*నేను యజమానిలా ఉంటున్నానా లేక బానిసలా బ్రతుకుతున్నానా*
ఎన్నో సందర్భాలలో నేను శాంతి కోసం బయట ప్రపంచంలో వెతికాను . కానీ నా యొక్క అంతర్ముఖ యాత్ర మొదలు పెట్టినాక తెలిసింది
నా జీవితంలో చేయవలసిన అత్యంత గొప్ప యుద్ధం బయట ప్రపంచంతో కాదు నా మనసుతో మాత్రమే అని.
బయట ప్రపంచంలో సమస్యలు అవమానాలు ఆర్థిక ఒత్తిడులు సంబంధాల విరుగుడు అనారోగ్యాలు అనిశ్చితులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ ఒకే పరిస్థితిలో ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నంగా స్పందిస్తారు.
ఒకరు చిన్న సమస్యకే కూలిపోతారు.
మరొకరు మహా తుఫానుల మధ్య కూడా ప్రశాంతంగా నిలబడతారు.
ఇక్కడ తేడా పరిస్థితుల్లో లేదు.
తేడా వారి మనసు స్థితి లో ఉంది. అనగా నా మనసు యొక్క స్థితి కూడా నిశ్చలంగా నిలుపుకోవాలంటే నా మనసుతో నేను యుద్ధం చేయక తప్పదు. ఈ యుద్ధం ద్వారా మాత్రమే మనిషికి కావలసిన నిజమైన సంపద అయినటువంటి అంతర్ముఖ శాంతిని పొందగలను.
శాంతి ఎక్కడ ఉంది నన్ను నేను ప్రశ్నించుకుంటే
నేను నా జీవితమంతా శాంతి కోసం పరుగులు పెడుతూనే ఉన్నాను.
కొన్నిసార్లు డబ్బులో శాంతిని వెతికాను.
మరి కొన్నిసార్లు ప్రేమలో శాంతిని వెతికాను.
ఇంకొన్నిసార్లు కీర్తి అధికారం భౌతిక సౌకర్యాలలో శాంతిని వెతికాను.
కానీ ఒక విచిత్రమైన నిజం ఏమిటంటే
బయట ప్రపంచం నాకు సౌకర్యం ఇవ్వగలదు
కానీ శాంతి మాత్రం ఇవ్వలేడు అని తెలుసుకున్నాను.
ఎందుకంటే శాంతి అనేది బయట లభించే వస్తువు కాదు.
అది నా మనసు కల్లోలం ఆగినప్పుడు నా లోపల మాత్రమే ఏర్పడే స్థితి. అసలు నా
మనసు ఎందుకు కల్లోలంగా ఉంటుంది
నాకు తెలిసిన సైకాలజీ ప్రకారం మనిషి మెదడు సహజంగా బాధలను గుర్తించే యంత్రం లా తయారైంది.
దీనిని Negativity Bias అంటాను,
దీనిని అర్థవంతంగా వివరించాలి అంటే
ఒక ప్రశంస కంటే ఒక విమర్శ ఎక్కువ ప్రభావం చూపుతుంది.
10 మంచి సంఘటనల కన్నా ఒక చెడు సంఘటన మనసులో ఎక్కువకాలం ఉంటుంది.
ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం మనిషి బతకడానికి ప్రమాదాలను ముందుగానే గుర్తించడం అవసరం అయ్యేది.
అందుకే మనసు ఎప్పుడూ ప్రశాంతతకంటే ప్రమాదాల వైపు ఎక్కువగా పరుగెడుతుంది. నా మనసు కూడా ఇంతే అందుకే నా
మనసుకు నేను బానిస అయ్యాను అని అనుకుంటున్నాను అనుకోవటం కాదు ఇదే నిజం.
నేను నా ఆలోచనలను అన్నింటినీ నావే అనుకుంటున్నాను.
కానీ నిజానికి చాలాసార్లు వాటిని నామనసే నడిపిస్తుంది అని తెలుసుకున్నాను అందుకే నా మనసుతో గొప్ప యుద్ధం చేస్తున్నాను.
ఉదాహరణకు నాకు
కోపం వస్తే వెంటనే పేలిపోవడం
భయం వస్తే వెనక్కి తగ్గిపోవడం
చిన్న విమర్శకే రాత్రంతా బాధపడటం
ఇతరులతో పోల్చుకొని అసంతృప్తిగా జీవించడం
ఇవి అన్నీ నా మనసుకు నేను బానిస అయిపోయాను అని తెలిపేలక్షణాలు.
ఇక్కడ నేను నిర్ణయం తీసుకోవడం లేదు. నా యొక్క భావోద్వేగాలు నిర్ణయం తీసుకుంటున్నాయి అని నిరూపించబడింది అందుకే నేను నా మనసుకి బానిస అయ్యాను అని తెలుసుకున్నాను.
అందుకే నాకు తెలిసిన సైకాలజీలో దీనిని
Emotional Hijacking
అంటారు.
అంటే భావోద్వేగాలు తాత్కాలికంగా నా వివేకాన్ని ఆక్రమించేసాయి వివేకం కోల్పోవడం కూడా నేను నా మనసుకు బానిస అయ్యాను అని తెలిపే లక్షణాలలో ప్రధానమైనదే.
మరి నామనసుకు నేనుయజమాని కావడం ఎలా
ముందుగా నామనసును నేను నియంత్రించడం నేర్చుకోవాలి .అంటే భావోద్వేగాలు లేకుండా రాయిలా మారిపోవడం కాదు.
కోపం వచ్చినా దానికి బానిస కాకపోవడం
భయం వచ్చినా నిలబడగలగడం
బాధ వచ్చినా విరిగిపోకపోవడం
ఆనందం వచ్చినా అతిగా మునిగిపోకపోవడం
వీటి ద్వారా నా మనసును నేను గెలిచే అవకాశం ఉందని తెలుసుకున్నాను.
మనసును గెలుచుకోవడం ద్వారా నాలో శాంతిని ఎలా పుట్టించగలను అని నాకు అనిపించింది అప్పుడు తెలిసిన నిజం ఏమిటంటే
నామనసులో రెండు స్థితులు ఉన్నాయి
1. ప్రతిస్పందించే మనసు (Reactive Mind)
ఇది ఎప్పుడూ నా బయట పరిస్థితులకు స్పందిస్తూ ఉంటుంది.
ఎవరైనా నన్ను విమర్శిస్తే బాధపడుతుంది
ఎవరో పొగిడితే ఉప్పొంగుతుంది
డబ్బు తగ్గితే భయపడుతుంది
ఇతరుల విజయంతో అసూయపడుతుంది
అందుకే ఈ మనసుకు శాంతి ఉండం లేదు.
2. పరిశీలించే మనసు (Observing Mind)
ఇది ఒక స్థిరమైన అవగాహన స్థితి.
ఈ స్థితిలో నేను నాఆలోచనలను గమనిస్తాను
భావోద్వేగాలను పరిశీలిస్తాను
వెంటనే స్పందించను
ఇది నా mindfulness యొక్క మూలసూత్రం.
ఆధునికతతో కూడిన నా జీవితంలో మనసు ఎందుకు ఎక్కువగా అలజడిలో ఉంది అని పరిశీలిస్తే
ఈ కాలంలో నా బయట ప్రపంచంతో అంతగా కలిసిపోయాను కానీ నాతో నేను ఉండలేకపోతున్నాను.
సామాజిక మాధ్యమాలు ఇతరులతో పోలికలు
నిరంతర సమాచారం
భవిష్యత్తు భయాలు
ఆర్థిక పోటీ
సంబంధాల అస్థిరత
ఇవి అన్నీ నా మనసును ఎప్పుడూ alert modeలో ఉంచుతున్నాయి.
దీంతో నామెదడులో stress hormone అయిన cortisol పెరుగుతుంది.
దీర్ఘకాలంలో ఇది నాకు
anxiety
depression
anger issues
sleep disorders వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఇక్కడ నా మనసు తెలుసుకోవాల్సిన ఒక విషయం శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు సమస్యల మధ్యలో కూడా మనసును ఎటు కదలకుండా నిశ్చలంగా ఉండే స్థితి.
అన్ని సమస్యలు ముగిశాక నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకున్నాను.
కానీ జీవితం ఎప్పుడూ సమస్యలతోనే ఉంటుంది. ఈ సమయంలో నాకు అర్థమైంది ఏమిటంటే
శాంతి అనేది సమస్యలు లేని స్థితి కాదు.
సమస్యల మధ్యలో కూడా మనసు కదలకుండా ఉండగలిగే స్థితి.
సముద్రం పైభాగంలో అలలు ఉంటాయి.
కానీ లోతుల్లో నిశ్శబ్దం ఉంటుంది.
నా మనసు కూడా అలాగే.
నామనసును స్థిరంగా ఉంచడానికి నేను ఎంచుకున్న శాస్త్రీయ మార్గాలు
1. స్పందించే ముందు గమనించడం
కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఇప్పుడు నా లోపల కోపం వస్తోంది అని గమనించడం.
ఇది emotional regulationలో అత్యంత శక్తివంతమైన పద్ధతి అని నేను అనుకుంటున్నాను.
2. శ్వాసపై దృష్టి
నామనసు కల్లోలంలో ఉన్నప్పుడు శ్వాస వేగంగా మారుతుంది.
నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మెదడుకు ప్రమాదం లేదు అనే సంకేతం వెళ్తుంది ఎప్పుడైతే మెదడు ప్రమాదం లేదు అని భావిస్తుందో అప్పుడే మనసు నిశ్చలంగా ఉంచుతుంది.
3. పోలికలను తగ్గించడం
Comparison అనేది నామనసుకు అతిపెద్ద విషం.
ఇతరుల జీవితాలతో నిరంతరం పోల్చుకుంటే మనసు ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటుంది అందుకే ఈ విష రసాయనం జోలికి వెళ్లకూడదని నేను నిశ్చయించుకున్నాను.
4. అంతర్ముఖతకు సమయం ఇవ్వడం
రోజులో కొంతసమయం
నిశ్శబ్దంగా కూర్చోవడం
ధ్యానం
ప్రకృతిలో నడవడం
ఇవి నామనసు అలజడిని తగ్గిస్తాయి అని నేను నమ్ముతున్నాను.
వీటన్నింటి తర్వాత నాకు ఒక సందేహం కలిగింది అసలు స్వేచ్ఛ ఏమిటి అని అప్పుడు నాకు నేను చెప్పుకున్న సమాధానం
నేను నా బయట ప్రపంచాన్ని గెలవడం గొప్ప విషయం కాదు.
నా మనసు నన్ను నడపకుండా నా మనసును నడపగలగడం అనేది నాకు అసలైన స్వేచ్ఛ అనిపించింది .
*నాలో నేను*
డబ్బు పదవి కీర్తి సంబంధాలు ఇవి జీవితాన్ని అందంగా చేయవచ్చు.
కానీ మనసు కల్లోలంగా ఉంటే అన్ని ఉన్నా లోపల శూన్యతే ఉంటుంది.
మరోవైపు మనసు ప్రశాంతంగా ఉంటే, చిన్న జీవితం కూడా మహాసంపదలా అనిపిస్తుంది.
అందుకే
నేను నా జీవిత నాణ్యతను నిర్ణయించేది
నా బ్యాంక్ బ్యాలెన్స్ నేను ప్రోగు చేసిన నా సంపదకాదు
నా మనసు స్థితి.
*గమనిక*
మీరు మీ మనసుకు బానిసనా?
లేక యజమానినా?
ఈ ఒక్క ప్రశ్నకు మీ సమాధానమే
మీ జీవిత శాంతిని నిర్ణయిస్తుంది.
శ్రీనివాస రావు మీసాల సీనియర్ సైకాలజిస్ట్
9963505005
No comments:
Post a Comment