఉంటుంది.
(09:54) ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అనుమానాలు పెరగవు అలాగే టార్చర్ చేయకుండా భర్తకి తగ్గ ప్రేమ ఇవ్వటం అలాగే భర్త భార్యకి ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ఇవ్వటం వాళ్ళని ఫ్రీడమ గా వదిలేయడం వాళ్ళ ఇష్ట ఇష్టాన్ని తెలుసుకోవటం వాళ్ళ నేచర్ ని డామేజ్ చేయకుండా ఉండటం వలన మన లైఫ్ సాఫీగా ఉంటుంది. ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. చచ్చేంతవరకు ఆ మనిషి మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోడని మీరు తెలుసుకోవాలన్నమాట మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది

No comments:

Post a Comment