Wednesday, June 3, 2026

SUPPRESSION OF SEXUAL URGES ♂️

SUPPRESSION OF SEXUAL URGES ♂️

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jTh7FeXNsV0



Transcript:
(00:00) బ్రహ్మచర్య సాధనలో అజ్ఞానులు ఇంద్రియాలను చంపడానికి మూర్ఖపు పద్ధతులను అవలంబిస్తారు. వారు చివరికి విఫలం అవుతారు. చాలామంది అవివేకులు ప్రత్యుత్పత్తి అవయవాన్ని కోసివేస్తారు. అలాంటి ప్రక్రియ ద్వారా కామాన్ని నిర్మూలించవచ్చని వారు భావిస్తారు. ఇది ఎంతటి మూర్ఖపు చర్య అంటే కామం మనసులో ఉంటుంది. మనసును అనిచివేస్తే ఈ బాహ్య మాంసపు అవయవం ఏం చేయగలదు ఇంకొందరు ఈ అవయవాన్ని చంపడానికి టన్నుల కొద్దీ నక్స్ ఒమేకాను మింగుతారు.
(00:47) బ్రహ్మచర్యంలో కేంద్రీకృతం కావాలనే వారి ప్రయత్నంలో వారు విఫలమవుతారు. నక్స్ ఓమికా తీసుకోవడం వల్ల వారు నపుంసకులు అయినప్పటికీ వారి మనస్థితి మాత్రం మారదు. కావలసింది ఇంద్రియాలను వివేకవంతంగా నియంత్రించడం అదుపులేని గుర్రం సవారీ చేసేవాడిని ఇష్టమవచ్చిన చోటికి లాక్కెళ్ళినట్లుగా అది మనల్ని నిర్దాక్షిణ్యంగా లౌకికత్వం అనే అగాధంలోకి నెట్టడానికి అనుమతించకూడదు.
(01:27) స్త్రీల నుండి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. అప్పుడు మాయ మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతుంది. ఆత్మను అన్ని రూపాలలోనూ దర్శించడానికి ప్రయత్నించండి. ఓం ఏక్ సత్చిత్ ఆనంద ఆత్మ అనే సూత్రాన్ని తరచుగా జపించండి. ఆత్మకు లింగభేదం లేదని గుర్తుంచుకోండి. లైంగిక వాంచను అనిచివేయడం మీకు పెద్దగా సహాయపడదు. కామాన్ని అనిచివేస్తే తగిన అవకాశం వచ్చినప్పుడు సంకల్పం బలహీన పడినప్పుడు వైరాగ్యం క్షీణించినప్పుడు వ్యాధి సోకి బలహీన పడినప్పుడు అది
(02:13) రెట్టింపు శక్తితో తిరిగి వ్యక్తమవుతుంది. బ్రహ్మచర్య సాధనలో కావలసింది కామాన్ని నిర్మూలించడం అంతేకానీ దాన్ని అణచివేయడం కాదు దేనినైతే అణచి పెడతారో దాని నుండి మీరు ఎప్పటికీ విముక్తి పొందలేరు. అనచిపెట్టబడిన లైంగిక వంచ మిమ్మల్ని పదే పదే పీడిస్తుంది. మరియు స్వప్నస్కలనాలు చిరాకు మానసిక అశాంతిని కలుగజేస్తుంది. ప్రార్థన ధ్యానం పవిత్ర గ్రంథాల అధ్యయనం ద్వారా మనసు దివ్యమైన ఆలోచనలతో నిండినప్పుడు
(03:00) మనసును ఉపసంహరించుకోవడం ద్వారా లైంగిక వాంచ నిర్వీర్యం అవుతుంది. అలాగే మనసు కూడా పలుచబడుతుంది.

No comments:

Post a Comment